రెసెర్పిన్
రెసెర్పిన్ ఒక ఆల్కలాయిడ్. దీని రసాయనిక ఫార్ములాC33H40N2O9, ఇది రౌవోల్ఫియా సర్పెంటినా అనే మొక్క వేరు నుండి లభించును.దీనిని రక్తపోటు చికిత్సలో ఉపయోగిస్తారు.[1]అధిక రక్తపోటు చికిత్సకు రెసెర్పిన్ ఉపయోగించబడుతుంది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నరోగులలో తీవ్రమైన ఆందోళనకు చికిత్స చేయడానికి కూడా ఇది ఉపయోగించ బడుతుంది.రెసెర్పిన్ ఆల్కలాయిడ్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది నాడీ వ్యవస్థ యొక్క కార్యకలాపాలను మందగింప చెయ్యడంద్వారా పనిచేస్తుంది,దీని వలన హృదయ స్పందన మందగిస్తుంది మరియు రక్త నాళాలు విశ్రాంతిస్థితిని పొందుతాయి. ఇది యాంటీహైపెర్టెన్సివ్ మరియు యాంటిసైకోటిక్ అలాగే పరిశోధనా సాధనంగా ఉపయోగించబడింది, అయితే దాని ప్రతికూల ప్రభావాలు దాని యొక్క చికిత్సా వాడకాన్ని పరిమితం చేసాయి.[2] 1 mg కంటే ఎక్కువ మోతాదు రెసెర్పైన్ కలిగిన అన్ని నోటి ద్వారా తీసుకునే మందుల ఉత్పత్తుల ఉపయోగం పై FDA తన ఆమోదాన్ని ఉపసంహరించుకుంది.[3] సాధారణంగా మరియు అధిక రక్తపోటు నివారణకుదీర్ఘకాలిక చర్య కోసం దాని ప్రభావాన్ని పెంచడానికి అలాగే మందు దుష్ప్రభావాలను తగ్గించడానికి దాని సారం(extract) లేదా ఉత్పన్నాల(products) కంటే దీని వేరు పొడి (సర్పగంధ చూర్ణం అని పిలుస్తారు) ఉపయోగించడం ఉత్తమం అని ఆయూర్వేద వైద్యుల అభిప్రాయం.[4]పాము మరియు కీటకాల కాటు, జ్వరసంబంధమైన పరిస్థితులు, మలేరియా, కడుపునొప్పి మరియు విరేచనాలతో సహా అనేక రకాల వ్యాధుల చికిత్సకు శతాబ్దాలుగా భారతదేశంలోని జానపద వైద్యంలోసర్ప గంధ (R సర్పెంటినా)ఉపయోగించబడింది.[5]
[[file:|320px|alt=]] | |
---|---|
[[file:|320px|alt=]] | |
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
methyl (3β,16β,17α,18β,20α)-11,17-dimethoxy-18-[(3,4,5-trimethoxybenzoyl)oxy]yohimban-16-carboxylate and | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Serpasil, others |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | Consumer Drug Information |
MedlinePlus | a601107 |
లైసెన్స్ సమాచారము | US FDA:link |
ప్రెగ్నన్సీ వర్గం | C |
చట్టపరమైన స్థితి | Rx-only (banned/discontinued in some countries) |
Routes | Oral |
Pharmacokinetic data | |
Bioavailability | 50% |
మెటాబాలిజం | gut/liver |
అర్థ జీవిత కాలం | phase 1 = 4.5h, phase 2 = 271h, average = 33h |
Excretion | 62% feces / 8% urine |
Identifiers | |
CAS number | 50-55-5 |
ATC code | C02AA02 |
PubChem | CID 5770 |
IUPHAR ligand | 4823 |
DrugBank | DB00206 |
ChemSpider | 5566 |
UNII | 8B1QWR724A |
KEGG | D00197 |
ChEBI | CHEBI:28487 |
ChEMBL | CHEMBL772 |
Chemical data | |
Formula | C33H40N2O9 |
| |
| |
(what is this?) (verify) |
రౌవోల్ఫియా సర్పెంటినా మొక్క -ఆవాసం
మార్చురౌవోల్ఫియా సర్పెంటినా అనే మొక్క. ఇది అపోసైనేసికుటుంబానికి చెందిన మొక్క.ఈ మొక్కను ఇంగ్లీసులో ఇండియన్ స్నేక్ రూట్(indian snake wood) అనికూడా అంటారు.భారతీయ భాషలలో సర్పగంధ అంటారు. తెలుగులో సర్పగంధ మరియు పాతాళ గరుడ అని పిలుస్తారు.సర్పగంధ సతత హరిత శాశ్వత పొద.ఇది భారతదేశం, బర్మా, శ్రీలంక, చైనా అలాగే పాకిస్తాన్‌లకు చెందిన మొక్క.భారతదేశంలో, ఇది బీహార్,పంజాబ్, ఒరిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు మహారాష్ట్రలలో కనిపిస్తుంది.[4]
రెసెర్పిన్ మొక్క నుండి వేరుచేయబడిన చరిత్ర
మార్చురెసెర్పిన్ (1958) వాస్తవానికి 1952లో రాబర్ట్ బర్న్స్ వుడ్‌వార్డ్ (Robert Burns Woodward)చేత రౌవోల్ఫియా సర్పెంటినా నుండి వేరుచేయబడింది. ఇది ఒకప్పుడు అధిక రక్తపోటు మరియు సైకోటిక్ ఎపిసోడ్‌లకు చికిత్సగా ఉపయోగించబడింది, అయితే తక్కువ దుష్ప్రభావాలు వున్న కొత్త ఔషధాల వాడకం ద్వారాదీనివాడకం తగ్గిపోయింది.[6]రౌవోల్ఫియా సర్పెంటినా వేర్లను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీని వేర్లు అత్యధిక మొత్తంలో క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి యాంటీ యాంగ్జైటీ, సెడేటివ్, యాంటీహైపెర్టెన్సివ్ మరియు రిలాక్సింగ్ ఎఫెక్ట్స్‌గా ప్రయోజనకరంగా ఉంటాయి.[4] ఈ మొక్కను 1940 లలో భారతదేశం అంతటా అనేక మంది వైద్యులు ఉపయోగించారు మరియు 1950 లలో యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించారు.డిప్రెషన్ మరియు క్యాన్సర్‌తో సహా ప్రతికూల దుష్ప్రభావాలు దీని వాడకం తో సంబంధం కలిగిఉన్నందున క్రమం గా ఇది ప్రజాదరణ కోల్పోయింది.[7] భారతదేశంలో ప్రయాణించేటప్పుడు మొక్కలను అధ్యయనం చేసిన 16వ శతాబ్దపు జర్మన్ వైద్యుడు డాక్టర్ లియోన్‌హార్డ్ రౌవోల్ఫ్ గౌరవార్థం మొక్క జాతికి రౌవోల్ఫియా అని పేరు పెట్టారు.సర్పెంటినా(సర్ప గంధ) దాని పొడవైన,కుచించుకుపోయిన, పాము లాంటి వేరుల కారణంగా అధ్యయనం కోసం ఎంపిక చేయబడింది.[8]భారత రాజకీయ నాయకుడు మహాత్మా గాంధీ సర్ప గంధ వేర్ల కషాయాన్ని వాడినట్లు తెలిసింది, అతను సాయంత్రం పూట బిజీగా, అతిగా ఉత్తేజితమైన రోజు తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి టీని తయారు చేసి తాగేవాడు.[9][10]ఇది గర్భాశయ ఉద్దీపన, జ్వరసంబంధమైన మరియు పిచ్చితనానికి నివారణగా కూడా ఉపయోగించబడింది. క్రీ.పూ. 1000 నాటికే భారతీయ మాన్యుస్క్రిప్ట్‌లలో ఈ మొక్క ప్రస్తావించబడింది మరియు దీనిని సర్పగంధ మరియు చంద్రిక అని కూడా పిలుస్తారు.[5]భారతీయ వైద్యుడు రుస్తోమ్ జల్ వాకిల్ పాశ్చాత్య వైద్యంలోసర్ప గంధను పరిచయంచేశాడు.అతను 1939 నుండి 1949 వరకు 10 సంవత్సరాల పాటు సర్పగంధ తో చికిత్స పొందిన రోగుల సమాచారాన్ని సేకరించాడు. 1949లో, అతను బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో R సర్పెంటినా యొక్క యాంటీహైపెర్టెన్సివ్ లక్షణాలపై వాటర్‌షెడ్ పేపర్‌ను ప్రచురించాడు.1949 నాటికి, 90% కంటే ఎక్కువ మంది భారతీయ వైద్యులు అధిక రక్తపోటు చికిత్సలో సర్ప గంధను ను ఉపయోగించారు . వకీల్ యొక్క మొదటి నివేదిక తర్వాత, ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ శాస్త్రీయ కథనాలు ప్రచురించబడ్డాయి[11][12]
సర్పగంధ మొక్క వేర్లలోని ఇతర ముఖ్యమైన రసాయన సమ్మేళనాలు
మార్చుకిందిరసాయన సమ్మేళనాలు సర్పగంధ మొక్క వేర్లలో కనిపిస్తాయి:[7]
- రెసరపైన్
- రెసరిపిలిన్
- సర్పెంటైన్
- అజ్మలైన్
- అజ్మాలిసిన్
- అజ్మాలిమిన్
- అరిసిన్
- కొరినాంథైన్
- డెసర్పిడిన్
- రెసిన్నమైన్
- రెసినామిడిన్
- ఐసోరెస్సర్పైన్
- ఐసో రెసరిపిలిన్
- ఇండోబైన్
- ఇండోబినైన్
- సర్పెంటినినైన్(SERPENTININE)
- యోహింబైన్
సర్పగంధ మొక్క ఆల్కహాల్‌లు, చక్కెరలు మరియు గ్లైకోసైడ్‌లు, కొవ్వు ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్‌లు, ఫైటోస్టెరాల్స్, ఒలియోరెసిన్‌లు, స్టెరాయిడ్స్, టానిన్‌లు మరియు ఆల్కలాయిడ్స్‌తో సహా అనేక రకాల ఫైటోకెమికల్‌లను కలిగి ఉన్నది.మొక్కలో కనిపించే అతి ముఖ్యమైన ఆల్కలాయిడ్లు ఇండోల్ ఆల్కలాయిడ్స్, వీటిలో 50 కంటే ఎక్కువ ఆల్కలాయిడ్లు మొక్కలో వేరుచేయబడ్డాయి.[13]ఇండోల్ ఆల్కలాయిడ్స్ అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ నుండి ఏర్పడిన నత్రజని సమ్మేళనాల సమూహం.ఇవి 1 నైట్రోజన్ అణువుతో సాధారణ 5 మరియు 6 కార్బన్ హెటెరోసైక్లిక్ రింగ్ నిర్మాణాన్ని పంచుకుంటాయి.[14][15]కాండం మరియు ఆకులతో సహా మొక్క యొక్క అన్ని భాగాలలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి, అయితే అవి వేరు బెరడులో అత్యధిక పరిమాణం లో కనిపిస్తాయి.[16]ఆల్కలాయిడ్స్ యొక్క ఖచ్చితమైన గాఢత మారుతూ ఉంటుంది. మొత్తం ఆల్కలాయిడ్స్ యొక్క దిగుబడి మొక్క యొక్క పొడి బరువులో 0.8% నుండి 1.3% వరకు ఉంటుందని ఒక అధ్యయనం కనుగొంది.[17]
మొక్కలొ రెసెర్పిన్ శాతం/పరిమాణం
మార్చుమొక్క యొక్క ప్రధాన ఆల్కలాయిడ్లలోరెసెర్పైన్ ఒకటి. ఆ రెసర్పైన్ పరిమాణం వేరులో ఎక్కువగా మరియు కాండం మరియు ఆకులలో తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది.[16]ఇది మొక్కలో అత్యంత ప్రబలమైన ఇండోల్ ఆల్కలాయిడ్ అని శాస్త్రవేత్తలు విశ్వసించారు; అయితే, వివిధ పరీక్షలు ఆ వాదనను సవాలు చేశాయి.మొక్కలోని రెసెర్పైన్ యొక్క సాంద్రత/శాతం మొక్క యొక్క పొడి బరువులో 0.03% నుండి 0.14% వరకు ఉందని కనుగొనబడింది.[18]వివిధ మొక్కలలో వేరు యొక్క రెసర్పైన్ పదార్థం 0.038% నుండి 0.14% వరకు ఉం దని అదే అధ్యయనం కనుగొంది.ఒక అధ్యయనంలో, ఒక గ్రాము వేరులో వున్న మొత్తం ఆల్కలాయిడ్స్ 496 మి.గ్రా లలో 33 మి. గ్రా రెసర్పైన్ పదార్థం ఉంది.[19]సర్పగంధవేరు యొక్క మరొక అధ్యయనంలో, రెసర్పైన్ రసాయనం 0.955 మి. గ్రా /గ్రాం వున్నట్లు తెలిసింది.[20]మొక్కలోని కెనెసిన్, డెసెర్పిడిన్, రీకానెస్సిన్ మరియు రెసిన్నమైన్ వంటి ఇతర ఆల్కలాయిడ్‌లు కూడా జీవరసాయన ఔషధ చర్యలను కలిగి ఉన్నట్లు గుర్తించబడ్డాయి.
