న్యూజీలాండ్‌లో హిందూమతం
న్యూజిలాండ్‌లో హిందూమతం రెండవ అతిపెద్ద మతం. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మతాలలో ఇది ఒకటి. 2018 జనాభా లెక్కల ప్రకారం న్యూజిలాండ్ జనాభాలో హిందువులు 2.63% మంది - 1,23,534 మంది - ఉన్నారు. [1]
Total population | |
---|---|
1,23,534 (2018) న్యూజీలాండ్ జనాభాలో 2.63% | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
ఆక్లండ్ · వెల్లింగ్టన్ · హామిల్టన్ · తౌరంగ | |
భాషలు | |
ఇంగ్లీషు · హిందీ · పంజాబీ · మరాఠీ · గుజరాతీ · తమిళం · కన్నడం · తెలుగు · బెంగాలీ · భారతీయ భాషలు |
భారతదేశం నలుమూలల నుండి హిందువులు నేటికీ వలసలు కొనసాగిస్తున్నారు. న్యూజీలాండ్ లోని అతిపెద్ద భారతీయ జాతి ఉప సమూహం గుజరాతీలు. తరువాతి హిందూ వలసదారులలో చారిత్రకంగా యూరోపియన్ వలస పాలనలో ఉన్న ఫిజీ వంటి దేశాల నుండి వచ్చిన భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. నేడు అన్ని ప్రధాన న్యూజిలాండ్ నగరాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి.
చరిత్ర
మార్చుతొలి వలసలు
మార్చు1836 లో మిషనరీ విలియం కోలెన్సో, వాంగరే వద్ద మావోరీ మహిళలు కొందరు ఒక విరిగిన కంచు గంటలో బంగాళదుంపలు ఉడకపెట్టడం చూసాడు. దాని అంచు చుట్టూ ఉన్న శాసనంలో చాలా పాత తమిళ లిపిలో 'ముహాయిదీన్ బక్ష్ ఓడ యొక్క గంట' అని రాసి ఉంది. ఈ ఆవిష్కరణతో తమిళం మాట్లాడే హిందువులు వందల సంవత్సరాల క్రితమే న్యూజిలాండ్‌ను సందర్శించి ఉండవచ్చనే ఊహాగానాలు వచ్చాయి.
అయితే, న్యూజిలాండ్‌లో హిందువుల మొదటి స్థావరం 19వ శతాబ్దంలో సిపాయిల (భారత సైనికులు) రాక నాటిది. పంజాబ్, గుజరాత్‌ల నుండి 1890లలో మొదటి సమాజాలు వచ్చాయి. 1980ల వరకు వచ్చిన హిందూ వలసదారులు దాదాపుగా అందరూ గుజరాత్ నుండి వచ్చినవారే. తరువాత భారతదేశం నలుమూలల నుండీ, శ్రీలంక, మలేషియా, దక్షిణాఫ్రికాతో సహా ఇతర ప్రాంతాల నుండీ వచ్చారు. [2]
ఇమ్మిగ్రేషన్ విధానాల సడలింపు, పెరిగిన వలసలు: 1987-2001
మార్చు1987 నాటి వలస చట్టం ఫలితంగా పెరిగిన వలసల కారణంగా హిందువుల సంఖ్య 17,000 దాటిందని 1991 జనాభా లెక్కల్లో తేలింది. [3] [4] భారతదేశపు ఆర్థిక సరళీకరణ ఆ సంవత్సరంలోనే మొదలైంది. దీనితో జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆ తరువాత ఎక్కువ మంది వలసదారులు రావడానికి వీలు కలిగించింది. వలస చట్టాలను సడలించడం వలన హిందువుల సంఖ్య 1991లో 18,000 నుండి మొదటిసారిగా 25,000కి పెరిగింది. 1987 చట్టపు విజయమే దీనికి కారణం.
