జ్యోతి (1976 సినిమా)
నవ్వుతూ తుళ్ళుతూ ఉండే జ్యోతి (జయసుధ) అనే అమ్మాయి రవి (మురళీమోహన్)ను ప్రేమిస్తుంది. కాని ఆమె హఠాత్తుగా తన తండ్రి వయసువాడైన రాజయ్య (గుమ్మడి) అనే పెద్ద మనిషిని పెళ్ళి చేసుకోవడం ఎవరికీ అర్ధం కాదు. ఆస్తి కోసం అని కొందరనుకొంటారు. అందరి సూటిపోటు మాటలను భరిస్తూనే జ్యోతి రాజయ్య ఇంటిలో కకావికలైన సంసారాన్ని చక్కబెడుతుంది. ఆమె అలా ఎందుకు చేసిందనే విషయం సినిమా చివరిలో తెలుస్తుంది. తాను కాలిపోతూ అందరికీ వెలుగునివ్వడం జ్యోతి లక్షణం అని తెలుసుకొంటారు. ఇందులో జె.వి. సోమయాజులు ఒక చిన్న పాత్ర పోషించాడు. ఇది అతని మొదటి (లేదా రెండవ?) సినిమా. ఇది దర్శకునిగా రాఘవేంద్రరావుకు, నిర్మాతగా క్రాంతి కుమార్‌కు మూడవ సినిమా. గిరిబాబు ఊతపదం "ఫస్ట్ టైమ్" ప్రేక్షకుల నోట నానింది.
జ్యోతి (1976 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె. రాఘవేంద్రరావు |
నిర్మాణం | క్రాంతికుమార్ |
రచన | సత్యానంద్ |
కథ | సి. ఆనందారామం ("మమతల కోవెల" నవల ఆధారంగా)[1] |
తారాగణం | జయసుధ, మురళీమోహన్, చిడతల అప్పారావు, గిరిబాబు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఫటాఫట్ జయలక్ష్మి, జె.వి. సోమయాజులు, సత్యనారాయణ, కృష్ణకుమారి, రావు గోపాలరావు, శుభ |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | పి. సుశీల, ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
గీతరచన | ఆత్రేయ |
సంభాషణలు | సత్యానంద్ |
ఛాయాగ్రహణం | విన్సెంట్, కె.ఎస్. ప్రకాష్ |
కూర్పు | అంకిరెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ |
విడుదల తేదీ | 4 జూన్ 1976 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణంసవరించు
సంగీతంసవరించు
అన్ని పాటల రచయిత ఆత్రేయ, ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది కె. చక్రవర్తి.
క్రమసంఖ్య | పేరు | గానం | నిడివి |
---|---|---|---|
1. | "ఏడు కొండలపైన ఏల వెలిశావో ఎవరికి అందక ఎందుకున్నావో తెలియని వారికి తెలుపర స్వామీ కన్నుల పొరలను తొలగించవేమ" | పి.సుశీల | |
2. | "సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు" | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | |
3. | "నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు తుళ్ళంటసి. ఆనందారామం" | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | |
4. | "ఫస్ట్ టైమ్ ఇది నీకు ఫస్ట్ టైమ్ బెస్ట్ టైమ్" | పి.సుశీల |
పురస్కారాలుసవరించు
సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1975 | జయసుధ | నంది ఉత్తమ నటీమణులు | Won |
మూలాలుసవరించు
- ↑ ‘I cherish that compliment’
- ↑ మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- తెలుగు సినిమా.కమ్ వ్యాసం - శ్రీ, నచకి