పౌరాణిక కాలక్రమం

పౌరాణిక కాలక్రమం మహాభారతం, రామాయణం, పురాణాలపై ఆధారపడిన హిందూ చరిత్ర కాలక్రమం. ఈ కాలక్రమం ప్రకారం రెండు ముఖ్యమైన తేదీలున్నాయి. ఒకటి మహాభారత యుద్ధం - సా.పూ. 3138 లో జరిగింది, రెండవది కలియుగం ప్రారంభం - సా.పూ 3102 లో ప్రారంభమైంది. స్వదేశీ ఆర్య సిద్ధాంత ప్రతిపాదకులు వేద కాలాన్ని నిర్ధారించేందుకు, ఇండో-యూరోపియన్ భాషలు భారతదేశం నుండి వ్యాపించిన కాలాన్ని నిర్ధారించేందుకూ ఈ పురాణ కాలక్రమాన్ని అనుసరించారు. "భారతీయ నాగరికతను సింధు-సరస్వతి (లేదా సింధు) సంప్రదాయం (7000 లేదా 8000) యొక్క ప్రారంభ కాలం నుండి అవిచ్ఛిన్నంగా వస్తున్న సంప్రదాయంగా చూడాలి" అని వారు వాదిస్తారు. [1]

రథంపై[permanent dead link] కృష్ణార్జునులు. 18వ -19వ శతాబ్దపు చిత్రం

హిందూ గ్రంథాలు మార్చు

మహాభారతం, రామాయణం పురాతన భారతదేశంలోని రెండు ప్రధాన సంస్కృత పురాణాలు.[2] ఈ రెండూ కలిసి హిందూ ఇతిహాసానికి ఈ రెండూ మూల స్థంభాలు. [3]  కురుక్షేత్ర యుద్ధంలో బంధువుల మధ్య జరిగిన పోరాటం గురించి, కౌరవ పాండవుల భవిష్యత్తు గురించీ మహాభారతం వివరిస్తుంది. ఇందులో నాలుగు "పురుషార్థాల" ( 12.161 ) వంటి విషయాలపై తాత్విక చర్చ కూడా ఉంది. మహాభారతంలో ఎక్కువ భాగం సా.పూ. 3 వ శతాబ్దం సా.శ. 3 వ శతాబ్దం మధ్య సంకలనం చేయబడి ఉండవచ్చు. దానిలోని అత్యంత పురాతన భాగాలు సా.పూ. 400 కన్నా పాతవి కావు [4] [5]

కోసల రాజ్య యువరాజు అయిన రాముడి జీవితాన్ని రామాయణ వివరిస్తుంది. దీని తొలి దశ రచనా కాలం సా.పూ. 7 నుండి 4 వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినదని ఇటీవలి పండితుల అంచనాలు, తరువాతి దశలు సా.శ. 3 వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్నాయి. [6]

పురాణాలు భారతీయ సాహిత్యంలో విస్తృతమైన విషయాల గురించిన సాహిత్యం.[7] ముఖ్యంగా ఇతిహాసాలు, ఇతర సాంప్రదాయక కథల గురించినవి.[8] వీటిని సా.శ. మొదటి సహస్రాబ్ది లో కూర్చారని ప్రధాన స్రవంతి పండితులు అంటారు.[9]హిందూ పురాణాలు అనామక గ్రంథాలు. శతాబ్దాలుగా చాలా మంది రచయితలు వీటిని రచించి ఉండవచ్చు.[10] గావిన్ ఫ్లడ్, గుప్తుల యుగంలో వివిధ దేవతలను ఆరాధించే భక్తి సంప్రదాయాల ఉద్భవానికీ, లిఖిత పురాణాల అభ్యున్నతికీ ముడిపెట్టాడు. పురాణాలు వివిధ పోటీ సంప్రాదాయాల అభిప్రాయాలను ముందుకు తెచ్చే సంక్లిష్టమైన సారస్వతం.[11] వివిధ పురాణాలలో రాసిన విషయాలు పరస్పరం స్థిరంగా ఉండవు. ప్రతి పురాణం అనేక రాతప్రతుల్లో ఉంటుంది. ఈ రాతప్రతులు అన్నీ ఒకే రకంగా ఉండవు.[12]