వేగవంతమైన వృద్ధి, మందగమనం: 2001-2012
మార్చు2001 జనాభా లెక్కల ప్రకారం, హిందువుల జనాభా దాదాపు 40,000 వద్ద ఉంది, అంటే 1991 జనాభా లెక్కల నుండి 10 సంవత్సరాలలో హిందువుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2006 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య 64.557. 2001 నాటి జనాభా గణనతో పోలిస్తే ఇది దాదాపు 62% పెరుగుదల. [5] 2006, 2013 జనగణనల మధ్య సంవత్సరాలలో న్యూజిలాండ్‌లో హిందువుల సంఖ్య పెరుగుదల వివిధ సంఘటనల కారణంగా మందగించింది. భారతీయ ఆస్ట్రేలియన్లపై పెరిగిన హింస (2007-2010), 2011 క్రైస్ట్‌చర్చ్ భూకంపం లు హిందువుల పెరుగుదల క్షీణించడానికి ప్రధాన కారణాలు. అదే సమయంలో జనగణను 2011 నుండి 2013 కు జరపడానికి కూడా ఆ భూకంపమే కారణం. [6] భారతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన వలసదారుల సంఖ్య పెరగడంతో దీర్ఘకాలిక వలసల మందగమనం పాక్షికంగా ఆగింది. ఆర్థిక మాంద్యం సమయంలో, తక్కువ ఖర్చులు, మెరుగైన ఆర్థిక దృక్పథం కారణంగా వారి సంఖ్య వేగంగా పెరిగింది. [7] [8] ఇటీవల నిర్వహించిన 2013 జనాభా లెక్కల ప్రకారం హిందూ జనాభా 90,018 మందితో మొత్తం జనాభాలో 2% కంటే కొంచెం ఎక్కువగా ఉంది. పైన పేర్కొన్న సంఘటనల ఫలితంగా వలసలు మందగించినప్పటికీ మొత్తం న్యూజిలాండ్ జనాభాలో హిందూమతస్తుల వాటా 0.5% పెరిగింది.
జనాభా వివరాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1966 | 3,599 | — |
1971 | 3,845 | +6.8% |
1976 | 5,203 | +35.3% |
1981 | 6,078 | +16.8% |
1986 | 8,148 | +34.1% |
1991 | 17,661 | +116.8% |
1996 | 25,293 | +43.2% |
2001 | 39,627 | +56.7% |
2006 | 64,557 | +62.9% |
2013 | 90,018 | +39.4% |
2018 | 1,23,534 | +37.2% |
సంవత్సరాల వారీగా హిందువుల శాతం
మార్చుసంవత్సరం | శాతం | పెంచు |
---|---|---|
1966 | 0.13% | - |
1971 | 0.13% | +0.00% |
1976 | 0.17% | +0.04% |
1981 | 0.19% | +0.02% |
1986 | 0.25% | +0.06% |
1991 | 0.54% | +0.29 |
1996 | 0.71% | +0.17% |
2001 | 1.02% | +0.31% |
2006 | 1.51% | +0.49% |
2013 | 2.12% | +0.61% |
2018 | 2.63% | +0.51% |
సంవత్సరాల వారీగా మతం డేటా
మార్చు2013 [9] | 2006 [10] | 2001 | 1996 | 1991 | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య | % | సంఖ్య | % | సంఖ్య | % | సంఖ్య | % | సంఖ్య | % | |
రోమన్ కాథలిక్ | 4,92,384 | 11.07 | 5,08,437 | 11.87 | 4,85,637 | 12.40 | 473,112 | 13.08 | 498,612 | 14.78 |
ఆంగ్లికన్ | 4,59,771 | 10.33 | 5,54,925 | 12.95 | 5,84,793 | 14.93 | 631,764 | 17.46 | 732,048 | 21.70 |
ప్రెస్బిటేరియన్, కాంగ్రేగేషనల్, రిఫార్మ్డ్ | 3,30,903 | 7.44 | 4,00,839 | 9.36 | 4,31,139 | 11.01 | 470,442 | 13.00 | 553,386 | 16.40 |
హిందూమతం | 90,018 | 2.12 | 64,560 | 1.51 | 39,864 | 1.02 | 25,551 | 0.71 | 18,036 | 0.54 |
బౌద్ధుడు | 58,440 | 1.31 | 52,392 | 1.22 | 41,661 | 1.06 | 28,131 | 0.78 | 12,762 | 0.38 |
ముస్లిం | 46,194 | 1.04 | 36,153 | 0.84 | 23,637 | 0.60 | 13,545 | 0.37 | 6,096 | 0.18 |
