పశ్చిమ క్షాత్రపులు
పశ్చిమ క్షాత్రపులు, సా.శ. 35 నుండి 415 మధ్య, భారతదేశపు పశ్చిమ, మధ్య ప్రాంతాన్ని (సౌరాష్ట్ర, మాల్వా: ఆధునిక గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు) పాలించిన ఇండో-సిథియన్ (శకులు) పాలకులు. వీరిని పశ్చిమ సాత్రపులు అని కూడా అంటారు. వీరు భారత ఉపఖండంలోని ఉత్తర భాగాన్ని పాలించిన కుషాణులకు సమకాలికులు. బహుశా కుషాణులకు సామంతులై ఉండవచ్చు. వారు మధ్య భారతదేశంలో పాలించిన శాతవాహనులకు (ఆంధ్రులు) కూడా సమకాలికులు. సా.శ. 2వ శతాబ్దం వరకు పంజాబ్, మథురలో పాలించిన "ఉత్తర క్షాత్రపుల" నుండి వేరుగా చూపించడానికి ఆధునిక చరిత్ర చరిత్రలో వారిని "పశ్చిమ క్షాత్రపులు" అని పిలుస్తారు.
పశ్చిమ క్షాత్రపులు | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
35–415 CE | |||||||||||||||||||||
పశ్చిమ క్షాత్రపుల సామ్రాజ్యం (35–415) సా.శ. 350[1] | |||||||||||||||||||||
రాజధాని | ఉజ్జయిని బరిగాజా మిన్నగారా | ||||||||||||||||||||
సామాన్య భాషలు | పాళీ (ఖరోష్ఠి లిపి) సంస్కృతం, ప్రాకృతం (బ్రాహ్మీ లిపి) | ||||||||||||||||||||
మతం | బౌద్ధం హిందూమతం | ||||||||||||||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||||||||||||||
క్షాత్రప రాజు | |||||||||||||||||||||
• c. 35 | ఆభీరకులు | ||||||||||||||||||||
• 388–415 | మూడవ రుద్రసింహుడు | ||||||||||||||||||||
చారిత్రిక కాలం | ప్రాచీన రాజవంశం | ||||||||||||||||||||
• స్థాపన | 35 | ||||||||||||||||||||
• పతనం | 415 CE | ||||||||||||||||||||
| |||||||||||||||||||||
Today part of | భారతదేశం పాకిస్తాన్ |
శాతవాహన వంశానికి చెందిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో శక పాలకులు ఓడిపోయిన తర్వాత సా.శ. 2వ శతాబ్దంలో పశ్చిమ క్షాత్రపుల శక్తి క్షీణించడం ప్రారంభమైంది.[2] దీని తరువాత, శక రాజ్యం పునరుద్ధరించబడినప్పటికీ, సా.శ. 4వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యానికి చెందిన రెండవ చంద్రగుప్రుడు దాన్ని నాశనం చేసాడు.[3]
మొత్తంగా, సుమారు 350 సంవత్సరాల కాలంలో 27 మంది స్వతంత్ర పశ్చిమ క్షాత్రప రాజులు పాలించారు.
పేరు
మార్చుతూర్పు పంజాబ్, మథుర ప్రాంతాలను పాలించిన రాజులూ, అతని వారసులూ అయిన "మహాక్షాత్రపుడు" ఖరపల్లన, "సత్రప్" వనస్పరా వంటి పాలకులను "ఉత్తర క్షాత్రపులు" అంటారు. ఆ పాలకుల నుండి భిన్నంగా చూపించేందుకు వీరిని పశ్చిమ క్షాత్రపులు అని అంటారు.[5]
పశ్చిమ క్షాత్రపులు తమ నాణేలపై తమను తాము "సాత్రపులు" అని పిలుచుకున్నప్పటికీ (ఇదే వారిని "పశ్చిమ క్షాత్రపులు" అనడానికి దారితీసింది), టోలెమీ తన 2వ శతాబ్దం నాటి "జియోగ్రాఫియా"లో వారిని "ఇండో-సిథియన్స్" అని పిలిచాడు.[6] క్షాత్రప అనే పదానికి, సాత్రప అనే పదానికీ ఒకే మూలం ఉంది. ఈ రెండూ ఒకప్పటి ఇరాన్ ప్రాంతం లోని మీడియన్ భాషకు చెందిన xšaθrapāvan- నుండి వచ్చినవే. ఈ మాటకు అర్థం రాజప్రతినిధి లేదా ప్రాంతీయ ప్రభువు అని అర్థం. జాన్ మార్షల్ ప్రకారం, క్షాత్రప అనే పదానికి "రాజాధిరాజు" యొక్క రాజప్రతినిధి అని అర్థం. మహాక్షాత్రప అనే బిరుదును రాజుకు ఇవ్వగా, క్షాత్రప అనే బిరుదు రాజు వారసుడికి ఇచ్చారు. పశ్చిమ క్షాత్రపులను భారతీయులు శకులు అని కూడా పిలుస్తారు.[7]
పశ్చిమ క్షాత్రపులు తమను తాము క్షహరాట అని పిలుచుకునేవారు. ఈ బిరుదు శక భాషా పదం *xšaθrapati నుండి వచ్చింది. దీనికి "దేశానికి ప్రభువు" అని అర్థం. క్షాత్రప అనే భారతీయ బిరుదు ఈ శక భాషా పదానికి పర్యాయపదమై ఉండవచ్చు. దానికి మూలం కూడా మీడియన్ భాషా పదమే.
పశ్చిమ భారతదేశంలోని శకులు శక భాషను మాట్లాడేవారు. దీనిని ఖోటానీ అని కూడా పిలుస్తారు. ఇది మొదటగా తారిమ్ బేసిన్‌లో కనబడింది.[8]
తొలి విస్తరణ: క్షహరాట రాజవంశం (సా.శ. 1వ శతాబ్దం)
మార్చుపశ్చిమ క్షాత్రపులు స్వల్పకాలం పాటు పాలించిన క్షహరాట రాజవంశంతో ప్రారంభమైనట్లు భావిస్తున్నారు (మూలాలను బట్టి చహరద, ఖహరాట లేదా ఖఖరాట అని కూడా పిలుస్తారు).[9] క్షహరాట అనే పదం సా.శ. 6 నాటి తక్షశిల రాగి ఫలకంలో కూడా ఉంది. ఇది ఇండో-సిథియన్ పాలకుడు లియాకా కుసులకా కు చెందినది అని ఉంది. శ్రీ పులమావి పాలనా కాలపు 19వ సంవత్సరానికి చెందిన నాసిక్ శాసనంలో కూడా ఖఖరాటవాస లేదా క్షహరాట జాతి ప్రస్తావన ఉంది.[10]
ఆధారాలు లభించిన తొట్ట తొలి క్షహరాట ప్రస్తావన ఆభీరకునికి చెందినది. అతనికి చెందిన అరుదైన నాణేలు ప్రసిద్ధి చెందాయి. అతని తరువాత నహపాణుడి తండ్రి భూమకకు చెందిన నాణేలున్నాయి. అతని నాణేలపై సాత్రప అనే బిరుదును మాత్రమే ఉపయోగించాడు గానీ, రాజా లేదా రాణో (రాజు) అని వాడలేదు. భూమక కుమారుడు గొప్ప పాలకుడైన నహపాణుడు (అతని పాలన సా.శ. 24-70, సా.శ. 66-71, లేదా సా.శ. 119-124 నాటిది అయి ఉండవచ్చు). తరువాతి కాలానికి చెందిన నాణేలలో ఒకదానిపై ఈ ప్రసక్తి ఉంది. భూమక నాణేలు ఎనిమిది చుక్కల చక్రం (ధర్మచక్రం) లేదా పీఠంపై కూర్చున్న సింహం, అశోక స్తంభం వంటి బౌద్ధ చిహ్నాలను కలిగి ఉంటాయి.
