మూస చర్చ:Infobox India AP Village
సమాచార పెట్టె ఉదాహరణ కొరకు ఒకటి కంటె ఎక్కువ రెవెన్యూగ్రామాలతో కూడిన గ్రామ పంచాయతీ పేరు కావాలి
మార్చు సహాయం అందించబడింది
User:యర్రా రామారావుగారు మరి గ్రామాలపై విశేషంగా కృషి చేసిన ఇతర సభ్యులకు, చాలా గ్రామ పేజీలలో ప్రస్తుతము వున్న సమాచారపెట్టె {{Infobox Settlement/sandbox}} చాలా పొడుగైనది, మరియు sandbox రూపం వాడకూడనిది కావున, దానిని పొట్టిదైన {{Infobox India AP Village panchayat}} తో మార్చేందుకు ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే ఒక గ్రామపంచాయతీకి మూస డాక్యుమెంటేషన్ పేజీలో పాత, కొత్త మూసల ఉదాహరణగా చేర్చాను. ఇంకా క్లిష్టమైన మరియు ఒకటి కంటె ఎక్కువ రెవిన్యూ గ్రామాలతో కూడుకున్న గ్రామ పంచాయతీ వ్యాసాన్ని సూచించండి. అలాగే ఈ క్రొత్త మూసపై మీ వ్యాఖ్యలు తెలియచేయండి. --అర్జున (చర్చ) 10:44, 26 ఏప్రిల్ 2019 (UTC)
- @అర్జున అర్జనరావు గారూనాకు తెలిసినంతవరకు ఒకటి కంటె ఎక్కువ రెవిన్యూ గ్రామాలతో కూడుకున్న గ్రామ పంచాయతీ ఉండదు.ఎక్కువ గ్రామ పంచాయితీలతో కూడుకున్న రెవెన్యూ గ్రామం ఉంటుంది.శివారు గ్రామాలు (Hamlets)తో కలిగిన రెవెన్యూ గ్రామాలు, నివాస ప్రాంతాలు (Habitatios)తో కలిగిన గ్రామ పంచాయితీలు ఉంటాయి.ఉదాహరణలు కావాలంటే రేపు తెలుపగలను.--యర్రా రామారావు (చర్చ) 16:50, 27 ఏప్రిల్ 2019 (UTC)
- @యర్రా రామారావు, మీ స్పందనకు ధన్యవాదాలు, తెవికీలో గ్రామానికి బదులుగా, రెవిన్యూ గ్రామం వాడుకచూసి పొరబడ్డాను. అయితే ఈ మూస ఏస్థాయిలో వుండాలి. ఇంతకుముందులాగా గ్రామ స్థాయి సరిపోతుందా?దానిని శివారు గ్రామాలు, నివాస ప్రాంతాలకు కూడా వాడవచ్చా. తెవికీలో శివారు గ్రామాలకు, నివాసప్రాంతాలకు ప్రత్యేక పేజీలున్నాయా?--అర్జున (చర్చ) 00:23, 28 ఏప్రిల్ 2019 (UTC)
@అర్జున గారూ తెవికీలో ప్రస్తుతం రెవెన్యూ గ్రామాలకు మాత్రమే వ్యాసాలు ఉన్నవి.కొన్ని గ్రామ పంచాయితీలకు ఏక వ్యాక్యంతో వ్యాసం పేజీలు ఉన్నవి.తెలంగాణలో అవికూడా చాలవరకు తొలగించబడినవి.కొన్నిటికి తొలగింపు మూసలు చేర్చబడినవి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మండలాలలోని గ్రామాలు విభాగంలో గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలు అనేమి లేదు.అన్ని గ్రామాలు రెవెన్యూ గ్రామాలుగా సమాచారపెట్టెలు కూర్పు చేసి ఉన్నవి.తెలంగాణలో అన్ని జిల్లాల మండలాలలో, పునర్వ్యవస్థీకరణ ప్రకారం సంబందిత ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి రెవెన్యూ గ్రామాలు మాత్రమే మండలంలోని గ్రామాల విభాగంలో,మండలంలోని గ్రామాలు మూసల నందు కూర్పు చేసాను.