జి. సంజీవరెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెందిన రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు.

గొంగళ్ళ సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెందిన రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1962 నుండి 1972 వరకు సిర్పూర్ శాసనసభ్యుడిగా, 1968 నుండి 1971 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో రాష్ట్రమంత్రిగా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి భారత పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.[1]

గొంగళ్ళ సంజీవరెడ్డి
జి. సంజీవరెడ్డి


ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 ఆగస్టు 1994
ముందు జి. రామానుజం

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
ఏప్రిల్ 2006 – ఏప్రిల్ 2012

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
డిసెంబరు 2003

ఐటియూసీ-సిఎస్ఐ-ఐజిబి ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 జూన్ 2010

ఐటియూసీ-ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు
పదవీ కాలం
ఫిబ్రవరి 2011 – నవంబరు 2015
ముందు జి రాజశేఖరన్
తరువాత ఫెలిక్స్ ఆంథోనీ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు
రాజ్యసభ మాజీ సభ్యుడు
కార్మిక నాయకుడు

జననం, విద్య

మార్చు

సంజీవరెడ్డి, 1930లో అచ్చిరెడ్డి - నరసమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించాడు. ప్రజా జీవితంలో సాధించిన విజయాలు, సేవకు గుర్తింపుగా, వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం సంజీవరెడ్డిని డాక్టరేట్‌తో సత్కరించింది.

జీవిత విశేషాలు

మార్చు

1948లో సంజీవరెడ్డి ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో యువ కార్మికుడిగా చేరాడు. 1950లో ఇంటూక్ (ఐఎన్‌టీయూసీ) ఆంధ్రా శాఖకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు, 1954లో అధ్యక్షుడిగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్నాడు. విద్యుత్, టన్నెల్, బొగ్గు, ఆరోగ్యం, వైద్యం, ఇంజనీరింగ్, రసాయన, మున్సిపల్, సిమెంట్ కార్మికులు, ఉక్కు కార్మికులు, సిగరెట్, పొగాకు కార్మికులలో ప్రధాన జాతీయ కార్మిక సంఘాల అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఐఎన్‌టీయూసీ మాజీ అధ్యక్షుడు జి. రామానుజం 1994లో ఒరిస్సా గవర్నర్‌గా నియమించబడిన తరువాత 1994 ఆగస్టు 3న సంజీవరెడ్డి ఐఎన్‌టీయూసీ అధ్యక్షునిగా ఎన్నికై, అప్పటినుండి ప్రతిసారీ ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాడు.[2] 1988 మార్చిలో మెల్‌బోర్న్‌లో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. 2018లో డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన చివరి ప్రపంచ కాంగ్రెస్ ద్వారా అతను తిరిగి ఎన్నుకోబడ్డాడు.

నిర్వర్తించిన పదవులు

మార్చు
  • 1962-1967 శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
  • 1967-1972 శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
  • 1968-1971 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, పునరావాస మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశాడు.
  • ఏప్రిల్ 2006 రాజ్యసభకు ఎన్నికయ్యాడు[3]
  • జూన్ 2006-మే 2009, ఆగస్టు 2009 నుండి పరిశ్రమపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడు
  • సెప్టెంబరు 2006 నుండి, టేబుల్‌పై ఉంచిన పేపర్లపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడు
  • డిసెంబర్ 2006-మే 2009: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల జాతీయ బోర్డు సభ్యుడు
  • ఆగస్టు 2007-మే 2009: పరిశ్రమపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, భారీ పరిశ్రమలు-పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కోసం సబ్-కమిటీ-III సభ్యుడు
  • ఆగస్టు 2009-ఆగస్టు 2010: లేబర్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు
  • ఆగస్టు 2009 నుండి భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • సెప్టెంబర్ 2010 నుండి పరిశ్రమపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడు
  • ఆగస్ట్ 1994 నుండి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్
  • సెప్టెంబరు 2010 నుండి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రోహ్‌తక్‌కి డైరెక్టర్‌గా నియమితులయ్యారు
  • జనవరి 2011 నుండి వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ - బెల్జియం
  • ఫిబ్రవరి 2011-నవంబరు 2015 అధ్యక్షుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ - ఆసియా పసిఫిక్ ప్రాంతం - సింగపూర్

ఏఐసిసి లేబర్ సెల్ రద్దు చేయబడేవరకు, ఐఎన్‌టీయూసీని ఏఐసిసి ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌లలో చేర్చే వరకు సంజీవరెడ్డి ఛైర్మన్‌గా ఉన్నాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన వివిధ కమిటీలు, బోర్డులలో సభ్యునిగా కూడా ఉన్నాడు.ప్రాంతీయ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ చైర్‌పర్సన్, 2వ నేషనల్ కమీషన్ ఆన్ లేబర్ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్, హిందూస్తాన్ సాల్ట్స్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ఉత్పాదక మండలి వైస్ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా ఉన్నాడు.

ఇతర వివరాలు

మార్చు

అమెరికా, రష్యా, చైనా, నేపాల్, డెన్మార్క్, ఫిలిప్పీన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, ఇటలీ, జపాన్, హాంకాంగ్‌, శ్రీలంక, కెనడా వంటి దేశాలలో ట్రేడ్ యూనియన్ సమస్యలకు సంబంధించి జరిగిన అనే సమావేశాలు, సమ్మిట్‌లు, ఫోరమ్‌లలో భారతదేశం తరపున సంజీవరెడ్డి ప్రాతినిధ్యం వహించాడు. జెనీవా, బ్యాంకాక్‌లలో జరిగిన ఐఎల్ఓ సమావేశాలకు అనేకసార్లు హాజరయ్యాడు. కోపెన్‌హాగన్‌లో సోషల్ డెవలప్‌మెంట్ కోసం జరిగిన వరల్డ్ సమ్మిట్ లో ఇండియన్ డెలిగేషన్ సభ్యుడిగా ఉన్నాడు. 2002లో న్యూయార్క్ నగరంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు కూడా హాజరయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ తగదు". andhrajyothy. 2022-02-17. Archived from the original on 2022-02-18. Retrieved 2022-02-18.
  2. "Dr G Sanjeeva Reddy elected as INTUC president". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2019-03-20. Archived from the original on 2021-02-04. Retrieved 2022-02-18.
  3. "Sanjeeva Reddy elected as ITUC Vice-President". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2018-12-19. Archived from the original on 2018-12-22. Retrieved 2022-02-18.

బయటి లింకులు

మార్చు