భూమకుని తరువాత అతని కుమారుడు, నహపాణుడు రాజయ్యాడు. అతను చాలా శక్తివంతమైన పాలకుడు. పశ్చిమ, మధ్య భారతదేశంలోని శాతవాహన సామ్రాజ్యంలోని కొన్ని భాగాలను ఆక్రమించాడు. నహపాణుడు మాళవ, దక్షిణ గుజరాత్, ఉత్తర కొంకణ్, భరూచ్ నుండి సోపారా, నాసిక్, పూనా జిల్లాలపై ఆధిపత్యం చెలాయించాడు.[12] ఆ సమయంలో, పశ్చిమ క్షాత్రపులకు వాయవ్య ప్రాంతమైన బలూచిస్తాన్‌ను ఇండో-పార్థియన్ రాజులైన పరాతరాజులు పరిపాలించేవారు. కుషాణులు ఉత్తరాన తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు.[13]
అతని అల్లుడు, శకుడు అయిన ఉషవదాత (నహపాణుడి కుమార్తె దక్షమిత్రను వివాహం చేసుకున్నాడు), నాసిక్, కర్లే, జున్నార్ (మన్మోడి గుహలు, 46వ సంవత్సరపు శాసనం) లోని శాసనాలను బట్టి అతడు రాజ్యపు దక్షిణ ప్రాంతంలో నహపాణుని ప్రతినిధిగా ఉండి, పరిపాలించేవాడని తెలుస్తోంది[14][15] నహపాణుడు క్షాత్రపుల వెండి నాణేలను ముద్రించాడు.
సా.శ. 120 ప్రాంతంలో, పశ్చిమ క్షాత్రపులు మాలవాల దాడిని తిప్పికొట్టడానికి ఉత్తమభద్రులతో పొత్తు పెట్టుకున్నారని తెలిసింది. చివరకు పశ్చిమ క్షాత్రపులు వారిని అణిచివేశారు.[16] ఈ విషయం నాసిక్ గుహల వద్ద నహపాణుడి ప్రతినిధి ఉషవదాత వేయించిన శాసనంలో కనిపిస్తుంది:
...ఆపై ప్రభువు ఆజ్ఞతో నేను, వర్షాకాలంలో మాళయులు ముట్టడించిన ఉత్తమభద్రుల అధిపతిని విడిపించడానికి వెళ్ళాను. ఆ మాళయులు (నేను వెళ్తున్నప్పుడు వచ్చిన) ధ్వనికే పారిపోయారు. ఉత్తమభద్ర యోధులు వారిని బందీలుగా పట్టుకున్నారు.
—నాసిక్ గుహల్లోని 10 వ గుహలోని శాసనం[17]
భారతీయ మతాల పోషణ
మార్చుకర్లా గుహలలోని మహాచైత్యంలో నహపాణుడికి సంబంధించిన ఒక ముఖ్యమైన శాసనంలో[18] బౌద్ధ, హిందూమతాలకు అతనిచ్చిన పోషణను చూడవచ్చు:
బౌద్ధ గుహల నిర్మాణం
మార్చుపశ్చిమ క్షాత్రపులు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలో అనేక బౌద్ధ గుహల నిర్మాణానికి ప్రసిద్ధి చెందారు.[19][20] నహపాణుడు కర్లా, జున్నార్, నాసిక్ ప్రాంతంలో కనీసం 35 సంవత్సరాలు పాలించాడని, అక్కడ అనేక నిర్మాణాలు చేపట్టాడని భావిస్తున్నారు.[21]
గుహలలోని అనేక శాసనాలను నహపాణ కుటుంబం వేయించింది: నాసిక్ గుహలలో ఆరు శాసనాలు, కర్లా గుహలలో ఒక శాసనం, జున్నార్‌లోని మన్మోడి గుహలలో నహపానా మంత్రి ఒక శాసనం వేయించారు.[22][23] అదే సమయంలో, " యవనులు ", గ్రీకులు లేదా ఇండో-గ్రీకులు, నాసిక్ గుహలు, కర్లా గుహలు, లేన్యాద్రి, మన్మోడి గుహలలో దాన శాసనాలను కూడా వేయించారు.[24]
కార్లా గుహలలో గొప్ప చైత్య మందిరం
మార్చుప్రత్యేకించి, దక్షిణాసియాలో అతిపెద్దదైన కర్లా గుహల చైత్య గుహ సముదాయాన్ని సా.శ. 120 లో నహపాణుడు నిర్మించి సమర్పించాడు.[19][25][26]
-
కార్లా వద్ద ఉన్న మహా చైత్యం హాలు (సా.శ. 120)[19]
-
కుడి వైపు స్థంభాలు
-
చైత్యం కప్పు
-
స్థంభ శీర్షాలు
-
వీతసంఘాత అనే యవనుడు వేయించిన దాన శాసనం.[27]
నాసిక్ గుహ నెం.10, 'నహపాణ విహార'
మార్చుపాండవ్లేని గుహలు అని కూడా పిలిచే నాసిక్ గుహల్లోని కొన్నిభాగాలను కూడా నహపాణుడి కాలంలోనే చెక్కారు.[20]
నాసిక్ సమీపంలోని నాసిక్ గుహలలోని 10 వ గుహ లోని శాసనాలు, సా.శ. 105-106 లో, క్షాత్రపులు శాతవాహనులను ఓడించారని, ఆ తర్వాత క్షాత్రప నహపాణుడి అల్లుడు, దినిక కుమారుడూ అయిన ఉషావదత ఈ గుహ కోసం, అలాగే సన్యాసుల ఆహారం, దుస్తుల కోసం 3000 బంగారు నాణేలను విరాళంగా ఇచ్చాడనీ వెల్లడైంది. ఉషవదత్త భార్య (నహపాణుడి కుమార్తె), దక్షమిత్ర కూడా బౌద్ధ సన్యాసుల కోసం ఒక గుహను దానం చేసింది. 'నహపాణ విహార' అనే 10 వ గుహ 16 గదులతో కూడినది.
