ఆర్యుల వలస సిద్ధాంతం

ఇండో ఆర్యులు భారత ఉపఖండం లోకివలస వచ్చారనే సిద్ధాంతం

ఇండో-ఆర్య ప్రజలు భారత ఉపఖండంలోకి వలస వచ్చారనే పరికల్పనను ఆర్యుల వలస సిద్ధాంతం అంటారు. దీన్ని ఇండో-ఆర్య వలసలు[note 1] అని కూడా అంటారు. ఇండో-ఆర్య భాషలు మాట్లాడే ఒక భాషా జాతి సమూహమే ఇండో ఆర్యులు. నేటి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులలో మాట్లాడే భాషలు ఈ భాషా కుటుంబం లోనివే. మధ్య ఆసియా నుండి ఈ ప్రాంతంలోకీ, అనటోలియా (పురాతన మిటాని) లోకీ ఇండో-ఆర్య జనాభా కదలికలు క్రీ.పూ 2000 తరువాత ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. చివరి హరప్పన్ కాలం తరువాత ఈ వలసలు నెమ్మదిగా వ్యాపించి, ఉత్తర భారత ఉపఖండంలో భాషా మార్పుకు దారితీసిందని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఇండో-ఆర్యన్లతో దగ్గరి సంబంధం ఉన్న ఇరానియన్లు ఇరానియన్ భాషలను ఇరానియన్ పీఠభూమిలోకి తీసుకువచ్చారు.  

ఇండో-ఆర్యుల పుట్టుకకు, ఇరానియన్ల పుట్టుకకూ మూలమైన ప్రోటో-ఇండో-ఇరానియన్ సంస్కృతి కాస్పియన్ సముద్రానికి ఉత్తరాన ఉన్న మధ్య ఆసియా గడ్డిభూములపై సింటాష్ట సంస్కృతిగా (2200[2][3][4] –1800 BC)[5][6][7][8] అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం ఆధునిక కాలపు రష్యా, కజాఖ్‌స్తాన్‌లలో ఉంది. ఆ తరువాతి కాలంలో ఇది ఆరల్ సముద్రం చుట్టూ ఆండ్రోనోవో సంస్కృతిగా (క్రీ.పూ. 2000-900), వృద్ధి చెందింది.

ఇండో-ఆర్యులు క్రీ.పూ 2000 - క్రీ.పూ 1600 మధ్య కాలంలో ఇరానియన్ల నుండి విడిపోయి,[9] దక్షిణ దిశగా బాక్టీరియా-మార్జియానా సంస్కృతి (BMAC) వైపు వలస వెళ్ళారు. దాని నుండి వారు తమ విలక్షణమైన మత విశ్వాసాలను, అభ్యాసాలను స్వీకరించారు. BMAC నుండి, ఇండో-ఆర్యులు అనటోలియాకు వలస వెళ్ళారు. బహుశా పంజాబ్ (ఉత్తర పాకిస్తాన్, భారతదేశం) లోకి కూడా అనేక తరంగాలుగా వలస వెళ్ళి ఉండవచ్చు. ఇరానియన్లు, క్రీ.పూ. 800 లో ఇరాన్లోకి వలస వెళ్ళారు. ఈ రెండు శాఖలూ తమతో ఇండో-ఇరానియన్ భాషలను తీసుకువెళ్ళాయి.

18 వ శతాబ్దం చివరలో, పాశ్చాత్య భారతీయ భాషల మధ్య సారూప్యతలు గుర్తించిన నేపథ్యంలో ఇండో-యూరోపియన్ భాషా కుటుంబాన్ని కనుగొన్న తరువాత ఇండో-యూరోపియన్ ప్రజల వలస సిద్ధాంతాన్ని కల్పన చేసారు. ఈ సారూప్యతలను బట్టే, ఒకే మూలాన్ని ప్రతిపాదించారు. ఏదో ఒక అసలు జన్మస్థానం (మాతృభూమి) నుండి వాళ్ళు వలసల ద్వారా వ్యాపించి ఉంటారని కల్పన చేసారు.

సిద్ధాంతం అభివృద్ధి చెందిన క్రమం

మార్చు

సంస్కృతం, పర్షియన్, గ్రీకు భాషల మధ్య సారూప్యతలు

మార్చు

16 వ శతాబ్దంలో, భారతదేశానికి వచ్చిన యూరోపియన్ సందర్శకులు భారత, యూరోపియన్ భాషల మధ్య సారూప్యతలు ఉన్నట్లు గమనించారు.[10] 1653 లోనే వాన్ బాక్సార్న్ జర్మానిక్, రోమాన్ష్, గ్రీకు, బాల్టిక్, స్లావిక్, సెల్టిక్, ఇరానియన్ లకు ఒక ఆదిమ భాష ( "స్కైతియన్") ఉందనే ప్రతిపాదనను ప్రచురించాడు.[11]

జీవితమంతా భారతదేశంలో గడిపిన ఫ్రెంచ్ జెస్యూట్ గాస్టన్-లారెంట్ కోర్దూ, 1767 లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు పంపిన ఒక జ్ఞాపికలో, సంస్కృతానికి యూరోపియన్ భాషలకూ మధ్య ఉన్న సారూప్యతను చూపాడు.[12][note 2]

1786 లో, కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన విలియం జోన్స్, ఆసియాటిక్ సొసైటీ మూడవ వార్షికోత్సవంలో చేసిన ఉపన్యాసంలో సంస్కృతం, పర్షియన్, గ్రీకు, లాటిన్, గోతిక్, సెల్టిక్ భాషలు ఒకే కోవకు చెందినవని సూత్రీకరించాడు. అతడు భాషా శాస్త్రవేత్త, సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్న క్లాసిక్ పండితుడు కూడా. కానీ అతడు చేస్తున్న పని అనేక విధాలుగా అతని పూర్వీకుల కంటే తక్కువ ఖచ్చితమైనది. ఎందుకంటే అతను చేసిన ఈజిప్షియన్, జపనీస్, చైనీసులను ఇండో-యూరోపియన్ భాషలలో చేర్చడం, హిందూస్థానీ[11] స్లావిక్ భాషలను చేర్చకపోవడం రెండూ తప్పే.[13][14]

సంస్కృత భాష ప్రాచీనత ఎప్పటిదైనప్పటికీ, దాని అద్భుతమైన నిర్మాణం; గ్రీకు కంటే పరిపూర్ణమైనది, లాటిన్ కంటే ఎక్కువ ప్రఖ్యాతి గాంచినది. ఈ రెండింటికన్నా చాలా నాగరికమైనది. అయినప్పటికీ క్రియల మూలాల్లోను, వ్యాకరణ రూపాల్లోనూ ఈ రెండు భాషల తోటీ బలమైన అనుబంధాన్ని కలిగి ఉంది. ఇదేఓ కాకతాళీయంగా జరిగినది కాకపోవచ్చు. ఈ సారూప్యత ఎంత బలంగా ఉందంటే, ఈ మూడింటినీ అధ్యయనం చేసే ఏ భాషాశాస్త్రవేత్తైనా ఇవి ఒకే మూలం నుండి ఉద్భవించాయని భావించకుండా ఉండడు. ఇంత బలంగా కాకపోయినా, గోతిక్ సెల్టిక్ భాషలు కూడా సంస్కృతంతో పాటు ఒకే మూలం నుండి ఉద్భవించాయని భావించవచ్చు. అలాగే ప్రాచీన పర్షియను భాషను కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.[15]

ఈ భాషలన్నీ ఒకే మూలం నుండి వచ్చాయని జోన్స్ తేల్చాడు.[15]

మాతృభూమి

మార్చు

ఆర్యుల మాతృభూమి మధ్య ఆసియాలో లేదా పశ్చిమ ఆసియాలో ఉందని పండితుల ఊహ. దీని ప్రకారం సంస్కృతం పశ్చిమం నుండి తూర్పుకు భాషా బదిలీ పద్ధతిలో భారతదేశానికి చేరుకుని ఉండాలి.[16][17] 19 వ శతాబ్దంలో జరిగిన ఇండో-యూరోపియన్ అధ్యయనాలలో,ఋగ్వేదం లోని భాష పండితులకు తెలిసిన అత్యంత పురాతనమైన ఇండో-యూరోపియన్ భాష. వాస్తవానికి కాంస్య యుగానికి చెందిన ఏకైక ఇండో-యూరోపియన్ రికార్డులివి. సంస్కృతం యొక్క ఈ ప్రాముఖ్యతే ప్రోటో-ఇండో-యూరోపియన్ మాతృభూమికి కేంద్రం భారతదేశంలోనే ఉందని ఫ్రెడరిక్ ష్లెగెల్ వంటి పండితులు భావించేలా ప్రేరేపించింది. ఇతర మాండలికాలు చారిత్రక వలసల ద్వారా పశ్చిమాన వ్యాపించాయి.[16]

కాంస్య-యుగం నాటి ఇండో-యూరోపియన్ (అనాటోలియన్, మైసెనియన్ గ్రీకు) ఆధారాలను 20 వ శతాబ్దంలో కనుగొనడంతో, అత్యంత పురాతన ఇండో-యూరోపియన్ భాష అనే విశిష్ట హోదాను వేద సంస్కృతం కోల్పోయింది.[16][17]

ఆర్య "జాతి"

మార్చు
 
హచిన్సన్ యొక్క "హిస్టరీ ఆఫ్ ది నేషన్స్" నుండి ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించిన 1910 చిత్రణ

1850 లలో మాక్స్ ముల్లర్, పశ్చిమ అర్యులు తూర్పు ఆర్యులు అనే రెండు ఆర్య జాతుల భావనను ప్రవేశపెట్టాడు. వారు కాకసస్ ప్రాంతం నుండి ఐరోపా వైపు వెళ్ళిన పశ్చిమ ఆర్యులు కాగా, భారతదేశానికి వలస వచ్చిన వారు తూర్పు ఆర్యులు. ముల్లర్ ఇలా రెండు సమూహాలుగా విడదీసి, పశ్చిమ శాఖకు ఎక్కువ ప్రాముఖ్యతను విలువనూ ఆపాదించాడు. అదెలా ఉన్నప్పటికీ, ఈ "తూర్పు ఆర్య జాతి తూర్పు ప్రాంతపు స్థానికుల కంటే శక్తివంతమైన వారు, స్థానికులను సులభంగా జయించగలిగారు" అని కూడా అతడు సిద్ధాంతీకరించాడు.[18]

ముల్లర్ ప్రతిపాదించిన ఇండో-యూరోపియన్ మాట్లాడే రెండు-జాతుల ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని హెర్బర్ట్ హోప్ రిస్లీ విస్తరించాడు. కులవ్యవస్థ అనేది స్థానిక ద్రావిడలపై ఇండో-ఆర్యులు సాధించిన ఆధిపత్యపు అవశేషమేనని అతడు సిద్ధాంతీకరించాడు.[19][20] రిస్లీ "ఆర్యుల రక్తం, ముక్కు పొడవు వెడల్పుల నిష్పత్తి లను బట్టి అత్యున్నత స్థాయి కులాల నుండి నిమ్న స్థాయి కులాల తారతమ్యతను ఆపాదించాడని థామస్ ట్రాట్మాన్ చెప్పాడు. కులానికి జాతికీ మధ్య చూపిన ఈ సారూప్యత చాలా ప్రభావాన్ని చూపింది"[21]

ముల్లర్ పని ఆర్య సంస్కృతిపై ఆసక్తిని పెరగడానికి దోహదపడింది, ఇది తరచూ ఇండో-యూరోపియన్ ('ఆర్యన్') సంప్రదాయాలను సెమిటిక్ మతాలకు పోటిగా నిలబెట్టింది. తరువాతి కాలంలో "ఈ వర్గీకరణలు జాత్యహంకార పరంగా వ్యక్తీకరణలకు దారితీయడం పట్ల అతను చాలా బాధపడ్డాడు", ఎందుకంటే ఇది అతని ఉద్దేశ్యానికి దూరంగా ఉంది.[22] [note 3] ముల్లర్ దృష్టిలో భారతీయులకు, యూరోపియన్లకు ఒకే వంశపారంపర్యత ఉండడం అనేది జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఉన్న ఒక శక్తివంతమైన వాదన. "ఆర్య జాతి, ఆర్య రక్తం, ఆర్య కళ్ళూ, జుట్టూ గురించి మాట్లాడే ఎథ్నోలజిస్టు, డోలికోసెఫాలిక్ డిక్షనరీ గురించో బ్రాచైసెఫాలిక్ వ్యాకరణం గురించో మాట్లాడే భాషావేత్త లాంటి గొప్ప పాపి అని అతడు వాదించాడు. అత్యంత నల్లగా ఉండే హిందువు, అత్యంత తెల్లగా ఉండే స్కాండినేవియన్లతో పోలిస్తే మరింత ప్రాచీనమైన ఆర్యుల భాషను, ఆలోచనలనూ ప్రతిబింబిస్తాడు అని అతడు అన్నాడు.[23] తన తరువాతి రచనలో, మాక్స్ ముల్లర్ "ఆర్యన్" అనే పదాన్ని కేవలం భాషా పరమైన అర్థానికే పరిమితం చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.[24]

"ఆర్యుల దండయాత్ర"

మార్చు

1920 లో సింధు లోయ నాగరికతకు చెందిన హరప్పా, మొహెంజో-దారో, లోథల్ ప్రదేశాల్లో జరిపిన తవ్వకాలు,[25] ఇండో-ఆర్యులు ఈ ప్రాంతానికి వలస వచ్చినప్పటికే ఉత్తర భారతదేశంలో ఒక ఆధునిక సంస్కృతి ఉందని తేలింది.దీనితో ఆర్యుల వలస అనే కథనానికి మార్పు చేర్పులు చేసారు. ఆధునికులైన ఆర్యులు ఆదిమ అనాగరికులైన జనావాసాల వైపు జరిగిన వలస లాగా కాకుండా, దీన్ని, సంచార ప్రజలైన ఆర్యులు అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత విలసిల్లిన ప్రాంతానికి జరిపిన వలసగా ఈ సిద్ధాంతాన్ని మార్చేసారు. పాశ్చాత్య రోమన్ సామ్రాజ్య పతనానికి ఒక కారణమైన జర్మనీయుల వలసల్లాగా, బాబిలోనియాపై కాస్సైట్ దండయాత్ర లాగా ఈ అర్యుల వలస కథనాన్ని మార్చేసారు

ఉత్తర భారతదేశంలోకి ఆర్యుల సాయుధ దండయాత్ర జరిగినట్లుగా సిద్ధాంతికరించారు. ఇండో-ఆర్య వలసలు జరిగాయని చెబుతున్న కాలం, చరిత్రలో సరిగ్గా సింధు లోయ నాగరికత క్షీణించిన సమయంతో సరిపోలడంతో, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి మద్దతు లభించినట్లుగా భావించారు. ఈ వాదనను 20 వ శతాబ్దం మధ్యలో పురావస్తు శాస్త్రవేత్త మోర్టిమెర్ వీలర్ ప్రతిపాదించాడు. అతను మొహెంజో-దారో తవ్వకాల వద్ద పైపొరల్లో సరిగా పూడ్చని అనేక శవాలు కనిపించినపుడు ఆ శవాలు యుద్ధాల్లో మరణించిన వారివని అతడు వ్యాఖ్యానించాడు. ఆ నాగరికత నిర్మూలనకు "ఇంద్రుడే నిందితుడని" చేసిన అతడి వ్యాఖ్య చాలా ప్రసిద్ధి పొందింది.

