పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న ఉద్యానవనం.
(పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్ నుండి దారిమార్పు చెందింది)

పబ్లిక్ గార్డెన్స్ (ప్రజా ఉద్యానవనం) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న ఉద్యానవనం. నగరంలోని పురాతన ఉద్యానవనాల్లో ఒకటైన ఈ పబ్లిక్ గార్డెన్స్‌ను 1846లో నిజాం రాజు నిర్మించాడు.[1][2][3][4]

పబ్లిక్ గార్డెన్స్
బాగ్-ఈ-ఆమ్
పబ్లిక్ గార్డెన్స్ లోని సరస్సు
రకంపట్టణ ఉద్యానవనం
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు17°23′54″N 78°28′10″E / 17.3982°N 78.4695°E / 17.3982; 78.4695
నవీకరణ1846
ప్రజా రవాణా సౌకర్యంనాంపల్లి మెట్రో స్టేషన్

చరిత్ర

మార్చు

పబ్లిక్ గార్డెన్స్‌ను బాగ్-ఎ-ఆమ్ (బాగీయం) లేదా బాఘం అని కూడా పిలుస్తారు. ఉర్దూలో "బాగ్" అంటే గార్డెన్, ఆమ్ లేదా "ఆమ్ జన" అంటే "పబ్లిక్" అని (ప్రజల ఉద్యానవనం) అర్థం. ఇది నిజాం పాలనలో 1846లో నిర్మించబడింది. 1980 నుండి దీనిని పబ్లిక్ గార్డెన్స్ అని పిలుస్తున్నారు.[5]

ఆకర్షణలు

మార్చు

తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, లలిత కళా తోరణం, జవహర్ బాలభవన్, తెలంగాణ రాష్ట్ర శాసన సభ, తెలంగాణ శాసన మండలి, జూబ్లీహాల్, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఆసిఫ్ టెన్నీస్ క్లబ్, షాహి మజీద్ వంటి భవనాలు ఇక్కడ ఉన్నాయి.

స్మారక భవనాలతో పాటు పచ్చిక బయళ్ళు, సరస్సు, విశాలమైన మైదానంలతో ఈ పార్కు ఆహ్లాదకరంగా ఉంటుంది. లోటస్ చెరువులో వృక్షజాలం, జంతుజాలం ​​ఉన్నాయి. ఇందులో సుమారు 20 రకాల జాతుల పక్షులు నివసిస్తున్నాయి. పార్కులోని చెట్లకు వాటి శాస్త్రీయ, సాధారణ పేర్లతో బోర్డులను ఏర్పాటుచేశారు. ఇక్కడ లభించే కొన్ని చెట్లు వేప, సీతాఫలం, వెదురు, సింగపూర్ చెర్రీ, ఆస్ట్రేలియన్ తుమ్మా మొదలైన చెట్లు ఇక్కడ ఉన్నాయి..

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. IFTHEKHAR, J S (17 June 2013). "Public Garden turns a real concrete jungle". The Hindu. Hyderabad.
  2. "Public Gardens of Hyderabad to get a makeover - Times of India". The Times of India. Retrieved 2020-06-16.
  3. "Filth in Public Gardens raises a stink, algae chokes water - Times of India". The Times of India. Retrieved 2020-06-16.
  4. "Queen's Gift To Nizam Is Now Horticulture Office - Times of India". The Times of India. Retrieved 2020-06-16.
  5. Bhavani, Divya Kala (2017-05-19). "A bedrock of history". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-06-16.

ఇతర లంకెలు

మార్చు