-
ముందు
-
వరండా
-
లోపల
-
చైత్యం, ఛత్రాలు
-
శాసనం
10వ గుహలోని రెండు శాసనాలు శకుల అల్లుడు, నహపాణుడి ప్రతినిధి అయిన ఉషావదత[28] ఆ మొత్తం గుహను నిర్మించి, సంఘకు బహూకరించాడని పేర్కొన్నాయి:
శాసనాల ప్రకారం, ఉషావదాత తన మామగారి తరపున అనేక దానధర్మాలు చేసాడు, అనేక విజయాలను సాధించాడు. అతను బరుకచ్చా (బ్రోచ్), దశపుర (మాల్వాలోని మందసార్), గోవర్ధన (నాసిక్ దగ్గర), షోర్పరాగా (ఠానా జిల్లాలోని సోపారా) వద్ద విశ్రాంతి గృహాలు, తోటలు, చెరువులు నిర్మించాడు.
అంతర్జాతీయ వాణిజ్యం: ఎరిత్రియన్ సముద్రానికి చెందిన పెరిప్లస్
మార్చుఎరిథ్రియన్ సముద్రపు పెరిప్లస్‌లో నహపాణుని, బరిగాజా చుట్టుపక్కల ప్రాంతానికి పాలకుడిగా, నంబనస్ పేరుతో పేర్కొంటుంది.[29] :
పశ్చిమ క్షాత్రపుల పాలనలో, బారిగాజా భారతదేశంతో రోమన్ వాణిజ్యానికి ప్రధాన కేంద్రాలలో ఒకటి. మార్పిడి చేయబడిన అనేక వస్తువుల గురించి పెరిప్లస్ వివరిస్తుంది:
పశ్చిమ క్షాత్రపుల రాజధాని ఉజ్జయిని నుండి కూడా సరుకులు వచ్చేవి:
హిందూ మహాసముద్రం మీదుగా పశ్చిమ దిశగా వస్తువులను ఎగుమతి చేయడానికి బరిగాజా నుండి కూడా కొన్ని నౌకలు సిద్ధమయ్యేవి:
పాంపే లక్ష్మి
మార్చుపాంపే లక్ష్మి అని పిలుస్తున్న భారతీయ విగ్రహం ఒకటి ఇటలీ పట్టణమైన పాంపే శిథిలాలలో కనుగొనబడింది. సా.శ. 1వ శతాబ్దంలో ఇండో-రోమన్ వాణిజ్య సంబంధాల ఫలితంగా ఇది అక్కడికి చేరిందని భావించారు.[30] భోకర్దాన్ ప్రాంతంలో పశ్చిమ క్షాత్రపుడు నహపాణుడి పాలనలో ఈ విగ్రహం పశ్చిమానికి వెళ్ళిన అవకాశం ఉంది. దీన్ని బరిగాజా ఓడరేవు నుండి రోమ్‌కు రవాణా చేసి ఉండవచ్చు.[31]
గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో ఓటమి
మార్చునహపాణుడు, ఉషావదత్తుడు చివరికి శక్తివంతుడైన శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయారు. గౌతమీపుత్రుడు మాల్వా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల నుండి శకులను తరిమికొట్టాడు, నహపాణుని పశ్చిమాన గుజరాత్‌కు తరిమి కొట్టాడు. గౌతమీపుత్రుడు అనేక నహపాణుడి నాణేలను చెడగొట్టి వాటిపై తన ముద్రలను ముద్రింపజేసాడు (నాసిక్ జిల్లా జోగల్తంబిలో వాటి ఖజానా కనబడింది),[33] నాసిక్ లోని పాండవ్లేని గుహలలోని గుహ నెం. 3 వద్ద ఉన్న శాసనంలో గౌతమీపుత్రుడు వారిపై విజయం సాధించాడని పేర్కొనడాన్ని బట్టి అతని విజయం తెలుస్తుంది.
గౌతమీపుత్ర శాతకర్ణి (...) క్షత్రియుల అహంకారాన్ని అణచివేసిన వ్యక్తి; శకులు (పశ్చిమ క్షాత్రపులు), యవనులు (ఇండో-గ్రీకులు), పహ్లవులను (ఇండో-పార్థియన్లు),[34] ఖఖరత కుటుంబాన్నీ (నహపాణుడి కుటుంబం) నిర్మూలించాడు; శాతవాహన జాతి వైభవాన్ని పునరుద్ధరించాడు.
—నాసిక్ లోని పాండవ్‌లేని గుహల్లోని 3 వ గుహలో రాణి గౌతమీ బాలశ్రీ సా.శ. 2 వ శతాబ్దంలో వేయించిన శాసనం
జావా, సుమత్రాల ఆక్రమణ
మార్చుజావా, సుమత్రా దీవులను పశ్చిమ క్షాత్రపుల కాలంలో వలసరాజ్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.[35] అక్కడి గొడవల కారణంగా ప్రజలు ఉపఖండం నుంచి పారిపోయి ఉండవచ్చు. జావా యొక్క కొన్ని పునాది పురాణాల్లో శక శకం (జావా శకం కూడా ఇదే) ప్రారంభ కాలం నాటి వలసవాదుల నాయకుడిని గుజరాత్‌కు చెందిన యువరాజు అజీ శకగా వర్ణించారు.[35]
కర్దమక రాజవంశం, కాస్తానా కుటుంబం (1వ-4వ శతాబ్దం)
మార్చుభద్రముఖ లేదా కర్దమక రాజవంశం అని పిలువబడే కొత్త వంశాన్ని "క్షాత్రపుడైన" కాస్తానా స్థాపించాడు. కాస్టానా కాలం ఖచ్చితంగా తెలియదు, కానీ అతని పాలన సా.శ. 78 లో ప్రారంభమైందని భావిస్తున్నారు. తద్వారా అతన్ని శక శకానికి స్థాపకుణ్ణి చేసారు.[36] అతని వారసులు (తమ నాణేలు, శాసనాలపై శక యుగాన్ని ఉపయోగించారని మనకు తెలుసు) వారి స్థాపకుడి తేదీనే తమ యుగంగా ఉపయోగిస్తారనే వాస్తవంతో ఇది సరిపోతుంది. ఆ కాలంలో కాస్తానా ఉజ్జయినిని పాలించిన క్షాత్రపుడు. మథురలో కుషాను రాజు కనిష్కుడు, విమ తక్తు విగ్రహాలతో పాటు కనబడిన "షస్తానా" అనే పేరున్న ఒక విగ్రహమే ఈ కాస్తానా అని తరచూ భావిస్తూంటారు. కాస్తానా కుషానుల సామంతుడిగా ఉండవచ్చని ఇది సూచిస్తుంది. కనిష్కుడి పాలనలో (సా.శ. 127–150) పశ్చిమ క్షాత్రప భూభాగంపై (రాజధాని ఉజ్జయినిపై కుషాన్ నియంత్రణను పేర్కొనడం ద్వారా) కుషాణుల ఆధిపత్యాన్ని కూడా రబాటక్ శాసనం కూడా పేర్కొంది.