సిక్కు | 19,191 | 0.43 | 9,507 | 0.22 | 5,199 | 0.13 | 2,817 | 0.08 | 2,061 | 0.06 |
ఇతర మతాలు | 40,365 | 0.91 | 42,012 | 0.99 | 36,318 | 0.94 | 21,957 | 0.60 | 26,133 | 0.78 |
మతం లేదు/చెప్పలేదు | 21,55,722 | 50.82 | 18,32,688 | 45.50 | 15,54,669 | 41.60 | 1,336,854 | 36.95 | 980,079 | 29.05 |
మొత్తం జనాభా | 42,42,048 | 40,27,947 | 37,37,277 | 3,618,303 | 3,373,926 |
సంస్థల పరంగా, జాతి పరంగా
మార్చు2018 జనాభా లెక్కల ప్రకారం: [11]
- 1,21,644 మంది హిందువులు
- 645 హరే కృష్ణులు
- 327 యోగా
- 36 ఆర్య సమాజం
- 882 హిందూ (దేనికీ చెందనివారు).
జాతి
మార్చున్యూజిలాండ్లోని హిందువులలో ఎక్కువ మంది ఆసియన్లు. ఆ తరువాత యూరోపియన్లు, పసిఫిక్ ద్వీపవాసులు ఉన్నారు. 3,567 మంది యూరోపియన్, 1,857 పసిఫిక్ ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. మావోరీలలో కూడా కొద్ది మంది హిందూమతాన్ని ఆచరిస్తారు. 858 మంది మావోరీలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు
హిందూ సంస్థలు
మార్చుమొదటి హిందూ సంస్థ - హిందూ కౌన్సిల్ ఆఫ్ న్యూజిలాండ్ (HCNZ) 1990ల మధ్యలో ఏర్పడింది. ఇది ప్రపంచ హిందూ సంస్థ అయిన విశ్వ హిందూ పరిషత్‌కు అనుబంధంగా ఉంది. HCNZ 2007 నుండి వార్షిక న్యూజిలాండ్ హిందూ సమావేశాలను నిర్వహిస్తోంది. ఇది హిందూ హెరిటేజ్ సెంటర్, హిందూ సోషల్ సర్వీస్ ఫౌండేషన్, హిందూ ఎల్డర్స్ ఫౌండేషన్, హిందూ యూత్ న్యూజిలాండ్‌లను కూడా స్థాపించింది. యువతకు, కుటుంబాలకూ శిబిరాలను నిర్వహిస్తోంది. 2010లో HCNZ న్యూజిలాండ్‌లోని హిందూ సమూహాలకు ప్రతినిధి సంస్థ అయిన హిందూ సంస్థలు, దేవాలయాలు, సంఘాలను (HOTA) ప్రారంభించింది. [2]
ఇతర హిందూ సంస్థలలో రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, సత్యసాయి ఆర్గనైజేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, హిందూ స్వయంసేవక్ సంఘ్, సేవా ఇంటర్నేషనల్, ఏకల్ విద్యాలయ ఫౌండేషన్ ఉన్నాయి . [2]
సమకాలీన సమాజం
మార్చు2019లో వెల్లింగ్‌టన్ లోని విక్టోరియా యూనివర్శిటీ చేసిన సర్వే ప్రకారం, నాస్తికులు, ప్రొటెస్టంట్లు, ముస్లింలు, క్యాథలిక్‌లు, ఎవాంజెలికల్‌ల కంటే హిందువులు నమ్మదగినవారని న్యూజిలాండ్ వాసులు భావిస్తున్నట్లు తేలింది. దాదాపు 28.3 శాతం మంది న్యూజిలాండ్ వాసులు హిందువులపై పూర్తి లేదా ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారు. అయితే 19.9 శాతం మందికి హిందువుపై అంతగా నమ్మకం లేదు. [13]
న్యూజిలాండ్‌లో యూదులకు, హిందువులకు అత్యధిక విద్యా స్థాయి ఉంది. [14]
మావోరీలతో హిందువుల సంబంధాలు
మార్చుహిందూ, మావోరీ ప్రజల ఆచారాలు, భాషల మధ్య సారూప్యతలు ఉన్నాయి. మావోరీ భాషకు సమానమైన కనీసం 185 సంస్కృత, ఇతర భారతీయ భాషా పదాలు ఉన్నాయి. కొన్ని హిందూ సంఘాలకు మారే ను పోలిన భవనాలున్నాయి. ఇక్కడ ప్రజలు సమావేశాలు నిర్వహిస్తారు, అక్కడే నిద్ర చేస్తారు. మావోరీలు కూడా హిందువుల లాగే కొత్త భవనాలలోకి గృహప్రవేశాలు చేస్తారు. సాధారణంగా సూర్యోదయానికి ముందు ఇది చేస్తారు. [15] [16]
దేవాలయాలు
మార్చుప్రధాన న్యూజిలాండ్ నగరాల్లోని హిందూ దేవాలయాల జాబితా ఇది.
