పెళ్ళి సందడి (1996 సినిమా)
పెళ్ళిసందడి 1996 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన కుటుంబ, ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.
పెళ్ళి సందడి | |
---|---|
![]() | |
దర్శకత్వం | కె. రాఘవేంద్రరావు |
నిర్మాత | అశ్వనీ దత్, అల్లు అరవింద్ |
నటులు | శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
ఛాయాగ్రహణం | వి. జయరాం |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదారు | గీతా ఆర్ట్స్ |
విడుదల | జనవరి 12, 1996 |
నిడివి | 129 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథసవరించు
విజయ్ ది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి, ముగ్గురు అక్కలు, బావలతో కలిసి నివసిస్తుంటాడు. పెళ్ళి వయసు రావడంతో తండ్రి అతన్ని తొందరగా పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తుంటాడు. ఆ పనిని తన ముగ్గురు అల్లుళ్ళకు అప్పజెబుతాడు. విజయ్ మాత్రం తనకు కలలో కనిపించిన స్వప్న సుందరిని మాత్రమే పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. అతని బావలు పోలికలు చెప్పమని అడిగితే బొడ్డు పక్కన ఉన్న పుట్టుమచ్చ ఉందని మాత్రమే చెబుతాడు. అలాంటి అమ్మాయి వెతకడం అసంభవం అనీ ఆ ఆలోచన మానుకోమని సలహా ఇస్తారు. విజయ్ తండ్రి తెలిసిన వాళ్ళ ద్వారా దగ్గర్లోనే ఉన్న మరో సంబంధం మాట్లాడతాడు. విజయ్ అయిష్టంగానే పెళ్ళి చూపులకు వెళతాడు. తీరా వెళ్ళాక ఆ సంబంధం వద్దనడానికి అతనికి ఏ కారణం కనిపించదు. అతని ఆలోచనలతో సంబంధం లేకుండా నిశ్చితార్థం జరిగిపోతుంది.
ఒకసారి విజయ్ బంధువుల పెళ్ళికి తన బావలతో కలిసి వెళతాడు. అక్కడ తన స్వప్న సుందరి లక్షణాలను పోలిన అమ్మాయిని కనపడుతుంది కానీ మళ్ళీ ఆమె జాడ కానరాదు. విజయ్ ఎలాగైన ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. విజయ్ కి ఊటీలో సంగీత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వస్తుంది. స్వప్న మళ్ళీ ఆ విద్యార్థుల్లో ఒకరిగా కనిపిస్తుంది. విజయ్ స్వప్న ప్రేమలో పడతారు.
తారాగణంసవరించు
- విజయ్ గా శ్రీకాంత్
- స్వప్న దీప్తి భట్నాగర్
- కల్యాణి గా రవళి
- విజయ్ తండ్రి కైకాల సత్యనారాయణ
- విజయ్ బావ గా బ్రహ్మానందం
- విజయ్ బావ గా తనికెళ్ళ భరణి
- విజయ్ బావ గా శివాజీ రాజా
- ఏవీఎస్
- బాబు మోహన్
- మన్నవ బాలయ్య
- రాజా రవీంద్ర
- చిట్టి బాబు
- అనంత్
- శ్రీలక్ష్మి
పురస్కారాలుసవరించు
- ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం. ఎం. కీరవాణికి ఫిల్మ్ ఫేర్ (తెలుగు) పురస్కారం
- ఉత్తమ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నంది పురస్కారం
- ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం. ఎం. కీరవాణికి నంది పురస్కారం
- ఉత్తమ నృత్య దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నంది పురస్కారం
పాటలుసవరించు
- సౌందర్యలహరి, స్వప్నసుందరి
- రమ్యకృష్ణ లాగ ఉంటదా
- హృదయమనే కోవెలలో వెలిగే దీపం
- సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
- నవమన్మథుడా అతి సుందరుడా నిను వలచిన ఆ ఘనుడు
సంభాషణలుసవరించు
- కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా? ఇంకోసారి కాఫీలు తాగుతారా, ఇంకోసారి టిఫినీలు చేస్తారా?