కస్తానా సమయంలో పశ్చిమ క్షాత్రపుల భూభాగాన్ని భౌగోళిక శాస్త్రవేత్త టోలెమీ తన "జియోగ్రాఫియా"లో విస్తృతంగా వర్ణించాడు. అందులో అతను వారిని "ఇండో-సిథియన్స్"గా పేర్కొన్నాడు. అతను ఈ భూభాగాన్ని పశ్చిమాన పాటలేన్ నుండి తూర్పున ఉజ్జయిని వరకు ("ఓజెనా-రెజియా తియాస్తానీ", "ఓజెన్/ఉజ్జయిని, రాజు చస్తానా రాజధాని "),[37] దక్షిణాన బరిగాజాకు ఆవల ఉన్నట్లు వివరించాడు.
మొదటి రుద్రదమన్ (సా.శ. 130-150)
మార్చుశాతవాహనులపై విజయం
మార్చుసా.శ. 130 లో, కాస్తానా మనవడు మొదటి రుద్రదమన్ "మహాక్షాత్రప" అనే బిరుదు పెట్టుకున్నాడు. అతను శాతవాహనుల నుండి తన రాజ్యాన్ని రక్షించుకున్నాడు. రుద్రదమన్, శాతవాహనుల మధ్య ఘర్షణ ఎంత ముదిరిందంటే, దాన్ని అరికట్టడానికి, రుద్రదమన్ కుమార్తెను శాతవాహన రాజు వశిష్టిపుత్ర శాతకర్ణికి ఇచ్చి పెళ్ళి చేసి, ఆ శత్రుత్వానికి ముగింపు పలికారు. ఈ పెళ్ళికి సంబంధించిన శాసనం కన్హేరిలోని ఒక గుహలో కనిపిస్తుంది:
శాతవాహనులు, పశ్చిమ క్షాత్రపుల మధ్య యుద్ధాలు కొనసాగాయి. ఈ ఘర్షణలలో మొదటి రుద్రదమన్ శాతవాహనులను రెండుసార్లు ఓడించాడు. వారి కుటుంబ సంబంధం కారణంగా వశిష్టిపుత్ర శాతకర్ణిని వదలి పెట్టాడు:
గతంలో నహపాణుడి ఆధీనంలో ఉన్న భూభాగాలన్నిటినీ రుద్రదమన్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బహుశా పూనా, నాసిక్‌లోని దక్షిణ ప్రాంతాలను మినహాయించి (ఆ సమయంలో ఈ రెండు ప్రాంతాలలో ఎపిగ్రాఫికల్ అవశేషాలు శాతవాహనులవి మాత్రమే కనిపించాయి)[38]
యౌధేయులపై విజయం
మార్చుతరువాత, మొదటి రుద్రదమన్[39] వేయించిన జూనాగఢ్ శిలా శాసనం (సా.శ. 150) లో యౌధేయుల సైనిక శక్తిని కొనియాడారు. "క్షాత్రియులలో వీరులు" అనే తమ బిరుదుకు తగినట్లుగానే వారు లొంగిపోరు". చివరికి మొదటి రుద్రదమన్ చేతిలో వారు ఓడిపోయారు అని ఆ శాసనం చెబుతోంది.[40][41]
ఇటీవల కనుగొనబడిన స్తంభాల శాసనాలు మహారాష్ట్రలోని ఈశాన్య ప్రాంతంలోని విదర్భ ప్రాంతంలోని భండారా జిల్లాలో రూపియమ్మ అనే పశ్చిమ క్షాత్రపుని ఉనికిని వివరిస్తాయి. అక్కడ అతను స్తంభాలను స్థాపించాడు.[42]
రుద్రధమన్ కళాపోషకుడు. అతను సంస్కృతంలో కవిత్వం వ్రాసాడు. దానిని తన ఆస్థాన భాషగా చేసుకున్నాడు. సుదర్శిని సరస్సులోని శాసనానికి అతని పేరు జతచేయబడింది.
అతని ఆస్థానంలో యవనేశ్వర అనే గ్రీకు రచయిత ఉండేవాడు. అతను యవనజాతకాన్ని గ్రీకు నుండి సంస్కృతం లోనికి అనువదించాడు. ఇది జ్యోతిషశాస్త్ర గ్రంథం. జాతకశాస్త్రంలో భారతదేశపు తొలి సంస్కృత రచన అది.[43]
జీవదమన్ (సా.శ. 178-181, సా.శ. 197-198)
మార్చుశక సంవత్సరం 100 లో (సా.శ. 178) జీవదమన్ రాజు అయ్యాడు. అతని పాలన వేరే విధంగా ఎక్కడా నమోదు కాలేదు. అయితే అతడు, నాణేలపై ముద్రణ తేదీని ముద్రించడం ప్రారంభించిన పశ్చిమ క్షాత్రప పాలకుడు. రాజు తల వెనుక, బ్రాహ్మీ లిపిలోని సంఖ్యలను ఉపయోగించి ఆ తేదీని ముద్రించారు[45] పశ్చిమ క్షాత్రప పాలకుల కాలం నిర్ణయించడానికి ఇది చాలా విలువైనది. వారి నాణేలపై వారి పూర్వీకుల గురించి కూడా పేర్కొన్నందున, వారి మధ్య కాలక్రమం, వారసత్వాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయడానికి ఇది చాలా విలువైనది. అతని నాణేల ప్రకారం, జీవదమన్ రెండుసార్లు - ఒకసారి శక శకం 100, 103 (సా.శ. 178-181) మధ్య, రుద్రసింహ I పాలనకు ముందు, రెండవసారి శక శకం 119 - 120 (సా.శ. 197-198) మధ్యనా పాలించినట్లు తెలుస్తోంది.