ఔషధ శాస్త్రం లో రెసెర్పిన్
మార్చుసర్ప గంధలోవున్న ఆల్కలాయిడ్ లలో అత్యంత విస్తృతంగా అధ్యయనం చేయబడిన ఆల్కలాయిడ్ రెసెర్పైన్.సేన్ మరియు బోస్‌లచే ఇండియన్ మెడికల్ జర్నల్‌లో 1931లో రిసర్పైన్‌పై మొట్టమొదటి ఆధునికని ఆధ్యాయన వేదిక ప్రచురించబడింది.[21]ఇది మొదటిసారిగా 1950లో రాబర్ట్ వాలెస్ విగ్గిన్స్ చేత వేరుచేయబడి ఉపయోగించబడింది.1952లో, స్విట్జర్లాండ్‌లోని CIBA ల్యాబ్స్ (ఇప్పుడు నోవార్టిస్) రెసెర్పైన్ రసాయన శాస్త్రం మరియు ఫార్మకాలజీపై మొదటి పూర్తి నివేదికను ప్రచురించింది.[22] [21]నోటి ద్వారా తీసుకున్న తర్వాత, రెసెర్పైన్ యొక్క జీవ లభ్యత 50% మరియు 70% మధ్య ఉన్నట్లు నిర్ణయించబడింది, అయితే చాలా అధ్యయనాలు ఇది సుమారుగా 50% అని సూచించాయి.శోషణ చాలా వేగంగా ఉంటుంది, నోటి ద్వారా తీసుకున్న తర్వాత 1 మరియు 2 గంటల మధ్యశోషణ పూర్తి అవుతుంది అయితే 2 మరియు 4 గంటల మధ్య నెమ్మదిగా శోషణ జరిగినట్లు కొన్ని అధ్యయనాలలో నివేదించబడింది.
మెదడు కాలేయం, ప్లీహము, మూత్రపిండాలు మరియు కొవ్వు కణజాలానికి శరీరం అంతటా రెసెర్పైన్ విస్తృతంగా పంపిణీ చేయబడుతుంది.[23][24]ఎర్ర రక్త కణాలు మరియు పరిధీయ నాడీకణాలకు కూడా రెసెర్పైన్ విస్తృతంగా పంపిణీ చేయబడుతుందని ఇతర అధ్యయనాలు చూపించాయి.ఇది తల్లిపాలలో ఉన్నట్లు కూడా గుర్తించారు.రక్తంలో దాని ప్రారంభ సగం/అర్ధ జీవితం(half life) 4 నుండి 5 గంటల వరకు గమనించబడింది.దాని అర్ధ జీవితకాలం ప్లాస్మాలో తొలగింపు వ్యవధి 45 మరియు 168 గంటల మధ్య ఉన్నట్లు నిర్ణయించబడింది.దానిసగం-జీవితం సాపేక్షంగా దీర్ఘకాల తొలగింపుకు ప్రోటీన్లు మరియు ఎర్ర రక్త కణాలతో బంధించబడం కారణంగా నమ్ముతారు.హెపాటిక్ జీవక్రియ రెసెర్పైన్ యొక్క క్షీణతలో సుమారు 62% ఉంటుంది, అయితే మూత్రపిండాల తొలగింపు 8% కంటే తక్కువగా ఉంటుంది.మానవ దేహం నుండి రెసెర్పిన్ తొలగింపు చాలావరకు మల విసర్జన ద్వారా జరుగుతుంది.
