పాలారు నది
పాలారు నది కర్ణాటకలో పుట్టి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం (ఆంధ్రప్రదేశ్) మీదుగా ప్రవహిస్తూ, తమిళనాడు ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది నీరు దశాబ్ధాల క్రితం చెన్నై (మద్రాసు) కు త్రాగునీరుగా ఉపయోగించేవారు. ప్రస్తుతం, వర్షాకాలంలో మాత్రమే ఈ నదిలో కొద్దిగా మాత్రమే నీరు ప్రవహిస్తాయి.
పాలారు నది | |
---|---|
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | కోలారు జిల్లా, కర్ణాటక, భారతదేశం |
సముద్రాన్ని చేరే ప్రదేశం | |
• స్థానం | బంగాళాఖాతం |
పొడవు | 216 మై. (348 కి.మీ.) |
పాలార్ నది దక్షిణ భారతదేశ నది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని నంది కొండలలో ఉద్బవించింది.[1] ఇది కర్ణాటకలో 93 కిలోమీటర్లు (58 మై.) ఆంధ్రప్రదేశ్లో 33 కిలోమీటర్లు (21 మై.) తమిళనాడులో 222 కిలోమీటర్లు (138 మై.) ప్రవహించి, ఆ తరువాత చెన్నైకి దక్షిణాన 100 కిలోమీటర్లు (62 మై.) దూరం ప్రవహించి వయలూర్ వద్ద బెంగాల్ బేలో కలిసింది. [2] ఇది బేతమంగళ పట్టణానికి సమీపంలో ఉద్భవించటానికి చాలా దూరం భూగర్భ నదిగా ప్రవహిస్తుంది. అక్కడ నుండి ఇది నీటి వేగాన్ని అందుకుని డెక్కన్ పీఠభూమి క్రింద తూర్పు వైపు ప్రవహిస్తుంది. పాలార్ నది తీర ప్రాంతంలో బేతమంగళ, శాంతిపురం, కుప్పం, రామనాయకునిపేట్, వనియంబాడి, అంబూర్, మెల్‌పట్టి, గుడియతం, పల్లికొండ, మెల్మోనవూర్, వెల్లూరు, కాట్పాడి, మెల్వీషరం, ఆర్కాట్, రాణిపేట, వాలాజపేట,కాంచీపురం,చెంగల్పట్ పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. పాలార్ నది ఏడు ఉపనదులలో, ప్రధాన ఉపనది చెయ్యార్ నది.
పలార్ అనకట్ట నుండి పాలర్ నది నీటిని కోశాస్థలైయార్ నదీ పరీవాహక ప్రాంతంలోని పూండి జలాశయానికి, అడయార్ నది పరీవాహక ప్రాంతంలో ఉన్న చెంబరంబక్కం సరస్సుకి మళ్లించారు. [3] ఈ రెండు జలాశయాలు చెన్నై నగరానికి ప్రధాన నీటి సరఫరా కేంద్రాలు.కృష్ణ నది నీటిని రోజుకు, 1,000,000,000 లీటర్లు (260,000,000 యుఎస్ గ్యాలన్లు చెన్నై నగరానికి సరఫరా చేయడానికి తెలుగు గంగ ప్రాజెక్టును ప్రారంభించిన తరువాత పాలార్ నది నీటిపై ఆధారపడటం బాగా తగ్గింది.
వివాదాస్పద ఆనకట్ట
మార్చుకుప్పం సమీపంలోని గణేష్‌పురం వద్ద పాలార్ నది మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల ఆనకట్టను నిర్మిస్తోంది.ఇది పాలార్ నది వలన లబ్దిపొందిన తమిళనాడులోని వెల్లూర్, కాంచీపురం, తిరువన్నమలై, తిరువల్లూరు, చెన్నై ఐదు ఉత్తర జిల్లాల ప్రజల ఆందోళనకు కారణమైంది.[4]ఈ ప్రతిపాదనపై అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత "పాలార్ ఒక అంతర్-రాష్ట్ర నది, ఇది 1892 షెడ్యూల్ -ఎ ఒప్పందానికి పేర్కొన్న నదులలో అనుసంధానించబడిన నది అని తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.[5] పాలార్ నదిపై 1956 అంతరాష్ట్ర నది నీటి వివాదాల చట్టం అమలులో ఉంది.ఒప్పంద నిబంధనలు ప్రకారం, ఎగువ రాష్ట్రం, దిగువ రాష్ట్ర అనుమతి లేకుండా నదీ జలాలను అడ్డుకోవటానికి, మళ్లించడానికి లేదా నిల్వ చేయడానికి కొత్త ఆనకట్ట నిర్మాణం లేదా నిర్మాణం ఎత్తు పెంచటం అనుమతులు లేకుండా చేయకూడదని చెపుతుంది. [6] [7]
పాలార్ నదీ పరీవాహక ప్రాంత మొత్తంలో సగటు వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతం తరచూ కరువుతో బాధపడుతుండేది. 2010కి ముందునుండి 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయి ప్రవాహం లేదు. ఏదేమైనా, కర్ణాటక, తమిళనాడు అసంఖ్యాక చిన్న, మధ్యస్థ నీటిపారుదల చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా కరువు పునరావృతమవుతుంది.ఇది భూగర్భజల నీటిపారుదలతో పాటు ఉపరితల నీటి కోసం లభ్యతను మెరుగుపరిచింది. అట్లాస్ ప్రకారం భారతదేశంలోని మానవనిర్మిత తడి భూములు, [8] కర్ణాటక, తమిళనాడు జిల్లాలలో పాలార్ నదీ పరీవాహక ప్రాంతాన్ని విస్తరించి ఉన్నాయి (3% నుండి 5%). ఆంధ్రప్రదేశ్‌లోని పాలార్ బేసిన్ తడి భూములతో బాగా కప్పబడి ఉండకపోగా, కర్ణాటక, తమిళనాడులతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో నదీ జల వినియోగం అంతగా లేదని సూచిస్తుంది. 1892 సంవత్సరంలో పాలార్ జలాల ఒప్పందం కుదిరినప్పుడు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. [9] మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ రాజ్యం మధ్య పాలార్ నదీ పరీవాహక ప్రాంతంలోని సరిహద్దు రేఖ ఇప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భాగమైనందున, పలార్ నది నీటి భాగస్వామ్యంపై 1892 ఒప్పందం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య వర్తిస్తుంది.
