జి.వి. నారాయణరావు

నటుడు, నిర్మాత

జి.నారాయణరావు తెలుగు సినిమా నటుడు. అంతులేని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. సుమారు 100 సినిమాలలో నటించాడు.[1] ప్రస్తుతం టి.వి.సీరియళ్లలో నటిస్తున్నాడు.

నారాయణరావు
జన్మ నామంజి.వి.నారాయణరావు
జననం
క్రియాశీలక సంవత్సరాలు 1976 - ప్రస్తుతం వరకు
ప్రముఖ పాత్రలు ముత్యాల పల్లకి,
చిలకమ్మ చెప్పింది,
అంతులేని కథ

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు కృష్ణా జిల్లా, కురుమద్దాలి గ్రామంలో జన్మించాడు[2]. ఇతని తండ్రి జి.డి.ప్రసాదరావు సినిమా పంపిణీ రంగంలో కొంతకాలం, సారథీ స్టుడియోకు మేనేజింగ్ డైరెక్టర్‌గా కొంతకాలం ఉన్నాడు. ఇతని బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లు, హైదరాబాదులలో నడిచింది. ఇతడు గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్.కృష్ణ వద్ద నటన నేర్చుకున్నాడు. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాలలో నటించాడు. ప్రముఖ సినిమా నటులు కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, విద్యాసాగర్, దేవదాస్ కనకాల మొదలైనవారు ఇతని రంగస్థల మిత్రులు. 1973లో మద్రాసు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లో ఇతడు శిక్షణ పొందాడు. ఇతడు సినిమాలలో నటించడమే కాక కొన్ని చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం టి.వి.సీరియల్స్ నిర్మాతగా, నటునిగా రాణిస్తున్నాడు.

సినిమాల జాబితా

మార్చు

నటుడిగా

మార్చు

నిర్మాతగా

మార్చు

టెలివిజన్

మార్చు

మూలాలు

మార్చు
  1. MAASTARS. "NARAYANA RAO". MAASTARS. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్. Retrieved 15 October 2016.
  2. వినాయక, రావు (25 July 2010). "ఇప్పుడేం చేస్తున్నారు?". నవ్య వారపత్రిక.