సింధు తులాని

సినీ నటి


సింధు తులాని ఒక తెలుగు సినీ నటి. తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఫెయిర్ అండ్ లవ్లీ క్రీము ప్రకటనలో నటించింది.

సింధు తులాని
జననం (1983-07-19) 1983 జూలై 19 (వయసు 40)[1]
వృత్తినటి

వ్యక్తిగత జీవితం సవరించు

సింధు తులాని జూలై 19, 1983 న ముంబైలో జన్మించింది.[1]

కెరీర్ సవరించు

సింధు 2003 లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. గుణ్ణం గంగరాజు ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తీసినా మంచి విజయం సాధించింది. దీని తరువాత ఆమెకు వేరే సినిమాలలో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన అతనొక్కడే సినిమాతో సింధుకు ఇంకా మంచి పేరు వచ్చింది. దీని తరువాత తమిళ నటుడు శింబుతో చేసిన ద్విభాషా చిత్రం మన్మథతో మరో విజయం సాధించింది. తెలంగాణా సాంప్రదాయమైన బతుకమ్మను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాలో ఆమె ప్రధాన పాత్రను పోషించింది.

మొదట్లో కథానాయికగా నటించిన తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోకు వదిన గా, ఆది (నటుడు) హీరోగా వచ్చిన ప్రేమ కావాలి సినిమాలో నటనకు ఆస్కారమున్న సహాయ పాత్రలు పోషిస్తోంది.[2]

నటించిన సినిమాలు సవరించు

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "ఫిల్మీబీట్ లో సింధు తులాని బయోగ్రఫీ, ప్రొఫైలు". filmibeat.com. Retrieved 24 September 2016.
  2. "character artist so what?". gotelugu.com. Retrieved 24 September 2016.
  3. 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 12 March 2020.

బయటి లింకులు సవరించు