జనసేన పార్టీ

రాజకీయ పార్టీ
(జనసేన నుండి దారిమార్పు చెందింది)

జనసేన పార్టీ అనునది తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ 2014 లో స్థాపించిన రాజకీయ పార్టీ. జనసేన అనగా ప్రజా సైన్యం అని అర్ధం.[1] 2014 ఎన్నికలప్పుడు నేరుగా పోటీలో దిగకుండా ఇతరపార్టీలకు మద్దతునిచ్చింది. 2019 ఎన్నికలలో నేరుగా ఆంధ్రప్రదేశ్ లో పోటి చేసినా, కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలింది.

జనసేన పార్టీ
Leaderపవన్ కళ్యాణ్
Founderపవన్ కళ్యాణ్
Foundedమార్చి 14, 2014
Headquartersహైదరాబాదు
Ideologyసమ సమాజం
Coloursఎరుపు
ఈసిఐ హోదాజనసేన
Election symbol
Website
http://janasenaparty.org/
వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్

చరిత్ర మార్చు

పవన్ కళ్యాణ్ 2014 మార్చి 10న ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేశారు. 2014 డిసెంబరు 11న ఎన్నికల సంఘం దీనిని ఆమోదించినది[2]. 2019 ఎన్నికలలో పార్టీ పోటీ చేయటం దీనితో ఖారారు అయినది[3][4][5].[6]

ఆవిర్భావం మార్చు

2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా వ్యవస్థాపకుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాదు నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించాడు. ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించాడు. రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగంలో ఆయన తన రాజకీయ చైతన్యం గురించి, తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు, విభజన జరిగిన తీరుపై ఆవేదన, పార్టీ విధానాలు వంటివి స్పష్టంగా వ్యక్తపరిచారు.[7]

24 అక్టోబరు 2017న హైదరాబాదులో పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించబడింది.[8]

ఆవిర్భావ వేడుకలు 2022 మార్చు

తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు 2022 మార్చి 14న జరిగాయి. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు.[9] ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన ఈ సభను ఏర్పాటుచేసింది.

లక్ష్యాలు మార్చు

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ప్రధాన నినాదంగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. రాజకీయాల్లో నిలకడ లేమి, అవకాశవాదం, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించడం వంటి వాటిని విమర్శించాడు. ఆవిర్భావ సభలో ప్రసంగాన్ని అనుసరించి మౌలిక లక్ష్యాలుగా వీటిని పేర్కొనవచ్చు:[7]

  • బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన.
  • విద్య, వైద్యం మెరుగుపరచడం.
  • చట్టాల అమలులో అందరికీ సమన్యాయం.
  • ప్రజాధనం వ్యయానికి కాపలా.
  • జాతీయ సమైక్యత.

పార్టీ చిహ్నం , జెండా మార్చు

పార్టీ లోగో, రంగులు చేగువేరా, అనేక ఇతర ప్రభావవంతమైన నాయకుల వంటి విప్లవకారులను తలపించేలా ఉంటాయి. ఈ పార్టీ చిహ్నం మన దేశం యొక్క చరిత్రను, పోరాటాలను నిర్వచించే ఒక దళముల కలయిక.

తెల్ల రంగు

దీనిలోని తెలుపు నేపథ్యం భారత నాగరికత, సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి, స్థిరత్వమును సూచిస్తుంది.

ఎరుపు రంగు

విప్లవ చిహ్నం. లోతైన, నిజమైన మార్పును సూచిస్తుంది.

ఆరు మూలల నక్షత్రం

పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం. నక్షత్రంలోని తెలుపు భాగం సరైన మార్గం చూపించే స్వయంప్రకాశిత గుణాన్ని సూచిస్తుంది.

కేంద్ర బిందువు

మధ్యలో ఉన్న బిందువు ప్రతి జీవిలోనున్న ఆత్మ. ఇదే అఖండ సత్యం. వ్యక్తులుగా, దేశంగా మనం చేసే ప్రతి పనినీ మూర్తీభవిస్తుంది.

నల్లని చారలు

విప్లవ వాంఛకు, దాని వ్యతిరేక శక్తులకు సమతూకంగా వ్యవహరించి పక్షపాతధోరణిని అసమ్మతిని దూరం చేస్తుంది~

రాజకీయ వ్యవహారాల కమిటీ మార్చు

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా నాదెండ్ల మనోహర్, సభ్యుడిగా నాగబాబు వున్నారు.

