ప్రవాస ప్రభుత్వం

ప్రవాస ప్రభుత్వం అనేది ఒక దేశానికి లేదా అర్ధ సార్వభౌమ రాజ్యానికి చెందిన చట్టబద్ధమైన ప్రభుత్వం అని చెప్పుకునే రాజకీయ సమూహం. కానీ ఇది స్వదేశంలో చట్టపరమైన అధికారాన్ని వినియోగించుకోలేక, మరొక రాజ్యంలో లేదా మరొక దేశంలో పని చేస్తూ ఉంటుంది. [1] ప్రవాసంలో ఉన్న ప్రభుత్వాలు సాధారణంగా ఏదో ఒకరోజున తమ స్వదేశానికి తిరిగి వెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకుంటామని యోచిస్తాయి. ప్రవాసంలో ఉన్న ప్రభుత్వం అవశిష్ట రాజ్యం కంటే భిన్నంగా ఉంటుంది. అంటే అవశిష్ట రాజ్యం, ఆ రాజ్యానికి గతంలో ఉన్న భూభాగంలో కొంత భాగాన్ని నియంత్రిస్తుంది. [2] ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధంలో, దాదాపు బెల్జియం మొత్తాన్నీ జర్మనీ ఆక్రమించింది. అయితే బెల్జియం, దాని మిత్రదేశాలు దేశానికి పశ్చిమాన ఒక చిన్న ముక్కను తమ అధీనంలో ఉంచుకున్నాయి. అది అవశిష్ట రాజ్యం అవుతుంది. [3] దీనికి విరుద్ధంగా, ప్రవాసంలో ఉన్న ప్రభుత్వం తన భూభాగం మొత్తాన్నీ కోల్పోతుంది. అయితే, వాస్తవానికి చూస్తే ఈ వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉండవచ్చు; పై ఉదాహరణలో, సెయింట్-అడ్రెస్సేలోని బెల్జియన్ ప్రభుత్వం ఫ్రెంచి భూభాగంలో ఉంది. పైగా చాలా ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ప్రవాసంలో ఉన్న ప్రభుత్వం లాగానే వ్యవహరించింది.

యుద్ధంలో ఆక్రమించుకోబడినప్పుడు గాని, అంతర్యుద్ధం, విప్లవం లేదా సైనిక తిరుగుబాటు తరువాత గానీ ప్రవాస ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ విస్తరణ సమయంలో, కొన్ని యూరోపియన్ ప్రభుత్వాలు నాజీ జర్మనీ చేతిలో నాశనమైపోయే బదులు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆశ్రయం పొందాయి. మరోవైపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రకటించిన స్వేచ్ఛా భారతదేశపు తాత్కాలిక ప్రభుత్వం బ్రిటీష్ ఆక్రమణదారులను నుండి దేశాన్ని విడిపించేందుకు జపనీయుల మద్దతును తీసుకోవాలని ప్రయత్నించింది. ప్రవాసంలో ఉన్న ప్రభుత్వం పాలక ప్రభుత్వపు చట్టవిరుద్ధతపై ప్రజల్లో విస్తృతంగా ఉన్న భావనల నుండి కూడా ఏర్పడవచ్చు. ఉదాహరణకు 2011 లో సిరియన్ అంతర్యుద్ధం ప్రారంభమైన కారణంగా, పాలక బాత్ పార్టీ పాలనను అంతం చేయడానికి ప్రయత్నించిన సమూహాలు కలిసి సిరియా విప్లవ, ప్రతిపక్ష దళాల జాతీయ కూటమి ఏర్పరచారు.

ప్రవాసంలో ఉన్న ప్రభుత్వాల ప్రభావం ప్రధానంగా విదేశీ ప్రభుత్వాల నుండి లేదా దాని స్వంత ప్రజల నుండి లభించే మద్దతుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని బహిష్కృత ప్రభుత్వాలు బలీయమైన శక్తిగా అభివృద్ధి చెందుతూ, దేశంలోని ప్రస్తుత పాలకులకు తీవ్రమైన సవాలు విసురుతాయి. మరికొన్ని పేరుకే ప్రభుత్వాలుగా మిగిలిపోతాయి.

ప్రవాస ప్రభుత్వం అనే పేరు ఉనికి లోకి రాక ముందు నుండే అలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి. రాచరిక ప్రభుత్వాల కాలాల్లో, నిర్వాసిత చక్రవర్తులు లేదా రాజవంశాలు కొన్నిసార్లు ప్రవాసంలో సభలు తీర్చి ప్రభుత్వాలు నడిపారు. హౌస్ ఆఫ్ బౌర్బన్ దీనికి ఒక ఉదాహరణ. ఫ్రెంచ్ విప్లవం సమయంలో దీనిని ప్రజలు పడగొట్టిన తర్వాత కూడా దీన్నే చట్టబద్ధమైన ఫ్రాన్స్ ప్రభుత్వం అని ఇతర దేశాలు గుర్తించాయి. 1803-04 నుండి 1815 వరకు నెపోలియన్ బోనపార్టే చేసిన యుద్ధాల కాలంలో కూడా ఇది కొనసాగింది. రాజ్యాంగ రాచరికం వ్యాప్తి చెందడంతో, దేశం నుండి బహిష్కృతులైన రాజులు, ఒక ప్రధానమంత్రిని పెట్టుకుని ప్రభుత్వాలను ఏర్పటు చేసారు. పీటర్ స్జోర్డ్స్ గెర్బ్రాండీ నేతృత్వంలోని రెండవ ప్రపంచ యుద్ధ కాలపు డచ్ ప్రభుత్వం దీనికి ఒక ఉదాహరణ.

కార్యకలాపాలు

మార్చు

ప్రవాసంలో ఉన్న ప్రభుత్వాలు తమ రోజువారీ వ్యవహారాల నిర్వహణలో అనేక రకాల చర్యలను చేపట్టవచ్చని అంతర్జాతీయ చట్టం గుర్తించింది. ఈ చర్యలలో కిందివి ఉన్నాయి:

ప్రవాస ప్రభుత్వానికి ఆశ్రయమిచ్చిన దేశంలో, ప్రవాస ప్రభుత్వ దేశపు జనాభా పెద్ద సంఖ్యలో ఉంటే, లేదా తమ జాతొకి చెందిన ప్రజలు అతిధేయ దేశంలో పెద్ద సంఖ్యలో ఉంటే, ప్రవాస ప్రభుత్వం అతిధేయ దేశంలో కొన్ని పరిపాలనా విధులను చేఒపట్టవచ్చు. ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడ్ద స్వేచ్ఛా భారత ప్రభుత్వం, బ్రిటిష్ మలయాలో ఉన్న భారతీయ జనాభాలో అటువంటి అధికారాన్నే కలిగి ఉండేది. దీన్ని అప్పటి జపనీస్ మిలిటరీ అధికారుల సమ్మతించారు.

ప్రవాసంలో ఉన్న గత ప్రభుత్వాలు

మార్చు

కూలదోయబడిన మాజీ రాజ్యాల ప్రభుత్వాలు

మార్చు

ప్రవాసంలో ఉన్న ఈ ప్రభుత్వాలు తొలగించబడిన ప్రభుత్వాలు లేదా పాలకులు ఏర్పరచారు. ఒకప్పుడు తాము పాలించిన రాజ్యానికి చట్టబద్ధమైన పాలకులమని చెప్పుకుంటారు గానీ, ఆ రాజ్యం ఇప్పుడు ఉనికిలో లేదు.

