మంచుపల్లకీ (సినిమా)
మంచుపల్లకీ 1982 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో సుహాసిని, చిరంజీవి, నారాయణరావు, రాజేంద్రప్రసాద్, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎం. ఆర్. ప్రసాదరావు గోదావరి చిత్ర పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రం తమిళ చిత్రం పాలైవన సోలై కి పునర్నిర్మాణం. రాజశేఖర్ మూలకథ అందించాడు. యండమూరి వీరేంద్రనాథ్ సంభాషణలు అందించగా దర్శకుడు వంశీ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. చిరంజీవితో యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా పనిచేసిన మొట్టమొదటి సినిమా ఇది. రాజన్ - నాగేంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించాడు. వంశీకి దర్శకునిగా, హరి అనుమోలుకు ఛాయాగ్రాహకునిగా మొదటి సినిమా. ఈ సినిమా తరువాత చిరంజీవి-సుహాసిని కాంబినేషన్లో అనేక చిత్రాలు వచ్చాయి. (మగమహారాజు, ఛాలెంజ్, కిరాతకుడు, రాక్షసుడు, ఆరాధన, మంచి దొంగ, మరణ మృదంగం).
మంచు పల్లకీ | |
---|---|
దర్శకత్వం | వంశీ |
రచన | యండమూరి వీరేంద్రనాధ్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | వంశీ |
కథ | రాజశేఖర్ |
నిర్మాత | ఎం. ఆర్. ప్రసాదరావు |
తారాగణం | సుహాసిని చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ నారాయణరావు సాయిచంద్ |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | అనిల్ దత్తాత్రేయ |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థలు | గోదావరి చిత్ర, అనీల్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | నవంబరు 19, 1982 |
సినిమా నిడివి | 132 ని. |
భాష | తెలుగు |
కథ
మార్చుసినిమా కథ ఐదుగురు మిత్రుల (చిరంజీవి, నారాయణ రావు, రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్, గిరీష్)చుట్టూ తిరుగుంది. ఈ ఐదుగురూ నిరుద్యోగులు. వీరు ఉంటున్న వీధిలోకి కొత్తగా వస్తుంది గీత. ఆమె మంచితనాన్ని చూసి శేఖర్ ఆమెను ఆరాధించడం మొదలు పెడతాడు. సుహాసిని ఈ ఐదుగురు మిత్రులను విజయం సాధించేలా ప్రోత్సహిస్తుంది. సుహాసినిని వివాహం చేసుకోవాలనుకొన్న శేఖర్ ఆమెకు క్యాన్సర్ అనీ, ఎంతోకాలం బతకదనీ తెలుసుకొంటాడు. ఒక వైపు వరకట్నం సమస్యతో నారాయణ రావు చెల్లెలు పెళ్ళి చెడిపోతుంది. చివరకు గీత కోరిక మేరకు శేఖర్ మిత్రుడు వాసు చెల్లెల్ని వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
మార్చు- గీతగా సుహాసిని
- శేఖర్ గా చిరంజీవి
- హరిగా రాజేంద్ర ప్రసాద్
- వాసుగా నారాయణరావు
- కుమార్ గా సాయిచంద్
- గాంధీగా గిరీష్
- సాక్షి రంగారావు గీత ఫాదర్
- పి.ఎల్. నారాయణ (వాసు సహోద్యోగి)
- శ్యామలమ్మగా అన్నపూర్ణ
- భీమేశ్వరరావు (డాక్టర్)
- దేవదాస్ కనకాల (వాసు సహోద్యోగి)
- మల్లికార్జునరావు (ఫిల్మ్ డైరెక్టర్)
- మాష్టర్ ఆలీ (వాసు తమ్ముడు)
పాటలు
మార్చుఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర స్వరాలు అందించారు. వేటూరి, శ్రీశ్రీ, గోపి పాటలు రాశారు. బాలు, జానకి పాటలు పాడారు.
- మనిషే మణిదీపం, మనసే నవనీతం - బాలు - వేటూరి
- విష్యూ హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్
- మేఘమా దేహమా ఉరమకే ఈ క్షణం - జానకి - వేటూరి
- పగలు రేయిలో జారకముందే, వెలుగు చీకటిగా మారకముందే కలుసుకుంటాం[1] - బాలు - శ్రీశ్రీ
- నే కోసమే మేమందరం - బాలు, జానకి - గోపి
ఇవి కూడా చూడండి
మార్చువనరులు, మూలాలు
మార్చు- ↑ సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
- తెలుగు సినిమా.కమ్ లో వ్యాసం - రచన: శ్రీ, నచకి, విజయభాస్కర్