పెద ఓగిరాల

భారతదేశంలోని గ్రామం

పెద ఓగిరాల, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 245. యస్.టీ.డీ.కోడ్ = 08676.

పెద ఓగిరాల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి ఉండ్రాసి దీపిక
జనాభా (2011)
 - మొత్తం 3,842
 - పురుషులు 1,899
 - స్త్రీలు 1,943
 - గృహాల సంఖ్య 1,223
పిన్ కోడ్ 521245
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో ఆకునూరు, చలివేంద్రపాలెం, శాయపురం, వుయ్యూరు, నెప్పల్లి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

తోట్లవల్లూరు, కంకిపాడు, పమిడిముక్కల, పెనమలూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కంకిపాడు, మానికొండ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 27 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

కార్పొరేటు పాఠశాలకు దీటుగా మూడు సంవత్సరాలుగా పదవ తరగతి ఫలితాలలో వరుసగా, 96%, 100%, 97% ఫలితాలనందించి మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంతేగాక ఈ పాఠశాల విద్యార్థిని ఎ.దివ్యభవానిరెడ్డి, 2012-13 సంవత్సరంలో 10వ తరగతిలో, పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించి, గుడివాడ డివిజను స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, విద్యాధికారుల మన్ననలు పొందినది. ఈ పాఠశాల విద్యార్థులు ఐ.ఐ.ఐ.టి.లో గూడా సీట్లు సాధించారు. ఈ పాఠశాల దాతల తోడ్పాటు, విద్యార్థుల, తల్లిదండ్రుల, గ్రామస్థుల ఆదరాభిమానాలు పొందుచున్నది. [4] సి.బి.ఎం.జి.హైస్కూల్, పెద ఓగిరాల ఈ పాఠశాల 2015-16 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించింది. [5]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలసవరించు

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

బ్యాంకులుసవరించు

ఆంధ్రా బ్యాంక్.

గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఉండ్రాసి దీపిక, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గుంటక రామకృష్ణారెడ్డి ఎన్నికైనారు. [3]

గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలుసవరించు

  1. శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లిఖార్జునస్వామివారి ఆలయం (శివాలయం).
  2. శ్రీ దాసాంజనేయస్వామివారి అలయం:- ఈ ఆలయం స్థానిక ఎస్.ఎస్.ఎస్.రెడ్డినగర్ లో ఉంది.

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ భీమవరపు నాగేశ్వరరెడ్డి అను రైతు, తన చెరకు పొలంలో, ఒక మొక్కతో 12 పంటలు పండించి రికార్డు సృష్టించారు. ఈయన 2001 సం.లో 3 ఎకరాల విస్తీర్ణంలో "83వి36" అను చెరకు విత్తనం నాటినారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ, అదే పిలకతో పంటసాగు చేస్తున్నారు. మొదటి సారి ఎకరాకు 55 టన్నులు దిగుబడివచ్చింది. ఇప్పుడు ఎకరాకు 48 టన్నులు దిగుబడి వచ్చింది. ఇప్పుడు దిగుబడి తగ్గినా, మొత్తంమీద పంటసాగు చూసుకొంటే లాభదాయకమే. ఈ రకంగా విత్తనం నాటే ఖర్చు ఆదాఅవుతుంది. ఈయనకు ఇప్పుడు ఎకరాకు మొత్తం 2 వేలే ఖర్చు అవుచున్నది. మున్ముందు ఒక మొక్కతో 20 పంటలు పండించాలని ఈయన ఆలోచన. [2]

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామంలో జన్మించిన ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 3,842 - పురుషుల సంఖ్య 1,899 - స్త్రీల సంఖ్య 1,943 - గృహాల సంఖ్య 1,223

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3676.[2] ఇందులో పురుషుల సంఖ్య 1816, స్త్రీల సంఖ్య 1860, గ్రామంలో నివాస గృహాలు 1038 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 519 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "పెద ఓగిరాల". Retrieved 23 June 2016.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2013, సెప్టెంబరు-18; 1వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జనవరి-1; 7వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జూలై-24; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016, మే-11; 2వపేజీ.