పూర్తిగా పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం దాదాపుగా పూర్తి అయింది.కాకపోతే మండలాలకు ప్రత్యేక వ్యాసాలు సృష్టించినందున కొన్ని జిల్లాలలో గ్రామ వ్యాసాలకు మండల వ్యాసం లంకె కలుపబడుతుంది.ఈ కార్యక్రమం నేను 2017 అక్టోబరు నుండి చేస్తున్నాను.ఆ క్రమంలో నేను కనుగొన్న లోపాల ఆధారంగా గ్రామ వ్యాసాలకు నాకు తెలిసిన,నాకు తోచిన ప్రకారం మార్గదర్శకాలు, గ్రామ వ్యాసాలకు వర్గాలు క్రమం ఎలా ఉండాలి, అని తయారుచేసి రచ్చబండలో చర్చకు పెడితే విశ్వనాధ్ గారు తప్పితే ఎవరు స్పందించలేదు.మరి కొంతకాలం కాల నిర్ణయం ఇచ్చి స్పందించుటకు అభ్యర్ధించిననూ ఎవరూ స్పదించలేదు.నేను మాత్రం ఆ మార్గదర్శకాలు ప్రకారం గ్రామ వ్యాసాలలో మార్పులు చేసాను, చేస్తున్నాను, చేస్తుంటాను.సందర్బం వచ్చింది కాబట్టి,ఎందుకంటే మీరు మూసలు గురించి అడిగారు కాబట్టి ఇది చెప్పవలసి వచ్చింది.మూసలు తయారీ ,సవరణకు ముందు ఒకసారి ఆ మార్గదర్శకాలు పరిశీలించి తదనుగుణంగా తయారుచేయగలరు.మండలంలోని సమాచారపెట్టెకు, రెవెన్యూ గ్రామం సమాచారపెట్టెకు, గ్రామ పంచాయితీ సమాచారపెట్టెకు కొన్ని మార్పుల అవసరముంది.నాకు తెలిసిన,నాకు తోచిన మార్పుల సాయంత్రంలోగా పరిశీలించి తెలుపగలను.నేను చేసిన ఉద్యోగరీత్యా నాకు, గ్రామాలకు అనినాభావసంభంధం ఉంది.--యర్రా రామారావు (చర్చ) 11:41, 28 ఏప్రిల్ 2019 (UTC)
@యర్రా రామారావు గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. తెలుగువికీలో క్రియాశీల సభ్యుల సంఖ్యతక్కువకాబట్టి క్లిష్టతను చాలావరకు తగ్గించడం మంచిది. అందుకని మండలం, గ్రామం పేజీలు వాటికి సమాచారపెట్టెలతో ప్రారంభిస్తే ముందు ముందు మిగతావి అవసరాన్ని బట్టి చేర్చవచ్చు. అందుకని,ప్రస్తుత మూసని గ్రామ పేరుతో (గ్రామ పంచాయతి కాకుండా) మారుద్దామనుకుంటున్నాను.వీటిలో కూడా గ్రామాలకు కేవలం చాలవరకు స్థిరంగా వుండే భౌగోళిక సమాచారం వుంటే సరిపోతుందని నా ఊహ. సర్పంచ్, విఎఒ లాంటివి ప్రస్తుతానికి వదలివేస్తే మంచిదనుకుంటాను. ఈ సమాచారం సేకరించటం, చేర్చటం, తనిఖీ చేయటం అంత సులభం కాదు. మీ స్పందన తెలియచేయండి. --అర్జున (చర్చ) 12:38, 28 ఏప్రిల్ 2019 (UTC)
@అర్జున గారూ మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను.మండల వ్యాసంలో సమాచారపెట్టెలు నిడివి వ్యాస సమాచారంకన్నా ఎక్కువ ఉంటుంది.గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 12:55, 28 ఏప్రిల్ 2019 (UTC)
- @యర్రా రామారావు గారికి, ధన్యవాదాలు. కావలసిన మార్పులు చేస్తాను. --అర్జున (చర్చ) 03:17, 29 ఏప్రిల్ 2019 (UTC)