పేరు అప్పటి నుండి బహిష్కరణ రాజ్యం తన క్లెయిమ్ చేసిన భూభాగాన్ని నియంత్రిస్తుంది ( పూర్తిగా లేదా పాక్షికంగా ) గమనికలు మూలాలు
  బెలారసియన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ యొక్క రాడా 1920   Republic of Belarus కెనడాలోని ఒంటారియోలోని ఒట్టావాలో ప్రస్తుతం ఇవోంకా సుర్విల్లా నేతృత్వంలో ప్రవాసంలో ఉన్న పురాతన ప్రస్తుత ప్రభుత్వం (అధికారికంగా, తాత్కాలిక పార్లమెంట్). [4] [5]
  ఇరాన్ సామ్రాజ్యం 1979   Islamic Republic of Iran పజావి రాజవంశం, రెజా పహ్లవి నేతృత్వంలో ఏర్పడింది. అమెరికా, మేరీల్యాండ్‌లోని పోటోమాక్‌లో నివసిస్తున్నారు.
  రాయల్ లావో ప్రభుత్వం (ప్రవాసంలో ఉంది) 1975   Laos లావోస్ రాజ్యం యొక్క మాజీ ప్రభుత్వం; గ్రెషమ్, ఒరెగాన్, యునైటెడ్ స్టేట్స్‌లో ఉంది.
  యెమెన్ రిపబ్లిక్ ప్రభుత్వం 2015   Republic of Yemen ( సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ ) రియాద్‌లో ఉన్న నాయకత్వం. [6]
  మయన్మార్ జాతీయ ఐక్యత ప్రభుత్వం 2021   Republic of the Union of Myanmar ( స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ) ఈ ప్రభుత్వం 2021 మయన్మార్ తిరుగుబాటుకు ప్రతిస్పందనగా ఏర్పడింది. జాతీయ ఐక్యత ప్రభుత్వ క్యాబినెట్ సభ్యులు మయన్మార్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. [7] [8] [9]

తొలగించబడిన దేశాంతర్గత భూభాగాల ప్రభుత్వాలు

మార్చు

ఈ ప్రభుత్వాలు ప్రస్తుతం దావా చేస్తున్న భూభాగం మొత్తాన్ని లేదా చాలావరకు ఒకప్పుడూ పాలించాయి. కానీ ప్రస్తుతం దానిలో ఒక చిన్న భాగంపై నియంత్రణను కొనసాగిస్తూనే, గతంలో తమ నియంత్రణలో ఉన్న మొత్తం భూభాగంపై దావా చేసుకుంటూనే ఉన్నాయి.

పేరు బహిష్కరణ క్లెయిమ్ చేసిన భూభాగం యొక్క ప్రస్తుత నియంత్రణ గమనికలు మూలాలు
నుండి గా ద్వారా గా
  దక్షిణ మలుకు రిపబ్లిక్ 1963 స్వతంత్ర రాజ్యం   Republic of Indonesia మలుకు ప్రావిన్స్ నెదర్లాండ్స్‌లో 1950 - 1963 మధ్య గుర్తించబడని స్వతంత్ర రాజ్యంగా ఉన్న దక్షిణ మలుకు రిపబ్లిక్ కు చెందిన బహిష్కృత ప్రభుత్వం లోని సభ్యులు ఏర్పరచారు.

"ప్రవాస ప్రభుత్వాలు" గా కొందరు భావించే ప్రస్తుత ప్రభుత్వాలు

మార్చు

  రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం: ప్రస్తుతం తైపీలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం తనను తాను ప్రవాస ప్రభుత్వంగా భావించదు. కానీ తైవాన్ రాజకీయ స్థితిపై చర్చలో పాల్గొన్న కొందరు దీనిని ప్రవాస ప్రభుత్వం గానే పేర్కొన్నారు. [10]రిపబ్లిక్ ఆఫ్ చైనాకు ప్రస్తుతం తైవాన్ ద్వీపంతో పాటు, మరి కొన్ని ఇతర ద్వీపాలపై నియంత్రణ ఉంది. అంతే కాకుండా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భూభాగంతో పాటు, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, ఇండియా, జపాన్, మయన్మార్, పాకిస్తాన్‌, రష్యా, తజికిస్తాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలు కూడా తమ దేశం లోని భాగాలేననే వాదన చేస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో తైవాన్ సార్వభౌమత్వాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చట్టబద్ధంగా అందజేయబడలేదు అనే వాదనపై ఈ "ప్రభుత్వం-ప్రవాస" వాదన ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా రిపబ్లిక్ ఆఫ్ చైనా విదేశీ భూభాగంలో ఉంది. కాబట్టి దీనిని ప్రవాస ప్రభుత్వం గానే పరిగణించాలి. దీనికి విరుద్ధంగా, యుద్ధం ముగిసిన తరువాత, తైవాన్ సార్వభౌమత్వాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చట్టబద్ధంగా తిరిగి ఇచ్చినట్లుగా భావించే వారు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించరు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం, రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) లోని కుమింటాంగ్ లు రెండూ ఈ రెండో అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి.

అయితే, యుద్ధం ముగింపులో తైవాన్ సార్వభౌమత్వాన్ని చట్టబద్ధంగా రిపబ్లిక్ ఆఫ్ చైనాకు తిరిగి ఇవ్వబడిందనీ, రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం-ప్రవాసంగా ఉందనీ, తైవాన్ చైనా భూభాగంలో భాగమనీ అంగీకరించని వారు కూడా ఉన్నారు. తైవాన్‌లో ప్రస్తుత డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఈ అభిప్రాయానికి మొగ్గు చూపుతుంది. తైవానీస్ స్వాతంత్ర్యానికి అది మద్దతు ఇస్తుంది.

దేశాంతర్గత భూభాగాలకు చెందిన ప్రభుత్వాల ప్రత్యామ్నాయ వేర్పాటువాద ప్రభుత్వాలు

మార్చు

ప్రస్తుతం

మార్చు

ప్రవాసంలో ఉన్న ఈ ప్రభుత్వాలు మరొక రాజ్యం లోని స్వయంప్రతిపత్త భూభాగాల చట్టబద్ధతపై దావా చేస్తాయి. వీటిని ప్రత్యేక రాజ్యంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించని ప్రభుత్వాలు లేదా పాలకులు ఏర్పరచారు.