మహాభారతం, రామాయణం, పురాణాలలో రాజుల వంశవృక్షాలు ఉన్నాయి,[13] ఇవి భారతదేశపు ప్రాచీన చరిత్ర యొక్క సాంప్రదాయిక కాలక్రమానికి ఉపయోగిస్తారు. చారిత్రక పత్రాలుగా ఈ గ్రంథాల విశ్వసనీయతను మైఖేల్ విట్జెల్ శంకించాడు. అవి "స్పష్టంగా వేదాల నుండి వంశాలు (భాగాలు), శకలాలు ముక్కలుగా తెచ్చిపెట్టి, ఇతర అంశాలను - ఊహాత్మక, లేకపోతే తెలియని సంప్రదాయాల నుండి - కొత్తగా చేర్చి పెట్టినవి. లేదా, మహాభారతంలో ఉన్నట్లుగా కవిత్వ కల్పన కావచ్చు " అని అతడు అన్నాడు.  [14]

పౌరాణిక కాలక్రమం మార్చు

ఆవర్తన సమయం, యుగాలు మార్చు

పురాణాలు సమయం చక్రీయ అవగాహనతో ఉంటాయి. వాటిలో ప్రపంచపు సృష్టి, లయం గురించిన కథలు, యుగాలు మొదలైనవాటి గురించి ఉంటుంది. [15] ఒక కాలచక్రంలో నాలుగు యుగాలు ఉంటాయి:

మనుస్మృతి (సా.శ. 2 వ శతి) యుగాల గురించి ఇలా వివరిస్తుంది.[16] ప్రతి చక్రం (మహా యుగం) 12,000 దైవ సంవత్సరాలు ఉంటుంది. ఒక్కో చక్రంలో కృతయుగం 4800, త్రేతాయుగం 3600, ద్వాపరయుగం 2400 కలియుగం 1200 దైవ సంవత్సరాల పాటు ఉంటాయి. ఒక్కో దైవ సంవత్సరానికి 360 మానవ సంవత్సరాలు. ఆ ప్రకారం కృతయుగం 17,28,000, త్రేతాయుగం 12,96,000, ద్వాపరయుగం 8,64,000 కలియుగం 4,32,000 సంవత్సరాలు. మొత్తం 43,20,000 మానవ సంవత్సరాలకు ఒక మహాయుగం పూర్తౌతుంది. ఈ నాలుగు యుగాల నిష్పత్తి 4: 3: 2: 1. [17]

భాగవత పురాణం [3.11.18-20] ( c. 500-1000) లో కూడా యుగాల గురించి పై వివరణే ఉంది.

ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. పౌరాణిక మూలాల ప్రకారం, కృష్ణుడి నిర్యాణంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలైంది. అది సా.పూ. 3102 ఫిబ్రవరి 17/18 న, [18] భారత యుద్ధం ముగిసిన ఇరవై సంవత్సరాల తరువాత, జరిగింది.  [19]

దశావతారాలు మార్చు

దశావతారాలకు సంబంధించి వివిధ వెర్షన్లు ఉన్నాయి, ఇవి ప్రాంతాన్ని బట్టి, సంప్రదాయాన్ని బట్టీ మారుతూంటాయి. [20] [21] [22] [23] కొన్ని జాబితాల్లో కృష్ణుడు ఎనిమిదవ అవతారమని, బుద్ధుడు తొమ్మిదవ అవతారమనీ చెబుతాయి. [20] అయితే 17 వ శతాబ్దపు వైష్ణవ సిద్ధాంతమైన యతీంద్రమతదీపిక వంటివి [22] బలరాముడిని ఎనిమిదవ అవతారంగాను, కృష్ణుడిని తొమ్మిదవదిగానూ పేర్కొంటాయి. [22] కొంతమంది వైష్ణవులు బుద్ధుడిని విష్ణువు అవతారంగా అంగీకరించరు -వారు యతీంద్రమతదీపికను అనుసరిస్తారు. [24] నిర్వివాదమైన, ప్రామాణికమైన జాబితా ఇదీ అని దేన్నీ చెప్పలేనప్పటికీ, "చాలామంది అంగీకరించిన జాబితాల్లోను, పురాణాలు, ఇతర గ్రంథాల లోనూ [...] కృష్ణుడు, బుద్ధుడు ఉంటారు." [25] [26] [27] [28] [note 1]

వివిధ సంప్రదాయాల్లోని దశావతారాలను కింది పట్టికలో చూడవచ్చు:[21][22][23][29]

స్థానం కృష్ణుడు, బుద్ధుడు బలరాముడు, కృష్ణుడు

(వైష్ణవులు) [21] [22]

బలరాముడు, బుద్ధుడు కృష్ణుడు, విఠోబా బలరాముడు, జగన్నాథుడు
1 మత్స్యావతారం [21] [22] కృతయుగం [21]
2 కూర్మావతారం [21] [22]
3 వరాహావతారం [21] [22]
4 నరసింహావతారం [21] [22]
5 వామనావతారం [21] [22] త్రేతాయుగం [21]
6 పరశురామావతారం [21] [22]
7 రామావతారం [21] [22]
8 కృష్ణావతారం [21] బలరామావతారం [21] [23] [22] బలరామావతారం [30] కృష్ణావతారం [29] బలరామావతారం [31] [23] ద్వాపర యుగం, [21]బుద్ధుడి విషయంలో కలియుగం [21]
9 బుద్ధావతారం [21] కృష్ణావతారం [21] [23] [22] బుద్ధావతారం [30] విఠోబావతారం [29] జగన్నాథావతారం [31] [23]
10 కల్క్యావతారం [21] [22] (కలియుగాన్ని ముగించే 10 వ అవతారం. ఇది రాబోయే అవతారం) కలియుగం

భారత యుద్ధానికి ముందరి రాజులు, అవతారాలు మార్చు

 
సాంప్రదాయిక[permanent dead link] హిందూ ఖగోళశాస్త్రంలోని ఏడు నక్షత్రాల సప్తర్షి మండలాన్ని ఆధునిక ఖగోళ శాస్త్రంలో ఉర్సా మేజర్ అంటారు.

పురాణాలు, మహాభారతం, రామాయణంలో రాజుల వంశావళి జాబితాలు ఉన్నాయి.[13] వీటి నుండి భారతదేశ ప్రాచీన చరిత్ర యొక్క సాంప్రదాయిక కాలక్రమం ఉద్భవించింది.[32] సా.పూ. 300 లో పాట్నాలో మౌర్యుల సభలో గ్రీకు రాయబారిగా ఉన్న మెగస్థనీస్ 6042 సంవత్సరాల పాలనా కాలాన్ని చూపే 153 మంది రాజుల సాంప్రదాయిక జాబితా గురించి విన్నట్లు చెప్పాడు.[33] ఇది సా.పూ. 3102 లో కలియుగం ప్రారంభ సమయాన్ని దాటి పోయింది. ఈ రాజుల జాబితాలు సూత బార్డిక్ సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయి. అవి మౌఖికంగా వస్తూ, నిరంతరం పునఃరూపకల్పన చేయబడుతూ ఉన్న జాబితాల నుండి వచ్చినవి. [33]

శ్రద్ధదేవ మను మార్చు

ఈ జాబితాలో మొదటి రాజు శ్రద్ధదేవ మనువు. అతడు ప్రస్తుత కల్పం (శ్వేత వరాహ కల్పం) లోని మొత్తం 14 మంది మనువులలో ఏడవ మనువు. ఇతడికే వైవస్వత మనువు అని కూడా పేరు. పురాణాల ప్రకారం, శ్రద్ధదేవుడి వంశవృక్షం ఈ క్రింది విధంగా ఉంది:  [34]

  1. బ్రహ్మ
  2. మరీచి, బ్రహ్మ సృష్టించిన 10 ప్రజాపతులలో, సప్తఋషులలో ఒకడు
  3. కశ్యపుడు, మరీచి, కళల కుమారుడు. ఋగ్వేదంలో ప్రవచించినసప్తర్షులలో ఒకడు. ఈ ఏడుగురు ఋషులు వైదిక మత పితరులు. బ్రాహ్మణుల గోత్రాల పూర్వీకులు.
  4. వివస్వతుడు లేదా సూర్యుడు. కశ్యపుడు, అదితిల కుమారుడు.
  5. వైవస్వత మనువు. వివస్వతుడు, శరణ్య (సంజ్ఞా దేవి) ల కుమారుడు. ఇతన్ని సత్యవ్రతుడని, శ్రద్ధదేవుడనీ కూడా పిలుస్తారు.

శ్రద్ధదేవకు డెబ్బై మంది సంతానం. చంద్ర, సూర్య రాజ వంశాలకు పూర్వీకులైన ఇళ, ఇక్ష్వాకులు ఈ సంతానం లోని వారే. ఇవి వేద కాలం నాటి రాజ కుటుంబాల మూల కథలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.  మహాభారతం "బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, తదితరులందరూ మనువు వారసులేనని చెబుతుంది.[note 2]

తాత్కాలిక కాలక్రమం మార్చు

మహాభారత యుద్ధానికి ముందరి భారతీయ చరిత్ర గురించి తాత్కాలిక అవలోకనం ఇవ్వడానికి కొందరు పురాణాలను ఉపయోగించుకున్నారు.[36]  సా.పూ 7350 లో వైవస్వత మనువు పాలన ప్రారంభమైందని గుల్షన్ (1940) చెప్పాడు.[36]  వైవస్వత మనువుకూ, భారత యుద్ధానికీ మధ్య 95 మంది రాజులను పురాణాలు చూపిస్తున్నాయని గంగూలీ అన్నాడు.[37]  భరత యుద్ధం సా.పూ 1400 లో జరిగిందని చెబుతూ పుసాల్కర్ (1962) ఈ జాబితాను వాడి ఈ క్రింది కాలక్రమానుసారం రూపొందించాడు: : [37]

  1. జల ప్రళయానికి ముందరి సంప్రదాయం, చరిత్ర ఆవిర్భావం
  2. మహా జల ప్రళయం, వైవస్వత మనువు
  3. రాజు యాయతి కాలం (సా.పూ. 3000-2750)
  4. రాజు మాంధాత్రి కాలం (సా.పూ. 2750-2550)
  5. విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి యుగం (సా.పూ. 2550-2350)
  6. విష్ణువు ఏడవ అవతారమైన రాముడి యుగం (సా.పూ. 2350-1750)
  7. విష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడి కాలం (సా.పూ.1950-1400)
  8. భారత యుద్ధం (సా.పూ. 1400)

సుభాష్ కాక్ ప్రకారం,

భారతీయ నాగరికతను సింధు-సరస్వతి (లేదా సింధు) సంప్రదాయం (సా.పూ. 7000 లేదా 8000) నాటి నుండి అవిచ్ఛిన్నంగా వస్తూ ఉన్న సంప్రదాయంగా చూడాలి.[1][note 3]

భారత యుద్ధం మార్చు

మహాభారత యుద్ధపు చారిత్రకత పండితుల మధ్య వివాదాస్పదంగా ఉంది..[38][39] మహాభారతపు ప్రస్తుత కథ దాకా జరిగున అభివృద్ధి అనేక దశల గుండా వెళ్ళింది. ఎక్కువగా సా.పూ. 500 - 400 మధ్య కాలానికి చెందినది. [40][41]  మహాభారత కథలో పరిక్షిత్తు, జనమేజయులు కురు వంశ వారసులుగా కనిపిస్తారు.[42]  ఈ గాథలోని నేపథ్యం ఇనుప యుగ ప్రారంభానికి ముందు, సుమారు సా.పూ 1200 - 800 మధ్య, కురు సామ్రాజ్యం రాజకీయ శక్తి కేంద్రంగా ఉండే కాలాన్ని సూచిస్తోందని మైకేల్ విట్జెల్ అన్నాడు.[42]  ప్రొఫెసర్ ఆల్ఫ్ హిల్టెబీటెల్ ప్రకారం, మహాభారతం పౌరాణికమే.[43]  భారత చరిత్రకారుడు ఉపీందర్ సింగ్ ఇలా రాసాడు:

అసలు కౌరవ పాండవుల మధ్య ఒక మహా యుద్ధం జరిగిందా లేదా అనేది ఎప్పటికీ నిరూపించలేకపోవచ్చు. కానీ, ఒక చిన్నపాటి సంఘర్షణ ఒకటి జరిగి ఉండవచు, దాన్ని కవులు గాయకులూ ఒక భారీ ఐతిహాసిక యుద్ధంగా మార్చి ఉండవచ్చు. కొంతమంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలూ ఈ యుద్ధం సా.పూ 1000 లో జరిగి ఉండవచ్చు అని అంటారు.[39]

డేటా అసంపూర్తిగా ఉన్నప్పటికీ, కురుక్షేత్ర యుద్ధానికి ఒక చారిత్రక తేదీని ఆపాదించే ప్రయత్నాలు జరిగాయి. జనాదరణ పొందిన సంప్రదాయం ప్రకారం, ఈ యుద్ధం తరువాత కలి యుగం లోకి అడుగుపెట్టడాన్ని సూచిస్తుంది. అ విధంగా ఇది సా.పూ 3102 నాటిది. ఈ తేదీ పట్ల అనేక ఇతర ప్రతిపాదనలు కూడా వచ్చాయి:

  • పి.వి.హోలీ గ్రహ స్థానాలు, క్యాలెండర్ వ్యవస్థలను ఉపయోగించి ఈ తేదీని 3143 నవంబరు 13 అని లెక్కగట్టాడు
  • కె. సదానంద, అనువాద రచనల ఆధారంగా, కురుక్షేత్ర యుద్ధం సా.పూ. 3067 నవంబరు 22 న మొదలైందని చెప్పాడు.
  • సా.పూ. 3067 లో మహాభారత యుద్ధం జరిగిందని వాదించడానికి బిఎన్ అచార్ ప్లానిటోరియం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు.
  • ఎస్. బాలకృష్ణ వరుస చంద్ర గ్రహణాలను ఉపయోగించి సా.పూ. 2559 తేదీని నిర్ధారించాడు.
  • ఆర్‌ఎన్ అయ్యంగార్ జమిలి గ్రహణాలు, సాటర్న్ + బృహస్పతి సంయోగాలను ఉపయోగించి సా.పూ. 1478 గా తేల్చాడు.
  • పిఆర్ సర్కార్ కురుక్షేత్ర యుద్ధం జరిగినది సా.పూ 1298 లో అని అంచనా వేశారు.

భారత యుద్ధానంతరం మార్చు

వేదిక్ ఫౌండేషన్, కృష్ణుడు, భారత యుద్ధం కాలం నుండి ప్రాచీన భారతదేశం యొక్క కాలక్రమాన్ని ఈ క్రింది విధంగా ఇచ్చింది:

  • సా.పూ 3228 - కృష్ణుడి అవతరణ
  • సా.పూ 3138 - మహాభారత యుద్ధం ; మగధలో బృహద్రథ రాజవంశం ప్రారంభం; హస్తినాపురంలో యుధిష్ఠిర రాజవంశం ప్రారంభం
  • సా.పూ 3102 - కృష్ణుడి అవతారం ముగింపు; కలియుగం ప్రారంభం
  • 2139 సా.పూ - బృహద్రథ రాజవంశం ముగింపు
  • 2139-2001 సా.పూ - ప్రద్యోత రాజవంశం
  • 2001-1641 సా.పూ - శిశునాగ రాజవంశం
  • సా.పూ 1887–1807 - గౌతమ బుద్ధుడు
  • 1641-1541 సా.పూ - నందవంశం
  • సా.పూ 1541–1241 - మౌర్య రాజవంశం
  • సా.పూ 1541-1507 - చంద్రగుప్తా మౌర్య
  • 1507-1479 సా.పూ - బిందుసారుడు
  • సా.పూ 1479–1443 - అశోకవర్ధనుడు
  • సా.పూ 1241–784 - శుంగ, కానౌ రాజవంశం
  • సా.పూ 784–328 - ఆంధ్ర రాజవంశం
  • 328–83 సా.పూ - గుప్తా రాజవంశం
  • సా.పూ 328–321 - చంద్రగుప్త విజయాదత్య
  • 326 సా.పూ - అలెగ్జాండర్ దండయాత్ర
  • 321-270 సా.పూ - అశోక
  • 102 సా.పూ - AD 15 - విక్రమాదిత్య, సా.పూ. 57 లో విక్రమ శకాన్ని స్థాపించాడు

స్వదేశీ ఆర్యులు - 'భారతదేశంలో 10,000 సంవత్సరాలు' మార్చు

స్వదేశీ ఆర్యులు మార్చు

గాథా-పౌరాణిక కాలక్రమాన్ని స్వదేశీ ఆర్యుల ప్రతిపాదకులు అనుసరిస్తున్నారు. దీని ప్రకారం సా.పూ. 1500 లో జరిగిందని పాశ్చాత్యులు కల్పించిన ఇండో-ఆర్య వలస సిద్ధాంతాన్ని వారు ప్రశ్నించారు. "దేశీయత సిద్ధాంతం" ప్రకారం, ఆర్యులు భారతదేశానికే చెందినవారు. ఇండో-యూరోపియన్ భాషల మాతృభూమి భారతదేశమే. తమ మాతృభూమి నుండి వాటి ప్రస్తుత ప్రదేశాలకు వలస వెళ్ళాయి. వీరి ప్రకారం, వేదాలు సా.పూ. రెండవ సహస్రాబ్ది కంటే పాతవి. మహాభారతం వంటి గ్రంథాలు సా.పూ. 1500 కంటే ముందు జరిగిన చారిత్రక సంఘటనలను ప్రతిబింబిస్తాయి. కొందరు సింధు సరస్వతి నాగరికతను వైదిక నాగరికత ఒకటే అని అంటారు, సింధు లిపి బ్రాహ్మి లిపికి మాతృక అని అంటారు. ఉత్తర భారతీయులకు, దక్షిణ భారతీయులకూ మధ్య తేడా ఏమీ లేదని చెబుతారు.

