మీడియావికీ చర్చ:Sidebar

తాజా వ్యాఖ్య: సంప్రదింపు పేజీ లింకు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

ఒక ప్రతిపాదన మార్చు

ఆంగ్లవికీలో ఉన్నట్లు ఈ విధంగా పెడితే బాగుంటుందేమొ

  • navigation
    • mainpage|Main page
    • Wikipedia:Contents|Contents
    • Wikipedia:Featured content|Featured content
    • currentevents-url|currentevents
    • randompage-url|randompage
  • interaction
    • Wikipedia:About|About Wikipedia
    • portal-url|portal
    • recentchanges-url|recentchanges
    • uploadwizard-url|uploadwizard
    • contact-url|contact
    • sitesupport-url|sitesupport
    • helppage|help

__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:17, 29 మే 2007 (UTC)Reply

కొన్ని ఇబ్బందులున్నట్టున్నాయి. ఉదాహరణకు..
  • Wikipedia:Contents అనే పేజీయే మనకు లేదు. ఆ పేజీ సృష్టించాల్సినంత అవసరమూ ఉన్నట్టు లేదు ప్రస్తుతానికి
  • Wikipedia:Featured content.. ఇదీ లేదు మనకు
  • ప్రస్తుత ఘటనలు ప్రస్తుతం మందంగా పడి ఉంది. (దీన్ని కొనసాగించాలని నాకో ఆలోచన ఉంది). __చదువరి (చర్చ, రచనలు) 09:44, 29 మే 2007 (UTC)Reply
మీరు చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమే, అక్కడ వాళ్ళది చూడటానికి/వాడటానికి బాగునట్లనిపించి ఇక్కడ కూడా అలా పెడితే బాగుంటుంది కాదా అనిపించింది. కానీ మన వికీపీడియా అక్కడికి చేరుకోవటానికి కొంత సమయం పడుతుందనుకుంటా... __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 18:44, 29 మే 2007 (UTC)Reply

పేజీ మార్పులు మార్చు

పేజీమార్పులలో అచేతన వ్యాఖ్యలు వాడకూడదు.

పట్టీలో రచ్చబండ మార్చు

మనం మెనూ పట్టీని చదువరులు, సంపాదకులు దృష్టినుంచి చేయాలి. ఇంగ్లీషు వికీలో రచ్చబండ ను సముదాయపందిరినుండి ఇచ్చారు. దానివలన దృష్టి సముదాయ పందిరి పై ప్రధానంగా వుంటుంది.రచ్చబండ తప్పక ప్రక్క పట్టీలో చూపించాల్సిన అవసరమైతే రెండవ పట్టీలో వుంచడం మంచిది. --అర్జున 16:32, 6 ఫిబ్రవరి 2012 (UTC)Reply

సముదాయపందిరి అదనంగా ఉన్నా ఫర్వాలేదు కాని రచ్చబండ మాత్రం సైడ్‌బార్‌లో ఉంటేనే సౌకర్యంగా ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:11, 6 ఫిబ్రవరి 2012 (UTC)Reply

పట్టీ కొత్త రూపం మార్చు

పట్టీ కొత్త రూపం ఇంగ్లీషు వికీ కు దగ్గరగా చేస్తే దాదాపు ఆరేడేళ్లుగా మార్పులేని తెవికీని వాడటానికి మరింత ఉపయోగంగా చేయవచ్చు. దీనికై నేను ప్రతిపాదిస్తున్నది. దీనిపై సలహాలు ఇవ్వండి. --అర్జున 16:47, 6 ఫిబ్రవరి 2012 (UTC)Reply

