మంచి రోజులు వస్తాయి
(మంచిరోజులు వస్తాయి నుండి దారిమార్పు చెందింది)
మంచిరోజులు వస్తాయి కౌలస్య ప్రొడక్షన్స్ పతాకంపై జి.విశ్వనాథం దర్శకత్వంలో ఎస్.భావనారాయణ, పి.సి.బాలకృష్ణరాజు నిర్మించిన 1963 నాటి సాంఘిక చిత్రం. జగ్గయ్య, జమున, కాంతారావు, రాజనాల తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రానికి కథ, మాటలు ప్రముఖ రచయిత, కవి ఆరుద్ర సమకూర్చగా, సంగీతం దర్శకత్వం ఎస్.పి.కోదండపాణి వహించారు. ఈ సినిమా 1963, ఆగష్టు 9వ తేదీన విడుదలయ్యింది.[1]
మంచి రోజులు వస్తాయి (1963 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.విశ్వనాథం |
---|---|
నిర్మాణం | ఎస్. భావనారాయణ, పి.సి. బాలకృష్ణరాజు |
రచన | ఆరుద్ర |
తారాగణం | జగ్గయ్య, జమున, కాంతారావు, రాజనాల, రాజశ్రీ, శ్రీరంజని |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నిర్మాణ సంస్థ | కౌసల్య ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జగ్గయ్య - రఘు
- జమున - జానకి
- కాంతారావు - కృష్ణమూర్తి
- రాజనాల - కైలాసం
- శ్రీరంజని (జూనియర్) - అన్నపూర్ణ
- రాజశ్రీ - రాధ
- రమణారెడ్డి
- రఘునంద్
- ఎ.వి.సుబ్బారావు (జూనియర్)
- సురభి బాలసరస్వతి
- గీతాంజలి
- ఉదయలక్ష్మి
- లక్ష్మీకాంతమ్మ
- జయలలిత
- లక్ష్మీరాజ్యం (జూనియర్)
- సీతారాం
- మోదుకూరి సత్యం
- భూపతి నందారాం
- కొండా శేషగిరిరావు
- పాపయ్య
- మాస్టర్ బాబు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: జి.విశ్వనాథ్
- కథ: ఎస్.భావనారాయణ
- మాటలు, పాటలు: ఆరుద్ర
- సంగీతం: ఎస్.పి.కోదండపాణి
- ఛాయాగ్రహణం: హెచ్.ఎస్.వేణు
- కూర్పు: కె.ఎస్.ఆర్.దాస్
- నృత్యాలు: ఎ.కె.చోప్రా, మాధవన్
- నిర్మాతలు: ఎస్.భావనారాయణ, పి.సి.బాలకృష్ణరాజు
పాటలు
మార్చుక్ర.సం. | పాట/పద్యం | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | మంచిరోజులొస్తాయి మంచివారికి మంచితనమే జయిస్తుంది చిట్టచివరికి | ఆరుద్ర | పి.బి.శ్రీనివాస్ |
2 | కలయో వైష్ణవమాయయో యనుచు కంగారేలనో మామ (పద్యం) | ఆరుద్ర | మాధవపెద్ది |
3 | తాతలనాటి క్షేత్రంబులు తావక హస్తగతంబు చేయ (పద్యం) | ఆరుద్ర | మాధవపెద్ది |
4 | శృంగారవీధిలో రంగేళి మేడ అందులో కలుసుకుందాము ఓ అందగాడ | ఆరుద్ర | కె.జమునారాణి |
5 | దళమౌ పయ్యెదలో వెలుంగుటకు నుద్వాహంబు సద్వేళ (పద్యం) | ఆరుద్ర | మాధవపెద్ది |
6 | చెల్లియో చెల్లకో మునుపు చేసిన మోసము సైచినాడు (పద్యం) | ఆరుద్ర | మాధవపెద్ది |
7 | తెల్లనివన్నీ పాలనుకోకోయి నల్లనివన్నీ నీళ్ళనుకోకోయి | ఆరుద్ర | ఘంటసాల |
8 | గరిగమప నా నయనాలు నవ్వేను కమ్మని కెమ్మోవి కవ్వించి ఊదితే గలగల ముత్యాలు రాలేను | ఆరుద్ర | పి.సుశీల |
9 | తాలేలో తక తాలేలో వచ్చే శ్రావణమాసంలో ముచ్చట తీరును పందిట్లో | ఆరుద్ర | ఎల్.ఆర్.ఈశ్వరి |
10 | విరిసీవిరియని కుసుమాలు వెలిగెను వెన్నెల దీపాలు తెలిసీతెలియని మురిపాలు ఇదె కలిసెను ఇరువురి హృదయాలు | ఆరుద్ర్ర | పి.బి.శ్రీనివాస్, పి.సుశీల |
11 | సంపెంగి రెమ్మలాంటి సొగసు సొంపార విరిసె దోరవయసు పంచదారచిలుక ఇది కన్నె గోరువంక | ఆరుద్ర | ఎస్.జానకి |
12 | ఓ వయ్యారిభామా ఒకమాట ఓ వయ్యారిభామా ఒకమాట మళ్ళీ దరిశన మెపుడంట? | ఆరుద్ర | పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి |
మూలాలు
మార్చు- ↑ web master. "Manchi Rojulu Vastayi (G. Vishwanath) 1963". indiancine.ma. Retrieved 30 January 2023.
- ↑ ఆరుద్ర (9 August 1963). Manchi Rojulu Vastayi (1963)-Song_Booklet. p. 12. Retrieved 30 January 2023.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)