మహా క్షాత్రప రూపియమ్మ (సా.శ. 2వ శతాబ్దం)
మార్చు"మహాక్షాత్రప కుమార రూపియమ్మ" పేరుతో శాసనం ఉన్న స్మారక స్థూపం విదర్బా,[46] మధ్య ప్రాంతంలోని పౌనిలో కనుగొనబడింది. ఇది సా.శ. 2వ శతాబ్దం నాటిది.[47] ఈ మహా క్షాత్రపుని గురించి తెలియజెప్పే నాణేలు లేనప్పటికీ, ఈ స్మారక స్తంభం, పశ్చిమ క్షాత్రపులకు సాంప్రదాయికంగా దక్షిణ సరిహద్దుగా ఉన్న నర్మదా నదిని దాటి చాలా దూరం విస్తరించి ఉన్నట్లుగా భావించబడుతుంది.[47] "కుమార" అనే పదానికి అర్థం - అది ఒక బిరుదుగా కాక, ఒక గొప్ప క్షాత్రపుని కుమారుడు అని కావచ్చు.[48]
శాతవాహనులకు దక్షిణ భూభాగాలను కోల్పోవడం (సా.శ. 2వ శతాబ్దం ముగింపు)
మార్చుశాతవాహన రాజవంశానికి చెందిన దక్షిణ భారత పాలకుడు యజ్ఞ శ్రీ శాతకర్ణి (సా.శ. 170-199) సా.శ. 2వ శతాబ్దం చివరిలో పశ్చిమ క్షాత్రపులను ఓడించాడు. తద్వారా పశ్చిమ, మధ్య భారతదేశంలోని వారి దక్షిణ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇది పశ్చిమ క్షాత్రపుల క్షీణతకు దారితీసింది.[49]
యజ్ఞ శ్రీ శాతకర్ణి నాసిక్ గుహలు, కన్హేరి, గుంటూరులలో శాసనాలను వేయించి, శాతవాహనుల భూభాగాన్ని పునరుద్ధరించాడు.[50] కన్హేరి వద్ద యజ్ఞ శ్రీ శాతకర్ణి గుహ నం. 81,[51] చైత్య గుహ నం. 3[52] లలో వేయించిన రెండు శాసనాలు ఉన్నాయి.నాసిక్ గుహలలో, యజ్ఞ శ్రీ శాతకర్ణి పాలన 7వ ఏట వేయించిన శాసనం ఒకటి ఉంది.[53]
అయితే, నహపాణుడిపై విజయం సాధించిన తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి కాలం నుండి పూనా, నాసిక్ ప్రాంతాలు శాతవాహనుల చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో కర్దమకులకు సంబంధించిన శాసనాలు ఏమీ లేవు.[38]
రెండవ రుద్రసేనుడు (256–278)
మార్చుక్షాత్రపులలో 19వ పాలకుడైన రెండవ రుద్రసేనుడి పాలనలో (256–278) క్షాత్రప రాజవంశం ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇతని కాలంలో ఆంధ్ర ఇక్ష్వాకులకు, పశ్చిమ క్షాత్రపులకూ మధ్య వైవాహిక బంధం ఏర్పడింది. ఆంధ్ర ఇక్ష్వాకు పాలకుడు మాతరీపుత్ర వీరపురుషదత్త (సా.శ. 250-275) భార్యలలో ఒకరైన రుద్రధర-భట్టారిక, "ఉజ్జయిని పాలకుడి" - బహుశా రెండవ రుద్రసేనుడి - కుమార్తె.[55][56][57][58] నాగార్జునకొండలోని ఒక శాసనం ప్రకారం, ఇక్ష్వాకు రాజు వీరపురుషదత్తుడికి ఉజ్జయిని పాలకుడి కుమార్తె రుద్రధర -భట్టారికతో సహా [59] అనేక మంది భార్యలున్నారు. (ఉజ్(ఇ)నికా మహార(జ) బాలిక). [55][56][60]
రెండవ రుద్రసేనుడి (సా.శ. 255-278) పాలనలో సాంచి - విదిశ ప్రాంతాన్ని శాతవాహనుల నుండి మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో రెండవ రుద్రసేనుడి నాణేలు కనుగొనబడ్డాయి.[61] ఈ ప్రాంతం సా.శ. 4వ శతాబ్దం వరకు పశ్చిమ స్ఖాత్రపుల పాలనలో ఉందని కనకెర్హా శాసనం ధృవీకరిస్తోంది.[61]
కస్తానా వంశానికి చెందిన చివరి క్షాత్రప పాలకుడు విశ్వసేనుడు (పాలనా కాలం సా.శ. 293–304), భర్తృదమన్ సోదరుడు, అతనికి వారసుడు, రెండవ రుద్రసేనుడి కుమారుడు. అజంతా గుహల వద్ద త్రవ్వకాల్లో, వాఘోరా నది కుడి ఒడ్డున గుహలకు ఎదురుగా ఉన్న కాల్చిన ఇటుకలతో నిర్మించిన ఆశ్రమంలో విశ్వసేనుడి నాణెం ఒకటి కనుగొనబడింది.[62]
రెండవ రుద్రసింహుడి రాజవంశం (c. 304–396 CE)
మార్చురెండవ రుద్రసింహుడితో (పాలనా కాలం సా.శ. 304–348) కొత్త కుటుంబం పాలనకు వచ్చింది. అతను తన నాణేలపై తనను స్వామి జీవదామన్ కుమారుడిగా ప్రకటించుకున్నాడు.[63] అతని పాలన పాక్షికంగా ఇతర పాలకుల పాలనతో సమకాలికంగా ఉంది. ఆ నాణేలపై పేర్కొన్న యశోదమన్ II (పాలనా కాలం సా.శ. 317–332), రుద్రదమన్ II (పాలనా కాలం సా.శ. 332–348) లు అతని కుమారులు లేదా ఉప-రాజులు కావచ్చు.
