రెడ్యా నాయక్

(రెడ్యానాయక్ నుండి దారిమార్పు చెందింది)

ధరంసొతు రెడ్యానాయక్ వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాజీ రాష్ట్ర మంత్రి, జిల్లా రాజకీయ నాయకుడు. డోర్నకల్ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభ సభ్యుడుగా గెలుపొందాడు.[1][2]

డి. ఎస్. రెడ్యా నాయక్
రెడ్యా నాయక్

రెడ్యానాయక్ చిత్రపటము

నియోజకవర్గం డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం

రెడ్యానాయక్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-08-20) 1952 ఆగస్టు 20 (వయసు 72)
ఉగ్గంపల్లి మరిపెడ వరంగల్ జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి లక్ష్మీ
సంతానం ఇద్దరు కుమారులు ఒక కుమార్తె (మాలోత్ కవిత)మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం Ex.MLA[2009].
మతం హిందూ మతము

జీవిత విశేషాలు

మార్చు

రెడ్యానాయక్ 1952 ఆగస్టు 20లో మహబూబాబాదు  జిల్లా, చిన్నగూడూర్ మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలో రామ్ నాయక్ కు జన్మించాడు.[3] అతను ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు.[4] లక్ష్మీ తో వివాహం జరిగింది, వారికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు.

రాజకీయ జీవితం

మార్చు

ఉగ్గంపల్లి సర్పంచ్ గా ఎన్నికైన రెడ్యానాయక్ అధ్యక్షుడు, పంచాయితీ సమితి, వ్యవసాయ మార్కెట్. డైరెక్టర్,మరిపెడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు,AP శాసన అసెంబ్లీ S.T. ఛైర్మన్, కమిటీ 3 సంవత్సరాలు సంక్షేమ సభ్యుడు, AP శాసన, మాజీ కాంగ్రెస్ మంత్రి,2014లో మళ్లీ 5వ సారీ MLA గా అసెంబ్లీలో డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయవేత్త డిఎస్ రెడ్యానాయక్[5].

డోర్నకల్ గెలుపు, ఓటములు

మార్చు
  • 2018 లో 17,281 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు
  • 2014 101 డోర్నకల్ (ఎస్టీ) దరంసోత్ రెడ్యానాయక్ 1,64,681 సత్యవతి రాథోడ్ 1,41,150
  • 2009 101 డోర్నకల్ (ఎస్టీ)) సత్యవతి రాథోడ్ టిడిపి 69282 దరంసోత్ రెడ్యానాయక్ 64659
  • 2004 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 72669 బనోత్ జయంత్ నాథ్ టిడిపి 53529
  • 1999 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 56339 నరేష్ రెడ్డి నోకల టిడిపి 48303
  • 1994 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 53274 నోకల నరేష్ రెడ్డి ఇండియా 27180
  • 1989 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 46645 సత్యవతి రాథోడ్ టిడిపి 41560.

కుమార్తె కవిత

మార్చు

తన కుమార్తె మాలోత్ కవిత, మహబూబాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2009 లో గెలుపొందారు[6].

యం.యల్.ఎ గా ఓటమి

మార్చు

2009 ఎన్నికలలో రెడ్యానాయక్ ఓటమిచెందారు. యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్ గెలిచారు... 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్ పోటీ చేయగా[7] కాంగ్రెస్ పార్టీ నుండి డిఎస్ రెడ్యా నాయక్, భారతీయ జనతా పార్టీ తరఫున పరశురాం నాయక్, ప్రజారాజ్యం పార్టీ తరఫున బానోతు సుజాత పోటీచేశారు.[8]. 2014లో తెలంగాణగా రాష్ట్రం విడిపోయింది. యం.యల్.ఎగా సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీ తరఫున పోటీలో 2014 ఓటమిచెందారు. కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడింది[9].

శాసనసభ్యునిగా

మార్చు

2014 5వ సారీ MLA గా అసెంబ్లీలో డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు రెడ్యానాయక్[10].

టీఆర్ఎస్ లో చేరారు

మార్చు

రెడ్యానాయక్ టీఆర్ ఎస్ తీర్దంపుచ్చుకున్నారు.కేసిఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కవితతో పాటు టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.ఆయనతోపాటు డోర్నకల్,మహాబూబాబాద్,నియోజక వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టీఆర్ ఎస్ లో చేరారు.[11]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-30.
  2. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-18. Retrieved 2015-12-30.
  4. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  5. http://www.elections.in/telangana/assembly-constituencies/dornakal.html[permanent dead link]
  6. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/redya-naik-loses-daughter-wins/article284155.ece
  7. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  8. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  9. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html[permanent dead link]
  10. https://www.youtube.com/watch?v=Y7MQK9f4DOI
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-14. Retrieved 2015-12-30.

బయటి లింకులు

మార్చు