గిరిధర్ (అసలు పేరు వజ్జా వెంకట గిరిధర్) ఒక తెలుగు సినీ నటుడు.[1] గిరిధర్ మొదటి సినిమా 1996లో వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమా. త్రివిక్రం శ్రీనివాస్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, గోపీ మోహన్ లాంటి దర్శకులతో కలిసి పనిచేశాడు.

గిరిధర్
జననం
వజ్జా వెంకట గిరిధర్

పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం
విద్యాసంస్థఎ. వి. కాలేజి, హైదరాబాదు
జీవిత భాగస్వామిఅచ్యుతవల్లి
పిల్లలువైష్ణవి, ఐశ్వర్య
తల్లిదండ్రులు
  • శ్రీనివాసరావు (తండ్రి)
  • విజయలక్ష్మి (తల్లి)

వ్యక్తిగత జీవితం

మార్చు

గిరిధర్ పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం లో శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. హైదరాబాదులోని ఎ. వి. కాలేజీలో డిగ్రీ చదువుకున్నాడు. అతని భార్య పేరు అచ్యుతవల్లి. వీరికి వైష్ణవి, ఐశ్వర్య అనే ఇద్దరు కూతుర్లున్నారు.[1]

కెరీర్

మార్చు

సినిమాల్లో అవకాశాల కోసమని 1991 లో మద్రాసు వెళ్ళాడు. నిర్మాత, నటుడు అశోక్ కుమార్ సలహాలు అడిగి తెలుసుకున్నాడు. కానీ అవకాశాలు ఇప్పిస్తానని ఒక వ్యక్తి మోసం చేయడంతో హైదరాబాదుకు వచ్చి ఎ. వి. కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. 1996 నుంచి మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నించాడు. త్రివిక్రం శ్రీనివాస్తో మొదటి నుంచి పరిచయం ఉండటం వల్ల ఆయన దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో గిరిధర్ కు ఓ పాత్ర ఉంటుంది. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ సినిమాల్లో కూడా చెప్పుకోదగ్గ పాత్రల్లో నటిస్తుంటాడు.[2]

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "మా వెబ్ సైటులో గిరిధర్ ప్రొఫైలు". maastars.com. MAA. Retrieved 16 November 2016.
  2. "నటుడు గిరిధర్ ఫేస్ బుక్ అభిమానుల ప్రశ్నలకిచ్చిన సమాధానాలు". youtube.com. తెలుగు ఫిలిం నగర్. Retrieved 16 November 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=గిరిధర్&oldid=2984829" నుండి వెలికితీశారు