నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

2018 లో వక్కంతమ్ వంశి దర్శకత్వం లో విడుదల చేసిన చిత్రం

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 2018 లో విడుదలయిన తెలుగు చిత్రం.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
దర్శకత్వంవక్కంతం వంశీ
నిర్మాతలగడపాటి శిరీష
లగడపాటి శ్రీధర్
బన్నీ వాసు
కె. నాగేంద్రబాబు
రచనవక్కంతం వంశీ
నటులుఅల్లు అర్జున్
అను ఇమ్మాన్యుయేల్
అర్జున్ సర్జా
ఆర్. శరత్ కుమార్
సంగీతంవిశాల్- శేఖర్
ఛాయాగ్రహణంరాజీవ్ రవి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
విడుదల
4 మే 2018 (2018-05-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

సూర్య (అల్లు అర్జున్‌) కోపాన్ని అదుపు చేసుకోలేని యువకుడు. తన ఆవేశంతో ప్రతి ఒకరితో గొడవపడుతూ ఉంటాడు. చిన్నతనంలో ఓ గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక సైన్యంలో చేరి అక్కడా తన తీరును మార్చుకోడు. ఈ క్రమంలో ఓ మంత్రి కొడుకుతో గొడవపడటం, తరువాత సైన్యం నిర్భందంలో ఉన్న ఓ వ్యక్తిని చంపటంతో ఉన్నతాధికారులు సూర్య మీద చర్యలు తీసుకుంటారు.తన మీద తనకు అదుపు లేని వాడు సైన్యంలో పనికిరాడంటూ సైన్యం నుంచి తొలగిస్తారు. తిరిగి సైన్యంలో చేరాలంటే తాను మానసికంగా దృఢంగా ఉన్నట్లు ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు రామకృష్ణం రాజు (అర్జున్‌) నుంచి ధృవపత్రం తీసుకురావాలని షరతు పెడతారు. ఆ పని మీద వైజాగ్‌ వచ్చిన సూర్యకు సమస్యలు ఎదురవుతుంటాయి. చల్లాతో గొడవలు పెట్టుకుంటాడు. ఇంతకీ రామకృష్ణంకు సూర్యకు మధ్య సంబంధం ఏంటి..? సూర్య తన నైజాన్ని వదులుకొని తిరిగి సైన్యంలో చేరాడా? అన్నదే మిగతా కథ.

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • సంగీతం : విశాల్‌ - శేఖర్‌
  • కథ, స్క్రీన్‌ ప్లే, సంభాషణలు, దర్శకత్వం : వక్కంతం వంశీ
  • నిర్మాత : లగడపాటి శ్రీధర్‌, నాగబాబు, బన్నీ వాసు

సాహిత్యంసవరించు

ఈ చిత్రంలో కథానాయకుడు సూర్య సైనికుడు. సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధం చేసే అతను ప్రేమికుడు కూడా! ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అమ్మాయీ అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ, ఒక రోజు సూర్యపై కోపం వస్తుంది. అతడిపై యుద్ధం ప్రకటిస్తుంది. చిన్న చిన్న మనస్ఫర్థలతో ప్రేమ యుద్ధం అన్నమాట! సరిహద్దుల్లో యుద్ధం అయితే ఎలా చేయాలో సూర్యాకు తెలుసు. ప్రేమ యుద్ధం కొత్త. ప్రేయసిపై బోల్డంత ప్రేమ ఉంది. బ్రేకప్‌ చెప్పేసి వెళ్ళలేడు. అమ్మాయిని ఏడిపించలేడు. అతడి ప్రేమలో నిజాయితీ ఉంది. పాటలో అది కనిపించాలి. అలాగని, సైనికుడిగా అతని వ్యక్తిత్వాన్ని తగ్గించకూడదు. పాటలో ఆ వ్యక్తిత్వం కనిపించేలా రాయాలి. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రతిభతో పాటు అనుభవాన్ని రంగరించి ఈ చిత్రంలో ఐయామ్‌ లవర్‌ ఆల్సో... ఫైటర్‌ ఆల్సో! పాటను ట్రెండీగా రాశారు. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాట చరణాల్లోని నీ హార్ట్‌ బుక్‌ పై లవ్‌ స్టోరీ మళ్లీ రాసే రైటర్‌ ఆల్సో , నీలోని ప్రేమని పట్టుబట్టి బయటపెట్టె లైటర్‌ ఆల్సో ప్రయోగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.[1]

మూలాలుసవరించు

  1. "సైనికుడూ... ప్రేమికుడూ!". andhrajyothy.com. 2018-02-14. Archived from the original on 2018-02-15. Retrieved 2017-01-15. CS1 maint: discouraged parameter (link)

బయటి లంకెలుసవరించు