తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2021)


తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే ప్రతిభా పురస్కారం.[1] భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది.

ప్రతిభా పురస్కారాలు (2021)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2020
మొత్తం బహూకరణలు 12
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2020ప్రతిభా పురస్కారాలు (2021)2022

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]

పురస్కార గ్రహీతలు

మార్చు

2021 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[3] వీరికి 2023 ఆగస్టు 30న హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. ఎన్.టి.ఆర్. కళామందిరంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారాలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలుగు విశ్వవిద్యాలయ వీసీ టి.కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలను సత్కరించారు.[4]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 గింజల నరసింహారెడ్డి కవిత్వం
2 తేరాల సత్యనారాయణ శర్మ విమర్శ
3 బి. నరహరి చిత్రకళ
4 డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి శిల్పకళ
5 మేలట్టూర్‌ ఎస్‌ కుమార్‌ నృత్యం
6 పి. పూర్ణచందర్‌ సంగీతం
7 జి. వల్లీశ్వర్‌ పత్రికారంగం
8 దెంచనాల శ్రీనివాస్‌ నాటకం
9 వేద్మ శంకర్‌ జానపదము
10 డాక్టర్‌ ముదిగొండ అమరనాధశర్మ అవధానం
11 డాక్టర్‌ కొండపల్లి నీహారిణి రచయిత్రి
12 డాక్టర్‌ జి. అమృలత కథ/నవల

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి (2018-11-15). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 2018-11-15. Retrieved 2023-09-13.
  2. telugu, NT News (2023-08-19). "తెలుగు వర్సిటీ2021 ప్రతిభా పురస్కారాలు వీరికే." www.ntnews.com. Archived from the original on 2023-08-24. Retrieved 2023-09-13.
  3. "తెలుగువర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రకటన". EENADU. 2023-08-19. Archived from the original on 2023-08-19. Retrieved 2023-09-13.
  4. Velugu, V6 (2023-08-31). "12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు". V6 Velugu. Archived from the original on 2023-08-31. Retrieved 2023-09-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు

మార్చు
  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine