తోట్లవల్లూరు

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలం లోని గ్రామం

తోట్లవల్లూరు (నార్త్ వల్లూరు), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్: 521

163., ఎస్.టి.డి. కోడ్ = 0866.

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టంమీద 11 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

ఈ గ్రామం విజయవాడ నుండి 35 కి.మీ. దూరంలో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

తెనాలి, విజయవాడ, మంగళగిరి, గుడివాడ

సమీప మండలాలుసవరించు

వుయ్యూరు, కొల్లిపర, కంకిపాడు, పమిడిముక్కల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

వుయ్యూరు, కంకిపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 28 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, గ్రామానికి చెందిన శ్రీ ఓరుగంటి సుబ్బారావు దంపతులు, ప్రోత్సాహక నగదు బహుమతులు అందించుచున్నారు. [6]
  2. ఎస్.సి.బాలుర వసతి గృహం.
  3. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, కలాసమాలపల్లి.
  4. శాఖా గ్రంథాలయం.

గ్రామంలోని మౌలిక సౌకర్యాలుసవరించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంసవరించు

ఈ కేంద్రంలో ఆయుర్వేద ఆసుపత్రి గూడా ఉంది.

బ్యాంకులుసవరించు

  1. యుకో బ్యాంక్. ఫోన్ నం. 0866/2804245.
  2. సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఫోన్ నం. 0866/2804145., సెల్= 8886644182.
  3. కార్పొరేషన్ బ్యాంక్. ఫోన్ నం. 0866/2804411.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి చిరుమామిళ్ళ ఉమాదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా చిరుమామిళ్ళ మోహన్ మంజు ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా (మే నేలలో) తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [2]

శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ చెన్నమల్లికార్జునస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో 2015,డిసెంబరు-26వ తేదీ శనివారంనాడు శివ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుఝామున 5 గంటలనుండియే ఉత్తరద్వారంగుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని భృంగీ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. [8]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఒక వారంరోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [9]

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో 2016,డిసెంబరు-5వతేదీ సోమవారంనాడు, స్వామివారి కల్యానం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా నాగేంద్రస్వామి పుట్ట వద్ద, జంట నాగ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. [10]

శ్రీ విజయదత్త షిర్డీ సాయిబాబా ఆలయంసవరించు

ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం 2017,మార్చి-20వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం నుండి సోమవారం వరకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం సాయిబాబా గారికి పల్లకీసేవ నిర్వహించారు. [11]

శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ కోదండరామాలయంసవరించు

తోట్లవల్లూరు గ్రామంలోని నాయుడుపేటలో నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2015,మే నెల-5వ తేదీ మంగళవారంనాడు, విగ్రహాలకు గ్రామోత్సవం నిరవించారు. ఆరవతేదీ బుధవారం ఉదయం 9-48 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా బంధుమిత్రుల రాకతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసారు. [3]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

తోట్లవల్లూరు శివారులోని కలాసమాలపల్లిలో, 2017,మార్చి-5వతేదీ ఆదివారంనాడు, గంగానమ్మ తల్లి, పోతురాజు, బొడ్డురాయి, నూకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత విగ్రహాల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. [10]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ గ్రామంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఈ జంపనవారి ఆలయంలో అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం 2017,మార్చి-18వతేదీ శనివారంనాడు కన్నులపండువగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో ఉంటున్న జంపన, నక్కా వంశీయులు ఆలయానికి తరలివచ్చి, అమ్మవారిని దర్శించుక్న్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [11]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ తోట్లవల్లూరు, దాతత సహకారంతో, 2012,డిసెంబరు-14వ తేదీనాడు ప్రారంభించిన నిత్యాన్న పథకం, 3 సంవత్సరాలుగా, నిత్యాన్న పథకాన్ని కొనసాగుచున్నది. స్థానిక లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీ వీరంకి గురుమూర్తి, ఈ పథకానికి పునాది వేసినారు. అప్పటినుండి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మొత్తం 65 మందికి లయన్స్ క్లబ్ ఆవరణలో, మద్యాహ్నం ఒకపూట ఉచిత భోజనం పెడుచున్నారు. అంతే కాక వల్లూరుపాలెం-15, భద్రిరాజుపాలెం-12, తోట్లవల్లూరు-8, క్యారేజీలు పంపించుచున్నారు. ఈ పథకం ప్రారంభించి, 2015,సెప్టెంబరు-10వ తేదీనాటికి 1000 దినాలు పూర్తి అయినది. [5]&[7] తోట్లవల్లూరు మండలంలో ఇప్పటి వరకు దీపం పథకంలో భాగంగా, 2400 గ్యాస్ కనెక్షన్లను లబ్దిదారులకు రాయితీపై అందజేసినారు. ఈ సందర్భంగా, కృష్ణా జిల్లా కలెక్టరు శ్రీ లక్ష్మీకాంతం, 2017,మే-29న నిర్వహించిన వీడియో కాన్‌ఫరెన్స్‌లో, తోట్లవల్లూరు మండలాన్ని పొగరహిత మండలంగా ప్రకటించినారు. [12]

మండలంలోని గ్రామాలుసవరించు

జనాభాసవరించు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. బొడ్డపాడు 457 1,577 786 791
2. చాగంటిపాడు 820 2,817 1,413 1,404
3. చినపులిపాక 307 1,040 533 507
4. దేవరపల్లి 878 3,044 1,498 1,546
5. గరికపర్రు 891 3,149 1,559 1,590
6. గురివిందపల్లి 226 830 420 410
7. ఈలూరు 382 1,485 740 745
8. కనకవల్లి 206 759 384 375
9. కుమ్మమూరు 340 1,256 620 636
10. మధురాపురం 14 48 25 23
11. ములకలపల్లి 132 421 198 223
12. నార్త్ వల్లూరు 1,935 7,259 3,675 3,584
13. పెనమకూరు 674 2,440 1,233 1,207
14. రొయ్యూరు 662 2,418 1,234 1,184
15. సౌత్ వల్లూరు 2,307 8,978 4,485 4,493
16. యాకమూరు 560 2,164 1,083 1,081

గణాంకాలుసవరించు

జనాభా (2001 -మొత్తం 39685, -పుల్రుషులు 19886 -స్త్య్రీలు 19799

వనరులుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Thotlavalluru". Retrieved 18 June 2016. External link in |title= (help)[permanent dead link]
  2. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-03.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2014,మే-8; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-7; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-17; 24వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-10; 24వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-8; 24వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-14; 23వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-27; 27వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చి-3; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చి-6; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-21; 1వపేజీ. [12] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మే-30; 2వపేజీ.