దాహోద్, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, దాహోద్ జిల్లాలో దుధిమతి నది ఒడ్డున ఉన్న నగరం.దుధుమతి నది ఒడ్డున ఆశ్రమం ఉన్నసెయింట్ దధీచి నుండి దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.ఈ నగరందాహోద్ జిల్లాకు జిల్లాప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.ఇది అహ్మదాబాద్ నుండి 214 కిలోమీటర్లు (133 మై.), వడోదర నుండి 159 కిలోమీటర్లు (99 మై.) దూరంలోఉంది.దీనినిదోహాద్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులుసమీపంలో ఉన్నందున "రెండు సరిహద్దులు" అనేఅర్థాన్ని సూచిస్తుంది.[1]

దహోద్ జిల్లా పంచాయతీ భవన్

జహంగీర్ పాలన కాలంలో,మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దాహోద్‌లో సా.శ. 1618లో జన్మించాడు.ఇది ఔరంగజేబుజన్మస్థలం కాబట్టి తను ఈపట్టణానికి అనుకూలంగా ఉండాలని తన మంత్రులనుఆదేశించినట్లు చెబుతారు.[2] స్వాతంత్ర్య సమరయోధుడు తాత్యా తోపే తన చివరి రోజుల్లోఅతనుదాహోద్‌ ప్రాంతంలోఅజ్ఞాతంగా నివసించాడని నమ్ముతారు.

ఇది గతంలో పంచమహల్ జిల్లా సరిహద్దులో ఉండేది.అయితే 2006లో దాహోద్ ప్రత్యేక జిల్లాగా గుర్తింపు పొందింది.పట్టణ ప్రాంత బ్యాంక్,ఆసుపత్రి ఇక్కడఉన్నాయి.పరోపకారి గిర్ధర్‌లాల్ షేథ్ ట్రస్ట్ ద్వారాడెంటల్ కళాశాలకు శంకుస్థాపనజరిగింది.

దహోద్‌లోని పరేల్ ప్రాంతం అని పిలువబడే రైల్వే కాలనీని బ్రిటిష్ వారు నిర్మించారు.ఇదిఇప్పటికీ అదేనిర్మాణంతో కొనసాగుతుంది. ఇక్కడ పశ్చిమ రైల్వే లోకోమోటివ్ కార్కానా ఉంది.ఈప్రాంతంఇతర రాష్ట్రాల నుండి వచ్చిన జనాభాకు దోహదపడుతుంది.ఇక్కడ రైల్వేకార్కానాలోవారు పని చేస్తుంటారు.దాహోద్ నగరం డిజిటల్ యుగంలోకి అడుగు పెడుతుంది.ఇస్కాన్ సంస్థ దాహోద్ ప్రజలకు సాంస్కృతిక, విలువ ఆధారిత విద్య,యువత కార్యక్రమాలనుఅందించడం ద్వారా సమాజ సంక్షేమం కోసం నగరంలోనిరంతరంపనిచేస్తుంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద స్మార్ట్ సిటీగా అభివృద్ధిచేయబోయే వందభారతీయ నగరాల్లో దాహోద్ నగరం ఒకటిగాఎంపిక చేయబడింది.

విద్యా సౌకర్యాలు

మార్చు

దాహోద్‌లోని విద్యా సంస్థలు: హిందీ హయ్యర్ సెకండరీపాఠశాల,హిందీ ప్రాధమిక పాఠశాల, ఎడునోవా,సెయింట్ స్టీఫెన్స్ ఉన్నత పాఠశాల,ప్రభుత్వఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ మేరీ పాఠశాల,ప్రభుత్వ సాంకేతిక కళాశాల,ఎం.వై.ఉన్నత పాఠశాల,ఎస్ & ఐ దాదరర్వాలా ఉన్నతపాఠశాల,లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల,శశి ధన్ డే పాఠశాల, జమాలి ఆంగ్ల పాఠశాల,బుర్హానీ ఆంగ్ల మాధ్యమిక పాఠశాల,ఆర్.ఎల్, పాండ్యా ఉన్నత పాఠశాల , సన్‌రైజ్ పబ్లిక్ పాఠశాల,కేంద్రీయవిద్యాలయం,జవహర్ నవోదయవిద్యాలయం, శ్రీ జ్ఞానజ్యోత్ ప్రాధమిక,ఉన్నత పాఠశాల,ఆదివాసీ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ పాఠశాల,అనేకఇతరప్రభుత్వప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి.

వంటకాలు

మార్చు

కచోరి, సమోసా, రత్లామి సేవ్, పానీపూరి నగరం ప్రధాన భారతదేశ తిను భండారాలు వాడతారు. దాహోద్ మత్తా,పక్వాన్‌లకు ప్రసిద్ధి చెందింది.రత్లామి సేవ్ భండార్, ధవల్ రెస్టారెంట్ దాహోద్‌లోని స్నాక్స్‌కు హాట్‌స్పాట్,గుజరాత్ అంతటా కచోరీకి ప్రసిద్ధి చెందింది.

ఆరోగ్యం

మార్చు

దాహోద్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలకు వైద్య కేంద్రం. దాహోద్ పట్టణ ప్రాంత ఆసుపత్రి, అంజుమాన్ ట్రస్ట్ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి వంటి కొన్ని లాభాపేక్షలేని ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తోంది.దృష్ట్రి నేత్రాలయ [3] 20 మంది నిపుణులతో కూడిన ప్రసిద్ధ లాభాపేక్షలేని కంటి వైద్యశాల. ఇది డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ కోర్సును అందిస్తుంది.