- మార్చిన మూస {{Infobox India AP Village}} చూడండి. లింకులో ఉదాహరణ గ్రామ సమాచార పెట్టె చూసి ఏమైనా మార్పులు అవసరమైతే తెలపండి. దాని తెరపట్టు కుడివైపు బొమ్మగా చేర్చాను. అలాగే ఇంకా ఒకటి రెండు గ్రామాలు సూచించడి. వాటికి మానవీయంగా మార్పులు చేసి మూసకు సవరణలు ఏవైనా అవసరమైతే చేద్దాం.--అర్జున (చర్చ) 04:28, 29 ఏప్రిల్ 2019 (UTC)
- మరిన్ని ఉదాహరణలకు చూడండి.--అర్జున (చర్చ) 04:05, 2 మే 2019 (UTC)
వికీడేటా లో కొంత సమాచారం సమాచారపెట్టెలలో వాడుకోవటానికి శుద్ధిచేయాలి
మార్చుజనాభాకు ఎక్కువ గణాంకాలు వున్నప్పుడు చివరి తేదీనాటి గణాంకాన్ని preferred గా చేస్తేనే సమాచారపెట్టెలో వాడుకోగలుగుతాము. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు వికీడేటా లో ఎంతవరకు వున్నాయో తెలియాలి--అర్జున (చర్చ) 11:17, 28 ఏప్రిల్ 2019 (UTC)
కొత్త సమాచారపెట్టెపై స్పందన
మార్చు- అర్జున గారూ మండల వ్యాసానికి జిల్లా మ్యాప్, గ్రామ వ్యాసానికి మండల మ్యాప్ సమాచార పెట్టెలో చూపే విధంగా ఉంటే బాగుంటుదనేది నా అభిప్రాయం. ఇటీవల పందిళ్లపల్లి గ్రామ వ్యాసంలో చూసాను. రెండు మ్యాప్ లు ఉవసరం లేదు అనుకుంటాను.మండల వ్యాసం సమాచారపెట్టెకు, రెవెన్యూ గ్రామ సమాచారపెట్టెకు తేడా ఉంటేనే బాగుంటుదనేది నా అభిప్రాయం.మండల వ్యాసం సమాచారపెట్టెకు గ్రామం పేరు క్రింద 'మండలం' అని, రెవెన్యూ గ్రామ సమాచారపెట్టెకు గ్రామం పేరు క్రింద 'రెవెన్యూ గ్రామం' అని ఉండటానికి ప్రయత్నం చేయగలరు.లోగడ అలా ఉంది.సమాచారపెట్టెల మార్పులపై మీ నిరంతర కృషిని అభినందిస్తున్నాను.
- 23. మండల వ్యాసం పేజీ ఇన్ ఫో బాక్స్ లో సంబందిత జిల్లా పటంలో మండలం యొక్క స్థానం ఉన్న రేఖా పటం మాత్రమే కూర్పు చేయాలి.
- 25. గ్రామ వ్యాసం పేజీ ఇన్ ఫో బాక్స్ లో సంబందిత మండల పటంలో ఆ గ్రామం యొక్క స్థానం ఉన్న రేఖా పటం మాత్రమే కూర్పు చేయాలి.--యర్రా రామారావు (చర్చ) 02:51, 5 మే 2019 (UTC)
- @యర్రా రామారావు గారికి, మీ స్పందనకు,అభినందనలకు ధన్యవాదాలు. రెవిన్యూ గ్రామం కొరకు మార్పు చేశాను. మండలాల సమాచారపెట్టెలు కొంతవరకు తెవికీకొరకు సవరించబడివాడినందున, వాటిపై ప్రస్తుతము దృష్టిపెట్టుటలేదు. గ్రామసమాచారపెట్టెలకోసమే ఈ మూస తయారు చేశాను. ప్రస్తుతానికి వేటపాలెం మండలం గ్రామాల్లో మార్పులు చేస్తే కొంతవరకు లోటుపాట్లు స్పష్టమయ్యాయి. ఈ సమాచారపెట్టె వాడే వికీడేటాదత్తాంశం చేర్చిన వాడుకరి:Chaduvari వాడుకరి:Pavan santhosh.s మరియు ఇతర సభ్యులకు ధన్యవాదాలు. ఇంకేమైనా సమస్యలు,సలహాలు తెలపండి. --అర్జున (చర్చ) 06:11, 5 మే 2019 (UTC)
- @యర్రా రామారావు గారికి, ఇంకొక విషయానికి స్పందించటం మరిచాను. రెండు మ్యాప్ లు ఎందుకు చేర్చానంటే, మొదటిది గతిశీల పటము, అనగా దానిపై నొక్కి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు తెలుసుకోవచ్చు. రెండవది రాష్ట్రంలో ఎక్కడవున్నదో నేరుగా చూపించేది. మండల పటమలు చేర్చటము కన్నా, నేరుగా రాష్ట్రంలో గుర్తించుతున్నాము కాబట్టి, ఉపయోగంగా వుంటుందనుకుంటున్నాను. ఈ విషయాన్ని చర్చించి మార్గదర్శకాలకు అనుగుణమైన మార్పులు చేస్తేమంచిది. మీ మార్గదర్శకాలకనుగుణంగా ఒక మండలంలోని గ్రామలన్నిటినీ సరిదిద్దితే ఉదాహరణగా పనికొస్తుంది. ఇప్పటికే అలా చేయకపోతే వేటపాలెం మండలం పరిగణించండి.--అర్జున (చర్చ) 06:28, 5 మే 2019 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.అలాగే చేద్దాం.--యర్రా రామారావు (చర్చ) 06:40, 5 మే 2019 (UTC)
- అర్జున గారూ ప్రాంతపు పోన్ కోడ్, ఎర్రలింకు కాకుండా, లింకు ఉండేలాగున రావటానికి అవకాశం ఉందా? కావాలంటే ఆంగ్ల వికీపీడియాలో ఉన్న Telephone numbering plan వ్యాసాన్ని తెలుగు వికీపీడియాలో సృష్టించుదాం.
- అలాగే పిన్(Pin) ఇలా కాకుండా, పిన్ (Pin) లాగా ఉండేట్లు,లింకు ఉండేట్లు చేయవచ్చా? కావాలంటే ఆంగ్ల వికీపీడియాలో ఉన్న Postal Index Number వ్యాసాన్ని తెలుగు వికీపీడియాలో సృష్టించుదాం.అవకాశముంటే చేయగలరు.మీకు ఎదో ఒకటి చెప్పి విసుగిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:40, 5 మే 2019 (UTC)
- యర్రా రామారావు అవునండి, ఆ వ్యాసం వుంటే ఆ లింకు పెట్టి ఎరుపురంగు తొలగించవచ్చు. నేను చేద్దామనుకున్నా సాంకేతికతలు చాలావరకు అయిపోయాయి. ఏమైనా చిన్నమార్పులు చేయటానికి ఇబ్బందిలేదు. --అర్జున (చర్చ) 07:48, 5 మే 2019 (UTC)
- పిన్ (Pin) వ్యాసం లంకె గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:28, 5 మే 2019 (UTC)
- @యర్రా రామారావు మూస పిన్ కోడ్ లింకుతో సవరించాను. --అర్జున (చర్చ) 10:01, 5 మే 2019 (UTC)
- @యర్రా రామారావు ఇంకొక వివరణ మండల పటము చేర్చకపోవటానికి, మండలం పటం కేవల బొమ్మ కావున, గ్రామ స్థానం సూచించే వీలులేదు. --అర్జున (చర్చ) 10:50, 6 మే 2019 (UTC)
- పిన్ (Pin) వ్యాసం లంకె గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:28, 5 మే 2019 (UTC)
- యర్రా రామారావు అవునండి, ఆ వ్యాసం వుంటే ఆ లింకు పెట్టి ఎరుపురంగు తొలగించవచ్చు. నేను చేద్దామనుకున్నా సాంకేతికతలు చాలావరకు అయిపోయాయి. ఏమైనా చిన్నమార్పులు చేయటానికి ఇబ్బందిలేదు. --అర్జున (చర్చ) 07:48, 5 మే 2019 (UTC)
చేయవలసిన సవరణలు
