ప్రతిరోజూ పండగే

దాసరి మారుతి దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

ప్రతిరోజూ పండగే 2019, డిసెంబరు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ నటించారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం, జయకుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.[1]

ప్రతిరోజూ పండగే
Prathi Roju Pandage Movie Poster.jpeg
ప్రతిరోజూ పండగే సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి మారుతి
నిర్మాతబన్ని వాసు
అల్లు అరవింద్ (సమర్పణ)
రచనదేవా దత్తా
స్క్రీన్ ప్లేదాసరి మారుతి
కథదాసరి మారుతి
నటులు
సంగీతంఎస్. తమన్
ఛాయాగ్రహణంజయకుమార్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
యువీ క్రియేషన్స్
గీతా ఆర్ట్స్2 పిక్చర్స్
విడుదల
20 డిసెంబరు 2019 (2019-12-20)
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చు25 కోట్లు

కథసవరించు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

నిర్మాణంసవరించు

ప్రారంభంసవరించు

2019, జూన్‌లో పూజా కార్యక్రమాలతో, ముహూర్తం షాట్ చిత్రీకరణతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతోపాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.[2]

చిత్రీకరణసవరించు

2019, జూలై నెలలో రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాదులో ప్రారంభమైంది. 2019, సెప్టెంబరులో ఈ చిత్రంలోని గ్రామీణ నేపథ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రాజమండ్రికి వెళ్ళింది.[3]

విడుదలసవరించు

ఈ చిత్రం 2019, డిసెంబరు 20న విడుదలయింది.[4]

ప్రచారంసవరించు

గీతా ఆర్ట్స్ 2019, సెప్టెంబరు 12వ తేదీన వివిధ వేదికల్లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 2019, అక్టోబరు 15న చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రంలోని నటీనటులందరి ఫోటోలతో ఒక పోస్టర్‌ను విడుదలచేసింది.[5][6]

మూలాలుసవరించు

  1. "Watch: Teaser of 'Prathi Roju Pandage' promises a family entertainer". The News Minute. Retrieved 6 December 2019. Cite web requires |website= (help)[permanent dead link]
  2. "Tollywood buzz: Nithiin's 29th film titled Rang De!, Sai Dharam Tej's Prati Roju Pandage launched in Hyderabad". Indian Express. Retrieved 6 December 2019. Cite web requires |website= (help)
  3. "Prathiroju Pandage in Rajamundry". Idream. Retrieved 6 December 2019. Cite web requires |website= (help)
  4. "Sai Dharam Tej's Prati Roju Pandaage to clash with these two films. See inside". Times of India. 2 December 2019. Retrieved 6 December 2019.
  5. "Prati Roju Pandage' glimpse highlights Sathyaraj". NTV. Retrieved 6 December 2019. Cite web requires |website= (help)
  6. "ప్రతిరోజూ పండగే' ఫస్ట్ లుక్: నాన్నే కుర్రాడైతే..!". Telugu Samayam. Retrieved 6 December 2019. Cite web requires |website= (help)

ఇతర లంకెలుసవరించు