ఆరేడేళ్ళుగా మార్పులకు లోనుకాకుండా ఉన్ననూ ఇప్పుడూ పట్టీకి మార్పులు చేసే అవసరం కనిపించడం లేదు. అదనంగా కొన్ని లింకులు మాత్రం పెట్టవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:14, 6 ఫిబ్రవరి 2012 (UTC)Reply
రచ్చబండ లంకె ఎడమ పట్టీలో ఉండాలి. రెండవ విభాగంలో ఉంచవచ్చు. రెండో విభాగానికి పేరు పారస్పర్యం అంటే బాగుంటుంది. — వీవెన్ 02:35, 7 ఫిబ్రవరి 2012 (UTC)Reply
వికీ అంటేనే ఎల్లప్పుడూ మార్పులు జరిగేది కదా. మొదటిపేజీ మార్పులు మరీ ఎక్కువ వుండకూడదనేదానికి నేను ఒప్పుకుంటాను. అయితే క్రియాశీలంగా లేని లింకులను (ఉదా వర్తమాన ఘటనలనేది వుండేది) తొలగించకపోతే తెవికీ పై చెడ్డ అభిప్రాయం ఏర్పడే అవకాశం వుంది. అందుకని కనీసం సంవత్సరానికొకసారైనా మెరుగుచేయటానికి ప్రయత్నించటం మంచిది. రచ్చబండ లో వార్తలు తప్ప మిగతావి వాడేది క్రియాశీలక సంపాదకులు లేక నిర్వాహకులు మాత్రమే. సముదాయ పందిరిని సాధారణ సంపాదకులు కూడా వాడతారు. అందుకని వార్తలు విభాగాన్ని సముదాయపందిరి కి మార్చి రచ్చబండని సముదాయ పందిరి లింకుగా మారిస్తే వికీపీడియా వాడేవారి మొదటి చూపు మరింతగా ఉపయోగపడే సముదాయపందిరి పై పడేటట్లు చేయవచ్చు. రెండో విభాగానికి మెరుగైన పేరు కి దృష్టాంతం తెలపండి. నేను బూదరాజు ఆధునికవ్యవహారకోశం (http://www.andhrabharati.com/dictionary/index.php) లోని పదాన్ని వాడాను --అర్జున 12:26, 8 ఫిబ్రవరి 2012 (UTC)Reply
తెవికీలో మార్పులు జరగాలి నిజమే, కాని ఆ మార్పులనేవి సభ్యుల అనుమతితో, సభ్యులు మరియు పాఠకుల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగితే బాగుంటుంది. క్రియాశీలంగా లేని లింకులు తొలిగించడానికి ఇదివరకు కూడా ఎవరూ ఒప్పుకోలేరనుకుంటాను. మొదటిపేజీలో మీరు క్రింది నుంచి పైకి తెచ్చిన శీర్షిక మీకు తెలుసా! ను తొలిగించాలని ఇదివరకు కాసుబాబు గారు రెండు సార్లు ప్రతిపాదించారట. ఆ సమయంలో నేను సభ్యుడిని కాను కాబట్టి ఆ సంగతి ఏమయిందో తెలీదు కానీ ఆ తర్వాత నేను సభ్యుడిగా చేరడం అచేతనంగా ఉన్న మీకు తెలుసా శీర్షికను చాలా కాలంపాటు క్రమం తప్పకుండా నిర్వహించడంతో కాసుబాబు గారే నాకు ఆ సంగతి చెప్పి అభినందించారు. (చూడండి) ఇదంతా చెప్పే ఉద్దేశ్యమేమంటే ఆనాడు క్రియాశీలంగా లేదని తొలిగిస్తే ఆ తర్వాత శీర్షిక గురించి కొత్తగా వచ్చిన సభ్యులకు తెలిసేది కాదు. అంతేకాదు ఇప్పుడు మీరు తొలిగించిన వర్తమాన ఘటనలు శీర్షిక కూడా నేను రాకపూర్వం అచేతనంగానే ఉండేది. దాన్ని కూడా నేను ప్రతిరోజు నిర్వహించిన సంగతి 2007-09 కాలంలో చురుగ్గా ఉన్న వారందరికీ తెలుసు. కొన్ని శీర్షికలు ఇప్పుడు అచేతనంగా ఉన్ననూ ప్రస్తుతం ఉన్న సభ్యులు కాని, కొత్తగా చేరే సభ్యులు కాని ఎవరైనా నిర్వహించే వీలు కల్పించాలి. లేనిచో సమర్థత, అర్హత ఉండి కూడా శీర్షిక నిర్వహించడానికి అవకాశం కల్పించనట్లవుతుంది. తెవికీకి చదువరులపై మంచి అభిప్రాయం, చెడ్డ అభిప్రాయం ఏర్పడడం అనేది శీర్షికలపై కాకుండా వ్యాసంపై ఉంటుందనుకుంటాను. కాబట్టి వ్యాసాల నాణ్యత, తాజాకరణ చేపట్టడం