బుచ్చిబాబు (1980 సినిమా)
బుచ్చిబాబు 1980 మార్చి 21న విడుదలైన తెలుగు సినిమా. అన్నపూర్ణ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానరుపై వెలువడిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు.అక్కినేని, జయప్రద, జంటగా నటించిన ఈ చిత్రానికి, నిర్మాతలు, వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని. సంగీతం కె. చక్రవర్తి అందించారు.
బుచ్చిబాబు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద |
సంగీతం | చక్రవర్తి |
గీతరచన | దాసరి నారాయణరావు |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ ఆర్ట్ కంబైన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు
- జయప్రద
- దాసరి నారాయణరావు
- మోహన్‌బాబు
- ప్రభాకర రెడ్డి
- గుమ్మడి
- సూర్యకాంతం
- అత్తిలి లక్ష్మి
- నిర్మలమ్మ
- పుష్పలత
- రమాప్రభ
- గీత
- అత్తిలి లక్ష్మి
- డబ్బింగ్ జానకి
- చలం
- రావి కొండలరావు
- మాస్టర్ టామ్
- మాస్టర్ రాము
- చలపతిరావు
- సుత్తి వీరభద్రరావు
- రాజా
- వంగా అప్పారావు
- కృష్ణప్రియ
- హంస
- రాఘవయ్య
- మాలి
- తిలక్
- తులసి
- హరీష్
- మురళీమోహన్
- రాజబాబు
- కె.వి.చలం
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- సంగీతం: కె.చక్రవర్తి
- కూర్పు: బాలు
- ఛాయాగ్రహణం: సెల్వరాజ్
- పాటలు: దాసరి నారాయణరావు, పాలగుమ్మి పద్మరాజు (పద్యాలు)
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, పుష్పలత, రమణ
చిత్రకథ
మార్చుబుచ్చిబాబు విదేశాల నుండి తిరిగివచ్చేటప్పటికి ఆడపిల్లల తండ్రులు క్యూలో నిల్చుంటారు. తనకు చిన్ననాడే బుచ్చి అనే అమ్మాయితో పెండ్లి అయ్యిందని, మరో పెళ్లి తాను చేసుకోబోనని బుచ్చిబాబు తల్లిదండ్రులతో చెబుతాడు. బుచ్చి తల్లి అచ్చమ్మ బుచ్చిబాబుకు మేనమామ భార్య. ఆవిడ కోడలి హోదాలో ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానపరిచి వెడలగొడుతుంది. అత్తమామలను హీనంగా చూస్తుంది. భర్తను తన చెప్పుచేతల్లో వుంచుకుంటుంది. అచ్చమ్మ పెద్ద కూతురు భర్తను విడిచిపెట్టి కన్నారింట్లో వుంటుంది. రెండవ కూతురు భర్తను కోల్పోయి పుట్టింట్లోనే ఉంటుంది. మూడో అమ్మాయి బుచ్చి మాటకు ఆ ఇంట్లో ఎదురుండదు. అచ్చమ్మ కొడుకు రామారావు గీత అనే అమ్మాయిని గుళ్ళో పెళ్ళి చేసుకుంటాడు. అచ్చమ్మ తన సంసారాన్ని సర్కస్ కంపెనీలా తయారు చేస్తుంది. బుచ్చిబాబు ఇదంతా తెలుసుకుని అచ్చమ్మకు బుద్ధి చెప్పి, బుచ్చిని ఎలాగయినా తనదానిగా చేసుకోవడానికి శపథం చేసి "రింగ్ మాస్టర్"లా ఆ సర్కస్ కంపెనీలో అడుగు పెడతాడు[1].
పాటలు
మార్చుపాటల రచయిత: దాసరి నారాయణరావు.
- ఎర్రకోక కట్టినావే పిట్ట ఆపై ఎత్తు మడాలెక్కినావే పిట్ట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కంగారవుతోంది బెజారవుతోంది ఏమిటో ఇది ఏమిటో - ఎస్.పి.శైలజ, ఎం.రమేష్
- గుండా బత్తుల బుచ్చమ్మా ఎండాకాలపు మంటమ్మా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- చందమామ పైటేసింది అందగాడ్ని మూసేసింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- పంచదార వలన పలు రోగములు వచ్చి (పద్యం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: పాలగుమ్మి పద్మరాజు
- పసుపుపచ్చ తాడు పసుపుకోమ్ముకు తోడు - ఎస్.పి.శైలజ,కుమారి పుష్పలత & రమణి
- బాబు బుచ్చి బాబు బాబు బుచ్చి బాబు - ఎస్.పి.శైలజ, రమణ బృందం
- వలపు జ్వరమునకు దవడ పగులట (పద్యం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: పాలగుమ్మి పద్మరాజు
- వాల్మీకి ఇంటిలో లవకుశులు పుట్టారు అమ్మోరి కొంపలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి నువ్వు వ్రాసావ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- సేవకులకు హోటల్ సర్వర్లకును టిప్పు(పద్యం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: పాలగుమ్మి పద్మరాజు
మూలాలు
మార్చు- ↑ వెంకట్రావ్ (28 March 1980). "చిత్ర సమీక్ష: బుచ్చిబాబు". ఆంధ్రపత్రిక దినపత్రిక. 66 (352): 4. Retrieved 23 May 2017.[permanent dead link]