రాపర్ల(పామర్రు మండలం)

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, పామర్రు మండలం లోని గ్రామం

రాపర్ల, కృష్ణాజిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం.

రాపర్ల
—  రెవిన్యూ గ్రామం  —
రాపర్ల is located in Andhra Pradesh
రాపర్ల
రాపర్ల
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°18′30″N 80°57′45″E / 16.308366°N 80.962417°E / 16.308366; 80.962417
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 998
 - పురుషులు 504
 - స్త్రీలు 537
 - గృహాల సంఖ్య 255
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

ఇదే పేరుగల ప్రకాశం జిల్లాలోని మరియొక రాపర్ల గ్రామం కొరకు, రాపర్ల చూడండి.

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, మొవ్వ.

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషతు ప్రాథమికోన్నత పాఠశాల, రాపర్ల

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార పరపతి సంఘం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలై-13వ తేదీన ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి పోతన కమలకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పామర్తి లక్ష్మీనారాయణ ఎన్నికైనారు. వీరు 2016,జనవరి-30న, అనారోగ్య కారణాలతో, తన పదవికి రాజీనామా చేసారు. శ్రీ కొడాలి సుదర్శనరావు, 2016,అక్టోబరు-28న, ఉప సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2],[5]&[7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గణ్యశ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం రాపర్ల అడ్డరోడ్డువద్ద ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేసెదరు. [4]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంసవరించు

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016,మార్చ్-4వ తేదీ శుక్రవారంనాడు, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అక్షివిమోచనం, సర్వకుందేశు, అఘారం, పంచగవ్యాధివాసం, ఆదివాసం, హోమం, క్షీరాధివాసం, జలాధివాసం, ప్రభూత బలి ప్రదానం నిర్వహించారు. 5వ తేదీ శనివారంనాడు, విగ్రహప్రతిష్ఠ భక్తిశ్రద్ధలతో అత్యంతఘనంగా నిర్వహించారు. ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ధాతున్యాసం, రత్నన్యాసం, తదుపర్ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలోని ఎస్.సి.కాలనీలోగల పేద మహిళలందరూ కలిసి, అంబేడ్కర్ డ్వాక్రా మహిళా ఉత్పత్తుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, హ్యాండ్ బ్యాగుల శిక్షణలో తర్ఫీదుపొంది, ఆ ప్రక్రియలో నైపుణ్యాన్ని సాధించి, హ్యాండ్ బ్యాగులను తయారుచేయుచూ, ఆర్థిక స్వావలంబన కోసం, చేయీ చేయీ కలిపి అడుగులు వేయుచున్నారు. త్వరలో వీరు నాబార్డు ద్వారా తమ ఉతోత్తులను విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. [3]

ఈ గ్రామంన కాకర్ల వంశస్థులు ఎక్కువుగ ఉందురు.

3-11-2019 న విజయవాడలోని భవానీపురంలో నిర్వహించిన ఆరవ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో, ఈ గ్రామానికి చెందిన కాకర్ల వేణుగోపాలకృష్ణ, కాకర్ల శివగణేష్ అను యువకులు పోటీచేసి, బ్లాక్ బెల్ట్ విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. [8]

గణాంకాలుసవరించు

జనాభా (2001) - మొత్తం 1,041 - పురుషుల సంఖ్య 504 - స్త్రీల సంఖ్య 537 - గృహాల సంఖ్య 255;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1041.[3] ఇందులో పురుషుల సంఖ్య 504, స్త్రీల సంఖ్య 537, గ్రామంలో నివాస గృహాలు 255 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Raparla". Retrieved 30 June 2016. External link in |title= (help)[permanent dead link]
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-9; 27వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-31; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-20; 27వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2016,జనవరి-31; 29వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-6; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,అక్టోబరు-29; 2వపేజీ. (8) ఈనాడు అమరావతి,4-11-2019,పామర్రు నియోజకవర్గం పేజీ.