ముఖ్యం. శీర్షికలు ఎంత క్రియాశీలంగా ఉన్నప్పటికీ వ్యాసాలలో పాత సమాచారం, ఏకవాక్య వ్యాసాలు ఇలా ఉంటే పాఠకులు హర్షించరు కదా! ఇక రచ్చబండ విషయానికి వస్తే ఇది ప్రారంభం నుంచి అందరి ఆమోగ్యం పొందిన పేజీ. కొత్తవారు కూడా తమ సమస్యల కొరకు దీన్ని ఉపయోగించారు. కొంతకాలం పాటు సెలవులో ఉన్న సభ్యులు రాగానే చూసేది రచ్చబండనే అని అనుకుంటున్నాను. సముదాయపందిరిలో ఏమి చేర్చాలనుకుంటున్నారో దాన్ని రచ్చబండలో చేరిస్తే సరిపోతుంది. రచ్చబండను తొలిగించడానికి నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రాధాన్యత కల మొదటిపేజీ మరియు అంతకంటే ప్రాధాన్యత కల్గిన సైడ్‌బార్‌లలో మార్పులు చేసే ముందే సభ్యుల దృష్టికి తీసుకొని వచ్చి అందరి అభిప్రాయాలను తెలుసుకుంటే బాగుండేది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:23, 8 ఫిబ్రవరి 2012 (UTC)Reply
ఈ చర్చలు జరిగిన సంగతి తర్వాత అందరికీ తెలిసే వీలుండదు. ఎందుకంటే చర్చలు ముగిసిన తర్వాత ఇటీవలి మార్పులలో కనిపించదు. కాబట్టి భవిషత్తులో అందరికీ ఉపయోగపడడానికి దీన్ని రచ్చబండలో కాపీ చేస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:27, 8 ఫిబ్రవరి 2012 (UTC)Reply
మీ సంప్రదింపుల సలహా బాగానే వుంది. నేను ఇప్పటికి వరకు చేసిన ప్రయత్నాలు చూస్తే బహుశా ఇది తప్పక మిగతా వన్నీ రచ్చబండ లేక ఇతర చోట్ల చర్చించి చేసినవేనని గమనించగోర్తాను. గత మూడు నాలుగేళ్లుగా తెవికీని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్న నాకు సమిష్టికృషిలో తగిన ప్రోత్సాహం అంతగా లభించలేదనే చెప్పాలి. (తెవికీ మొదటిపేజీగురించి నేను చేసిన పాత సలహా ఆ చర్చాపేజీలో చూడగలరు ). అందుకనే ఈ సారి స్పందించిన వారి సహకారంతో ఇంకొక రకంగా కూడా ప్రయత్నం చేశాను. అదే వెబ్ ఛాట్, మీడియావికీ సైట్ ప్రకటన. దీనిని ప్రస్తుత ప్రయత్నంలో పూర్ణస్థాయికి తీసుకువెళదామని ఇంగ్లీషు వికీతో కనీసం పోలిక వుంటే వేరెవరైనా తరువాత తరువాత మార్చటానికి వీలుంటుందని చేశాను. పట్టీ మార్చటానికి కొంత కాలం ప్రయత్నిస్తున్నా, బగ్జిల్లాలో బగ్ పెట్టినా అది గమనించి సలహాలిచ్చినవారు కూడాలేరు. తెవికీ నాణ్యతని త్వరగా పెంచాలన్న ఆతృతలో, గతంలో జరిగిన అనుభవాల, స్పందనల దృష్ట్యా, నేను చేసినపని అందరకూ నచ్చుతుందనే చేశాను. ఇక మొదటిపేజీ లో శీర్షిక నిర్వహించకపోతే కొనసాగించటం నా దృష్టిలో అంత మంచి పద్దతి కాదు. తెవికీలో ఏమి జరుగుతున్నాయి అని సమీక్షించి తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నప్పుడు ఏ మార్పులు జరిగినవో తెలిపితే తరువాత ఎవరైనా ఆ ప్రయత్నం చేయటానికి తగిన వనరులు వికీలో ఎప్పుడు వుంటాయి కదా. ఇక ఈ చర్చకు సరైన స్థానం గురించి: పట్టీని మార్చాలంటే ఈ పేజీ దగ్గరికి రావలసిందే అందుకని నేను ఇక్కడే వ్యాఖ్య రాస్తున్నాను. --అర్జున 10:57, 10 ఫిబ్రవరి 2012 (UTC)Reply
Interaction కు పారస్పర్యం పదం అంత సులభంగా అర్థమయ్యేదికాదని నాఅభిప్రాయం. సహకారం ఎలా వుంటుంది?--అర్జున 11:00, 10 ఫిబ్రవరి 2012 (UTC)Reply