ఆర్యులకు స్థానికులకూ జరిగినట్లుగా చెప్పిన యుద్ధాలకు ఆధారాలేమీ దొరకకపోవడంతో ఈ సిద్ధాంతాన్ని పక్కనపెట్టారు. అస్థిపంజరాలు ఊచకోత బాధితులు కాదనీ, వాటిని హడావుడిగా ఖననం చేసినట్లు గానూ కనుగొన్నారు. వీలర్ కూడా ఈ వివరణను తరువాతి ప్రచురణలలో ఇలా చెప్పాడు, "ఇది ఒక సంభావ్యత, కానీ దాన్ని నిరూపించలేం. ఇది సరి కాకపోవచ్చుకూడా."[26] మోహెంజో-దారో ప్రాంతంలో మానవ నివాసాల చివరి దశలో జరిగిన సంఘటనను సూచిస్తూ ఉండవచ్చని, ఆ తరువాత ఆ స్థలంలో జనావాసాలు ఉండి ఉండకపోవచ్చనీ సూత్రీకరిస్తూ, మోహెంజో-దారో క్షీణతకు కారణం లవణీయత వంటి నిర్మాణాత్మక విషయాలు అయి ఉండవచ్చని వీలర్ అభిప్రాయపడ్డాడు.[27]

ఏదేమైనప్పటికీ, 'దండయాత్ర సిద్ధాంతం' ఖండనకు గురైనప్పటికీ, ఇండో-ఆర్య వలస సిద్ధాంత విమర్శకులు మాత్రం దాన్ని "ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం" గానే పిలుస్తున్నారు,[1][28][note 4] ఆ విధంగా దాన్ని ఒక జాత్యహంకార, వలసవాద వాదనగా చిత్రీకరిస్తున్నారు

ఆర్యుల వలస

మార్చు
 
20 వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలోని వ్యవసాయ గ్రామాలలో ఆర్యులు స్థిరపడ్డారు

20 వ శతాబ్దం తరువాత, డేటా సంకలనం జరగడంతో ఆలోచనలు మారిపోయాయి. ఇండో-ఆర్యులు, వారి భాష, వారి సంస్కృతి క్రీ.పూ. 1500 లో వాయువ్య భారతదేశంలో వ్యాపించిన పద్ధతిని దండయాత్ర కాదని, అవి వలసలనీ భావించారు. "దండయాత్ర" అనే పదాన్ని ఈ రోజుల్లో ఇండో-ఆర్య వలస సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారు మాత్రమే ఉపయోగిస్తున్నారు [1][28]

మారిన సిద్ధాంతం భాషా బదిలీ పట్ల కొత్తగా అభివృద్ధి చెందిన ఆలోచనలకు అనుగుణంగా ఉంది. ఉదాహరణకు, గ్రీకులు గ్రీస్‌లోకి వలస రావడం (క్రీ.పూ. 2100 - 1600 మధ్య), మైసెనియన్ గ్రీకును వ్రాసే ఉద్దేశ్యంతో లేదా పశ్చిమ ఐరోపా యొక్క ఇండో-యూరోపియనీకరణ (క్రీ.పూ. 2200 - 1300 మధ్య దశలలో) కోసం, ముందే ఉనికిలో ఉన్న లీనియర్ ఎ నుండి లీనియర్ బి అనే సిలబిక్ లిపిని స్వీకరించడం వంటివి,

భారతీయ అభిప్రాయాలు

మార్చు

ఇండో-ఆర్య ప్రజలు బయటి మూలానికి చెందినవారు అనే భావన భారత ఉపఖండంలో వివాదాస్పదమైంది. భారతీయులు దీన్ని ఐరోపా కేంద్రిత, అణచివేత కోసం ఉపయోగించుకోజూసే వలసరాజ్యాల కల్పనగా చూస్తారు. తమ భాష, సంస్కృతి, మతాల ప్రాచీనతను తక్కువ చేసి చూపేందుకు ఈ సిద్ధాంతాన్ని వినియోగించుకుంటున్నారని భారతీయులు భావిస్తారు.1990 ల లోను, ఆ తరువాత ఈ సిద్ధాంతం భారతదేశంలో ఎక్కువగా విమర్శలకు గురైంది.

