హన్మంత్ షిండే

(హ‌న్మంతు షిండే నుండి దారిమార్పు చెందింది)

హ‌న్మంతు షిండే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున జుక్కల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

హన్మంత్ షిండే
హన్మంత్ షిండే


పదవీ కాలం
2009 – 2018, 2014–2018, 2018 - ప్రస్తుతం
ముందు సౌదాగర్ గంగారాం
నియోజకవర్గం జుక్కల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 14, 1966
దోన్‌గావ్, జుక్కల్ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మహాదప్ప, నాగమ్మ
జీవిత భాగస్వామి శోభావతి
సంతానం ముగ్గురు కుమారులు

జననం, విద్య

మార్చు

హన్మంత్ 1966, ఆగస్టు 14న మహాదప్ప, నాగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలంలోని దోన్‌గావ్ గ్రామంలో జన్మించాడు. 1988లో ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బిఈ) పూర్తి చేసి నీటి పారుదల శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పని చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు.[3][4][5]

వ్యక్తిగత జీవితం

మార్చు

హన్మంత్ కు శోభవతితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు.

రాజకీయ విశేషాలు

మార్చు

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హన్మంత్, ఆ పార్టీ తరపున 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌదాగర్ గంగారాం చేతిలో 1241 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత 2009లో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రిబాయిపై విజయం సాధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభకు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు.

2013 డిసెంబరులో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[6] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌదాగర్ గంగారాంపై 35,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[7][8] 2016 మే 26 నుండి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగారాం సౌదగర్ పై 35,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[9]ఆయన అక్టోబర్‌ 5, 2021న తెలంగాణ శాసనసభలో ప్యానెల్‌ స్పీకర్‌గా పని చేశాడు.[10][11]

మూలాలు

మార్చు
 1. "Member's Profile – Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-25.
 2. "Hanmanth Shinde MLA of Jukkal (SC) Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
 3. Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
 4. V6 Velugu (24 September 2023). "లక్షల ఆదాయం వదులుకొని : పాలిటిక్స్​లోకి ప్రొఫెషనల్స్". Archived from the original on 24 September 2023. Retrieved 24 September 2023. {{cite news}}: zero width space character in |title= at position 35 (help)CS1 maint: numeric names: authors list (link)
 5. Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
 6. Mohan, P. Ram (2013-12-17). "MLA Hanmanth Shinde all set to quit TDP". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-25.
 7. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
 8. Sakshi (6 November 2018). "గులాబీ గుబాళింపు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
 9. "Hanmanth Shinde wins the battle". www.timesnownews.com. Retrieved 2021-08-25.{{cite web}}: CS1 maint: url-status (link)
 10. Namasthe Telangana (6 October 2021). "ప్యానల్‌ స్పీకర్లుగా ఇద్దరు". Archived from the original on 6 అక్టోబరు 2021. Retrieved 6 October 2021.
 11. Eenadu (4 November 2023). "8 మంది హ్యాట్రిక్‌ వీరులు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.