డాక్యుమెంటరీ
మార్చుసోషల్ యాక్షన్ మూవ్మెంట్ అండ్ వాటర్ రైట్స్ ప్రొటెక్షన్ గ్రూప్, చెంగల్పట్టు వారిచే నిర్మించిన ఎన్ పెయార్ పలార్ అనే డాక్యుమెంటరీ 30 జూన్ 2008 న విడుదలైంది, ఇది కర్ణాటకలో మూలం నుండి బెంగాల్ బేలో చేరే వరకు నది దుస్థితిని వివరిస్తుంది. 85 నిమిషాల డాక్యుమెంటరీ ఇసుక క్వారీ, పారిశ్రామిక కాలుష్యాలను విడుదల చేయడం వంటి కార్యకలాపాలు తమిళనాడు ప్రధాన తాగునీటి వనరులలో ఒకటైన నది ఎలా కలుషితం అవుతుందో వివరిస్తుంది. దీనికి ఆర్.ఆర్.శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. [10]
కర్ణాటక
మార్చుకర్ణాటక రాష్ట్రంలో పలార్ నది అగ్రహార సరస్సు (కర్ణాటకలోని కోలార్ జిల్లా) నుండి ఉద్భవించింది.నీటిని నిల్వ చేయడానికి నదికి అడ్డంగా వివిధ జలాశయాలు , చెక్ డ్యామ్‌లు ఉన్నాయి, వాటిలో రెండు కిలోమీటర్లలో వెనుకకు తిరిగి వచ్చే రెండు ముఖ్యమైన ఆనకట్టలు బేతమంగళం, రామసాగర జలాశయాలు. రామసాగర జలాశయాన్ని బుక్కసాగర అని కూడా పిలుస్తారు.కోలార్ బంగారు క్షేత్రాలకు తాగునీటి ప్రధాన వనరుగా బేతమంగళ జలాశయం ఉంది.ఇది బోటింగ్ చేయటానికి అనువైన ప్రాంతం.అతి పెద్దది జలాశయాలలో రామసాగర జలాశయం రెండవది.ఈ ప్రదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.ఇది 2005 సంవత్సరం వరకు మత్స్యకారులకు ముఖ్యమైన జలాశయం. ఆ తరువాత రిజర్వాయర్ దాని సామర్థ్యంలో 40 శాతానికి మించి నింపలేదు.2006 నుండి 2017 సెప్టెంబరు వరకు ఈ భాగంలో పాలార్ నది స్థితి దాదాపు పొడిగా ఉంది.పాలార్ నది తీరప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు బేతమంగళ జలాశయాన్ని తిరిగి దాని పూర్వ వైభవానికి తీసుకువచ్చాయి. 6 అక్టోబరు 2017 నాటికి బేతమంగళ రిజర్వాయర్ దాని పూర్తి సామర్థ్యానికి ఒక అడుగుకు తక్కువుగా నిండింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Palar river
- ↑ "Dam across the Palar is not feasible: State officials". Archived from the original on 29 March 2008. Retrieved 3 July 2008.
- ↑ "Palar Anicut". Archived from the original on 24 September 2016. Retrieved 21 May 2016.
- ↑ "పాలారు నది చెక్‌డ్యాం ఎత్తు పెంచొద్దు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 2021-04-19. Retrieved 2021-04-19.
- ↑ "1892 Agreement - pages 279 to 293" (PDF). Archived from the original (PDF) on 10 November 2011. Retrieved 19 January 2012.
- ↑ TN against AP making dam on Palar river
- ↑ "Ponnala defends dam across Palar". The Hindu. 26 September 2010. Archived from the original on 1 October 2010. Retrieved 21 May 2011.
- ↑ "Wet lands of India 2011". Archived from the original on 2013-03-03. Retrieved 2021-04-19.
- ↑ "Map of Madras Presidency in 1909". Archived from the original on 24 ఫిబ్రవరి 2021. Retrieved 1 July 2016.
- ↑ "A documentary charts the plight of Palar". Archived from the original on 2008-07-05. Retrieved 2021-04-19.