వేద సంస్కృతి, మతాల యొక్క ప్రాచీనత

మార్చు
దస్త్రం:Late Vedic Culture (1100-500 BC).png
అంత్య వేద కాలం (ca. 1100-500 BC).నాటికి ఆర్యావర్తం వ్యాప్తి. ఆర్యావర్తం వాయువ్య భారతదేశ, పశ్చిమ గంగా మైదానానికి పరిమితం కాగా, తూర్పున గ్రేటర్ మగధలో వేదయేతర ఇండో-ఆర్యులు నివసించేవారు. వారు జైన, బౌద్ధమతాలకు ఆద్యులయ్యారు.[29][30]

పురాణ భారతీయ చరిత్రలో మహాభారతం, రామాయణం, పురాణాలలో వివరించిన సంఘటనల కాలక్రమం - దీన్ని పౌరాణిక కాలక్రమం అంటారు- ప్రకారం వేద సంస్కృతికి పాశ్చాత్యులు చెప్పేదాని కంటే మరింత పాత కాలక్రమాన్ని వివరించింది. ఈ దృష్టిలో, వేదాలు వేల సంవత్సరాల క్రితమే అందించబడ్డాయి. భగవద్గీత యొక్క నేపథ్య దృశ్యం అయిన కురుక్షేత్ర యుద్ధం, వాస్తవంగా జరిగిన చారిత్రక సంఘటనలను సూచిస్తుంది. ఈ యుద్ధం జరిగినది క్రీ.పూ. 1000 లో జరిగిందని పాశ్చాత్యులు చెప్పగా[31][32] పౌరాణిక కాలక్రమం క్రీ.పూ 3100 లో జరిగిందని చెబుతోంది.

ఇవి కూడా చూడండి

మార్చు

నోట్స్

మార్చు
  1. The term "invasion", while it was once commonly used in regard to Indo-Aryan migration, is now usually used only by opponents of the Indo-Aryan migration theory.[1] The term "invasion" does not any longer reflect the scholarly understanding of the Indo-Aryan migrations,[1] and is now generally regarded as polemical, distracting and unscholarly.
  2. See:
    • Duperron, Anquetil (1808), Histoire et mémoires de l'Académie des Inscriptions et Belles-Lettres, de 1701 à 1793, imprimerie royale
    • Godfrey, John J. (1967). "Sir William Jones and Père Coeurdoux: A philological footnote". Journal of the American Oriental Society. 87 (1): 57–59. doi:10.2307/596596. JSTOR 596596.
  3. Esleben: "In later years, especially before his death, he was deeply saddened by the fact that these classifications later came to be expressed in racist terms."[22]
  4. According to Bryant, keeping up-to-date is problematic for many Indian scholars, since most Indian universities don't have enough funds to keep up with current scholarship, and most Indian scholars are not able to gain access to recent western publications.[28] Bryant further notes that "while one would be lucky to find a book by Max Muller even in the antique book markets of London, one can find a plethora of recent-edition publications of his and other nineteenth-century scholars' works in just about any bookstore in India (some of these on their tenth or twelfth edition). Practically speaking, it is small Delhi publishers that are keeping the most crude versions of the Aryan invasion theory alive by their nineteenth-century reprints! These are some of the main sources available to most Indian readers."[28]మూస:Unbalanced opinion

