హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంప్రదాయం, సంస్కృతిక, ఆధునికతతో గౌడ్ ల ఆత్మగౌవరం పెంచేలా నీరా కేఫ్‌ను నిర్మించారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ నీరా కేఫ్‌ను నిర్మించింది. తాటిచెట్లు, మట్టికుండలు, కల్లుగీత దృశ్యాలు, తాటాకు ఆకారం వచ్చేలా కేఫ్‌ పై కప్పు తయారు చేశారు.

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని నీరా కేఫ్‌

నీరా కేఫ్‌లో నీరాతో  పాటు 16 బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. నీరా కేఫ్ లో తెలంగాణ రుచులు, నీరా బెల్లం, తేనె, బూస్ట్, చాక్లెట్, ఐస్‌క్రీమ్‌లు, స్వీట్స్, నీరా బూస్టు, షుగర్‌, హనీ (తేనే) వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.[1]  

నిర్మాణం & ప్రారంభోత్సవం మార్చు

నెక్లెస్‌ రోడ్డులో 2020 జులై 23న రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ నీరా కేఫ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు.[2][3] ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించడం కోసం ప్రభుత్వం 12.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్‌, ఫుడ్‌ కోర్టును రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2023 మే 03న ప్రారంభించారు.

నీరా కేఫ్‌ ప్రారంభోత్సవంలో మాజీ శాసన మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌ గౌడ్‌, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు డాక్టర్‌ ఈడిగ ఆంజనేయ గౌడ్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌, మాజీ మంత్రి గొడిశెల రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం గౌడ్‌, మాజీ చైర్మన్‌ నాగేందర్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్‌, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళకు చెందిన స్వామీజీలు నాగలింగస్వామి, బసవమూర్తిస్వామి, కుంబాలస్వామి, శివానందస్వామి, ప్రణవానందస్వామి, నిచ్చల్‌ నిరంజన్‌ దేశందు స్వాములు, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం కోశాధికారి పుల్లెంల రవీందర్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తిగౌడ్‌, ఆర్టీఏ అధికారులు చక్రవర్తిగౌడ్‌, తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావుగౌడ్‌ పాల్గొన్నారు.[4][5]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (26 May 2023). "వీ లవ్‌ నీరా". Archived from the original on 27 May 2023. Retrieved 27 May 2023.
  2. Sakshi (23 July 2020). "నేడు నెక్లెస్‌రోడ్‌లో నీరాకేఫ్‌కు శంకుస్థాపన". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
  3. HMTV (23 July 2020). "తాటాకు ఆకృతిలో నీరా కేఫ్..శంకుస్థాపన చేసిన మంత్రులు". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
  4. Namasthe Telangana (4 May 2023). "గౌడల ఆత్మగౌరవానికి నీరాజనం.. బీమాతో గీత వృత్తిదారులకు భరోసా: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
  5. Sakshi (4 May 2023). "నీరా కేఫ్, క్యాంటీన్‌ ప్రారంభం". Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=నీరా_కేఫ్&oldid=3927243" నుండి వెలికితీశారు