శుభాకాంక్షలు (సినిమా)

1997 సినిమా

శుభాకాంక్షలు జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రధారులుగా నటించి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1997 లో విడుదలైన కుటుంబ కథా చిత్రం.[1] ఈ సినిమాకు మాతృక విజయ్ కథానాయకుడిగా నటించిన పూవే ఉనక్కాగ అనే తమిళ సినిమా.[2]

శుభాకాంక్షలు
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
రచనవిక్రమన్ (కథ),
భీమినేని శ్రీనివాసరావు (చిత్రానువాదం),
మరుధూరి రాజా (సంభాషణలు)
దీనిపై ఆధారితంపూవే ఉనక్కాగ (తమిళం)
నిర్మాతఎన్. వి. ప్రసాద్
శానం నాగ అశోక్ కుమార్
తారాగణంజగపతి బాబు,
రాశి,
రవళి
ఛాయాగ్రహణంమహీందర్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జనవరి 14, 1997 (1997-01-14)
భాషతెలుగు

క్రైస్తవ మతానికి చెందిన స్టీఫెన్, హిందూ మతానికి చెందిన సీతారామయ్య కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తుంటారు. వీరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంటుంది. వాళ్ళిద్దరి అబ్బాయిలు మోసెస్, బలరామయ్యలు కూడా అంతే స్నేహంగా మెలుగుతుంటారు. మోసెస్ తమ్ముడు రాబర్ట్, బలరామయ్య చెల్లెలు జానకి ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ కుటుంబాలు వీరిద్దరి ప్రేమను అంగీకరించకపోవడంతో దూరంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది.

25 సంవత్సరాల తర్వాత చందు అనే వ్యక్తి గోపి అనే స్నేహితుడితోఈ పాటు ఆ ఊరు వచ్చి తను రాబర్ట్, జానకిల కొడుకునని అందరితో చెబుతాడు. వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి అందరూ భయపడితే నాదబ్రహ్మం అనే అతను మాత్రం పిలిచి తన ఇంట్లో ఉండమంటాడు. చందు నెమ్మదిగా ఇద్దరి కుటుంబాలతో పరిచయం పెంచుకుని అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకసారి స్టీఫెన్, సీతారామయ్య భార్యలిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు చందు కోసం పెళ్ళి సంబంధం తెస్తారు. వాళ్ళిద్దరి బారినుంచి తప్పించుకోవడం కోసం చందు తనకి ఇదివరకే నిర్మలా మేరీ అనే అమ్మాయితో వివాహం అయిందని అబద్ధం చెబుతాడు. కానీ ఉన్నట్టుండి నిర్మలా మేరీ అనే పేరుతో ఒక అమ్మాయి ఇతని కోసం వచ్చి తానే అతని భార్య అని చెబుతుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: భీమనేని శ్రీనివాసరావు

కధ: విక్రమన్

సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ, భువన చంద్ర,సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: ఎస్ ఎ.రాజకుమార్

మాటలు: మరుదూరి రాజా

చిత్రానువాదo: భీమనేని శ్రీనివాసరావు

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రేణుక, మనో, సుజాత, ఎస్.ఎ.రాజకుమార్

ఛాయా గ్రహణం: మహీంధర్

కూర్పు: గౌతంరాజు

నిర్మాత: ఎన్.వి. ప్రసాద్_శానం నాగ అశోక్ కుమార్

నిర్మాణ సంస్థ: శ్రీదేవి ప్రొడక్షన్స్

విడుదల:14:01:1977.

నిర్మాణం

మార్చు

పూవే ఉనక్కాగ అనే తమిళ సినిమా ఈ సినిమాకి మాతృక. ఇందులో విజయ్ కథానాయకుడిగా నటిస్తే తెలుగులో జగపతి బాబు నటించాడు. విజయ్ పక్కన చార్లీ నటుడు స్నేహితుడిగా నటిస్తే తెలుగులో ఈ పాత్రలో సుధాకర్ నటించాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమా కథలో చాలా మార్పులు చేశారు. ఇందులో భాగంగా సుధాకర్ పాత్రను బాగా అభివృద్ధి చేశారు. సినిమా విజయంలో సుధాకర్ పోషించిన గోపి పాత్ర ముఖ్యమైంది.[2]

పాటలు

మార్చు
పాట పాడిన వారు రాసిన వారు
ఆనందమానంద మాయె బాలు సామవేదం షణ్ముఖ శర్మ
ఆనందమానంద మాయె చిత్ర సామవేదం షణ్ముఖ శర్మ
గుండె నిండా గుడి గంటలు బాలు, రేణుక సిరివెన్నెల
మనసా పలకవే బాలు, చిత్ర సిరివెన్నెల
అద్దంకి చీర కట్టే ముద్దుగుమ్మా బాలు, చిత్ర సిరివెన్నెల
పంచవన్నెల చిలక నిన్ను మనో, సుజాత సిరివెన్నెల
ఓ పూరి పానిపూరి ఎస్.ఏ రాజ్ కుమార్ భువన చంద్ర

మూలాలు

మార్చు
  1. "Subhakankshalu Cast and Crew - Telugu Movie". Apunkachoice.com. Archived from the original on 2013-07-15. Retrieved 2012-09-07.
  2. 2.0 2.1 విలేకరి. "ఉత్తముడైన గోపీ!". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 17 October 2016.