పట్టీ లోని లింకుల్లో చేసిన మార్పులు మార్చు

పక్కపట్టీలో నిన్న ఒక మార్పు చెయ్యాల్సి వచ్చింది. అందుకు కారణం ఇది. అయితే, అర్జున గారు ఆ మార్పు చేస్తూ, ఆ పట్టీలో ఉన్న కొత్త పేజీలు అనే లింకును తీసేసారు. పట్టీలో కనబడే లింకులు సైటు వ్యాప్తంగా ఏ పేజీకి వెళ్ళినా కనబడేవి. వాటిలో చేసే మార్పులు చాలా పెద్దవి. పొరపాటున ఏమైనా మార్పులు జరిగితే చేసేదేం లేదు, సరిదిద్దుకుంటాం. కానీ కావాలని ఇలా లింకులు ఏకపక్షంగా తీసెయ్యడమనేది చెయ్యకూడదు. ఇకపై అలా చెయ్యవద్దని, ఇలాంటి పనులు సముదాయం సమ్మతి తీసుకున్నాకే చెయ్యాలనీ అర్జున గారిని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 11:41, 20 ఏప్రిల్ 2021 (UTC)Reply

అర్జున గారూ, మీరు నేవిగేషన్ పట్టీలో "కొత్త పేజీలు" తొలగించారు. ఏ పేజీలో ఉన్నా కొత్త పేజీలను పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉండేది.సులభంగా కొత్తపేజీలు పరిశీలించటానికి, పర్వేక్షించటానికి ఒక హెచ్చరికలాగా నేవిగేషన్ పట్టీలో కనపడేది.మీరు తొలగించకముందు నావరికి నేను రోజకు రెండు, మూడుసార్లు వాటిని పరిశీలించేవాడిని.మీరు మార్చిన తరువాత నేను వాటిని ఒక్కసారికూడా పరిశీలించలేకపోయాను.మరి ఎందుకు మార్చారో అర్థంకాలేదు. ఇలాంటి మార్పులు ఎందుకు చేయాల్సివస్తుందో, మార్చటానికి ముందు సముదాయం దృష్టికి తీసుకువస్తే బాగుంటుంది.నావరకు నాకు లోగడ ఉన్న పద్దతి ప్రకారం నేవిగేషన్ పట్టీలో ఉండాలని నా అభిప్రాయం. దయచేసి సవరించగలరు.మీకు ఆ సవరణ ముఖ్యం అని తోస్తే సముదాయంలో చర్చకు తీసుకొని రావలిసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:40, 6 మే 2021 (UTC)Reply
చదువరి, యర్రా రామారావు, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:Pranayraj1985 గార్లకు, మీ స్పందనలకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియాకాని, ఆంగ్ల వికీపీడియాకాని మీడియావికీ సాఫ్ట్వేర్ పై ఆధారపడినవి. గతంలో కేవలం కొత్తపేజీలు మాత్రమే అదేశవరుసలో వుండేది, ఇప్పుడు ఇటీవలిమార్పులు లో ప్రత్యేక విభాగం ద్వారా ఇతర రకాల నిర్వహణ లింకులు చేర్చడం వీలైంది. కావున కేవలం కొత్తపేజీలు పక్కపట్టీలో కొనసాగించడం user interface సమగ్రతకు భంగకరం. వాడుకరి అంతర్వర్తి (User interface) ఎలా వుండాలి అనేది ఒక సాంకేతికమైన కళ. ఇది భాషకు ప్రత్యేకించిన అంశాలుతప్పించి భాషతో మారకూడదని నా గట్టి అభిప్రాయం. ఆంగ్లవికీలో ఇటువంటి మార్పులకు చాలా కొద్దిమంది మాత్రమే అవగాహనతో స్పందిస్తారు. (ఉదాహరణ ఆంగ్ల చర్చ), తెలుగు వికీలో అటువంటి నైపుణ్యాలు గలవారు అతి తక్కువ అని నా అభిప్రాయం. కాకపోతే ఒక రూపానికి అలవాటుపడిపోయి, కొత్తరూపం అందుబాటులోకి వచ్చినా పాతరూపం కావాలనుకోవటం మానవ సహజం. మీరు ఎక్కువగా వాడే ఆదేశాలను రకరకాల పద్ధతులలో సులభంగా చేరుకోవటానికి బ్రౌజర్ బుక్ మార్క్ సౌకర్యం వాడవచ్చు. వెక్టర్ తీరుని మలచుకోవటం ద్వారాగా కూడా మార్చుకోవచ్చు. దానికొరకు నా వాడుకరిపేరుబరిలో common.js కోడ్ మార్పులు మీ వాడుకరిపేరుబరి ఉపపేజీలో common.js లో చేర్చుకోవచ్చు. పైన తెలిపినవాటిలో సందేహాలుంటే తెలపండి. నేను తెలిపినవి మీరు అంగీకరించకపోతే, మీరు తగిన చర్చచేసి దానిప్రకారం సవరణలు చేయవచ్చు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 10:45, 17 మే 2021 (UTC)Reply
