నూతలపాటి గంగాధరం

నూతలపాటి గంగాధరం విలక్షణమైన కవి. మంచి విమర్శకుడు.

నూతలపాటి గంగాధరం
జననం(1939-12-15)1939 డిసెంబరు 15
రామగిరి గ్రామం, సత్యవేడు మండలం, చిత్తూరు జిల్లా
మరణం1975 మే 29(1975-05-29) (వయసు 35)
రామగిరి గ్రామం, సత్యవేడు మండలం, చిత్తూరు జిల్లా
మరణ కారణంపాముకాటు
విద్యవిద్వాన్
విద్యాసంస్థతిరుపతి ప్రాచ్య కళాశాల
వృత్తికవి, విమర్శకుడు, తెలుగు పండితుడు
తల్లిదండ్రులు
  • మునుస్వామి నాయుడు (తండ్రి)
  • కుప్పమ్మ (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1939, డిసెంబరు 15న చిత్తూరు జిల్లా, సత్యవేడు మండలం రామగిరి గ్రామంలో జన్మించాడు[1]. ఇతని తల్లి కుప్పమ్మ, తండ్రి మునుస్వామినాయుడు. ఇతడు ప్రాథమిక విద్య రామగిరిలో, ఉన్నత విద్యాభ్యాసం చిత్తూరులో పూర్తి చేసుకున్నాడు. తిరుపతి ప్రాచ్య కళాశాలలో విద్వాన్ కోర్సు అనంతరం సత్యవేడులోనే తెలుగు పండితుడిగా ఉద్యోగం ప్రారంభించాడు. గంగాధరం చిన్నతనంలోనే సంస్కృత కావ్యాలు, అలంకార, వ్యాకరణ శాస్త్రగ్రంథాలు అధ్యయనం చేశాడు. గంగాధరం కొంతకాలం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. ఇతని కవిత్వం పై కోసూరి దామోదర నాయుడు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన గావించాడు.

రచనలు

మార్చు

ఇతడు అనేక కవితలు, కథలు, విమర్శనాత్మక వ్యాసాలు రచించాడు.

  • 1965లో భారతిలో ప్రచురితమైన గురజాడకు మార్గదర్శి వేమన[2] అనే వ్యాసం ఇతనికి మంచిపేరు తెచ్చింది.
  • వేమన, గురుజాడ, శ్రీశ్రీ, కుందుర్తి తదితర కవుల గురించి రాసిన సాహిత్య గంగాలహరి అనే వ్యాస సంకలనం విమర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చింది.
  • కథల్లో తివాచీకల, కొత్తచీర, పందెం
  • నవలల్లో కాగితం పులి పేర్కొనదగినవి.
  • చీకటి నుంచి వెలుగులోకి కవితా సంకలనం కవిగా పేరు తెచ్చింది.

ఇతడు 1975, మే 29న తన స్వగ్రామంలో పాముకాటుకు గురై మరణించాడు.

నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం

మార్చు

ఇతని మరణానంతరం ఇతని మిత్రులు కొందరు నూతలపాటి సాహితీ కుటుంబం పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 1976 నుండి ఇతని పేరిట ఒక పురస్కారాన్ని ఏటా వివిధ ప్రక్రియల్లో సాహిత్య కృషికి గుర్తింపుగా ఒక రచయితకు బహూకరిస్తున్నారు. ఈ పురస్కారం పొందిన కొందరు

మూలాలు

మార్చు
  1. వి.రంగాచార్యులు. "వచన కవిత". ఈనాడు. ఉషోదయా పబ్లికేషన్స్. Retrieved 16 February 2015.[permanent dead link]
  2. నూతలపాటి, గంగాధరం (1965-01-01). "గురజాడకు మార్గదర్శి వేమన". భారతి. 42 (1): 31–38. Archived from the original on 2016-03-05. Retrieved 16 February 2015.

బయటి లింకులు

మార్చు