'భారతదేశంలో 10,000 సంవత్సరాలు' మార్చు

"స్వదేశీ ఆర్యత్వం" అనే ఆలోచన, తమ మతం పట్ల హిందువులకున్న సాంప్రదాయిక ఆలోచనలకు సరిపోతుంది. తమ మతం చరిత్ర పూర్వం నుండీ ఉన్నదని, వైదిక ఆర్యులు పురాతన కాలం నుండి భారతదేశంలో నివసిస్తున్నారనీ హిందువు భావిస్తారు. ఎంఎస్ గోల్వాల్కర్, 1939 లో ప్రచురించిన వి ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్ లో, "నిస్సందేహంగా [...] మనం - హిందువులం - విదేశీ జాతుల ఆక్రమణ జరగక ముందు, ఎనిమిది లేదా పది వేల సంవత్సరాలకు పైగా ఈ భూమిపై నిర్వివాదంగా, నిరాటంకంగా నివసిస్తూ వచ్చాం" అని రాసాడు. గోల్వాకర్, తిలక్ రాసిన ఆర్కిటిక్ హోమ్ ఇన్ ది వేదాస్ (1903) నుండి ప్రేరణ పొందాడు, ఆర్యుల మాతృభూమి ఉత్తర ధ్రువంలో ఉందని వాదించాడు. వేద శ్లోకాలు, జొరాస్ట్రియన్ గ్రంథాల ఆధారంగా అతడు ఈ ఆలోచన చేసాడు గోల్వాల్కర్ 10,000 సంవత్సరాల ఆలోచనను చేపట్టి, ఆ కాలంలో ఉత్తర ధృవం భారతదేశంలో ఉందని వాదించాడు. దేశీయ ఆర్య సిద్ధాంతపు ప్రధాన ప్రతిపాదకుడైన సుభాష్ కాక్, వేద-పురాణ కాలక్రమాన్ని వెలుగు లోకి తెచ్చాడు. దానిని అనుసరించి వేదాలు, వైదిక ప్రజల తేదీలను తిరిగి లెక్కగట్టాడు. "భారత నాగరికతను సింధు-సరస్వతి (లేదా సింధు) సంప్రదాయపు (సా.పూ. 7000 లేదా 8000) ప్రారంభ కాలం నుండీ వస్తున్న అవిచ్ఛిన్న సంప్రదాయంగా చూడాలి." అని కాక్ అంటాడు. సుధీర్ భార్గవ ప్రకారం, 10,000 సంవత్సరాల క్రితం, మనువు నివసించినట్లు చెప్పబడే కాలంలో, ఆర్యుల పురాతన నివాసమైన బ్రహ్మావర్తం లోని సరస్వతి నది ఒడ్డున ఉన్న ఆశ్రమాలలో వేదాలు కూర్చబడ్డాయి. సా.పూ. 4500 తరువాత, భూకంప కార్యకలాపాల వలన సరస్వతి తదితర నదుల ప్రవాహ మార్గాలు మారిపోయినపుడు బ్రహ్మావర్తం లోని ప్రజలు భారతదేశం నుండి బయటికి బయలుదేరారు అని సుధీర్ భార్గవ అంటాడు. దక్షిణ ఆసియాలో 10,000 సంవత్సరాలుగా ఉన్న హిందూ ఉనికి ఉందనే ఆలోచన, ప్రధాన స్రవంతి పండితుల వాదనకు పూర్తి విరుద్ధంగా ఉంది. వీరి వాదన ప్రకారం వేద సంస్కృతి సా.పూ. 1500 లో ఇండో-ఆర్యన్ వలసలతో భారతదేశంలోకి ప్రవేశించింది. సా.పూ. 500 తరువాత, వైదిక-బ్రాహ్మణ, స్వదేశీ మతాచారాల సంకలనమే హిందూమతంగా అభివృద్ధి చెందింది.

గమనికలు మార్చు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Buddha అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Mahbharata: "And Manu was endowed with great wisdom and devoted to virtue. And he became the progenitor of a line. And in Manu's race have been born all human beings, who have, therefore, been called Manavas. And it is of Manu that all men including Brahmanas, Kshatriyas, Vaishyas, Sudras, and others have been descended, and are therefore all called Manavas. Subsequently, the Brahmanas became united with the Kshatriyas. And those sons of Manu that were Brahmanas devoted themselves to the study of the Vedas. And Manu begot ten other children named Vena, Dhrishnu, Narishyan, Nabhaga, Ikshvaku, Karusha, Sharyati, the eighth, a daughter named Ila, Prishadhru the ninth, and Nabhagarishta, the tenth. They all betook themselves to the practices of Kshatriyas (warriors). Besides these, Manu had fifty other sons on Earth. But we heard that they all perished, quarrelling with one another."[35]
  3. See also Kak 1996