మార్చు- జనాభా సంవత్సరాలలో ఇటీవలి సంవత్సరం మరియు దాని జనాభా ఉపయోగించాలి. ప్రస్తుతం preferred rank తో వున్న విలువ వాడుతున్నాము. అర్జున (చర్చ) 06:40, 26 జూలై 2019 (UTC)
- జనాభా కు వివిధ సంవత్సరాల డేటా వున్నప్పుడు, ప్రోగ్రామ్ సహాయంతో preferred rank చేయటం సులభం కాదు కావున, మూసని 2011 జనాభా చూపించేటట్లు చేయటం జరిగింది. 2021గణాంకాలు చేర్చినతరువాత 2011 ని 2021 గా చేయాలి.అర్జున (చర్చ) 07:59, 27 జూలై 2019 (UTC)
జనసాంద్రత లెక్కింపులో దోషం
మార్చుజనసాంద్రత లెక్కింపులో, బహుశా విస్తీర్ణాన్ని (హెక్టార్లు -- చదరపు కిలోమీటర్లు) తీసుకోవడంలో జరిగిన దోషం కారణంగా విస్తీర్ణం, జనసాంద్రత తప్పు చూపిస్తోంది. అర్జున గారూ పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 04:37, 27 ఏప్రిల్ 2022 (UTC)
- @Chaduvari గారు, అవును. ఇటీవలి కోడ్ మెరుగుపరుద్దామని చేసిన సవరణలలో దోషం జరిగింది. హెక్టారు, చదరపు కిలోమీటర్ మధ్య తికమక పడలేదు కాని, హెక్టారు విలువ పొందటంలోనే దోషం ఏర్పడింది. పొరబాటు సవరించాను. ఇప్పుడు చూడండి. అర్జున (చర్చ) 05:15, 27 ఏప్రిల్ 2022 (UTC)
- @Arjunaraoc గారూ, సరేనండి. ధన్యవాదాలు.__ చదువరి (చర్చ • రచనలు) 05:29, 27 ఏప్రిల్ 2022 (UTC)
మెరుగైన కోడ్
మార్చుఈ మూసను sandbox లో qid పరామితి వాడి పరీక్షించుటకు అనుకూలంగా, వికీడేటా లో విస్తీర్ణం హెక్టేరులలో ఇచ్చినా దానిని చకి.మీ మార్చుకొని వాడుకొనుటకు అనుగుణంగా మార్చబడింది. ఇకనుంచి ఏవైనా మార్పులు sandbox తో పరీక్షించి చేయవలెను. ఈ మూస నిర్వహణకు సంబంధించి లోపాలు తొలగినందున, ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వాడుటకు అనుకూలం. అయితే వికీడేటాలో లేని సమాచారాన్ని, ప్రస్తుత సమాచారపెట్టెలలోగల సమాచారంతో నింపి వాడాలి. మరిన్ని వివరాలకు ప్రకాశం జిల్లా పైలట్ ప్రాజెక్టు చూడండి. అర్జున (చర్చ) 01:52, 2 మే 2022 (UTC)
ఆంధ్రప్రదేశ్ అన్ని రెవెన్యూ గ్రామాలకు వికీడేటా ఆధారిత సమాచారపెట్టె మార్పుకు ఉదాహరణ
మార్చువికీపీడియా:రచ్చబండ#ఆంధ్రప్రదేశ్_రెవెన్యూ_గ్రామ_వ్యాసాలలో_సమాచారపెట్టెను_వికీడేటా_ఆధారితంగా_మార్చటం విషయానికి గొత్తివాడ గ్రామ ఉదాహరణ. తొలిగా వున్నది వికీడేటా ఆధారిత సమాచారపెట్టె, తరువాత వున్నది ప్రస్తుత సమాచారపెట్టె. యాధృచ్చికంగా తీసుకున్న ఈ వ్యాసం పటంలో ఈ గ్రామానికి తెలుగు పేరు కనబడుటలేదు కాని, చాలా ఇతర గ్రామాలకు ఎక్కువ జూమ్ స్థాయి అనగా గ్రామ పరిసరాలు కనబడేటట్ల జూమ్ చేసినప్పుడు తెలుగు పేరు కూడా కనబడతాయి. తక్కువ జూమ్ లో తెలుగు పేర్లు కనబడడంలో దోషమున్నందున బగ్నివేదించబడింది.
