నమో వెంకటేశ 2010 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

నమో వెంకటేశ
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీను వైట్ల
నిర్మాణం అచంట గోపీచంద్, అచంట రామ్, సుంకర అనిల్
కథ గోపీమోహన్
తారాగణం దగ్గుబాటి వెంకటేష్
త్రిష కృష్ణన్
ముఖేష్ రిషి
కోట శ్రీనివాసరావు
బ్రహ్మానందం
జయప్రకాష్ రెడ్డి
జీవా
ఆలీ (నటుడు)
చంద్రమోహన్
మాస్టర్ భరత్
గిరిధర్
రఘుబాబు
బలిరెడ్డి పృధ్వీరాజ్
సంభాషణలు చింతపల్లి రమణ
ఛాయాగ్రహణం మూరెళ్ళ ప్రసాద్
కూర్పు నాగిరెడ్డి, ఎమ్.ఆర్.వర్మ
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 14 జనవరి 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ సవరించు

వెంకటరమణ (వెంకటేష్) ఒక వెంట్రిలాక్విజం కళాకారుడు. వేంకటేశ్వర స్వామి భక్తుడు. అతనికి వయసు మీద పడుతున్నా పెళ్ళి కాలేదని దిగులు పడుతుంటాడు. ఒకసారి వెంకటరమణకి విదేశాల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తుంది. అక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసే ప్యారిస్ ప్రసాద్ (బ్రహ్మానందం) అమెరికాకు వచ్చిన కళాకారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. కానీ వెంకటరమణ మాత్రం ప్రసాద్ ను అనేక ఇక్కట్లకు గురిచేస్తాడు. దాంతో ప్రసాద్ వెంకటరమణ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంటాడు. అంతకు ముందే వెంకటరమణ ప్రసాద్ కు బంధువైన పూజ (త్రిష) అనే అమ్మాయిని చూసి మనసులోనే ప్రేమిస్తుంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రసాద్ పూజ అతన్ని ప్రేమిస్తుందని చెప్పి ఆట పట్టించాలనుకుంటాడు. కానీ పూజ అందుకు ఒప్పుకోదు. వెంకటరమణకు తాను ప్రేమించడం లేదని నిజం చెప్పమంటుంది. కానీ ప్రసాద్ చెప్పాడు.

ఉన్నట్టుండి పూజను అతని మామయ్య చెంగల్రాయుడు (ముఖేష్ రిషి) భారతదేశానికి రమ్మంటాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఆమెకు చెంగల్రాయుడు కొడుకు భద్రప్ప (సుబ్బరాజు)తో బలవంతంగా పెళ్ళి నిశ్చయిస్తారు. అది ఇష్టంలేని పూజ ఆ సమస్య నుంచి బయట పడేయమని ప్రసాద్ ని భారత్ కి రమ్మంటుంది. అతను వచ్చేటపుడు వెంకటరమణను కూడా తనతో తీసుకువస్తాడు. తమకు సహాయంగా ఉండటానికి అతన్ని తోడు తీసుకువచ్చానని అతన్ని ప్రేమిస్తున్నట్లు నటించమని చెబుతాడు. పూజ అయిష్టంగానే అందుకు అంగీకరిస్తుంది. వెంకటరమణ పూజను పెళ్ళి చేసుకుందామనే ఉద్దేశంతో ఆమెను తీసుకెళ్ళి పోతాడు. కానీ పూజ జరిగిన విషయం చెప్పేసరికి ఆమె ప్రేమించిన వాడితో పెళ్ళి చేయడానికి సిద్ధ పడతాడు. చివరకు పూజ అతని ప్రేమను అర్థం చేసుకుని పెళ్ళికి అంగీకరించడంతో కథ ముగుస్తుంది.

తారాగణం సవరించు

పురస్కారాలు సవరించు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2010 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం ప్రసాద్ మూరెల్ల[2] Won

మూలాలు సవరించు

  1. హేమంత్. "నమోవెంకటేశ సినిమా సమీక్ష". 123telugu.com. మల్లెమాల. Retrieved 26 April 2017.
  2. "2010 నంది పురస్కారాల జాబితా". Archived from the original on 2016-03-05. Retrieved 2018-01-19.