రెసెర్పిన్ భౌతిక గుణాలు
మార్చుIUPAC పేరు: -methyl(1R,15S,17R,18R,19S,20S)-6,18-dimethoxy-17-(3,4,5-trimethoxybenzoyl)oxy-1,3,11,12,14,15,16,17,18,19,20,21-dodecahydroyohimban-19-carboxylate;
రెసెర్పిన్ ఇండోల్ ఆల్కలాయిడ్‌గా వర్గీకరించబడింది.ఇది తెలుపు నుండి పసుపు రంగులో ఉండే పొడి, ఇది కాంతికి గురైనప్పుడు ముదురు రంగులోకి మారుతుంది.[25]ఇది వాసన లేనిది,[26]నీటిలో కరగదు, ఆల్కహాల్‌లో కొద్దిగా కరుగుతుంది మరియు ఎసిటిక్ యాసిడ్‌లో పూర్తిగా కరుగుతుంది.దీని యొక్క రసాయన ఫార్ములాC33H40N2O9,పరమాణు ద్రవ్యరాశి609 గ్రా/మోల్ మరియు చేదురుచిని కలిగి ఉంటుంది.[27]
లక్షణం/గుణం | మితి/విలువ |
రసాయన ఫార్ములా | C33H40N2O9[28] |
అణుభారం | 608.679గ్రా /మోల్[28] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 264.5°C[28][29] |
మరుగు స్థానం | 655.12°C (స్థూల అంచనా)[30] |
సాంద్రత | 1.2336 (స్థూల అంచనా)[30] |
నీటిలో ద్రావణీయత | నీటిలో, 73 mg/l @ 30 °C[31] |
రెసెర్పిన్ ఉపయోగాలు
మార్చు- అధిక రక్తపోటు చికిత్సకురెసెర్పిన్ ఉపయోగించబడుతుంది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న రోగులలో తీవ్రమైన ఆందోళనకు చికిత్స చేయడానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది. ఇది నాడీ వ్యవస్థ యొక్క కార్యకలాపాలను మందగింప చెయ్యడం ద్వారా పనిచేస్తుంది, దీని వలన హృదయ స్పందన మందగిస్తుంది మరియు రక్త నాళాలు విశ్రాంతిస్థితి(విరామ స్థాయి)పొందుతాయి.[32]
- ఇది యాంటీహైపెర్టెన్సివ్ మరియు యాంటిసైకోటిక్ అలాగే పరిశోధనా మందుగా ఉపయోగించబడింది, అయితే దాని ప్రతికూల ప్రభావాలు దాని క్లినికల్ వాడకాన్ని పరిమితం చేసాయి.[33]
- అధిక రక్త పోటుకు పెద్దలకు మొదటి ఒకటి రెండు వారాలు 0.5 ం. గ్రా రోజుకు నోటిద్వారా మాత్రలుగా తీసుకోవాలి. ఆతరువాత రోజు 0.1-0.25 మీ. గ్రా రోజుకు, అలాగే పిల్లలు అయినా కేజీ బారువుకు 0.02 గ్రాముల చొప్పున 12 గంటలకు ఒకసారి చొప్పున ఇవాలి. అయితే రోజు మోతాదు 0.25 గ్రా దాటరాదు.[34]
- మానసిక రుగ్మతలు అయిన పెద్ద వారికి రోజుకు 0.5 మి. గ్రా ,అయితే రోగి మానసిక స్థితిని బట్టి 0.1-1 మి. గ్రా వరకు ఇవ్వవచ్చును.[34]
- టార్డివ్ డిస్స్కినియా చికిత్సకు 0.25 మి. గ్రా చొప్పున 6 గంటలకు ఒక పర్యాయం చొప్పున ఇవాలి0.1 నుండి 0.25 వరకు పెంచవచ్చు . అయితే రోజు మోతాదు 5 మి. గ్రాముల దాటరాదు.[34]
- ఇది ఒకప్పుడు స్కిజోఫ్రెనియా చికిత్సలో ఉపయోగించబడింది.[35]
దుష్పలితాలు