అర్జున గారూ, "ఇది భాషకు ప్రత్యేకించిన అంశాలుతప్పించి భాషతో మారకూడదని నా గట్టి అభిప్రాయం." అని అన్నారు. మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు. దాన్ని చర్చకు పెట్టి సముదాయం ఒప్పుకుంటే ఆ తరువాత మార్పులు చెయాలి. కానీ అలా చెయ్యకుండా మీ ఇష్టం ప్రకారం మార్పులు చేసేసారు. మీ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దడమేంటి? ఏకపక్షంగా మార్పుచేర్పులు చేసేసి, ఇప్పుడు మీమీ ఉపపేజీల్లో మీక్కావలసిన మార్పులు చేసేసుకోండి అని చెప్పడం ఏం బాగాలేదు అర్జునగారు. అసలు ముందు చర్చచెయ్యకుండా మీరు మార్పులెందుకు చేసారు? ఆ మార్పులేవో మీరే మీ ఉపపేజీలో ఎందుకు చేసుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా, "user interface సమగ్రతకు భంగకరం" అంటూ ఏదో గొప్ప సాంకేతిక విషయం అందులో ఉన్నట్టుగా చెప్పబోతున్నారు. గతంలో ఉన్నట్టుగా ఇక్కడ కొత్తపేజీలు లింకు ఉంటే దాని వలన వచ్చే సాకేతిక ఇబ్బంది ఏమీ లేదు. నాకు అనిపిస్తున్నది ఏంటంటే.., మీరు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు గాను ఏదో సమస్య ఉన్నట్టు సమర్ధించుకోజూస్తున్నారు లేదా మీకు అవగాహన లేక మాట్టాడుతున్నట్టున్నారు.
ఇకపోతే, అదేదో "సాంకేతికమైన కళ" అని అన్నారు. ఆ కళేదో మీకు ఉందని మీ ఉద్దేశమనుకుంటాను. అలా అనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, నేను దాన్ని పట్టించుకోను. కానీ మీకు మాత్రమే ఉందనుకుంటే అది భ్రమ. ఆ భ్రమ లోంచి బయటకు రండి.
మరో సంగతి.. మనకేదైనా కళంటూ ఉంటే అది వికీకి పనికొచ్చేల ఉండాలి, ఇలా వాడుకరుల పనిని అడ్డుకునేలాఅ ఉండకూడదు. __చదువరి (చర్చరచనలు) 11:04, 17 మే 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ మీరు చెప్పే కారణం సవేతుకంగా లేదు.యర్రా రామారావు (చర్చ) 12:01, 17 మే 2021 (UTC)Reply
@Chaduvari గారు, మీ సూచనలకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 04:34, 20 మే 2021 (UTC)Reply
కొత్త పేజీలకు లింకు ఉండాలని నా అభిప్రాయం. నేను రోజువారీ చేసే నిర్వహణలో దీన్ని తరచుగా వాడుతూ కొత్త వ్యాసాల్లో చెత్త వ్యాసాలని ఏరుతూ అప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తుండే వాడిని. అందులోని వాక్యాలని మీకు తెలుసా విభాగంలో రాసేవాడిని. అర్జున గారు సూచించిన పద్ధతులు ఈ సమస్యను పరిష్కరిస్తాయి కానీ, కేవలం సింగిల్ క్లిక్ తో కొత్త వ్యాసాలను చూసే సౌలభ్యం మనం కోల్పోయాము. ఇది ఇప్పటిదాకా ఆ సౌలభ్యాన్ని వాడుతున్న వాడుకరుల యూజబిలిటీకి భంగపాటు లాంటిది. ఒకవేళ కొత్తగా వచ్చే వాడుకరులెవరైనా కొత్తగా సృష్టించే వ్యాసాలను చూడాలంటే, అది ఎలా చూడాలో వివరంగా చెప్పడం కంటే, కేవలం ఎడమ వైపున లింకు మీద క్లిక్ చేయండి అని చెప్పడం చాలా సులువు. పైన పేర్కొన్న కారణాల వలన కొత్త పేజీలు లింకు మళ్ళీ చేర్చాలని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:36, 20 మే 2021 (UTC)Reply