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Witzel 2005, p. 348.
  2. Chernykh, E. N. (2008). "Formation of the Eurasian 'Steppe Belt' of Stockbreeding Cultures: Viewed through the Prism of Archaeometallurgy and Radiocarbon Dating" Archived 2020-06-22 at the Wayback Machine, in Archaeology, Ethnology & Anthropology of Eurasia 35/3 (2008), Elsevier: "...radiocarbon estimates...accumulated and systematized at the Laboratory of the Institute of Archaeology, Russian Academy of Sciences (Moscow)...Sintashta, 44 dates; Abashevo, 22; and Petrovka, only nine...the ranges of sum probabilities within the 68% limits: they strikingly coincide, falling between the 22nd and the 18th/17th cent. BC..." (pp. 38 and 48).
  3. Chernykh, E. N., (2009). Formation of the Eurasian Steppe Belt Cultures: Viewed Through the Lens of Archaeometallurgy and Radiocarbon Dating, in B. Hanks & K. Linduff (eds.), Social Complexity in Prehistoric Eurasia: Monuments, Metals and Mobility, Cambridge University Press, pp. 128-133.
  4. Parpola, Asko, (2017). "Finnish vatsa - Sanskrit vatshá - and the formation of Indo-Iranian and Uralic languages", in SUSA/JSFOu 96, 2017, p. 249.
  5. Witzel 2003.
  6. Anthony 2007, pp. 390 (fig. 15.9), 405–411.
  7. Kuz'mina 2007, p. 222.
  8. Parpola 2015.
  9. Lubotsky, Alexander, (2020). "What language was spoken by the people of the Bactria-Margiana Archaeological Complex?", in Paul W. Kroll and Jonathan A. Silk (eds.), 'At the Shores of the Sky': Asian Studies for Albert Hoffstädt, Brill, Leiden/Boston, p. 6: "...The breakdown of the Indo-Iranian branch into Indian and Iranian occurred somewhere between 2000 and 1600 bce, when future Indians left their tribesmen and crossed the Hindu Kush on their way to India..."
  10. Auroux, Sylvain (2000). History of the Language Sciences. Berlin, New York: Walter de Gruyter. p. 1156. ISBN 3-11-016735-2.
  11. 11.0 11.1 Roger Blench Archaeology and Language: methods and issues. In: A Companion To Archaeology. J. Bintliff ed. 52–74. Oxford: Basil Blackwell, 2004.
  12. Wheeler, Kip. "The Sanskrit Connection: Keeping Up With the Joneses". Dr.Wheeler's Website. Retrieved 16 April 2013.
  13. Campbell & Poser 2008, p. 37.
  14. Patil, Narendranath B. (2003). The Variegated Plumage: Encounters with Indian Philosophy : a Commemoration Volume in Honour of Pandit Jankinath Kaul "Kamal". Motilal Banarsidass Publications. p. 249. ISBN 9788120819535.
  15. 15.0 15.1 Anthony 2007, p. 7.
  16. 16.0 16.1 16.2 Senthil Kumar 2012, p. 123.
  17. 17.0 17.1 "Tense and Aspect in Indo-European Languages", by John Hewson, Page 229
  18. McGetchin 2015, p. 116.
  19. Trautmann, Thomas R. (2006) [1997]. Aryans and British India (2nd Indian ed.). New Delhi: YODA Press. p. 203. ISBN 81-902272-1-1.
  20. Risley, Herbert Hope (1891). "The Study of Ethnology in India". The Journal of the Anthropological Institute of Great Britain and Ireland. 20. Royal Anthropological Institute of Great Britain and Ireland: 253. JSTOR 2842267.
  21. Trautmann, Thomas R. (2006) [1997]. Aryans and British India (2nd Indian ed.). New Delhi: YODA Press. p. 183. ISBN 81-902272-1-1.
  22. 22.0 22.1 Esleben, Kraenzle & Kulkarni 2008.
  23. F. Max Müller, Biographies of Words and the Home of the Aryas (1888), Kessinger Publishing reprint, 2004, p.120; Dorothy Matilda Figueira, Aryans, Jews, Brahmins: Theorizing Authority Through Myths of Identity, SUNY Press, 2002, p.45
  24. McGetchin 2015, p. 117.
  25. Bryant & Patton 2005.
  26. Wheeler 1967, p. 76.
  27. Wheeler 1967, pp. 82–83.
  28. 28.0 28.1 28.2 28.3 Bryant 2001, p. 306.
  29. Bronkhorst 2007.
  30. Samuel 2010.
  31. Witzel 1995.
  32. Singh 2009, p. 19.

వనరులు

మార్చు