దామోదరం సంజీవయ్య మంత్రివర్గం
దామోదరం సంజీవయ్య, సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి. దళిత వర్గానికి చెందిన తొలి ముఖ్యమంత్రి. సంజీవయ్య మంత్రివర్గం, 1960, జనవరి 11 నుండి 1962, మార్చి 29వరకు పదవిలో ఉన్నది.
దామోదరం సంజీవయ్య మంత్రివర్గం
మార్చువ.సంఖ్య | మంత్రి పేరు | శాఖ | నియోజకవర్గం | పార్టీ | |
---|---|---|---|---|---|
1. | దామోదరం సంజీవయ్య, ముఖ్యమంత్రి | ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్, ఎన్నికలు, జనాభా లెక్కలు, అవినీతి నిరోధక సంఘాలు, అఖిలభారత సేవలు[1] | ఎమ్మిగనూరు | కాంగ్రేసు | |
2. | కె.వి.రంగారెడ్డి | ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్, కస్టమ్స్, నిర్వాసితుల ఆస్థులు, జాగీర్ల పరిపాలన,భూసంస్కరణలు | షాబాద్ | కాంగ్రేసు | |
3. | అల్లూరి సత్యనారాయణరాజు | నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, ప్రజాపనులు, ఉపశమన కార్యక్రమాలు, పునరావాసిత పనులు | కాంగ్రేసు | ||
4. | యస్.బి.పి. పట్టాభిరామారావు | విద్య మరియు రవాణా | పామర్రు | కాంగ్రేసు | |
5. | పిడతల రంగారెడ్డి | ప్రణాళిక శాఖ, స్థానిక పాలన, సమాచారం మరియు పర్యాటక శాఖ | గిద్దలూరు | కాంగ్రేసు | |
6. | కల్లూరి చంద్రమౌళి | మతసంస్థలు, దేవాదాయ శాఖ, సహకార శాఖ | వేమూరు | కాంగ్రేసు | |
7. | కాసు బ్రహ్మానందరెడ్డి | విత్త, వాణిజ్య పన్నులు, న్యాయశాఖ, న్యాయస్థానాలు మరియు కారాగారాలు | ఫిరంగిపురం | కాంగ్రేసు | |
8. | మందుముల నరసింగరావు | గృహ మంత్రి | కొల్లాపూర్ | కాంగ్రేసు | |
9. | మల్లిపూడి పల్లంరాజు | అటవీ శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ | కాకినాడ | కాంగ్రేసు | |
10. | ఆనం చెంచుసుబ్బారెడ్డి | భారీ పరిశ్రమలు, గనులు, వాణిజ్యం, అవాసం మరియు నగరపాలన | నెల్లూరు | కాంగ్రేసు | |
11. | పూసపాటి విజయరామ గజపతి రాజు | ఆరోగ్య శాఖ, వైద్య శాఖ | భీమునిపట్నం | కాంగ్రేసు | |
12. | మసూమా బేగం | సామాజిక సంక్షేమం, సాలార్‌జంగ్ ఎస్టేట్, ముస్లిం వక్ఫ్‌లు | పత్తర్‌ఘట్టి | కాంగ్రేసు | |
13. | నూకల రామచంద్రారెడ్డి | వ్యవసాయం, ఆహారం, ఆహార ఉత్పత్తి, మార్కెటింగ్, గ్రామీణ రుణాలు, రుణాల ఉపశమనం, శ్రామిక శాఖ | డోర్నకల్ | కాంగ్రేసు | |
14. | కొండా లక్ష్మణ్ బాపూజీ | లఘు మరియు కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ | చిన్నకోడూర్ | కాంగ్రేసు |
మూలాలు
మార్చు- ↑ India 1960. Government Of India. p. 132. Retrieved 31 July 2024.