డార్లింగ్ డార్లింగ్

డార్లింగ్ డార్లింగ్, 2001 నవంబరు 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్ బ్యానరులో మేడికొండ వెంకట మురళి కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి వి. సముద్ర దర్శకత్వం వహించాడు.[2] ఇందులో శ్రీకాంత్, షహీన్, సాయి కిరణ్, చంద్రమోహన్ తదితరులు నటించగా, కోటి సంగీతం అందించాడు.[3]

డార్లింగ్ డార్లింగ్
దర్శకత్వంవి. సముద్ర
రచనరాజసేనన్ (కథ)
దివాకర్ బాబు (మాటలు)
నిర్మాతమేడికొండ వెంకట మురళి కృష్ణ
తారాగణంశ్రీకాంత్
షహీన్
సాయి కిరణ్
చంద్రమోహన్
ఛాయాగ్రహణంఎస్. నవకాంత్
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2001 నవంబరు 30
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథా సారాశంసవరించు

కిరణ్ (సాయికిరణ్), లత (షహీన్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. కిరణ్ తండ్రి పెదరాయుడు (చంద్రమోహన్), లత తండ్రి (కోట శ్రీనివాసరావు) ల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. వారి మధ్య ఉన్న శత్రుత్వం తగ్గడానికి కిరణ్ వేరే పట్టణానికి వెళ్లి తన స్నేహితుడు చిన్నికృష్ణ (శ్రీకాంత్)తో కలిసి ఉంటాడు. చిన్నకృష్ణ కూడా లతను ప్రేమిస్తుంటాడు. దాంతో కిరణ్, లతలు కలవకుండా చిన్నికృష్ణ అడ్డుపడుతుంటాడు. ఎవరి ప్రేమ గెలిచిందనేది మిగతా కథ.[4][5]

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు కోటి సంగీతం అందించాడు.[6]

 1. ఎఫ్ ఛానెల్లో (సాహిత్యం: చంద్రబోస్, గానం: రఘు కుంచే)
 2. కిల కిల కిల కోకిలా (సాహిత్యం: శ్రీహర్ష, గానం: శ్రీరామ్ ప్రభు, మల్లికార్జున్, గోపిక పూర్ణిమ)
 3. నా ప్రేమ నువ్వని (సాహిత్యం: రవి మోహన్, గానం: శ్రీరామ్ ప్రభు, సునీత ఉపద్రష్ట)
 4. నారి నారి (సాహిత్యం: భువనచంద్ర, గానం: టిప్పు, కె.ఎస్. చిత్ర)
 5. టైటానిక్ (సాహిత్యం: చిర్రావూరి విజయకుమార్, గానం: టిప్పు, సునిత ఉపద్రష్ట)
 6. వందమంది బ్రహ్మలంతా (సాహిత్యం: చిర్రావూరి విజయకుమార్, గానం: ఎస్. పి. చరణ్, గంగ)

మూలాలుసవరించు

 1. "Darling Darling (2001)". Indiancine.ma. Retrieved 2021-06-06.
 2. "Darling Darling 2001 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. "Darling Darling 2001 Telugu Movie Cast Crew". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "Telugu Cinema - Review". www.idlebrain.com. Retrieved 2021-06-06.
 5. "Darling Darling Movie Review". www.movies.fullhyderabad.com. Retrieved 2021-06-06.{{cite web}}: CS1 maint: url-status (link)
 6. "Darling Darling 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలుసవరించు