దృశ్యం 2 2021లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల పై డి సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి నిర్మించిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. దగ్గుబాటి వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 25 నవంబర్ 2021న విడుదలైంది.

దృశ్యం2
దర్శకత్వంశ్రీప్రియ
రచనజీతు జోసెఫ్
నిర్మాతదగ్గుబాటి సురేష్ బాబు,
తారాగణందగ్గుబాటి వెంకటేష్,
మీనా,
నదియా,
నరేష్
ఛాయాగ్రహణంసతీష్ కురుప్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2021 నవంబర్ 25
భాషతెలుగు

కథ మార్చు

2014లో విడుదలైన దృశ్యం కథకు కొనసాగింపుగా ఈ సినిమాను నిర్మించారు. వరుణ్‌ మృతి తర్వాత రాంబాబు (వెంకటేశ్‌) కుటుంబంలో ఏళ్లు గడుస్తున్నా అలజడి కొనసాగుతూనే ఉంటుంది. దృశ్యంలో కేబుల్ ఆప‌రేట‌ర్ గా ఉన్న రాంబాబు సినిమా థియేటర్ ఓనర్‌గా మారుతాడు. సినిమాలే లోకంగా జీవించే రాంబాబు సినిమా తీయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. అంత సాఫీగా సాగుతున్న సమయంలో రాంబాబు జీవితంలోకి గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) లు తన కొడుకు వరుణ్ కేసును తోడుతారు. ఈ క్రమంలో రాంబాబు ఏం చేశాడు ? ఈ క్ర‌మంలో పోలీస్ స్టేషన్‌లో పూడ్చిన వరుణ్ శవాన్ని పోలీసులు క‌నిపెడుతారా ? ఆ కేసు నుంచి రాంబాబు ఎలా గట్టెక్కాడు? అనేదే మిగతా కథ.[1]

తారాగణం మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. Eenadu (25 November 2021). "రివ్యూ: దృశ్యం 2". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 24 నవంబరు 2021 suggested (help)
  2. TV9 Telugu (20 March 2021). "వెంకటేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. దృశ్యం 2లో కీలక పాత్రలో ఆ భామ". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. TV5 (26 November 2021). "'దృశ్యం2'లో నటించిన ఈ సరిత ఎవరు?" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దృశ్యం_2&oldid=3980739" నుండి వెలికితీశారు