జుక్కల్ శాసనసభ నియోజకవర్గం

(జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

1957లో ఏర్పడిన జుక్కల్ నియోజకవర్గం 1978 వరకు జనరల్ నియోజకవర్గంగానూ, ఆ తరువాత నుండి షెడ్యూల్డు కులాలకు రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది.

ఎన్నికైన శాసనసభ్యులు సవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1957 మాధవ రావు స్వతంత్ర అభ్యర్థి ఎస్.ఎల్.శాస్త్రి కాంగ్రెస్ పార్టీ
1962 నాగ్‌నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ మాణికేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థి
1967 వి.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఎన్.ఆర్.తమ్మేశ్వర్ కాంగ్రెస్ పార్టీ
1972 సామల విఠల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఆర్.వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1978 సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ జెట్టి ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ (కాలే)
1983 సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ బేగరి పండరి స్వతంత్ర అభ్యర్థి
1985 బేగరి పండరి తెలుగుదేశం పార్టీ సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ
1989 సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ కాలే శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ
1994 బేగరి పండరి తెలుగుదేశం పార్టీ సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ
1999 టి. అరుణ తార తెలుగుదేశం పార్టీ సౌదాగర్ గంగారాం స్వతంత్ర అభ్యర్థి
2004 సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ హ‌న్మంతు షిండే తెలుగుదేశం పార్టీ
2009 హ‌న్మంతు షిండే తెలుగుదేశం పార్టీ సావిత్రిబాయి కాంగ్రెస్ పార్టీ
2014 హ‌న్మంతు షిండే తెలంగాణ రాష్ట్ర సమితి సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ
2018 హ‌న్మంతు షిండే తెలంగాణ రాష్ట్ర సమితి సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు సవరించు

2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌదాగర్ గంగారాం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అయిన హ‌న్మంతు షిండే పై 1241 ఓట్ల మెజారిటోతో గెలుపొందినాడు. గంగారాంకు 50314 ఓట్లు పోలవగా, షిండేకు 49073 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు సవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున హన్మంత్ షిండే పోటీ చేస్తున్నాడు.[1]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009