ఆక్లాండ్
మార్చు- శ్రీ రామ మందిరం 11 బ్రిక్ స్ట్రీట్, హెండర్సన్, ఆక్లాండ్ వద్ద ఉంది.
- తిరు సుబ్రమణియర్ ఆలయం 69, టైడల్ రోడ్, మంగేరే, ఆక్లాండ్‌లో ఉంది. ఇది దక్షిణ భారత శైలి గ్రానైట్ దేవతలతో కూడిన ఆలయం. [17]
- భారతీయ మందిర్ న్యూజిలాండ్‌లోని పురాతన, అతిపెద్ద హిందూ దేవాలయం [18]
- ఒటాహుహులోని తిరుమురుగన్ ఆలయం.
- పాపకురాలో ఉన్న శ్రీ గణేష్ దేవాలయం. [19]
- ఈడెన్ టెర్రేస్‌లోని రాధా-కృష్ణ దేవాలయం
- పాపటోటోలోని రామకృష్ణ దేవాలయం
- ఇంటర్నేషనల్ స్వామినారాయణ్ సత్సంగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లోని స్వామినారాయణ ఆలయం
- BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్, అవొండలే, ఆక్లాండ్.
వెల్లింగ్టన్
మార్చు- న్యూలాండ్స్‌లోని వెల్లింగ్‌టన్ [20] లో ఉన్న కురించి కుమరన్ ఆలయం. ఇది న్యూజిలాండ్‌లో స్థాపించబడిన మొదటి దక్షిణ భారత శైలి హిందూ దేవాలయం. ఇది పురాతన ఆలయ నిర్మాణ శైలిలో ఉంటుంది.
- వెల్లింగ్టన్ ఇండియన్ అసోసియేషన్ ఉత్తర భారత శైలిలో ఆలయాన్ని నిర్వహిస్తోంది. [21]
- వెల్లింగ్టన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం [22] వైనుయోమాటాలో ఉంది. [23] న్యూజిలాండ్‌కు చెందిన సనాతన ధర్మ పరిపాలన సేవా ట్రస్ట్, కమ్యూనిటీ మద్దతుతో 2018లో ఈ ఆలయాన్ని స్థాపించింది
- BAPS శ్రీ స్వామినారాయణ మందిర్
తౌరంగ
మార్చు- సనాతన్ ధరమ్ మందిర్, తౌరంగ హిందూ సంఘం సభ్యులు నిర్మించారు. [24] ట్రస్ట్ దాదాపు 2150 చదరపు మీటర్ల భూమిని టౌరికో శివారులో సుమారు $400,000కి కొనుగోలు చేసింది. [25] 2012 లో ప్రారంభించినప్పటికీ, ఆలయం పని 2015 వరకు ప్రారంభం కాలేదు [26] ఆలయం మొదటి దశ 2015 మధ్యలో పూర్తయింది. [27]
క్రైస్ట్‌చర్చ్
మార్చు- క్రైస్ట్‌చర్చ్, సౌత్ ఐలాండ్‌లోని ఏకైక హిందూ దేవాలయం BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్. [28] ఈ మందిరం 2011లో "మహాపూజ" తర్వాత ప్రారంభించబడింది. [29] 2011 క్రైస్ట్‌చర్చ్ భూకంపం తర్వాత 12 నెలల పునర్నిర్మాణం తర్వాత ఈ ఆలయం ప్రారంభించబడింది. [30]
రోటోరువా
మార్చు- BAPS శ్రీ స్వామినారాయణ దేవాలయం, రోటోరువా యొక్క మొట్టమొదటి హిందూ దేవాలయం, 2012లో ప్రారంభించబడింది, ఇది న్యూజిలాండ్‌లోని నాల్గవ "BAPS" దేవాలయం. [31] ఇది మధ్య ఉత్తర ద్వీపంలోని ఏకైక హిందూ దేవాలయం. [32]