పేరు బహిష్కరణ క్లెయిమ్ చేసిన భూభాగం యొక్క ప్రస్తుత నియంత్రణ గమనికలు
   అబ్ఖాజియా యొక్క స్వతంత్ర రిపబ్లిక్ ప్రభుత్వం 1993 స్వతంత్ర రిపబ్లిక్   అబ్ఖాజియా రిపబ్లిక్ వాస్తవంగా స్వతంత్ర రాజ్యం జార్జియన్ ప్రావిన్షియల్ ప్రభుత్వం, రుస్లాన్ అబాషిడ్జ్ నేతృత్వంలో, దీని భూభాగం అబ్ఖాజ్ వేర్పాటువాదుల నియంత్రణలో ఉంది
   దక్షిణ ఒస్సేటియా యొక్క తాత్కాలిక పరిపాలనా సంస్థ 2008 తాత్కాలిక పరిపాలనా సంస్థ   దక్షిణ ఒస్సేటియా రిపబ్లిక్ జార్జియన్ ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, డిమిత్రి సనకోయెవ్ నేతృత్వంలో, దీని భూభాగం దక్షిణ ఒస్సేటియన్ వేర్పాటువాదుల నియంత్రణలో ఉంది
  స్వతంత్ర రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా 2014 స్వతంత్ర రిపబ్లిక్   Russia ఫెడరల్ సబ్జెక్ట్ ( రిపబ్లిక్ ) ఉక్రేనియన్ అటానమస్ రిపబ్లిక్, దీని భూభాగం వివాదాస్పద స్థితి ప్రజాభిప్రాయ సేకరణ తరువాత మార్చి 2014 లో రష్యా స్వాధీనం చేసుకుని విలీనం చేసుకుంది; ప్రెసిడెన్షియల్ రిప్రజెంటేటివ్-ఇన్-ప్రవాసం ఇప్పుడు ఖేర్సన్‌లో ఉంది [11]
  సెవాస్టోపోల్ నగరం ప్రత్యేక నగరం సమాఖ్య నగరం ఉక్రేనియన్ ప్రత్యేక నగరం, దీని భూభాగం వివాదాస్పద స్థితి ప్రజాభిప్రాయ సేకరణ తరువాత మార్చి 2014 లో రష్యా స్వాధీనం చేసుకుంది.
పేరు ప్రవాస కాలం క్లెయిమ్ చేసిన భూభాగం యొక్క వాస్తవ నియంత్రణ గమనికలు మూలాలు
  జనరల్‌టాట్ డి కాటలున్యా 1939-1977   స్పెయిన్ 1939 లో, స్పానిష్ అంతర్యుద్ధంలో రిపబ్లికన్ పక్షం ఓటమి చెందింది. దాంతో ఫ్రాంకోయిస్ట్ నియంతృత్వం జనరల్‌టాట్ డి కాటలున్యాను రద్దు చేసింది. కాటలోనియా స్వయంప్రతిపత్త ప్రభుత్వం, దాని అధ్యక్షుడు లూయిస్ కంపెనీలను హింసించి, ఉరితీసారు. అయితే, జనరల్‌ టాట్ ప్రెసిడెంట్స్ జోసెప్ ఇర్లా (1940-1954) జోసెప్ టర్రాడెల్స్ (1954-1980) నేతృత్వంలో 1939 నుండి 1977 వరకు ప్రవాసంలో తన అధికారిక ఉనికిని కొనసాగించింది. 1977 లో టార్రాడెల్స్ కాటలోనియాకు తిరిగి వచ్చారు. ఫ్రాంకో తరువాత వచ్చిన స్పానిష్ ప్రభుత్వం దాన్ని గుర్తించింది, జనరల్‌టాట్ బహిష్కరణను ముగించింది.
  అజర్‌బైజాన్ కమ్యూనిటీ ఆఫ్ నగోర్నో-కరాబాఖ్ 1994-2021   అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ తాత్కాలిక ప్రభుత్వం, తూరల్ గంజలియేవ్ నేతృత్వంలో, దీని భూభాగం అర్మేనియన్ వేర్పాటువాదుల నియంత్రణలో ఉంది. ఏప్రిల్ 30, 2021 న, 2020 నాగోర్నో-కరాబాఖ్ యుద్ధం తర్వాత అజర్‌బైజాన్ నియంత్రణలో ఉన్న నాగోర్నో-కరాబాఖ్‌లో ఎక్కువ భాగం తిరిగి వచ్చిన తర్వాత అసోసియేషన్ రద్దు ప్రకటించబడింది. [12] [13]

ప్రస్తుత రాజ్యాల ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు

మార్చు

ఈ ప్రభుత్వాలు, రాజకీయ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలూ బహిష్కరణలో ఉండగా సృష్టించినవి. తామే అసలైన పాలక అధికారులు కావాలనుకున్నవారు లేదా గతంలో తొలగించిన ప్రభుత్వాలకు చట్టపరమైన వారసులుగా చెప్పుకునేవారు వీరు. ప్రస్తుత ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వీటిని సృష్టించారు.

పేరు ప్రవాసమని పేర్కొన్నారు ప్రవాస ప్రకటన ప్రస్తుతం ప్రభుత్వం క్లెయిమ్ చేసిన భూభాగాన్ని నియంత్రిస్తోంది గమనికలు మూలాలు
  ఐదు ఉత్తర కొరియా ప్రావిన్సుల కోసం కమిటీ - 1949   North Korea సియోల్ ఆధారంగా, 1945 కి ముందు ఐదు ప్రావిన్సులకు దక్షిణ కొరియా ప్రభుత్వం తాత్కాలిక పరిపాలన చేసింది, ఇది రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో జరిగిన కొరియా విభజనలో ఉత్తర కొరియాగా మారింది. [14]
  తైవాన్ ప్రావిన్స్ ప్రతినిధి, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ / పిఆర్‌సి యొక్క సిపిపిసిసి తైవాన్ వ్యవహారాల కార్యాలయం -   Republic of China ప్రతినిధి సంస్థ కార్యనిర్వాహక సంస్థగా, తైవాన్ డెమొక్రాటిక్ స్వీయ-ప్రభుత్వ లీగ్ (పొలిటికల్ పార్టీ), ఆల్-చైనా ఫెడరేషన్ ఆఫ్ తైవాన్ స్వదేశీయులతో (సివిల్) కలిసి పని చేయండి
  తూర్పు తుర్కిస్తాన్ ప్రవాస ప్రభుత్వం 1949 2004   People's Republic of China స్వతంత్ర తూర్పు తుర్కిస్తాన్ పునరుద్ధరణ కోసం ప్రచారాలు; వాషింగ్టన్, DC, యునైటెడ్ స్టేట్స్‌లో ఉంది [15]
  నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇరాన్ 1979 2013   Islamic Republic of Iran ప్రిన్స్ రెజా పహ్లావి నేతృత్వంలోని నలభై ఇరానియన్ ప్రతిపక్ష రాజకీయ సంస్థల రాజకీయ గొడుగు కూటమి; అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉంది
  డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ - 1981 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ నిర్వహిస్తుంది, ఐదు ఇరానియన్ ప్రతిపక్ష రాజకీయ సంస్థల రాజకీయ గొడుగు కూటమి, అతిపెద్ద సంస్థ మర్యమ్, మసౌద్ రాజావిల నేతృత్వంలోని పీపుల్స్ ముజాహీదీన్; ఇరాన్‌లో ప్రస్తుత మత పాలన స్థానంలో "డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్" స్థాపించాలనే లక్ష్యంతో పారిస్‌లో ఉంది. [16]
  ఈక్వటోరియల్ గినియా ప్రోగ్రెస్ పార్టీ - 2003   Republic of Equatorial Guinea మాడ్రిడ్‌లోని ఈక్వటోరియల్ గినియా ప్రెసిడెంట్ సెవెరో మోటో [17]
  వియత్నాం యొక్క మూడవ రిపబ్లిక్ 1990 1991   Socialist Republic of Vietnam వియత్నాం యొక్క మూడవ రిపబ్లిక్ గతంలో వియత్నాం యొక్క తాత్కాలిక జాతీయ ప్రభుత్వం అని పేరు పెట్టబడింది, ఆరెంజ్ కౌంటీ, కాలిఫోర్నియాలో మాజీ సైనికులు, మాజీ దక్షిణ వియత్నామీస్ నుండి వచ్చిన శరణార్థులు ఏర్పాటు చేశారు. వియత్నాంలో ఉగ్రవాద సంస్థగా ప్రకటించబడింది. [18]
  సిరియన్ మధ్యంతర ప్రభుత్వం - 2012   Syrian Arab Republic సిరియన్ అరబ్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది ; ఇస్తాంబుల్ కేంద్రంగా; కొన్ని ఉచిత సిరియన్ ఆర్మీ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయి. [19]
  రాయల్ లావో ప్రభుత్వం (ప్రవాసంలో) - 1993   Lao People's Democratic Republic లావోస్‌లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది; ఒరెగాన్‌లోని గ్రెషమ్‌లో రాజ్యాంగ రాచరికం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు.
  పవర్ ట్రాన్స్ఫర్ కోసం కోఆర్డినేషన్ కౌన్సిల్ - 2020   Republic of Belarus అలెగ్జాండర్ లుకాషెంకో పాలనను అభ్యర్ధి అభ్యర్ధి Sviatlana Tsikhanouskaya ( లిథువేనియాలో బహిష్కరించబడ్డారు) లుకాషెంకోతో వివాదాస్పద ఎన్నికలలో ఓడిపోయిన తరువాత, అతన్ని అధికారంలో నుండి తొలగించడానికి దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.
  బెలారసియన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ యొక్క రాడా - 1919 BNR 1997 నుండి ఇవోంకా సుర్విల్లా నాయకత్వం వహిస్తుంది. సిఖానౌస్కాయను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా గుర్తించింది. ప్రపంచంలో ప్రవాసంలో ఉన్న పురాతన ప్రభుత్వం ఇది

ఈ ప్రభుత్వాలు రాజకీయ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు, వేర్పాటువాద ఉద్యమాలు ప్రవాసంలో సృష్టించినవి. తాము పాలకులమని చెప్పుకుంటున్న భూభాగాలకు స్వతంత్ర రాజ్యాలుగా వాటికి పాలకులుగా మారాలని కోరుకుంటున్నారు. లేదా గతంలో పదవీచ్యుతులైన ప్రభుత్వాలకు వారసులమని చెప్పుకునేవారు. ప్రస్తుతం చట్టబద్ధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వీటిని సృష్టించారు.

పేరు ప్రవాసమని పేర్కొన్నారు ప్రవాస ప్రకటన ప్రస్తుతం ప్రభుత్వం క్లెయిమ్ చేసిన భూభాగాన్ని నియంత్రిస్తోంది గమనికలు మూలాలు
  ప్రవాసంలో డాన్జిగ్ ప్రభుత్వ ఉచిత నగరం 1939 1947   Republic of Poland బెర్లిన్, జర్మనీలో ఉంది [20] [21] [22]
  బహిష్కరణలో పశ్చిమ పాపువాన్ ప్రభుత్వం 1963 1969   Republic of Indonesia స్వతంత్ర పశ్చిమ పాపువా కోసం ప్రచారాలు; నెదర్లాండ్స్‌లో ఉంది [23] [24]
  బయాఫ్రాన్ ప్రభుత్వం (ప్రవాసంలో) 1970 2007   Federal Republic of Nigeria బియాఫ్రా రిపబ్లిక్‌ను తిరిగి స్థాపించాలని కోరుతూ సార్వభౌమ రాజ్యమైన బియాఫ్రా యొక్క వాస్తవికత కోసం ఉద్యమం యొక్క ఒక భాగం; వాషింగ్టన్, DC లో ఉంది [25]
  క్యాబిండా రిపబ్లిక్ 1975   Republic of Angola పారిస్, ఫ్రాన్స్‌లో ఉంది
  టాటర్ ప్రభుత్వం (ప్రవాసంలో) 1994   Russia [26]
  Chechen Republic of Ichkeria  Chechen Republic of Ichkeria 2000   Russia కొంతమంది సభ్యులు రష్యన్ సాయుధ దళాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులుగా పోరాడుతున్నారు; పశ్చిమ ఐరోపాలో, అమెరికాలో, లండన్‌లో ఉంది.
ఇది కాకసస్ ఎమిరేట్ ద్వారా విజయవంతమైందని వివాదాస్పద వాదన ఉంది.
[27]
  మంచుకో ప్రభుత్వం 1945 2004   People's Republic of China హాంకాంగ్‌లో ఉంది
  కోమా సివాకాన్ కుర్దిస్తాన్ - 1998   Republic of Turkey టర్కీలో కుర్దిష్ సంస్థను సృష్టించడం లక్ష్యం; ప్రవాసంలో ఉన్న కుర్దిష్ పార్లమెంట్ వారసుల సంస్థ [28]
  అంబజోనియా రిపబ్లిక్ - 1999   Republic of Cameroon దక్షిణ కామెరూన్స్ యొక్క మాజీ బ్రిటిష్ విశ్వసనీయ భూభాగం ; 1999 డిసెంబరు 31, న స్వాతంత్ర్యం ప్రకటించింది [29]
  బహిష్కరణలో పశ్చిమ కుర్దిస్తాన్ ప్రభుత్వం - 2004   Syrian Arab Republic సిరియాలో కుర్దిష్ రాజ్యాన్ని సృష్టించడం లక్ష్యం; లండన్‌లో ఉంది [30]
  తమిళ ఈలం యొక్క అంతర్జాతీయ ప్రభుత్వం 2009 2010   Sri Lanka తమిళ ఈలం స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం [31]
  రిపబ్లిక్ కోసం కౌన్సిల్ - 2017   Spain కాటలోనియా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం; బ్రస్సెల్స్‌లో ఉంది
  కాబైల్ తాత్కాలిక ప్రభుత్వం 2010 -   Algeria ఒక స్వతంత్ర రాజ్యం కోసం ఎయిమ్స్ Kabylia [32]

ప్రవాస ప్రభుత్వాలుగా కూడా పనిచేస్తున్న బహిష్కృత ప్రభుత్వాలు

మార్చు
పేరు బహిష్కరణ క్లెయిమ్ చేసిన భూభాగం యొక్క ప్రస్తుత నియంత్రణ ప్రభుత్వం ఇప్పటికీ నియంత్రించే భూభాగం గమనికలు మూలాలు
  రిపబ్లిక్ ఆఫ్ చైనా 1949   People's Republic of China తైవాన్ ప్రస్తుతం తైపీలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం తనను తాను ప్రవాస ప్రభుత్వంగా భావించదు. కానీ తైవాన్ రాజకీయ స్థితిపై చర్చలో పాల్గొన్న కొందరు దీనిని ప్రవాస ప్రభుత్వం గానే పేర్కొన్నారు. [10]రిపబ్లిక్ ఆఫ్ చైనాకు ప్రస్తుతం తైవాన్ ద్వీపంతో పాటు, మరి కొన్ని ఇతర ద్వీపాలపై నియంత్రణ ఉంది. అంతే కాకుండా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భూభాగంతో పాటు, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, ఇండియా, జపాన్, మయన్మార్, పాకిస్తాన్‌, రష్యా, తజికిస్తాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలు కూడా తమ దేశం లోని భాగాలేననే వాదన చేస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో తైవాన్ సార్వభౌమత్వాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చట్టబద్ధంగా అందజేయబడలేదు అనే వాదనపై ఈ "ప్రభుత్వం-ప్రవాస" వాదన ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా రిపబ్లిక్ ఆఫ్ చైనా విదేశీ భూభాగంలో ఉంది. కాబట్టి దీనిని ప్రవాస ప్రభుత్వం గానే పరిగణించాలి. దీనికి విరుద్ధంగా, యుద్ధం ముగిసిన తరువాత, తైవాన్ సార్వభౌమత్వాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చట్టబద్ధంగా తిరిగి ఇచ్చినట్లుగా భావించే వారు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించరు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం, రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) లోని కుమింటాంగ్ లు రెండూ ఈ రెండో అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి.

అయితే, యుద్ధం ముగింపులో తైవాన్ సార్వభౌమత్వాన్ని చట్టబద్ధంగా రిపబ్లిక్ ఆఫ్ చైనాకు తిరిగి ఇవ్వబడిందనీ, రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం-ప్రవాసంగా ఉందనీ, తైవాన్ చైనా భూభాగంలో భాగమనీ అంగీకరించని వారు కూడా ఉన్నారు. తైవాన్‌లో ప్రస్తుత డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఈ అభిప్రాయానికి మొగ్గు చూపుతుంది. తైవానీస్ స్వాతంత్ర్యానికి అది మద్దతు ఇస్తుంది.

  సహ్రావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ 1976   Morocco పశ్చిమ షహారా యొక్క ఆగ్నేయ భాగాలు పోలిసారియో తిరుగుబాటు తర్వాత స్పానిష్ సహారా నుండి స్పానిష్ ఉపసంహరణ తరువాత, 1976 ఫిబ్రవరి 27 న ప్రకటించబడింది. దీన్ని ప్రవాసంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పలేం. ఎందుకంటే అది క్లెయిమ్ చేసిన భూభాగంలో 20-25% నియంత్రణలో ఉంటుంది. అయితే, తరచుగా దీనిని అలాగే సూచిస్తారు, ప్రత్యేకించి అల్జీరియాలోని టిండౌఫ్ శరణార్థి శిబిరాలలో రోజువారీ ప్రభుత్వ వ్యాపారాలు నిర్వహించబడుతున్నాయి, దీని తాత్కాలిక రాజధాని మొదటి బిర్ లెహ్లౌను 2008 లో టిఫరితికి తరలించారు.
  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ( నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ) 2021  ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ( తాలిబాన్ ) పంజ్‌షీర్ లోయ 2021 ఆగస్టు 15 న కాబూల్ పతనం తరువాత, చాలా మంది ఆఫ్ఘన్ పాలక అధికారులు దేశం విడిచి పారిపోయారు. డి జ్యూరీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలోని నార్దర్న్ అలయన్స్ మాజీ సభ్యుల బృందం దేశంలో పాలనను పునరుద్ధరించే ప్రయత్నంలో తాలిబాన్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసింది. [33] [34]

స్వయం పరిపాలన లేని భూభాగాలకు, లేదా ఆక్రమిత భూభాగాలకు చెందిన బహిష్కృత ప్రభుత్వాలు

మార్చు

ప్రవాసంలో ఉన్న ఈ ప్రభుత్వాలు స్వయం పరిపాలన లేని, లేదా ఆక్రమిత భూభాగాల ప్రభుత్వాలు. వారు ఒకప్పుడు నియంత్రించిన భూభాగంపై చట్టబద్ధమైన అధికారాన్ని దావా చేస్తారు. లేదా డీకోలనైజేషన్ అనంతర అధికారం చట్టబద్ధత ఉన్నట్లు దావా చేస్తారు. ఈ దావాకు మూలం బహిష్కరించబడిన సమూహం చట్టబద్ధమైన ప్రభుత్వంగా ఎన్నిక అవడం వలన ఉద్భవించి ఉండవచ్చు.

ఐక్యరాజ్యసమితి ఈ భూభాగాలకు చెందిన ప్రజల స్వీయ-నిర్ణయ హక్కును గుర్తిస్తుంది. ఈ భూభాగలను స్వతంత్ర సార్వభౌమ రాజ్యాలుగా ఏరపరచే అవకాశాలను కూడా పరిశీలిస్తుంది.

1988 లో అల్జీర్స్‌లో ప్రవాసంలో ఉంటూ పాలస్తీనా స్వాతంత్ర్య ప్రకటన చేసినప్పటి నుండి, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రవాస ప్రబుత్వం గానే పనిచేసింది. 1994 లో, PLO, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా లు సంతకం చేసిన ఓస్లో ఒప్పందాల ఫలితంగా PLO, పాలస్తీనా నేషనల్ అథారిటీ తాత్కాలిక ప్రాదేశిక పరిపాలనను స్థాపించింది. 1994 - 2013 మధ్య, PNA ఒక స్వయంప్రతిపత్తిగా పనిచేసింది. అందువలన ప్రభుత్వం వెస్ట్ బ్యాంక్‌లో ఉన్నప్పటికీ దానికి సార్వభౌమాధికారం లేదు. 2013 లో, పాలస్తీనాను ఐరాసలో సభ్యత్వం లేని రాజ్యం హోదాకు పెంఛారు. పైన పేర్కొన్నవన్నీ అస్పష్టమైన పరిస్థితిని సృష్టించాయి. ఇందులో రెండు విభిన్న సంస్థలు ఉన్నాయి: చాలా పరిమితమైన నియంత్రణను కలిగి ఉన్న పాలస్తీనా అథారిటీ ఒకటి కాగా, పాలస్తీనా రాజ్యం రెండవది. ఈ పాలస్తీనా రాజ్యాన్ని ఐక్యరాజ్యసమితితో సహా, అనేక దేశాలు సార్వభౌమదేశంగా స్వతంత్ర దేశంగా గుర్తించాయి. కానీ దీనికి క్షేత్ర స్థాయిలో ఎలాంటి సార్వభౌమత్వాన్ని అమలు చేయలేకపోతోంది. ఈ రెండింటికీ ఒకే వ్యక్తి -2016 ఫిబ్రవరి నాటికి, అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ - నేతృత్వం వహిస్తున్నారు. కానీ న్యాయపరంగా ఈ రెండు భిన్నమైనవి.

అస్పష్ట స్థితి కలిగిన ప్రవాస ప్రభుత్వాలు

మార్చు

ఈ ప్రభుత్వాలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం (ల) తో సంబంధాలు కలిగి ఉన్నాయి, కానీ వారి క్లెయిమ్ స్థితి లేదా పేర్కొన్న లక్ష్యాలు అస్పష్టంగా ఉంటాయి. ఎంతలా అంటే అవి ఇతర వర్గాలకు కూడా సరిపోతూంటాయి.

పేరు బహిష్కరణ క్లెయిమ్ చేసిన భూభాగం యొక్క ప్రస్తుత నియంత్రణ గమనికలు మూలాలు
  సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ 1959   People's Republic of China  People's Republic of China భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సహకారంతో భారతదేశంలోని ధర్మశాలలో దలైలామా స్థాపించారు; టిబెట్ సార్వభౌమత్వ చర్చ, టిబెటన్ స్వాతంత్ర్య ఉద్యమం కూడా చూడండి [35] [36]
  ఉక్రేనియన్ సాల్వేషన్ కమిటీ 2015   Ukraine  Ukraine ఉక్రెయిన్‌లో కొత్త ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో రష్యాలోని మాస్కోలో ఉక్రెయిన్ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్ ఏర్పాటు చేశారు. [37]
  సహ్రావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ 1976   Morocco  Morocco పోలిసారియో తిరుగుబాటు తర్వాత స్పానిష్ సహారా నుండి అప్పటి వరకు ఉన్న స్పానిష్ ఉపసంహరణ తరువాత, ఫిబ్రవరి 27, 1976 న ప్రకటించబడింది. ప్రవాసంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా కాదు, ఎందుకంటే అది క్లెయిమ్ చేసిన భూభాగంలో 20-25% నియంత్రణలో ఉంటుంది. ఏదేమైనా, తరచుగా దీనిని తరచుగా సూచిస్తారు, ప్రత్యేకించి అల్జీరియాలోని టిండౌఫ్ శరణార్థి శిబిరాలలో రోజువారీ ప్రభుత్వ వ్యాపారాలు నిర్వహించబడుతున్నాయి, ఇది ప్రకటించిన తాత్కాలిక రాజధాని (మొదటి బిర్ లెహ్లౌ, కాకుండా తరలించబడింది. 2008 లో టిఫరితికి).
  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ( పంజ్‌షీర్ కూటమి ) 2021  ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ( తాలిబాన్ ) 15 ఆగస్టు 2021 లో కాబూల్ పతనం తరువాత, చాలా మంది ఆఫ్ఘన్ పాలక అధికారులు దేశం విడిచి పారిపోయారు. డి జ్యూరీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలోని ఉత్తర కూటమి మాజీ సభ్యుల బృందం దేశంపై పాలనను పునరుద్ధరించే ప్రయత్నంలో తాలిబాన్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసింది. [33] [34]

రెండవ ప్రపంచ యుద్ధం

మార్చు

రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి సార్వభౌమత్వం కోల్పోయిన అనేక దేశాలు, ప్రవాసంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.

లండన్‌లో ప్రభుత్వాలు

మార్చు

లండన్‌లో పెద్ద సంఖ్యలో యూరోపియన్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి.

పేరు నాయకులు
  బెల్జియం ప్రభుత్వం (ప్రవాసంలో) ప్రధాన మంత్రి: హుబెర్ట్ పియర్‌లాట్
  చెకోస్లోవాక్ ప్రభుత్వం (ప్రవాసంలో)
  స్వేచ్ఛా ఫ్రాన్స్ చార్లెస్ డి గల్లె, హెన్రీ గిరౌడ్, ఫ్రెంచ్ నేషనల్ లిబరేషన్ కమిటీ (1943 నుండి)
  గ్రీకు ప్రభుత్వం (ప్రవాసంలో)
  • కింగ్ జార్జ్ II
  • ప్రధాన మంత్రి: ఎమ్మనౌల్ టౌడెరోస్ (1941–1944), సోఫోక్లిస్ వెనిజెలోస్ (1944), జార్జియోస్ పాపాండ్రియో (1944–1945)
  లక్సెంబర్గ్ ప్రభుత్వం (ప్రవాసంలో)
  డచ్ ప్రభుత్వం-బహిష్కరణ
  • క్వీన్ విల్హెల్మినా
  • ప్రధాన మంత్రి: డిర్క్ జాన్ డి గీర్ (1940), పీటర్ జార్డ్స్ జెర్బ్రాండీ (1940–1945)
  నార్వే ప్రభుత్వం (ప్రవాసంలో)
  పోలిష్ ప్రభుత్వం (ప్రవాసంలో)
  • అధ్యక్షుడు: Władysław Raczkiewicz
  • ప్రధాన మంత్రి: వాడిస్సా సికోర్స్కీ (1939–1943), స్టానిస్‌వా మికోనాజ్‌జిక్ (1943–1944), తోమాజ్ ఆర్సిజెవ్స్కీ (1944–1945)
  యుగోస్లేవ్ ప్రభుత్వం (ప్రవాసంలో)
గుర్తించబడని సమూహాలు

ఈ సమయంలో బ్రిటన్‌లో ప్రవాసంలో ఉన్న ఇతర నాయకులలో అల్బేనియా రాజు జోగ్, ఇథియోపియా చక్రవర్తి హైలే సెలాస్సీ కూఫ్డా ఉన్నారు.

లండన్‌లో ఫ్రీ డేన్స్ అసోసియేషన్ స్థాపించబడినప్పటికీ, ఆక్రమిత డెన్మార్క్ ప్రవాసంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. [38] ప్రభుత్వం డెన్మార్క్‌ లోనే ఉండి, కొంత స్వాతంత్ర్యంతో 1943 ఆగష్టు వరకు పనిచేసింది. అప్పుడూ జర్మనీ ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి, డెన్మార్క్‌ను పూర్తిగా తన ఆక్రమణలో ఉంచుకుంది. ఇదిలా ఉండగా, ఐస్‌ల్యాండ్, గ్రీన్ ల్యాండ్, ఫారో దీవులను మిత్రదేశాలు ఆక్రమించుకున్నాయి. వీటిని డేనిష్ పాలన నుండి విముక్తం చేసారు.

ఆసియాలో ప్రవాస ప్రభుత్వాలు

మార్చు

ఫిలిప్పీన్ కామన్వెల్త్ (1941 డిసెంబర్ 9, న ఆక్రమణకు లోనైంది) ప్రవాసంలో ఒక ప్రభుత్వాన్ని స్థాపించింది. మొదట్లో ఆస్ట్రేలియాలో, ఆ తరువాత అమెరికాలో ఇది ఉంది. అంతకు ముందు, 1897 లో, ఫిలిప్పీన్స్ విప్లవ రిపబ్లిక్ ఆఫ్ బియాక్-నా-బాటో ప్రవాసంలో హాంకాంగ్ జుంటాను ఒక ప్రభుత్వంగా స్థాపించాడు.

రెండవ ప్రపంచ యుద్ధానికి చాలా ముందుగానే ఏర్పడినప్పటికీ , కొరియా రిపబ్లిక్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం యుద్ధం ముగిసే వరకు చైనాలో ప్రవాసంలో కొనసాగింది.

జావా పతనంతో 1942 మార్చి 8 న మిత్రరాజ్యాల దళాల తరపున డచ్ లొంగిపోయినప్పుడు, చాలా మంది డచ్-ఇండిస్ అధికారులు ( డాక్టర్ వాన్ మూక్, డాక్టర్ చార్లెస్ వాన్ డెర్ ప్లాస్‌తో సహా ) 1942 మార్చిలో ఆస్ట్రేలియాకు పారిపోయారు. 1943 డిసెంబర్ 23 న, డచ్ రాయల్ ప్రభుత్వం, డాక్టర్ వాన్ మూక్ పాలకుడిగా, ఆస్ట్రేలియా గడ్డపై అధికారిక ప్రవాస నెదర్లాండ్స్ ఈస్ట్ ఇండీస్ ప్రభుత్వాన్ని ఏర్పాతు చేసినట్లుగా ప్రకతించింది.

అక్షరాజ్యాలకు అనుకూలంగా ఉన్న ప్రవాసం ప్రభుత్వాలు

మార్చు

రెండవ ప్రపంచ యుద్ధపు మలి దశలలో, జర్మనీ సైన్యం మరింత వెనక్కి నెట్టబడింది. వివిధ దేశాల నుండి దాన్ని పారదోలారు. మిగిలిన అక్షరాజ్య భూభాగాల్లో, కొన్ని దేశాలకు చెందిన అక్ష రాజ్య అనుకూల సమూహాలు, అక్షశక్తుల ఆధ్వర్యంలో "ప్రవాస ప్రభుత్వాలను" ఏర్పాటు చేశాయి - తమతమ స్వదేశాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ. ఆతిథ్య దేశంలో తమ జాతీయులతో కూడిన సైనిక విభాగాలను నియమించడం, నిర్వహించడం వీటి ముఖ్య ఉద్దేశ్యం.

Name Exiled or created(*) since Defunct, reestablished,(*) or integrated(°) since State that controlled its claimed territory Notes References
  Kingdom of Bulgaria September 16, 1944* May 10, 1945   Kingdom of Bulgaria (Fatherland Front) 1944 బల్గేరియన్ తిరుగుబాటుతో బల్గేరియాలో సామ్యవాదులు అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పడింది, ఈ ప్రభుత్వం అలెగ్జాండర్ సాంకోవ్ నాయకత్వంలో వియన్నాలో ఏర్పడింది. ఇది నాజీ జర్మనీ కి చెందిన SS యొక్క 1 వ బల్గేరియన్ రెజిమెంట్‌ను స్థాపించింది.
  Sigmaringen Governmental Commission September 7, 1944* April 23, 1945°   Provisional Government of the French Republic వీచీలోని సహకార ఫ్రెంచ్ క్యాబినెట్ లోని సభ్యులను జర్మనీ, తమ దేశం లోని సిగ్మారింజెన్ ఎన్‌క్లేవ్‌కు తరలించింది. అక్కడ వారు 1945 ఏప్రిల్ వరకు ప్రవాస ప్రభుత్వంగా పనిచేసారు. వారికి సిగ్మారింజెన్ నగరంపై ప్రభుత్వాధికారాన్ని ఇచ్చారు. మూడు అక్ష రాజ్యాలకు - జర్మనీ, ఇటలీ, జపాన్ - ఆ నగరంలో తమతమ అధికారిక ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో పాల్గొనడానికి పెటెయిన్ నిరాకరించడంతో, ఈ ప్రభుత్వానికి ఫెర్నాండ్ డి బ్రినన్ నాయకత్వం వహించాడు.
  Hungarian Government of National Unity 28/29 March 1945 May 7, 1945   Czechoslovak Republic

  Kingdom of Hungary   Kingdom of Romania  Kingdom of Yugoslavia

హంగేరిలో సోవియట్ ఆక్రమణ నేపథ్యంలో స్లాసీ ప్రభుత్వం పారిపోయింది. ఇది మొదట వియన్నా లోను, ఆ తరువాత మ్యూనిచ్ లోను స్థిరపడింది. మిత్రరాజ్యాల అంతిమ విజయం తరువాతి నెలల్లో దాని నాయకులు చాలా మందిని అరెస్టు చేశారు.
  Hellenic State September 1944 April 1945   Kingdom of Greece గ్రీస్ విముక్తి తరువాత, మాజీ సహకార మంత్రులు 1944 సెప్టెంబరులో వియన్నాలో కొత్త సహకార ప్రభుత్వాన్ని స్థాపించారు. దీనికి మాజీ సహకార మంత్రి ఎక్టోర్ సిరోనికోస్ నేతృత్వం వహించాడు. 1945 ఏప్రిల్‌లో, సిరోనికోస్ తన మంత్రులతో సహా వియన్నా దాడి సమయంలో పట్టుబడ్డాడు.
  Legionary Romania August, 1944 May 8, 1945   Kingdom of Romania 1941 లో లెజియోనైయర్స్ తిరుగుబాటు తరువాత హోరియా సిమాను, ఇతర ఐరన్ గార్డ్ సభ్యులను జర్మనీ ఖైదు చేసింది. 1944 లో, కింగ్ మైఖేల్ తిరుగుబాటుతో రొమేనియాలో మిత్రరాజ్యాల అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనికి ప్రతిస్పందనగా జర్మనీ, సిమాను విడుదల చేసి వియన్నాలో తమకు అనుకూల ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. ఇది 12.000 మందితో SS లో రొమేనియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది. ఈ సైన్యం యుద్ధం ముగిసే వరకు జర్మనీ తరపున పోరాడింది.
  Montenegrin State Council Summer of 1944 May 8, 1945   Kingdom of Yugoslavia మాంటెనెగ్రో నుండి జర్మన్లు వైదొలిగిన తరువాత, ఫాసిస్ట్ నాయకుడు సెకుల డ్రెల్జీవిక్ స్వతంత్ర రాజ్యమైన క్రొయేషియా (NDH) రాజధాని జాగ్రెబ్‌లో ఒక ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు ఛేసాడు. డ్రోల్జెవిక్ మాంటెనెగ్రిన్ నేషనల్ ఆర్మీని సృష్టించాడు. అతను, క్రొయేషియన్ ఫాసిస్ట్ నాయకుడు అంటె పావెలిచ్ కలిసి ఏర్పాటు చేసిన సైనిక దళం అది. అయితే, NDH పతనం తరువాత అతని ప్రభుత్వం రద్దైంది.
  Slovak Republic April 4, 1945 May 8, 1945   Czechoslovak Republic రెడ్ ఆర్మీ బ్రాటిస్లావాను స్వాధీనం చేసుకుని స్లోవేకియాను ఆక్రమించినప్పుడు, జోసెఫ్ టిసో నేతృత్వం లోని స్లోవాక్ రిపబ్లిక్ ప్రభుత్వం, 1945 ఏప్రిల్ 4 న ఆస్ట్రియన్ పట్టణం క్రెమ్స్‌మన్‌స్టర్‌లో ప్రవాసానికి వెళ్ళింది. ప్రవాస ప్రభుత్వం 1945 మే 8 న క్రెమ్స్‌మన్‌స్టర్‌లో అమెరికన్ జనరల్ వాల్టన్ వాకర్‌కు లొంగిపోయింది. 1945 వేసవిలో, స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ సభ్యులను చెకోస్లోవాక్ అధికారులకు అప్పగించారు.
  తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వం October 21, 1943* August 18, 1945  British Raj బ్రిటిషు వలస ప్రభుత్వంతో పోరాడటానికి, దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికీ ప్రవాసంలో ఏర్పడిన భారతదేశపు మొదటి స్వతంత్ర ప్రభుత్వం ఇది. ఇది మొదట రంగూన్‌లో ఆ తరువాత పోర్ట్ బ్లెయిర్‌లో స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ ప్రభుత్వానికి నేత. ప్రవాసంలో ఉన్న ఈ తాత్కాలిక భారత ప్రభుత్వానికి దేశాధినేత కూడా. మొదట దీన్ని సింగపూర్‌లో స్థాపించారు, కాని ఆ తరువాత తూర్పు భారతదేశంలోను, అండమాన్ నికోబార్ దీవులలోనూ జపనీయుల నియంత్రణలో ఉన్న భూభాగంపై వీరికి నియంత్రణ నిచ్చారు. ఈ భారత ప్రభుత్వం తన కరెన్సీ నోట్లను కూడా విడుదల చేసింది. బ్రిటిషు వ్యతిరేక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పరచుకోవడం ప్రారంభించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ INA అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక సైన్యం. రెండవ ప్రపంచ యుద్ధంలో అక్ష రాజ్యాల ఓటమి తరువాత ఈ ప్రభుత్వం 1945 లో పతనమైంది. INA భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉంది. ఇది భారతదేశంలో బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత నావికాదళ తిరుగుబాటును లేవదీసింది.
  Second Philippine Republic June 11, 1945 August 17, 1945   Philippine Commonwealth మిత్రరాజ్యాల దళాలు జపనీస్ ఆక్రమణదారుల నుండి ఫిలిప్పీన్స్‌ను విముక్తి చేసి, ద్వీపసమూహంలో ఫిలిప్పీన్స్ కామన్వెల్త్‌ను మళ్ళీ స్థాపించడంతో, అమెరికాలో కొన్ని సంవత్సరాల ప్రవాసం తర్వాత రెండవ ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ 1945 జూన్ 11 నుండి నారా / టోక్యోలో ప్రవాస ప్రభుత్వంగా మారింది. తరువాత ఈ ప్రభుత్వం 1945 ఆగస్టు 17 న రద్దైంది.
  Croatian Government in exile April 10, 1951 ?   Yugoslavia స్వతంత్ర రాష్ట్రమైన క్రొయేషియా ప్రభుత్వంలోని చాలా మంది మాజీ సభ్యులు అర్జెంటీనాకు పారిపోయారు. అక్కడ వారు ఒక ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పరచారు [39]

మూలాలు

మార్చు

 

  1. "Princeton University WordNet". Wordnetweb.princeton.edu. Retrieved 2012-09-20.
  2. Tir, J. (February 22, 2005). "Keeping the Peace After Secessions: Territorial Conflicts Between Rump and Secessionist States". Paper presented at the annual meeting of the International Studies Association, Hilton Hawaiian Village, Honolulu, Hawaii. Retrieved May 22, 2009.
  3. De Schaepdrijver, Sophie (2014). "Violence and Legitimacy: Occupied Belgium, 1914–1918". The Low Countries: Arts and Society in Flanders and the Netherlands. 22. OCLC 948603897.
  4. "Official website of the Belarusian National Republic". Radabnr.org. Retrieved 2021-05-28.
  5. Wilson, Andrew (2011). Belarus: The Last European Dictatorship. Yale University Press. p. 96. ISBN 9780300134353. Retrieved 8 May 2013.
  6. Profile, bbc.co.uk; accessed 6 April 2015.
  7. Profile, abcnews.go.com; accessed 31 March 2021.
  8. "Opponents of Myanmar coup form unity government, aim for 'federal democracy'". Reuters. 2021-04-16. Retrieved 2021-04-18.
  9. "Who's Who in Myanmar's National Unity Government". The Irrawaddy (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-16. Retrieved 2021-04-18.
  10. 10.0 10.1 Lori Reese (August 28–30, 1999). "China's Christian Warrior". Time. Vol. 154, no. 7/8. Archived from the original on May 11, 2010. After four years of civil war, Chiang and the nationalists were forced to flee to the island of Taiwan. There they established a government-in-exile and dreamed of retaking the mainland."Chiang Kai-shek (1887-1975)". BBC. Archived from the original on January 18, 2015. Retrieved March 4, 2015. There Chiang established a government in exile which he led for the next 25 years."TIMELINE: Milestones in China-Taiwan relations since 1949". Reuters. Archived from the original on 2015-09-24. Retrieved March 4, 2015. 1949: Chiang Kai-shek's Nationalists lose civil war to Mao Zedong's Communist forces, sets up government-in-exile on Taiwan."Establishment of the People's Republic Of China (Oct 1, 1949)". Public Broadcasting Service. Archived from the original on December 28, 2014. Retrieved March 10, 2015. ......after the inauguration of the People's Republic of China (PRC) in Beijing on October 1, 1949, Chiang and the Nationalists installed the rival Republic of China (ROC) as a government in exile on Taiwan."Tsai blasted for R.O.C. legitimacy remark". China Post. 27 May 2010. Archived from the original on 30 మే 2010. Retrieved 12 June 2010."Treaty confirmed sovereignty: Ma". Taipei Times. 29 April 2009. Retrieved 14 June 2010.Kerry Dumbaugh (23 February 2006). "Taiwan's Political Status: Historical Background and Ongoing Implications". Congressional Research Service. Retrieved 20 December 2009. While on October 1, 1949, in Beijing a victorious Mao proclaimed the creation of the People's Republic of China (PRC), Chiang Kai-shek re-established a temporary capital for his government in Taipei, Taiwan, declaring the ROC still to be the legitimate Chinese government-in-exile and vowing that he would "retake the mainland" and drive out communist forces.John J. Tkacik, Jr. (19 June 2008). "Taiwan's "Unsettled" International Status: Preserving U.S. Options in the Pacific". Heritage Foundation. Archived from the original on 27 జూలై 2009. Retrieved 20 December 2009. Chiang Kai-shek wanted to fight it out on an all-or-nothing basis. There are also reports that Chiang's advisors convinced him that if the ROC mission stayed to represent Taiwan, Chiang would be under pressure to demonstrate in some constitutional way that his Chinese government-in-exile represented the people of Taiwan rather than the vast population of China. Doing so would require Chiang to dismantle his existing regime (which was elected in 1947 on the Chinese mainland and continued to rule in Taiwan under emergency martial law provisions without benefit of elections), adopt an entirely new constitution, and install an entirely new government."ROC Government in Exile Is Illogical (English transl.)". Original source www.nownews.com/2010/06/01/142-2609610.htm 流亡政府」邏輯不通" by NOWnews Network. June 1, 2010. Archived from the original on 14 జూన్ 2011. Retrieved 7 October 2010.TIME magazine, Far Eastern Economic Review, Stanford University, US State Dept., Public Broadcasting Service, BBC, US Congressional Research Service, UK Parliament, UK Foreign Office, Los Angeles Times, New York Times, and numerous law journals have all referred to the Republic of China on Taiwan as a government in exile. However, the ROC has diplomatic relations with [[International recognition of మూస:Numrec/Republic of China మూస:Numrec/Republic of China|సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. UN member states]] and the Holy See. The PRC claims that the ROC government no longer exists. Republic of China government in exile, retrieved 2010-02-27 Jonathan I. Charney; J. R. V. Prescott (July 2000), Resolving Cross-Strait Relations Between China and Taiwan, American Journal of International Law, archived from the original on 2004-06-22, retrieved 2011-02-28
  11. Official website Archived 2016-03-03 at the Wayback Machine. Presidential representative of Ukraine in Crimea.
  12. Azerbaijan begins controversial renovation of Armenian church, Joshua Kucera, May 7, 2021, Eurasianet
  13. "Nagorno-Karabakh" separate administrative-territorial unit no longer exists - Azerbaijani MP, 30 April 2021, Azernews
  14. "South Korea's Governors-in-Theory for North Korea". The Wall Street Journal. March 18, 2014. Retrieved 29 April 2014.
  15. "East Turkistan Government-in-Exile". East Turkistan Government-in-Exile. Retrieved 15 December 2019.
  16. "National Council of Resistance of Iran". ncr-iran.org. Archived from the original on 2010-06-20. Retrieved 2012-09-20.
  17. "Timeline: Equatorial Guinea". BBC News. 14 April 2010. Retrieved 4 May 2010.
  18. An, Bộ Công. "Thông báo về tổ chức khủng bố "Việt Tân"". demo.bocongan.gov.vn. Retrieved 2019-03-27.[permanent dead link]
  19. "Mission statement". syriancouncil.org. 2011-11-25. Retrieved 2012-09-20.
  20. "Official website of the Government in exile of the Free City of Danzig". danzigfreestate.org. Retrieved 2013-05-08.
  21. Capps, Patrick; Evans, Malcolm David (2003). Asserting Jurisdiction: International and European Legal Approaches', edited by Patrick Capps, Malcolm Evans and Stratos Konstadinidis, which mentions Danzig on page 25 and has a footnote directly referencing the Danzig Government in exile website in a footnote also on page 25. ISBN 9781841133058. Retrieved 2013-05-08.
  22. "Sydney Morning Herald, November 15th, 1947". Retrieved 2013-05-08.
  23. Saha, Santosh C. (2006). Perspectives on Contemporary Ethnic Conflict. Lexington Books. p. 63. ISBN 9780739110850. Retrieved 20 May 2011.
  24. Minahan, James (2002). Encyclopedia of the Stateless Nations: S-Z. Westport, Connecticut: Greenwood Publishing Group. p. 2055. ISBN 978-0-313-32384-3. Retrieved 20 May 2011.
  25. "Biafraland". Biafraland. Retrieved 2012-09-20.
  26. Paul Goble (5 November 2019). "Tatar government in exile calls on Tatars not to serve in Russian army". Kyiv Post. Retrieved 11 February 2020.
  27. Huseyn Aliyev (24 February 2011). "Peace-Building From The Bottom: A Case Study Of The North Caucasus". Eurasia Review. Retrieved 10 May 2011.
  28. "Archived copy". Archived from the original on 2016-07-01. Retrieved 2016-02-08.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  29. "Southerncameroonsig.org". Southerncameroonsig.org. 2012-08-20. Archived from the original on 2021-02-12. Retrieved 2012-09-20.
  30. "KNC.org.uk" (PDF). Archived from the original (PDF) on July 16, 2011.
  31. "The Transnational Government of Tamil Eelam". Tgte-us.org. Archived from the original on September 21, 2012. Retrieved 2012-09-20.
  32. Tilmatine, Mohand. "La construction d'un mouvement national identitaire kabyle: du local au transnational".[permanent dead link]
  33. 33.0 33.1 [1], newsweek.com; accessed 17 August 2021.
  34. 34.0 34.1 [2], digitaljournal.com; accessed 18 August 2021
  35. "Tibet.net". Archived from the original on 2011-12-10.
  36. "Religions - Buddhism: Dalai Lama". BBC. Retrieved 2012-09-20.
  37. "Ex-PM Azarov, in Moscow, Proclaims "Salvation Committee" For Ukraine". Radio Free Europe. 2015-08-03.
  38. The Who's who of the Allied Governments and Allied Trade & Industry. Allied Publications. 1944. p. 173.

    Arthur Durham Divine (1944). Navies in Exile. E.P. Dutton. p. 214.

    Knud J. V. Jespersen (1 January 2002). No Small Achievement: Special Operations Executive and the Danish Resistance, 1940–1945. University Press of Southern Denmark. p. 48. ISBN 978-87-7838-691-5.
  39. Adriano, Pino; Cingolani, Giorgo (2018). Nationalism and Terror: Ante Pavelić and Ustasha Terrorism from Fascism to the Cold War. Central European University Press. p. 390. ISBN 978-9633862063.