గుప్తుల చేతిలో పరాజయం (పాలనా కాలం సా.శ. 335–415)
మార్చుమధ్య భారతదేశం సముద్రగుప్తుడి (పాలనా కాలం సా.శ. 336–380 ) స్వాధీనం
మార్చువిదిష / సాంచి, ఎరాన్ చుట్టూ ఉన్న మధ్య భారత ప్రాంతాన్ని శ్రీధరవర్మన్ అనే శక పాలకుడు ఆక్రమించుకున్నాడు, సాంచిలోని కనకెర్హా శాసనం, ఎరాన్ వద్ద అతని నాగా జనరల్‌తో ఉన్న మరొక శాసనం ద్వారా అతని గురించి తెలుస్తోంది.[61] ఎరాన్ వద్ద, శ్రీధరవర్మన్ శాసనం స్మారక చిహ్నం తరువాత, గుప్త సామ్రాజ్యం సముద్రగుప్తుడు (సా.శ.336-380) చేత "అతని కీర్తిని పెంపొందించుకోవడం కోసం" మరొక శాస్నాన్ని స్థాపించినట్లు తెలుస్తోంది. అతను పశ్చిమంగా చేసిన దండయాత్రలో శ్రీధరవర్మన్ యొక్క శకులను ఓడించి ఉండవచ్చు.[64] సముద్రగుప్తుని అలహాబాద్ స్థూప శాసనంలో పేర్కొనబడిన "శక" పాలకుడు బహుశా శ్రీధరవర్మన్ అయి ఉంటాడు. అతను గుప్త చక్రవర్తికి "కప్పం" చెల్లించినట్లు,[65] "స్వయంగా లొంగిపోయి, తన కుమార్తెలను వివాహంలో సమర్పించి, తన స్వంతభూభాగాన్ని పరిపాలించుకునేందుకు అభ్యర్థించేలా" అతన్ని బలవంతగా చేసినట్లూ తెలుస్తోంది.[66]
రామగుప్తుని గుజరాత్ దండయాత్ర
మార్చురుద్రసింహుడు III పశ్చిమ క్షాత్రప పాలకులలో చివరివాడు.[67] నాట్య-దర్పణ లోని ఒక భాగంలో, గుప్త రాజు రెండవ చంద్రగుప్తుని అన్న అయిన రామగుప్తుడు, గుజరాత్‌లోని పశ్చిమ క్షాత్రపులపై దండయాత్ర చేసి తన రాజ్యాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడని పేర్కొంది.
కొన్నాళ్ళకే ఆ దండయాత్రలో ఎదురుదెబ్బ తగిలింది. గుప్తుల సైన్యం చిక్కుల్లో పడింది. శక రాజైన మూడవ రుద్రసింహుడు, సంధి కుదరాలంటే రామగుప్తుడు తన భార్య ధ్రువదేవిని తనకు అప్పగించాలని షరతు పెట్టాడు. ఆ అవమానాన్ని నివారించడానికి గుప్తులు, చంద్రగుప్తుని ప్రియమైన వేశ్య అయిన మాధవసేనను రాణి వేషంలో పంపాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రగుప్తుడు పథకం మార్చుకుని తానే రాణి వేషంలో శక రాజు వద్దకు వెళ్లాడు. అక్కడ అతడు రుద్రసింహుడిని, ఆ తర్వాత తన స్వంత అన్న అయిన రామగుప్తుడినీ చంపేసాడు. అప్పుడు చంద్రగుప్తుడు ధృవదేవిని పెళ్ళి చేసుకున్నాడు.
రెండవ చంద్రగుప్తుని విజయాలు (పాలనా కాలం సా.శ. 380–415)
మార్చుపశ్చిమ క్షాత్రపులను చివరికి రెండవ చంద్రగుప్త చక్రవర్తి జయించాడు. సా.శ. 412-413 లో చంద్రగుప్తుడు వేయించిన శాసనాలను సాంచిలోని గ్రేట్ స్తూపం యొక్క తూర్పు ద్వారం సమీపంలో రైలింగ్‌పై చూడవచ్చు.[68]
గుప్త పాలకుడు స్కందగుప్తుడు (455-467 CE) గుజరాత్‌లోని జునాగఢ్‌లోని ఒక పెద్ద రాతిపై అశోకుడు, రుద్రదమన్ I ల పాత శాసనాల పక్కన వేయించిన సుదీర్ఘ శాసనంలో తనను "భూమికి పాలకుడు" అని వర్ణించుకున్నాడు. గుప్తులు పశ్చిమ ప్రాంతాలపై పట్టు సాధించారనడానికి అది నిదర్శనం.[69]
ఈ విజయాల తరువాత, గుప్త రాజులు రెండవ చంద్రగుప్తుడు, అతని కుమారుడు మొదటి కుమారగుప్తుల వెండి నాణేలు పశ్చిమ క్షాత్రపుల డిజైన్‌ను (ఇండో-గ్రీకుల నుండి తీసుకోబడ్డాయి) అనుసరిస్తూ, పాలకుడి ప్రతిమ, గ్రీకుల లాంటి శాసనం ఒకవైపున, రెండవ వైపున ఒక డేగను (గరుడ, గుప్తుల రాజవంశ చిహ్నం) ముద్రించారు.[70]
రెండవ చంద్రగుప్తుని దండయాత్రలతో ఉపఖండంలో దాదాపు నాలుగు శతాబ్దాల శక పాలనకు ముగిసింది. ఈ కాలం పంజాబ్‌లోని చివరి కుషాణ పాలకుల క్షీణతకు, మధ్య ఆసియాలోని స్టెప్పీల నుండి మొదటి హూణ ఆక్రమణదారులైన కిడారైట్ హూణుల రాకకు కూడా అనుగుణంగా ఉంటుంది. ఒక శతాబ్దం లోపే, ఆల్కాన్ హూణూలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించి, గుప్త సామ్రాజ్యానికి, భారతదేశంలోని సాంప్రదాయ కాలానికీ ముగింపు పలికారు.
నాణేల తయారీ
మార్చుక్షాత్రపులు చాలా గొప్ప, ఆసక్తికరమైన నాణేలను ముద్రించారు. వీటిని మునుపటి ఇండో-గ్రీక్ రాజుల నాణేల ఆధారంగా, బొమ్మ వైపున రాజు ముఖచిత్రాలతో రూపొందించారు. అయితే, నాణేల అచ్చు వైపు మాత్రం తమ స్వంత శైలిలో ఉంటుంది. దీనిపై సాధారణంగా పిడుగునూ, బాణాన్నీ ముద్రిస్తారు. తరువాతి కాలంలో, బ్రాహ్మి లిపిలో ఉన్న సూచిక, దాని లోపల చంద్రవంక, సూర్యునితో కూడిన చైత్యం గానీ, మూడు శిఖరాల కొండ, నది గానీ ఉంటాయి. ఈ నాణేలు చాలా సమాచారంతో కూడుకుని ఉంటాయి. వాటిలో రాజు పేరు, అతని తండ్రి, నాణేన్ని చెలామణీ చేసిన తేదీని చూపిస్తాయి. భారతదేశపు ప్రారంభ చరిత్రను తెలియజేయడంలో సహాయపడతాయి.