హామిల్టన్
మార్చు- శ్రీ బాలాజీ టెంపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన ఆరు సంవత్సరాల తర్వాత [33] 2015 మార్చిలో ఆలయాన్ని తెరిచారు. [34]
- BAPS శ్రీ స్వామినారాయణ మందిర్
ఇతర స్థలాలు
మార్చు- ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ న్యూజిలాండ్‌లో ఉంది, ఆక్లాండ్, హామిల్టన్, వెల్లింగ్‌టన్, క్రైస్ట్‌చర్చ్‌లలో దేవాలయాలను నడుపుతోంది. ఆక్లాండ్ ఆలయం నగరం వెలుపల, ప్రధాన మందిరంపై ఒక టవర్‌తో వేద శైలిలో నిర్మించబడింది.
ప్రముఖ హిందువులు
మార్చుక్రీడల్లో
మార్చు- జీతన్ పటేల్ , న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో మాజీ స్పిన్ బౌలర్
- రాయ్ కృష్ణ, ఫిజియన్ ఫుట్‌బాల్ ఆటగాడు
- దీపక్ నర్షిభాయ్ పటేల్, న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు
- జీత్ రావల్, టెస్ట్ మ్యాచ్ జట్టులో ప్రస్తుత బ్యాట్స్‌మెన్
- రోనీల్ హీరా, న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు
- తరుణ్ నేతుల, న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు
- రచిన్ రవీంద్ర, ప్రస్తుత న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు
వినోదం
మార్చు- ఆరాధన పటేల్: సగం సమోవాన్, సగం భారతీయ R&B కళాకారిణి
- శైలేష్ ప్రజాపతి: పవర్ రేంజర్స్ మెగాఫోర్స్‌లో ఎర్నీ పాత్రకు ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్ నటుడు
మీడియా
మార్చు- రోహిత్ కుమార్ హ్యాపీ, భారత్-దర్శన్, హిందీ సాహిత్య పత్రిక [35]
- వనితా ప్రసాద్, చీఫ్ రిపోర్టర్, వెస్ట్రన్ లీడర్
- రెబెక్కా సింగ్, న్యూజిలాండ్ టెలివిజన్ స్టేషన్ TV3లో న్యూస్ యాంకర్ - స్వలింగ సంపర్కుణ్ణని బహిరంగంగా చెప్పుకున్నాడు
రాజకీయం
మార్చు- మహేశ్ బింద్రా, పార్లమెంటు సభ్యుడు
- ప్రియాంకా రాధాకృష్ణన్, 2017 తర్వాత మొదటి హిందూ మహిళా పార్లమెంటు సభ్యురాలు
- రాజేన్ ప్రసాద్, మాజీ రేస్ రిలేషన్స్ కమీషనర్ ఫ్యామిలీస్ కమీషనర్, 2008-2014 మధ్య పనిచేసిన మొదటి హిందూ పార్లమెంటు సభ్యుడు
- ఆనంద్ సత్యానంద్, న్యూజిలాండ్ మాజీ గవర్నర్ జనరల్, 2006 ఆగస్టు 23న నియమితులయ్యారు
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Table 26, 2018 Census Data – Tables".
- ↑ 2.0 2.1 2.2 Taonga, New Zealand Ministry for Culture and Heritage Te Manatu. "Hindus". teara.govt.nz (in ఇంగ్లీష్). Retrieved 2020-10-19.
- ↑ "Christian faiths losing out to other religions". NZ Herald (in New Zealand English). Retrieved 2020-10-19.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-01-23. Retrieved 2015-04-05.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ More Hindu temples to come up in New Zealand[dead link] Hindustan Times - April 20, 2007
- ↑ "Census cancelled over Christchurch earthquake". NZ Herald (in New Zealand English). Retrieved 2020-10-19.
- ↑ "Archived copy". Archived from the original on 2015-01-25. Retrieved 2015-05-15.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Merinews.com". www.merinews.com. Archived from the original on 2019-02-12. Retrieved 2022-01-17.
- ↑ "2013 Census totals by topic". archive.stats.govt.nz. Archived from the original on 2017-11-22. Retrieved 2022-01-17.
- ↑ Table 28, 2006 Census Data – QuickStats About Culture and Identity – Tables Archived 2017-10-11 at the Wayback Machine.
- ↑ "Table". www.stats.govt.nz. 2018. Retrieved 2020-10-24.
- ↑ "Table". archive.stats.govt.nz. 2013. Archived from the original (PDF) on 2017-05-25. Retrieved 2020-10-24.
- ↑ "In New Zealand; Hindus More Trustworthy Than Atheists, Protestants, Muslims, Catholics, Evangelicals". www.face2news.com. Retrieved 2020-10-19.
- ↑ "The state of faith: Muslims most likely to be unemployed". NZ Herald (in New Zealand English). Retrieved 2020-10-19.
- ↑ "Hindu scholar finds similarities with Maori culture". www.rxpgnews.com. Archived from the original on 2019-08-24. Retrieved 2020-10-19.
- ↑ "City scientist to talk about being Hindu in New Zealand". NZ Herald (in New Zealand English). Retrieved 2020-10-19.
- ↑ AalayamWebAdmin. "Home". Aalayam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-19.
- ↑ "Historic Gajaraj Sthapna at Bhartiya Mandir: Five important things to know". Indian Weekender (in New Zealand English). Archived from the original on 2020-10-21. Retrieved 2020-10-19.
- ↑ "Archived copy". Archived from the original on 2009-02-17. Retrieved 2009-08-05.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy". Archived from the original on 2020-12-01. Retrieved 2021-02-07.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-16. Retrieved 2022-01-17.
- ↑ "Home | Wellington | Sri Venkateswara Swamy Temple of Wellington". SVWT.
- ↑ "Google Maps". Google Maps.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-13. Retrieved 2022-01-17.
- ↑ "New Zealand's Bay of Plenty to have its 1st Hindu temple soon – THE JET | Fiji's First Community Newspaper" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2015-08-08. Retrieved 2020-10-19.
- ↑ "Indian Community of Tauranga - Indian Community of Tauranga - Tauranga Memories". tauranga.kete.net.nz. Archived from the original on 2021-01-16. Retrieved 2020-10-19.
- ↑ "SunLive - Hindu temple build to start - The Bay's News First". www.sunlive.co.nz (in ఇంగ్లీష్). Retrieved 2020-10-19.
- ↑ "Archived copy". Archived from the original on 2015-01-13. Retrieved 2021-02-07.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "BAPS News: Mahapuja to Inaugurate the New BAPS Shri Swaminarayan Mandir, Christchurch, New Zealand | Facebook". www.facebook.com. Retrieved 2020-10-19.
- ↑ "Mahapuja to Inaugurate the New BAPS Shri Swaminarayan Mandir". BAPS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-19.
- ↑ "Inauguration of BAPS Swaminarayan Mandir". BAPS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-19.
- ↑ "Hindus look forward to place of worship". NZ Herald (in New Zealand English). Retrieved 2020-10-19.
- ↑ "SBTT". sites.google.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-19.
- ↑ "Hindu temple a valuable asset". NZ Herald.
- ↑ "रोहित कुमार 'हैप्पी' | Rohit Kumar 'Happy' - Hindi journalist & writer". www.bharatdarshan.co.nz.