{{Infobox India AP Village|qid=Q12995992}}
గొత్తివాడ | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°47′46″N 83°06′13″E / 17.796026°N 83.103517°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి |
మండలం | కోట ఉరట్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 531085 |
ఎస్.టి.డి కోడ్ |
అర్జున (చర్చ) 10:05, 11 జూన్ 2024 (UTC)
- @Arjunaraoc గారూ ఈ చర్చలో మీరు సూచించిన సమాచారపెట్టెపై అభిప్రాయాలు లేదా స్పందవలు తెలియచేయటానికి ప్రస్తుతం ఎన్నికలు వ్యాసాలు తాజాసవరింపులు, కాలానుగుణంగా సృష్టించవలసిన వ్యాసాలు పనిలో బిజీగా ఉన్నందున నాకు సమయం పట్టింది.నేను మీ దృష్టికి తీసుకురావలసిన స్పందనలు,లేదా అభిప్రాయాలు ఉన్నవి.అందువలన నాకు ఒకవారం రోజులు సమయం పట్టింది గమనించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 11:25, 11 జూన్ 2024 (UTC)
తాజా పరచిన సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామలలో అమలు
మార్చుఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామాలన్నిటిలో వికీడేటా ఆధారిత సమాచారపెట్టె {{Infobox India AP Village}} చేర్చడం జులై 1, 2024 నాడు పూర్తయింది. (మరింత సమాచారం) --అర్జున (చర్చ) 04:28, 2 జూలై 2024 (UTC)
- @Arjunaraoc గారూ ఈ దిగువ వివరించిన 30 ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామాలలో తాజాపరచిన సమాచారపెట్టె కూర్పు కాలేదు.దానికి కారణం వాటికి వికీడెటా లింకు లేదు.గమనించగలరు.
- గెంజిగెడ్డ-2 (చింతపల్లి)
- గొడ్డువెలగల
- గార్లమడుగు
- గార్లదిన్నె (ప్యాపిలి)
- కులబీరు-2
- కుమ్మరిపుట్టు-2
- కాగువలస-2 (అరుకులోయ)
- కోవూరుపల్లి
- కొల్లేరు (గ్రామం)
- కొర్రగూడ-3
- కొర్రగూడ-2
- కొమరగిరిపట్నం
- కొదపుట్టు-1
- కొత్తవలస-3 (అరకులోయ)
- కొత్తవలస -4 (అనంతగిరి)
- కొత్తవలస -1 (అనంతగిరి)
- చింతరాజుపల్లి (వరరామచంద్రపురం)
- చీడివలస - 2 (అనంతగిరి)
- తోటవలస-3 (అరుకులోయ)
- తోటవలస-2 (అరుకులోయ)
- తిరుపతిరాజుపేట
- తిరుఅన్నారం
- దొనరాయి
- దేవలచెరువు (ములకలచెరువు)
- నల్లరాళ్లపల్లి (గంగాధర నెల్లూరు)
- పందిరిమామిడి -2 (అనంతగిరి)
- బొడ్డపుట్టు-3 (హుకుంపేట)
- బసివిరెడ్డిపల్లె-2
- బర్నగూడ
- బొద్దపుట్టు (ముంచంగిపుట్టు)
యర్రా రామారావు (చర్చ) 03:01, 4 జూలై 2024 (UTC)
- @యర్రా రామారావు గారు, సమస్యాత్మక గ్రామాల తెలిపినందులకు ధన్యావాదాలు. /villages with issues-1 లో మీరు ఇచ్చిన వ్యాసపేజీలు, వాటిలో గల లొకేషన్ కోడ్, దానికి సరిపడే వికీడేటా అంశం, అనుసంధానించిన తెలుగు వికీ వ్యాసం లింకు చేర్చాను. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన వాటి సమస్య పరిష్కారానికి ఆ జిల్లా కు సంబంధించి ఎక్కవగా కృషిచేస్తున్న @Saiphani02 గారిని తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. మిగతా వాటిని నేను పరిశీలిస్తాను. అర్జున (చర్చ) 05:31, 4 జూలై 2024 (UTC)
- @Arjunaraoc మీ చర్యలకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:38, 4 జూలై 2024 (UTC)
- @యర్రా రామారావు గారు, అల్లూరి సీతారామరాజు జిల్లా తప్ప, మిగతావి పరిష్కరించాను. అర్జున (చర్చ) 06:40, 6 జూలై 2024 (UTC)
- @Arjunaraoc గారూ సరేనండీ. యర్రా రామారావు (చర్చ) 13:43, 6 జూలై 2024 (UTC)
- @యర్రా రామారావు గారు, అల్లూరి సీతారామరాజు జిల్లా తప్ప, మిగతావి పరిష్కరించాను. అర్జున (చర్చ) 06:40, 6 జూలై 2024 (UTC)
- @Arjunaraoc మీ చర్యలకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:38, 4 జూలై 2024 (UTC)