పట్టీలో చెయాల్సిన సవరణ మార్చు

అర్జున గారు చేసిన ఈ మార్పును వ్యతిరేకిస్తూ ఇక్కడ ఐదుగురు మాట్టాడారు. అయినా, ఆయన తన తప్పును సరిచేసుకోలేదు. పైగా దీని గురించిన అవగాహన, చర్చించగల నైపుణ్యం ఎక్కువ మందికి లేవని అన్నారు. కావాలంటే మీమీ స్వంత పేజీల్లో మార్పులు చెసుకోండని చెప్పారు. లేదా "మీరు తగిన చర్చచేసి దానిప్రకారం సవరణలు చేయవచ్చు." అని అన్నారు. తాను మాత్రం సముదాయాన్ని సంప్రదించకుండా, సముదాయపు అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా మార్పులు చేసేస్తారు, ఆ తప్పును సరిచేసేందుకు మాత్రం "తగిన చర్చ చేసాక" సరిచెయ్యాలంట.

అర్జున గారు ఇలాంటి ధోరణిని ప్రదర్శించడం ఈ మధ్య కాలంలో వేరే పేజీల్లో కూడా నేను గమనించాను. అంతెందుకు.., ఇదే చర్చ పేజీలో, ఇదే విషయంపై, పైన జరిగిన పాత చర్చను చూస్తే అలాంటిది ఇక్క్కడే గతంలో జరిగినట్టు తెలుస్తుంది. ఇలా ఏకపక్షంగా మార్పులు చేసే పనే గతంలో కూడా చేసారు. అప్పుడు కూడా సభ్యులు వ్యతిరేకించారు. దానిపై రచ్చబండలో చర్చ కూడా జరిగింది. "ముందు ముందు నేను చేయబోయే ప్రయత్నాలు ఇంతకుముందు లాగా రచ్చబండలోకాని ఇతర చర్చాపేజీలలోకాని ఇతర పద్ధతులలో చర్చించినా దానిని తెవికీలో నమోదు చేసి చేస్తానని మాటిస్తున్నాను." అంటూ రచ్చబండలో సముదాయానికి మాట కూడా ఇచ్చారు అర్జున గారు. కానీ అక్కడ తానిచ్చిన మాటను నిలుపుకోలేదని ఇప్పుడు మళ్ళీ ఇదే పేజీలో చేసిన ఏకపక్ష మార్పులను బట్టి అర్థం అవుతోంది.