మార్చురెసెర్పిన్ వాడినపుడు కొందరిలో దుష్పలితాలు కలగవచ్చు.రెసెర్పిన్ వాడకం వలన మైకము, అలసట, వికారం, వాంతులు, అతిసారం, నెమ్మదిగా గుండె కొట్టుకోవడం మరియు ముక్కు మూసుకుపోవడం వంటివి సంభవించవచ్చు.ఈ ప్రభావాలు ఏవైనా కొనసాగితే లేదా అధ్వాన్నంగా ఉంటే, వెంటనేచికిత్స చేసిన డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ చెప్పాలి.ఈ మందులను ఉపయోగించే చాలా మంది వ్యక్తులలో తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడ లేదు.[36]రెసెర్పైన్ తీసుకునే కొంతమందిమనో వాక్యులత(depression)కు గురికావొచ్చు.అలాంటి రెసెర్పైన్ తీసుకోవడం ఆపివేసి, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించవలెను.అలాంటి వారిలో మానసిక స్థితి లేదా ప్రవర్తనలో అసాధారణ మార్పులు కలుగుతాయి. ఆకస్మిక శక్తి హీనత ఏర్పడీ లేదా తక్కువ స్వీయ-నూన్యత భావాలు ఏర్పడటం,గతంలో ఆనందించిన విషయాలపై ఆసక్తి కోల్పోవడం;పీడకలలు లేదా నిద్రరాకపోవడం వంటి సమస్యలు రావడం,తన్ను తాను బాధపెట్టుకునే ఆలోచనలు కలగడం వంటివి కన్పిస్తాయి. అప్పుడు సదరు వ్యక్తిని వెంటనే డాక్టరు వద్దకు తీసుకుని వెళ్ళాలి.[37]
పాలిచ్చేతల్లులు రెసెర్పిన్ వాడకపోవడం మంచిది.తల్లులపై నిర్వహించిన అధ్యాయానాలలో తల్లి పాలలో రెసెర్పిన్ గుర్తించారు.
ఏ ఇతర మందులతో రెసెర్పిన్ కలిపి వాడరాదు
మార్చు- డ్యూటెట్రాబెనజైన్ తో కలిపి రెసెర్పిన్ మాత్రలు వాడిన తీవ్రమైన పరస్పర చర్యలు ఏర్పడును. అలాగే
బెరోట్రాల్‌స్టాట్, ఎస్కెటమైన్ ఇంట్రానాసల్, గానాక్సోలోన్, అలాగే లెంబోరెక్సాంట్ మందులతో రెసర్పైన్ యొక్క మితమైన పరస్పర చర్యలు ఉన్నాయి.[38][39]
- సంయుక్త రాష్ట్రాలలో రెసెర్పిన్ అందుబాటులో లేదు.
ఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "reserpine". dictionary.com. Retrieved 2024-03-19.
- ↑ "Reserpine". go.drugbank.com. Retrieved 2024-03-19.
- ↑ "216.24 Drug products withdrawn or removed from the market for reasons of safety or effectiveness". ecfr.gov. Retrieved 2024-03-19.
- ↑ 4.0 4.1 4.2 "Rauwolfia Serpentina (Sarpagandha) – Indian snakeroot". ayurtimes.com. Retrieved 2024-03-19.
- ↑ 5.0 5.1 Yarnell E, Abascal K. Treating hypertension botanically. Altern Complement Ther. 2001;7(5):284–290.
- ↑ "Reserpine". acs.org. Retrieved 2024-03-19.
- ↑ 7.0 7.1 "Rauwolfia in the Treatment of Hypertension". ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-19.
- ↑ Tyler VE, Brady LR, Robbers JE. Pharmacognosy. 9th ed. Philadelphia, PA: Lea & Febiger; 1988. pp. 222–225.
- ↑ Jerie P. Milestones of cardiovascular therapy, IV: reserpine [in Czech] Cas Lek Cesk. 2007;146(7):573–577.
- ↑ "[Milestones of cardiovascular therapy. IV. Reserpine]". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-19.
- ↑ Isharwal S, Gupta S. Rustom Jal Vakil: his contributions to cardiology. Tex Heart Inst J. 2006;33(2):161–170.
- ↑ "Rustom Jal Vakil". ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-19.
