యుగపురుషుడు
యుగపురుషుడు 1978 లో కె. బాపయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] వైజయంతీ మూవీస్ పతాకంపై ఎన్.టి.ఆర్., కె. బాపయ్య, అశ్వనీదత్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘ఎదురులేని మనిషి’ తరువాత అదే కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం యుగపురుషుడు. 1978, జూలై 14న విడుదలైన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., జయప్రదల మధ్య శృంగార సన్నివేశాలు కొత్త తరహాలో ఉండడంతోపాటు యువతరాన్ని ఆకర్షించే అనేక అంశాలు ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత.[2] ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.
యుగపురుషుడు | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
రచన | బాలమురుగన్ (కథ), జంథ్యాల (మాటలు) |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూలై 14, 1978 |
భాష | తెలుగు |
కథ
మార్చుకరాటే ఫైటర్ రాజేష్ (ఎన్.టి.ఆర్) అతని తండ్రి మారుతీరావు (కైకాల సత్యనారాయణ) కోరికపై జమిందారు (ప్రభాకర్ రెడ్డి) మనువడు కళ్యాణ్ గా నటించడానికి ఒప్పకుంటాడు. రాజేష్ ను ప్రేమించిన లత (జయప్రద) అతనిని అపార్థం చేసుకుంటుంది. జమిందారును కాపాడటానికే వచ్చానని చెబుతాడు. తన చిన్నాన్న జగ్గు (జగ్గయ్య) ద్వారా తానే ఆసలైన కళ్యాణ్ అని తెలుసుకుని వాళ్ళ ఆట కట్టించి తన తల్లిని, తాతను ఒక దగ్గరకు చేరుస్తాడు. తన మరదలు లతను పెళ్ళిచేసుకుంటాడు.
తారాగణం
మార్చు- రాజేష్,కళ్యాణ్ గా నందమూరి తారక రామారావు
- లతగా జయప్రద
- జమిందారుగా ప్రభాకర్ రెడ్డి
- మారుతిగా కైకాల సత్యనారాయణ
- బలరాంగా రావు గోపాలరావు
- దివానుగా అల్లు రామలింగయ్య
- జగ్గుగా కొంగర జగ్గయ్య
- ఈశ్వరరావు
- నర్రా వెంకటేశ్వర రావు
- రోసీగా జయలక్ష్మీ
- పుష్పలత
- మాధవి
- కోమిల్ల విర్క్
- ధూళిపాళ సీతారామశాస్త్రి
- రాజనాల
- చంద్రమోహన్
- కాంతారావు
- వెంకన్నబాబు
- చంద్రరాజా
- హంస
- సయ్యద్ వారిస్ బాష
- హిమబిందు
- పార్వతి
- జయశైల
- చలపతిరావు
- భీమరాజు
- వీరభద్రరావు
- సత్యనారాయణ
- నండూరి సుబ్బారావు
- పెమ్మసాని రామకృష్ణ
- కృష్ణారావు
- శేషగిరిరావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: కె.బాపయ్య
- నిర్మాత: సి. అశ్వనీ దత్
- రచన: బాలమురుగన్ (కథ), జంథ్యాల (మాటలు)
- ఛాయాగ్రహణం: ఓ. ప్రభాకర్
- కూర్పు. ఎ. సంజీవి
- సంగీతం: కె.వి.మహదేవన్
- పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి
- గాయకులు: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల
- నిర్మాణ సంస్థ: వైజయంతి మూవీస్
- స్టూడియో: అన్నపూర్ణ స్టూడియో
- పంపిణీరాదులు: లక్ష్మీ ఫిలింస్ (ఆంధ్ర), ఎస్.ఎన్.ఎ.పి (నైజాం), అజంతా మూవీస్ (మైసూర్)
- విడుదల తేది: జూలై 14, 1978
- నిడివి: 148 నిముషాలు
- సహాయ దర్శకత్వం: వై. నాగేశ్వరరావు, యు. మల్లిబాబు
- అసోసియేట్ దర్శకత్వం: కె. మురళీమోహనరావు
పాటలు
మార్చు- ఇదిగిదిగో మగసిరి వస్తాదు , రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల - 3.30 ని.
- గాలి మళ్ళింది నీపైన , రచన: ఆచార్య ఆత్రేయ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల - 4.06 ని.
- ఎంత వింత లేత వయసు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల - 4.15 ని.
- ఒక్క రాత్రి వచ్చిపోరా. రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల - 4.10 ని.
- అబ్బా అబ్బబ్బా బొబ్బర్లంక చిన్నది , రచన వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల - 5.28ని
మూలాలు
మార్చు- ↑ "యుగపురుషుడు (1978)". telugumoviepedia.com. తెలుగు మూవీపీడియా. Retrieved 15 October 2016.[permanent dead link]
- ↑ ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (21 July 1978). సినిమా విశేషాలు. ఆంధ్ర సచిత్ర వార పత్రిక. p. 30. Retrieved 13 July 2017.[permanent dead link]