ఆర్థిక వ్యవస్థ

మార్చు

ఇఁజనీరింగ్

మార్చు

ఇది అభివృద్ధి చెందుతున్నఇంజనీరింగ్ రంగానికి నిలయం.నగరంలో అనేక చిన్న,మధ్య తరహా ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నాయి.ఇవి మెటల్ ఫాబ్రికేషన్,మ్యాచింగ్ ,టూల్ అండ్ డై మేకింగ్ వంటి రంగాలలోప్రత్యేకతకలిగిఉన్నాయి.అదనంగా,సిమెన్స్ ఇండియాతో సహా, దాహోద్‌లో తయారీ కార్యకలాపాలనుస్థాపించినఅనేక పెద్ద కంపెనీలుఉన్నాయి.ఇది నగరంలోని దాని సౌకర్యంవద్దసరుకురవాణా లోకోమోటివ్‌లను తయారు చేయడానికి, నిర్వహించడానికి యోచిస్తోంది. [4] [5] [6] [7] [8] [9]

కళలు, రచయితలు

మార్చు

పట్టణంలోని నజ్మీ మసీద్ మసీదు, 2002లో ప్రారంభించబడింది, ఇది దావూదీ బోహ్రా సమాజంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి.3000 మంది మహిళలకు చేరువైన సహజ్- యాన్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ చే హస్తకళా ఉత్పత్తులకు దాహోద్ ప్రసిద్ధి చెందింది. 2001లో స్థాపించబడిన సహజ్ చక్కటి హస్తకళా ఉత్పత్తులను సృష్టిస్తుంది. భారతదేశం, ప్రపంచంలోని గిరిజన హస్తకళలో స్థాపించబడిన ప్రత్యేక ఉత్పత్తులు.

రవాణా

మార్చు
 
GSRTC బస్ స్టేషన్, దాహోద్

రహదారి మార్గాలు

మార్చు

రోడ్డు మార్గం ద్వారా దాహోద్ రాష్ట్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించబడే ప్రజా రవాణా సేవ ద్వారా గుజరాత్‌లోని అన్ని ప్రధాన పట్టణాలకు అనుసంధాన సౌకర్యాలు ఉన్నాయి.

దాహోద్ భారతీయ రైల్వేల పశ్చిమ రైల్వే విభాగం క్రిందకు వస్తుంది. ఇది న్యూఢిల్లీ-ముంబై ప్రధాన మార్గంలో ఉంది. దాహోద్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పశ్చిమ రైల్వే లైన్‌లో గుజరాత్ ప్రారంభం, ముగింపు రెండిటిని సూచిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం దాహోద్ రైల్వే స్టేషన్ ముఖభాగం ఆధునికీకరించారు.దాహోద్ నుండి ముంబై లేదా న్యూఢిల్లీ ( హజ్రత్ నిజాముద్దీన్ ) చేరుకోవడానికి అత్యంత వేగవంతమైన రైలు ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ సేవలు అన్నాయి. 2018 ఏప్రిల్ 25న రైల్వే మంత్రిత్వ శాఖ ఆగస్టు నుండి క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను దాహోద్‌లో ఆపాలని నిర్ణయించింది. అలాగే గోల్డెన్ టెంపుల్ మెయిల్, అవంతిక ఎక్స్‌ప్రెస్, పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్, ముంబై జైపూర్ (గంగౌర్) సూపర్‌ఫాస్ట్ వంటి ప్రతిష్టాత్మక రైళ్లు కూడా దాహోద్‌లో ఆగుతాయి. దాహోద్ భారతదేశంలోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధాన సౌకర్యం ఉఁది. దాహోద్ దాదాపు 106 రైళ్ల ట్రాఫిక్‌ను నిర్వహిస్తుంది.వాటిలో 7 రైళ్లు దాహోద్‌లో బయలుదేరి ముగుస్తాయి.

విమానాశ్రయం

మార్చు

సమీప విమానాశ్రయాలు వడోదర విమానాశ్రయం 125 కి.మీ,అహ్మదాబాద్ విమానాశ్రయం 210 కి.మీ.దూరంలో ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. Anjali H. Desai (2007). India Guide Gujarat. India Guide Publications. p. 180. ISBN 978-0-9789517-0-2. Retrieved 28 August 2017.
  2. Shikoh, Dara (2008). "An Experiment in Hindu-Muslim Unity". In Waseem, M. (ed.). On Becoming an Indian Muslim: French Essays on Aspects of Syncretism. Oxford University Press. p. 103. ISBN 9780195658071.
  3. "Drashti Netralaya". Archived from the original on 10 June 2010. Retrieved 24 జూన్ 2023. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Siemens sign contract worth ₹26,000 cr for Dahod Locomotive Project in Gujarat". DeshGujarat. 2023-01-19. Retrieved 2023-04-07.
  5. Jaiswar, Pooja Sitaram (2022-12-08). "Siemens shares extend rally after winning ₹20,000 cr Dahod locomotives project". www.livemint.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
  6. "Indian Railways issues Letter of Award for Manufacturing and Maintenance of 9000 HP Electric Freight Locomotives to Siemens, India". pib.gov.in. Retrieved 2023-04-07.
  7. "Siemens Mobility awarded a €3 billion project in India – large ..." press.siemens.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
  8. www.ETEnergyworld.com. "Siemens lowest bidder for manufacturing 1,200 electric locomotives worth Rs 20,000 cr - ET EnergyWorld". ETEnergyworld.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
  9. "Railways awards ₹26,000-cr contract to Siemens India in Dahod". www.fortuneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=దాహూద్&oldid=4218528" నుండి వెలికితీశారు