- ↑ Verma KC, Verma SK. Alkaloids analysis in root and leaf fractions of sarpaghanda (Rauwolfia serpentina) Agric Sci Dig. 2010;30(2):133–135
- ↑ Leete E. The biogenesis of the Rauwolfia alkaloids, I: the incorporation of tryptophan into ajmaline. J Am Chem Soc. 1960;82(24):6338–6342.
- ↑ "The Biogenesis of the Rauwolfia Alkaloids. I. The Incorporation of Tryptophan into Ajmaline". scholar.google.com. Retrieved 2024-03-13.
- ↑ 16.0 16.1 Ruyter CM, Akram M, Illahi I, Stöckigt J. Investigation of the alkaloid content of Rauwolfia serpentina roots from regenerated plants. Planta Med. 1991;57(4):328–330.
- ↑ Woodson RE, Youngken HW, Schlittler E, Schneider JE. Rauwolfia: Botany, Pharmacognosy, Chemistry and Pharmacology. Boston, MA: Little, Brown and Company; 1957. pp. 32–33.
- ↑ Hareesh Kumar V, Nirmala, Shashidhara S, Rajendra CE. Reserpine content of Rauwolfia serpentina in response to geographical variation. Int J Pharm Biosci. 2010;1(4):429–434.
- ↑ Leete E. The biogenesis of the Rauwolfia alkaloids, I: the incorporation of tryptophan into ajmaline. J Am Chem Soc. 1960;82(24):6338–6342.
- ↑ Deshmukh SR, Ashrit DS, Patil BA. Extraction and evaluation of indole alkaloids from Rauwolfia serpentina for their antimicrobial and antiproliferative activities. Int J Pharm Pharm Sci. 2012;4(suppl 5):329–334.
- ↑ 21.0 21.1 "[Milestones of cardiovascular therapy. IV. Reserpine]". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-20.
- ↑ Jerie P. Milestones of cardiovascular therapy, IV: reserpine [in Czech] Cas Lek Cesk. 2007;146(7):573–577.
- ↑ "Reserpine". inchem.org. Retrieved 2024-03-20.
- ↑ Armstrong WP. Major types of chemical compounds in plants and animals, II: phenolic compounds, glycosides and alkaloids: indole alkaloids. In: Armstrong WP, editor. Wayne’s Word: An On-Line Textbook of Natural History. San Marcos, CA: Palomar College; 2005. [Accessed January 22, 2015].
- ↑ Lewis, R.J., Sr (Ed.). Hawley's Condensed Chemical Dictionary. 13th ed. New York, NY: John Wiley & Sons, Inc. 1997., p. 963
- ↑ National Toxicology Program, Institute of Environmental Health Sciences, National Institutes of Health (NTP). 1992. National Toxicology Program Chemical Repository Database. Research Triangle Park, North Carolina.
- ↑ Friedli GL. Indole alkaloids. Friedli Enterprises Web site. [Accessed September 25, 2014]
- ↑ 28.0 28.1 28.2 "Reserpine". t3db.ca. Retrieved 2024-03-20.
- ↑ Lide, D.R. (ed.). CRC Handbook of Chemistry and Physics. 79th ed. Boca Raton, FL: CRC Press Inc., 1998-1999., p. 3-330
- ↑ 30.0 30.1 "Reserpine Properties". chemicalbook.com. Retrieved 2024-03-20.
- ↑ Yalkowsky SH, Dannenfelser RM; The AQUASOL dATAbASE of Aqueous Solubility. Fifth ed, Tucson, AZ: Univ Az, College of Pharmacy (1992)
- ↑ "Reserpine". medlineplus.gov. Retrieved 2024-03-20.
- ↑ "Reserpine". go.drugbank.com. Retrieved 2024-03-20.
- ↑ 34.0 34.1 34.2 "reserpine (Rx)". reference.medscape.co. Retrieved 2024-03-20.
- ↑ "reserpine". britannica.com. Retrieved 2024-03-20.
- ↑ "reserpine - oral". medicinenet.com. Retrieved 2024-03-20.
- ↑ "Reserpine Side Effects". drugs.com. Retrieved 2024-03-13.
- ↑ "reserpine". medicinenet.com. Retrieved 2024-03-20.
- ↑ Medical Reviewer: Sarfaroj Khan, BHMS, PGD Health Operations,Medically Reviewed on 11/7/2022