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Kak 2001b.
  2. Datta, Amaresh (1 January 2006). The Encyclopaedia of Indian Literature (Volume Two) (Devraj to Jyoti). ISBN 978-81-260-1194-0.
  3. "Ramayana | Summary, Characters, & Facts". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-02-18.
  4. Austin, Christopher R. (2019). Pradyumna: Lover, Magician, and Son of the Avatara (in ఇంగ్లీష్). Oxford University Press. p. 21. ISBN 978-0-19-005411-3.
  5. Brockington (1998, p. 26)
  6. J. L. Brockington (1998). The Sanskrit Epics. BRILL. pp. 379–. ISBN 90-04-10260-4.
  7. Merriam-Webster's Encyclopedia of Literature (1995 Edition), Article on Puranas, ISBN 0-877790426, page 915
  8. Greg Bailey (2001), Encyclopedia of Asian Philosophy (Editor: Oliver Leaman), Routledge, ISBN 978-0415172813, pages 437-439
  9. Collins 1988, p. 36.
  10. John Cort (1993), Purana Perennis: Reciprocity and Transformation in Hindu and Jaina Texts (Editor: Wendy Doniger), State University of New York Press, ISBN 978-0791413821, pages 185-204
  11. Flood 1996, p. 359.
  12. John Cort (1993), Purana Perennis: Reciprocity and Transformation in Hindu and Jaina Texts (Editor: Wendy Doniger), State University of New York Press, ISBN 978-0791413821, pages 185-204
  13. 13.0 13.1 Trautman 2005, p. xx.
  14. Witzel 2001, p. 70.
  15. Rocher 1986, p. 123-124.
  16. Olivelle, Patrick (2005). Manu's Code of Law. Oxford University Press. pp. 24–25. ISBN 978-0195171464.
  17. Olivelle 2005, pp. 90, 240 (1.61), 241 (1.70-71).
  18. See: Matchett, Freda, "The Puranas", p 139; and Yano, Michio, "Calendar, astrology and astronomy" in Flood, Gavin, ed. (2003). The Blackwell Companion to Hinduism. Blackwell Publishing. pp. 139–140, 390. ISBN 0-631-21535-2.
  19. Singh 2008, p. 22.
  20. 20.0 20.1 Wuaku 2013, p. 148.
  21. 21.00 21.01 21.02 21.03 21.04 21.05 21.06 21.07 21.08 21.09 21.10 21.11 21.12 21.13 21.14 21.15 21.16 21.17 21.18 Vaswani 2017, p. 12-14.
  22. 22.00 22.01 22.02 22.03 22.04 22.05 22.06 22.07 22.08 22.09 22.10 22.11 22.12 22.13 22.14 Carman 1994, p. 211-212.
  23. 23.0 23.1 23.2 23.3 23.4 23.5 Leyden 1982, p. 22.
  24. Krishna 2009.
  25. Dalal 2010, p. 112.
  26. Lochtefeld 2002, p. 73.
  27. Doniger O'Flaherty 1994, p. 175.
  28. Klostermaier 2007.
  29. 29.0 29.1 29.2 Pathak, Dr. Arunchandra S. (2006). "Junnar". The Gazetteers Dept, Government of Maharashtra (first published: 1885). Archived from the original on 16 October 2009. Retrieved 2008-11-03.
  30. 30.0 30.1 Nagaswamy 2010, p. 27.
  31. 31.0 31.1 Mukherjee 1981, p. 155.
  32. Ganguly 1984, p. 15-16.
  33. 33.0 33.1 Witzel 2001, p. 69.
  34. Francis Hamilton (1819). Geneaolgies of the Hindus: extracted from their sacred writings; with an introduction and alphabetical index. p. 89. {{cite book}}: |work= ignored (help)
  35. Swami Parmeshwaranand (1 January 2001). Encyclopaedic Dictionary of Puranas. Sarup & Sons. ISBN 978-81-7625-226-3., p. 638.
  36. 36.0 36.1 Rocher 1986, p. 122.
  37. 37.0 37.1 Ganguly 1984, p. 16.
  38. Singh, Upinder (2006). Delhi: Ancient History. Berghahn Books. p. 85. ISBN 9788187358299.
  39. 39.0 39.1 Singh 2009, p. 19.
  40. The Sauptikaparvan of the Mahabharata: The Massacre at Night. Oxford University Press. 1998. p. 13. ISBN 9780192823618.
  41. Singh 2009, p. 18-21.
  42. 42.0 42.1 Witzel 1995.
  43. Hiltebeitel 2005, p. 5594.