సాహితి (సినీ రచయిత)

తెలుగు సినిమాల్లో పాటలు సంభాషణల రచయిత

సాహితి పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి.[1][2]

సాహితి
చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి
జననం
చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి

కృష్ణా జిల్లా, మైలవరం మండలం, వెల్వడం గ్రామం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, సినిమా గేయ రచయిత

విశేషాలు

మార్చు

ఆయన కృష్ణా జిల్లా, మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో జన్మించారు. ఆయన వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, వరంగల్లులో ఇంటర్మీడియట్, నూజివీడులో డిగ్రీ చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా పొందారు. ఆయన గుడివాడలో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశారు[3].

సినిమా రంగం

మార్చు

ఆయన సినిమాలలో అవకాశం కోసం 1974లో మద్రాసుకు వెళ్లారు. మొదట ఆత్రేయ వద్ద సహాయకునిగా చేరారు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు ప్రారంభించారు. 1979లో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన కిలాడి కృష్ణుడు సినిమాలో తొలి పాటను రచించారు. తరువాత ఆయనకు అనేక అవకాశాలు కలిశాయి. ఆయన మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించారు. కేవలం పాటలే కాక "మల్లన్న", "జర్నీ" వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించారు[3].

ఆయన కలం తనదైన శైలిలో పాటకు పట్టాభిషేకం చేస్తుంది. ఆయన పాటలో పదాలు స్వరాల మధ్య విసిరేసినట్టుండవు. స్వరంపై పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నట్టుంటాయి. ఆయన రాసిన "జాబిలికీ వెన్నెలకీ", "ఎగిరిపోతే ఎంత బాగుంటుంది" పాటలు అశేష ఆదరణ పొందాయి.[4] ఆయన సుమారు 1000 తెలుగు సినిమా పాటలు రాశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ యాస, మాండలికాలతో జానపద గీతాలను రాసినందున సినిమా పరిశ్రమలో ప్రసిద్ది చెందారు. ఆయన దూర ప్రాంతాలు ప్రయాణం చేసి, ప్రజలతో సంభాషించి, వారి వ్యావహారిక పదాలు, పదజాలాన్ని సేకరించి జానపద కవిత్వంలో తనకు ఒక ప్రత్యేకమైన చిహ్నాన్ని సృష్టించారు. ఆయన మొండిమొగుడు పెంకి పెళ్ళాం చిత్రంలో విజయశాంతి పాత్రకు రాసిన "లాలూ దర్వాజ లష్కర్ బోనాల్ పండుగ" పాట పెద్ద హిట్ అయింది. ఆయన అందమైన, గొప్ప యాసలను రాసారని భావిస్తారు.[5]

సినిమాల జాబితా

మార్చు

ఆయన పనిచేసిన చిత్రాల పాక్షిక జాబితా:

గేయ రచయితగా

మార్చు
  1. కిలాడి కృష్ణుడు (1980)
  2. రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
  3. వాడనిమల్లి (1981)
  4. అతిరధుడు (1991)
  5. ఆగ్రహం (1991)
  6. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ (1991)
  7. అప్పుల అప్పారావు (1992)
  8. వద్దు బావా తప్పు (1993)
  9. నా మొగుడు నా ఇష్టం (1993)
  10. ఘరానా అల్లుడు (1994)
  11. అమ్మలేని పుట్టిల్లు (1995)
  12. ఆంటీ (1995)
  13. ఆలీబాబా అద్భుతదీపం (1995)
  14. ఆడాళ్లా మజాకా? (1995)
  15. అక్కుమ్ బక్కుమ్ (1996)
  16. ఇల్లాలు (1997)
  17. దొంగాట (1997)
  18. అల్లరి పెళ్లాం (1998)
  19. డాడీ డాడీ (1998)
  20. ఆవిడే శ్యామల (1999)
  21. హలో ప్రేమిస్తావా (1999)
  22. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
  23. తప్పుచేసి పప్పుకూడు (2002)
  24. అదృష్టం (2002)
  25. వెంకీ (2004)
  26. ఖుషి ఖుషీగా (2004)
  27. సఖియా (2004)
  28. మాస్ (2004)
  29. బాస్ (2006)
  30. ఆటాడిస్తా (2008)
  31. భలే దొంగలు (2008)
  32. బ్లేడ్ బాబ్జీ (2008)
  33. సమర్ధుడు (2009)
  34. వేదం (2009)
  35. మిరపకాయ్ (2011)
  36. ప్రేమ కావాలి (2011)
  37. ఢమరుకం (2012)
  38. నాయక్ (2013)
  39. రామయ్యా వస్తావయ్యా (2013)
  40. చల్‌ మోహన రంగా (2018)

సంభాషణల రచయితగా

మార్చు
  1. మల్లన్న
  2. జర్నీ

సినిమా పాటల జాబితా

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?[permanent dead link]
  2. "'డీజే' సినిమాలో పాటను తొలగించాలి".
  3. 3.0 3.1 సుమబాల (17 June 2013). "Sahithi My Song My Story". V6 News Telugu. Retrieved 30 April 2018.
  4. "అలాంటి దర్శకుల్లో క్రిష్ ఒకరు: గేయ రచయిత సాహితి -". www.andhrajyothy.com. Archived from the original on 2017-01-03. Retrieved 2018-04-30.
  5. Y.s.c; Y.s.c (2011-12-04). "Tapping into dialects". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-04-30.