కుషాణులకు సామంతులుగా
మార్చుపశ్చిమ క్షాత్రపులు స్వతంత్ర పాలకులా, లేక కుషాణ సామ్రాజ్యానికి (సా.శ. 30–375) సామంతులా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. వారి నాణెంపై "సాత్రప " అనే పదం ఉండడం, ఎవరో ఉన్నత పరిపాలకుడికి - బహుశా కుషాణ చక్రవర్తికి - సామంతులుగా ఉండడాన్ని సూచిస్తుంది.[71]
అలాగే, మథురలో మాత దేవాలయం వద్ద విమా కాడ్‌ఫైసెస్, కనిష్కుల ప్రసిద్ధ విగ్రహాలతో పాటు కస్తానా విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహంపై "శాస్తాన" (మధ్య బ్రాహ్మీ లిపి : శ-స్త-న) అని చెక్కి ఉంది.[72] ఇది కనీసం వారి మధ్య ఉన్న పొత్తును, స్నేహాన్నైనా సూచిస్తూ ఉండవచ్చు. చివరగా కనిష్కుడి రబాటక్ శాసనంలో తన రాజ్యం పశ్చిమ క్షాత్రపుల సాంప్రదాయిక రాజధాని ఉజ్జయిని వరకు విస్తరించిందని పేర్కొన్నాడు. కనిష్కుడి ప్రక్కన కస్తానా విగ్రహం ఉండటంతో పాటు ఇది కూడా పశ్చిమ క్షాత్రపులతో కుషాణుల పొత్తును సూచిస్తుంది.
చివరగా, మథుర ప్రాంతాన్ని పాలించిన "ఉత్తర క్షాత్రపుల " కాలాన్ని అనుసరించి, "మహా క్షాత్రప" ఖరపల్లాణ, "సాత్రప" వనస్పరలు కుషాణుల సామంతులుగా ఉన్నారనిసారనాథ్‌లోని శాసనం ద్వారా తెలిసింది.[5]
పశ్చిమ క్షాత్రపులు కుషాణులకు సామంతులుగా ఉన్నారని, కనీసం ప్రారంభ కాలంలో రుద్రదమన్ I యౌధేయులను జయించే వరకు, వారు సాధారణంగా కుషాను సామంతులుగా ఉండేవారనీ ఆధునిక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఈ అంశం ఇంకా సంపూర్ణంగా పరిష్కరించబడలేదు.
వారసులు
మార్చుఆభీరులు తమను తాము శకులు అని పిలుచుకున్నారు. వీరు పశ్చిమ క్షాత్రపుల సామంతుల నుండి వచ్చినవారు.[73]
ఇవి కూడా చూడండి
మార్చు- భారతదేశ చరిత్ర
- ఇండో-గ్రీక్ రాజ్యం
- ఇండో-సిథియన్లు
- ఇండో-పార్థియన్లు
- కుషాణ సామ్రాజ్యం
- మాళవులు
మూలాలు
మార్చు- ↑ Schwartzberg, Joseph E. (1978). A Historical atlas of South Asia. Chicago: University of Chicago Press. p. 145, map XIV.1 (h). ISBN 0226742210.
- ↑ World history from early times to A D 2000 by B .
- ↑ Ancient India by Ramesh Chandra Majumdar p. 234
- ↑ Burgess, Jas (1883). Archaeological Survey Of Western India. p. 103.
- ↑ 5.0 5.1 Kharapallana and Vanaspara are known from an inscription discovered in Sarnath, and dated to the third year of Kanishka, in which they were paying allegiance to the Kushanas.
- ↑ Ptolemy, "Geographia", Chap 7
- ↑ Marshall, John (1936). A guide to Sanchi. Patna: Eastern book House. p. 16. ISBN 978-81-85204-32-1.
- ↑ Diringer, David (1948). Alphabet A Key To The History Of Mankind. p. 350.
- ↑ Rapson, p.
- ↑ "Kharoshthi inscription, Taxila copper plate of Patika", Sten Konow, p25
- ↑ Alpers, Edward A.; Goswami, Chhaya (2019). Transregional Trade and Traders: Situating Gujarat in the Indian Ocean from Early Times to 1900 (in ఇంగ్లీష్). Oxford University Press. p. 99. ISBN 9780199096138.
- ↑ "The Satavahanas did not hold the western Deccan for long.
- ↑ "New light on the Paratarajas" Pankaj Tandon p.37
- ↑ "Catalogue of Indian coins of the British Museum.
- ↑ Tripathi, Rama Shankar (1942). History of Ancient India (in ఇంగ్లీష్). Motilal Banarsidass. p. 216. ISBN 9788120800182.
- ↑ Ancient Indian History and Civilization by Sailendra Nath Sen p.188
- ↑ Epigraphia Indica Vol.8 p.78-79
- ↑ Valukura is thought to be an ancient name for Karla Caves
- ↑ 19.0 19.1 19.2 World Heritage Monuments and Related Edifices in India, Volume 1 ʻAlī Jāvīd, Tabassum Javeed, Algora Publishing, 2008 p.42
- ↑ 20.0 20.1 Foreign Influence on Ancient India, Krishna Chandra Sagar, Northern Book Centre, 1992 p.150
- ↑ Journal of the Asiatic Society of Bombay (in ఇంగ్లీష్). Asiatic Society of Bombay. 1986. p. 219.
If Konow is right, then the length of time for Ksatrapa rule in the Nasik-Karla-Junnar region would be at least thirty-fire years.
- ↑ Cultural and Religious Heritage of India: Zoroastrianism, Suresh K. Sharma, Usha Sharma, Mittal Publications, 2004 p.112
- ↑ The Dynastic Arts of the Kushans, John M. Rosenfield p.131
- ↑ Religions and Trade: Religious Formation, Transformation and Cross-Cultural Exchange between East and West (in ఇంగ్లీష్). BRILL. 2013. p. 97. ISBN 9789004255302.
- ↑ Southern India: A Guide to Monuments Sites & Museums, by George Michell, Roli Books Private Limited, 1 mai 2013 p.72
- ↑ "This hall is assigned to the brief period of Kshatrapas rule in the western Deccan during the 1st century." in Guide to Monuments of India 1: Buddhist, Jain, Hindu - by George Michell, Philip H. Davies, Viking - 1989 Page 374
- ↑ Epigraphia Indica Vol.18 p.326 Inscription No1
- ↑ Ushavadata also presents himself as a Saka in inscription 14a of Cave No.10 of the Nasik Caves: "[Success !
- ↑ "History of the Andhras", Durga Prasad Source
- ↑ (2013-08-07). "Indian Spices and Roman "Magic" in Imperial and Late Antique Indomediterranea".
- ↑ Brancaccio, Pia (2010). The Buddhist Caves at Aurangabad: Transformations in Art and Religion (in ఇంగ్లీష్). BRILL. p. 64 Note 94. ISBN 978-9004185258.
- ↑ Hultzsch, E. (1906). Epigraphia Indica Vol.8. p. 60.
- ↑ Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century (in ఇంగ్లీష్). Pearson Education India. p. 383. ISBN 9788131711200.
- ↑ V.D, Mahajan (2016). Ancient India (in ఇంగ్లీష్). S. Chand Publishing. ISBN 9789352531325.
