మధ్య రైల్వే

(మధ్య రైల్వే జోన్ నుండి దారిమార్పు చెందింది)

సెంట్రల్ రైల్వే భారతీయ రైల్వేలు లోని 17 మండలాల్లో అతిపెద్ద వాటిల్లో ఒకటి . దీని ప్రధాన కార్యాలయం ముంబై వద్ద ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలోని విక్టోరియా టెర్మినస్) ఉంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము (లైన్) గా కలిగిన, ఈ మార్గము 1853 ఏప్రిల్ 16 న బాంబే నుండి థానే వరకు ఆరంభించబడింది.

మధ్య రైల్వే
Central Railway
8-మధ్య రైల్వే
మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఛత్రపతి శివాజీ టెర్మినస్
ఆపరేషన్ తేదీలు1951–ప్రస్తుతం
మునుపటిది[ గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే, సింధియా స్టేట్ రైల్వే, ధోల్పూర్ రైల్వే, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే , వార్ధా కోల్ స్టేట్ రైల్వే , ఇతరములు.
ట్రాక్ గేజ్మిశ్రమము
ప్రధానకార్యాలయంఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై

మధ్య రైల్వే మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, కర్ణాటక రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951, నవంబరు 5 న గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేతో సహా, గ్వాలియర్ మాజీ రాచరిక రాష్ట్రం యొక్క సింధియా స్టేట్ రైల్వే, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే, వార్ధా కోల్ స్టేట్ రైల్వే, ధోల్పూర్ రైల్వేలు వంటి అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలను ఒక చోట చేర్చడము ద్వారా ఏర్పడింది.[1][2] మధ్య రైల్వే జోన్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు, సిబ్బంది పరంగా భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త పశ్చిమ మధ్య రైల్వే జోనుగా ఏర్పాటు అయ్యింది.

Central Railway Headquarters.
సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం, సిఎస్‌టి.

మధ్య రైల్వే ప్రధాన మార్గాలు

 
ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై, భారతదేశం లోని రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి . ఇది కూడా ప్రపంచ హెరిటేజ్ ప్రదేశం
  • సెంట్రల్ రైల్వే ప్రధాన / పొడవైన మార్గములు
    • ముంబై సిఎస్‌టి - దాదర్ - కుర్లా - థానే - దివా - కళ్యాణ్ - కాసర- మన్మాడ్ - జలగావ్ - భూసావల్ - అకోలా - వార్ధా - నాగ్పూర్
    • ముంబై సిఎస్‌టి - దాదర్ - కుర్లా - థానే - దివా - కళ్యాణ్ - నేరల్ -కర్జత్ - లోనావాలా - పూనే
    • పూనే - దావండ్ - షోలాపూర్ - వాడి - తాండూరు
    • పూనే - సతారా - సాంగ్లీ - మిరాజ్ - కొల్హాపూర్
    • మిరాజ్ - పండరపుర - కుర్దువాడి - ఉస్మానాబాద్ - లాతూర్ - లాతూర్ రోడ్
    • బల్లార్షా- సేవాగ్రామ్ (గతంలో వార్ధా ఈస్ట్ జంక్షన్.) - నాగ్పూర్ - ఆమ్లా - ఇటార్సి
  • సెంట్రల్ రైల్వే షార్టర్ / బ్రాంచ్ మార్గాలు
    • ముంబై సిఎస్‌టి-వాదల-కింగ్ సర్కిల్
    • ముంబై సిఎస్‌టి-వాదల-కుర్లా-వాషి-పాన్వెల్
    • థానే-వాషి
    • దావండ్-మన్మాడ్
    • భూసావల్ -ఖాండ్వా
    • అమరావతి - నర్ఖేర్
    • దివా-పాన్వెల్-రోహా
    • పన్వేల్-కర్జత్
    • ఖోపోలి-కర్జత్
    • దివా - భివాండీ రోడ్-వాషి రోడ్
    • బద్నెర-అమరావతి
    • దావండ్-బారామతి
    • పుంతంబా-షిర్డీ
    • చాలిస్గాంవ్-ధూలే
    • పచోర-జామ్నార్ (ఎన్‌జి)
    • పూల్గాంవ్-Arvi (ఎన్‌జి)
    • మూర్తిజాపూర్-యావత్మల్ (ఎన్‌జి)
    • మూర్తిజాపూర్-అచల్పూర్ (ఎన్‌జి)
    • జాలాంబ్-ఖాంగాంవ్

బి.బి. , సి.ఐ. రైల్వే ప్రధాన కార్యాలయాలు

 
బి.బి., సి.ఐ. రైల్వే ప్రధాన కార్యాలయాలు, 1905

నవంబరు, 1906 సం.లో ఇది పాక్షికంగా మంటలలో నాశనం కాగా, ఆ రాత్రి వేల్స్ యొక్క యువరాజు బొంబాయి వదిలి వేయడము జరిగింది.

మధ్య రైల్వే డివిజన్లు

ఈ జోను ఐదు విభాగాలు (డివిజన్లు)గా విభజించారు ముంబై సిఎస్‌టి, భూసావల్, నాగ్పూర్, షోలాపూర్, పూనే. నెట్వర్క్ డివిజన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[3]

కొన్ని ముఖ్యమైన రైళ్ళు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, p.42
  2. "Welcome to Central Railways – Construction > Projects". Archived from the original on 2008-05-01. Retrieved 2015-03-01.
  3. "cnt-rly". Archived from the original on 2008-05-09. Retrieved 2015-03-01.

బయటి లింకులు

మూసలు , వర్గాలు