ఈ చర్చలో అర్జున గారు వెలిబుచ్చిన అభిప్రాయాలను బట్టి, తన తప్పును తాను సవరించుకునే ఉద్దేశం ఆయనకు లేదని నేను భావిస్తున్నాను. సముదాయం పట్ల అలాంటి మొండి పట్టుదల తగదని నా అభిప్రాయం. ఆ తప్పును నేను సవరిస్తూ "కొత్త పేజీలు" లింకును తిరిగి స్థాపిస్తాను.

ముఖ్యమైన చోట్ల, సముదాయపు అనుమతి తీసుకోకుండా, ఏకపక్షంగా మార్పులు చెయ్యడం లాంటివి ఇకముందైనా చెయ్యవద్దని అర్జున గారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 04:37, 24 మే 2021 (UTC)Reply

కొత్త పేజీలు లింకును పునరుద్ధరించాను.
అర్జున గారు "వికీపీడియా గురించి", "సంప్రదింపు పేజీ" అనే రెండు లింకులను కొత్తగా చేర్చారు. అవి ఉండడం వలన నష్టమేమీ లేదని భావించి వాటిని అలాగే ఉండనిచ్చాను. __ చదువరి (చర్చరచనలు) 04:45, 24 మే 2021 (UTC)Reply
కొత్త పేజీలు లింకును పునరుద్ధరించినందుకు చదువరి గార్కి ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 05:08, 24 మే 2021 (UTC)Reply
ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:12, 24 మే 2021 (UTC)Reply

సంప్రదింపు పేజీ లింకు మార్చు

ఇంగ్లీషు వికీలో సంప్రదింపుల పేజీని చాలా విస్తారంగా పాఠకులకు తేలిగ్గా ఉండేలా, వివిధ అంశాలపై సంప్రదించదలచే వారికి అనువుగా ఉండేలా మార్చారు. దాన్ని తెలుగు లోకి అనువదించాను ఆ పేజీలను ఇక్కడ చూడవచ్చు. సైడుబారు లోని "సంప్రదింపు పేజీ" లింకు లక్ష్యాన్ని ప్రస్తుతమున్న పేజీ నుండి మార్చి ఈ పేజీకి ఇవ్వాలని నా ప్రతిపాదన. ప్రస్తుతమున్న పేజీ కంటే ఈ కొత్త పేజీలు మరింత పాఠకానుకూలంగా ఉన్నాయి. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 05:08, 24 జూన్ 2021 (UTC)Reply

దీనికి స్పందనలేమీ రాలేదు. అభ్యంతరాలేమీ లేవనీ, ఈ లింకును మార్చడం లోని హేతుబద్ధతను ("ఈ లింకు పాఠకులను ఉద్దేశీంచినది, రచనలు చేసేవారిని కాదు" అని) గ్రహించారనీ భావిస్తున్నాను. రెండు రోజుల్లో ఈ లింకును సవరిస్తాను. __ చదువరి (చర్చరచనలు) 16:43, 12 మార్చి 2022 (UTC)Reply

వికీపీడియా:Contact us/Licensing లో ఎర్రలింకు ని అనువదించితే లేక వేరే విధమైన వివరణతో తొలగించితే మంచిది. ప్రస్తుతమున్న వివరణలో CC -BY-SA విడుదలకు ఉదాహరణ ధృవపత్రం ఇచ్చాము. అది కొనసాగించితే మంచిదని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 11:22, 15 మార్చి 2022 (UTC)Reply

Return to "Sidebar" page.