- ↑ 35.0 35.1 Foreign Influence on Ancient India, Krishna Chandra Sagar, Northern Book Centre, 1992 p.131
- ↑ A. Jha and D. Rajgor: Studies in the Coinage of the Western Ksatraps, Nashik: Indian Institute of Research in Numismatic Studies, 1992, p. 7.
- ↑ Allchin, F. R.; Erdosy, George (1995). The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 279. ISBN 9780521376952.
- ↑ 38.0 38.1 Sircar, D. C. (2005). Studies in Indian Coins (in ఇంగ్లీష్). Motilal Banarsidass. p. 118. ISBN 9788120829732.
- ↑ Junagadh Rock Inscription of Rudradaman I Archived 23 ఫిబ్రవరి 2009 at the Wayback Machine, accessed on 23 March 2007.
- ↑ Rosenfield, "The dynastic art of the Kushans", p132
- ↑ Rapson, "A catalogue of the Indian coins in the British Museum", p.lx
- ↑ "Vidarbha also was under the rule of another Mahakshatrapa named Rupiamma, whose pillar inscription was recently discovered at Pavni in the Bhandara district [Mirashi, Studies in Indology, Vol.
- ↑ Mc Evilley "The shape of ancient thought", p385 ("The Yavanajataka is the earliest surviving Sanskrit text in astrology, and constitute the basis of all later Indian developments in horoscopy", himself quoting David Pingree "The Yavanajataka of Sphujidhvaja" p5)
- ↑ Rapson, Edward James (1967). Catalogue Of The Indian Coins In The British Museum. p. 83.
- ↑ Rapson, p.cxxiv
- ↑ "Siddham. The Asian Inscription Database, Pauni (पवनी Bhandara district). Memorial Pillar (OBNAG0032) with Inscription (INNAG0031) of Rupiamma" (in ఇంగ్లీష్).
- ↑ 47.0 47.1 . "A Pillar Inscription of Mahakshatrapa Rupiamma from Pawni".
- ↑ "The pillar inscription of Rupiamma from Pauni (1-41) may present a similar example.
- ↑ "later Satavahana named Yajna Satakarni seems to have conquered the Southern Dominions of the Western Satraps.
- ↑ Sen, Sailendra Nath (1999). Ancient Indian History and Civilization (in ఇంగ్లీష్). New Age International. p. 174. ISBN 9788122411980.
- ↑ Burgess, James; Bühler, Georg (1883). Report on the Elura cave temples and the Brahmanical and Jaina caves in western India; completing the results of the fifth, sixth, and seventh seasons' operations of the Archaeological survey, 1877-78, 1878-79, 1879-80. Supplementary to the volume on "The cave temples of India.". London, Trübner & Co. p. 79.
- ↑ Burgess, James; Bühler, Georg (1883). Report on the Elura cave temples and the Brahmanical and Jaina caves in western India; completing the results of the fifth, sixth, and seventh seasons' operations of the Archaeological survey, 1877-78, 1878-79, 1879-80. Supplementary to the volume on "The cave temples of India.". London, Trübner & Co. p. 75.
- ↑ Burgess, Jas (1883). Archaeological Survey Of Western India. p. 114.
- ↑ CNG Coins Coin image
- ↑ 55.0 55.1 K. Krishna Murthy 1977, p. 6.
- ↑ 56.0 56.1 "Another queen of Virapurusha was Rudradhara-bhattarika. According to D.C. Sircar she might have been related to Rudrasena II (c. a.d. 254-74) the Saka ruler of Western India" in Rao, P. Raghunadha (1993). Ancient and medieval history of Andhra Pradesh (in ఇంగ్లీష్). Sterling Publishers. p. 23. ISBN 9788120714953.
- ↑ Subramanian, K. R. (1989). Buddhist Remains in Andhra and the History of Andhra Between 225 and 610 A.D. (in ఇంగ్లీష్). Asian Educational Services. p. 82. ISBN 9788120604445.
- ↑ Majumdar, Ramesh Chandra (1986). Vakataka - Gupta Age Circa 200-550 A.D. (in ఇంగ్లీష్). Motilal Banarsidass. p. 66. ISBN 9788120800267.
- ↑ K. Krishna Murthy 1977, p. 5.
- ↑ (India), Madhya Pradesh (1982). Madhya Pradesh District Gazetteers: Ujjain (in ఇంగ్లీష్). Government Central Press. p. 26.
- ↑ 61.0 61.1 61.2 Buddhist Landscapes in Central India: Sanchi Hill and Archaeologies of Religious and Social Change, c.
- ↑ Mitra, Debala (2004). Ajanta. Archaeological Survey of India. pp. 94–95.
- ↑ Catalogue of the coins of the Andhra dynasty, the Western Ksatrapas, the Traikutaka dynasty, and the "Bodhi" dynasty, by British Museum.
- ↑ "During the course of this expedition he is believed to have attacked and defeated the Saka Chief Shridhar Varman, ruling over Eran-Vidisha region.
- ↑ Mirashi, Vasudev Vishnu (1955). Corpus inscriptionum indicarum vol.4 pt.2 Inscriptions of the Kalachuri Chedi Era. Archaeological Society of India. pp. 605–611.
- ↑ Lines 23-24 of the Allahabad pillar inscription of Samudragupta: "Self-surrender, offering (their own) daughters in marriage and a request for the administration of their own districts and provinces through the Garuḍa badge, by the Dēvaputra-Shāhi-Shāhānushāhi and the Śaka lords and by (rulers) occupying all Island countries, such as Siṁhala and others."
- ↑ The Cambridge Shorter History of India (in ఇంగ్లీష్). CUP Archive. p. 93.
- ↑ Marshall, The Monuments of India p.388
- ↑ ""Junagadh Rock Inscription of Rudradaman", Project South Asia". Archived from the original on 2009-02-23. Retrieved 2023-03-07.
- ↑ "Evidence of the conquest of Saurastra during the reign of Chandragupta II is to be seen in his rare silver coins which are more directly imitated from those of the Western Satraps... they retain some traces of the old inscriptions in Greek characters, while on the reverse, they substitute the Gupta type ... for the chaitya with crescent and star." in Rapson "A catalogue of Indian coins in the British Museum.
- ↑ "The titles "Kshatrap" and "Mahakshatrapa" certainly show that the Western Kshatrapas were originally feudatories" in Rapson, "Coins of the British Museum", p.cv
- ↑ Journal of the Bihar and Orissa Research Society. The Society. 1920.
- ↑ Mitchiner, Michael (1976). Indo-Greek and Indo-Scythian Coinage (in ఇంగ్లీష్). Hawkins Publications. ISBN 978-0-904173-12-3.