లేవనెత్తిన సమస్యలు మార్చు

ప్రత్యేక హోదా మార్చు

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి, మూడేళ్ళ తర్వాత అది సాధ్యం కాదని తెలుపటం పై జనసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో ఈ విషయమై జనసేన బహిరంగ సభలను నిర్వహించింది.

ఉద్దానం మార్చు

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం అనే ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో (Chronic Kidnly Disease) బాధపడుతోన్న ప్రజలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలిసారు. జనసేన పార్టీ తరపున వైద్యులను, శాస్త్రవేత్తలను నియమించి ఈ సమస్యపై వివరణాత్మక్ నివేదికను సమర్పించమని కోరారు. 48 గంటలలోగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని వారికి తగు చికిత్సను అందించాలని గొంతెత్తారు. వారికి ఉచిత బస్ పాసులు, పరిశుభ్రమైన త్రాగు నీరు, ప్రతి మండలంలో డయాలిసిస్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రం, సమస్య యొక్క మూల కారణం తెలుసుకొనటానికి నెఫ్రాలజిస్టుల నియామకం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

29 జూలై 2017న పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని మన్నించి హార్వార్డ్ మెడికల్ స్కూల్ నుండి ఒక వైద్య బృందం ఉద్దానానికి వచ్చి ఈ వ్యాధి పై ఒక వైద్య సదస్సును నిర్వహించింది. ఈ వైద్య బృందం అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుని కలిసి పరిశోధన కేంద్రం నిర్మాణానికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చవలసినదిగా కోరారు.

శాసన సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ మార్చు

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతము ఫలితం
2019 15వ శాసనసభ
01 / 175
ఓటమి

లోక్ సభ ఎన్నికలు మార్చు

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు
2019 17వ లోక్ సభ 0

గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ మార్చు

800 కోట్ల విలువ చేసే గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పశ్చిమ గోదావరి లోని జొన్నలగరువు, తుండుర్రు, కంపల బేటపూడి, నర్సాపూర్ ప్రదేశాలకు చేరువలో నెలకొల్పబడుతోంది. ఈ ఫుడ్ పార్క్ వలన చుట్టు ప్రక్కల ఉండే జల వనరులపై, అక్కడ నివసించే ప్రజలపై చూపే దుష్ఫలితాల గురించి అటు ప్రభుత్వం గానీ, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం గానీ ప్రజలకు తెలుపలేకపోయారు. 100 కి.మీల దూరం లోపే ఉన్న జొన్నలగరువు ప్రజలు ఇది భద్రతా నియమాలకు విరుద్ధం అని ఆరోపించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం 10 మంది నిరసనకారులపై చొరబాటు/ఆస్తులను ధ్వంసం చేయటం కేసులు పెట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు.

ఈ గ్రామస్థులు చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సమస్య పై కూలంకుషంగా అధ్యయనం చేసిన పవన్ కళ్యాణ్, ఫ్యాక్టరీని వేరొక చోటుకు మార్చాల్సిందిగా సూచించారు. గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మార్చి 2017 నాటికి ఈ ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆపివేయబడింది.

మూలాలు మార్చు

  1. Pawan Kalyan's Jana Sena Party gets a new logo - The Times of India
  2. Suresh Krishnamoorthy (2014-03-07). "Stage set for Pawan Kalyan's "Jana Sena"". The Hindu. Retrieved 2014-03-14.
  3. "పార్టీ అధికారిక వెబ్ సైటు/About". Archived from the original on 2017-12-11. Retrieved 2017-12-27.
  4. Sreenivas, Janyala. "Politics makes rivals of actor brothers Chiranjeevi and Pawan Kalyan". The Indian Express. Retrieved 2014-03-14.
  5. K V Kurmanath. "Pawan Kalyan floats Jana Sena party | Business Line". Thehindubusinessline.com. Retrieved 2014-03-14.
  6. "Telugu actor Pawan Kalyan launches new party". indtoday.com. Archived from the original on 14 మార్చి 2014. Retrieved 30 డిసెంబరు 2017.
  7. 7.0 7.1 కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో:సూర్య పత్రిక:15.3.2014[permanent dead link]
  8. పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభం (ద హిందూ - 25 అక్టోబరు 2017)
  9. "Janasena: ఎట్టకేలకు జనసేన సభకు పోలీసుల అనుమతి". EENADU. Retrieved 2022-03-10.

ఇతర లంకెలు మార్చు