రైమా సేన్ (జననం రైమా దేవ్ వర్మ; 1979 నవంబరు 7) హిందీ, బెంగాలీ చిత్రాలతో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి.[1]

రైమా సేన్
2017లో రైమా సేన్
జననం
రైమా దేవ్ వర్మ

(1979-11-07) 1979 నవంబరు 7 (వయసు 44)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులురియా సేన్ (సోదరి)
సుచిత్రా సేన్ (అమ్మమ్మ)
తన తల్లి మూన్ మూన్ సేన్‌తో కలిసి రైమా సేన్
సోదరి రియా సేన్ (కుడి)తో కలిసి రైమా సేన్ (ఎడమ)

ఆమె నటనకుగాను నిషి జపాన్ (2006) చిత్రానికి బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ – మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ అవార్డును దక్కించుకుంది.[2] అదే పేరుతో నారాయణ్ గంగోపాధ్యాయ రచించిన నవల ఆధారంగా, సందీప్ రే దర్శకత్వం వహించిన బెంగాలీ చలనచిత్రం ఇది.[3][4]

తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన ధైర్యం చిత్రంలో ఆమె నితిన్ సరసన నటించింది.[5][6]

ప్రారంభ జీవితం

మార్చు

రైమా సేన్ 1979 నవంబరు 7న ముంబైలో మూన్ మూన్ సేన్, భరత్ దేవ్ వర్మ దంపతులకు లకు జన్మించింది. ఆమె బెంగాలీ సినిమా మహానాయికగా పరిగణించబడే నటి సుచిత్రా సేన్ మనవరాలు. ఆమె సోదరి రియా సేన్ కూడా బాలీవుడ్ పరిశ్రమలో అగ్ర నటి. వారి తండ్రి భరత్ దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందినవాడు.[7] ఆయన తల్లి ఇలా దేవి, కూచ్ బెహార్ యువరాణి, ఆమె చెల్లెలు గాయత్రీ దేవి జైపూర్ మహారాణి.[8] ఆమె నాయనమ్మ ఇందిర బరోడా మహారాజా సాయాజీరావ్ గైక్వాడ్ III ఏకైక కుమార్తె.[9][10]

రైమా ముత్తాత ఆదినాథ్ సేన్ ప్రముఖ కోల్‌కతా వ్యాపారవేత్త, అతని కుమారుడు దీనానాథ్ సేన్ - మాజీ కేంద్ర న్యాయ మంత్రి అశోక్ కుమార్ సేన్ బంధువు- దివాన్, త్రిపుర మహారాజా మంత్రి.[11]

ఈ సోదరీమణులు తెరపై వారి తల్లి మొదటి పేరుతోనే క్రెడిట్ చేయబడతారు, అయితే వారి అధికారిక పత్రాలు దేవ్ వర్మ అనే ఇంటిపేరును కలిగి ఉంటాయి.[12]

కెరీర్

మార్చు

రైమా సేన్ గాడ్ మదర్‌ (1999) చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె డామన్ చిత్రంలో రవీనా టాండన్ కుమార్తెగా నటించింది.

అయితే, రితుపర్ణో ఘోష్ చిత్రం చోఖర్ బాలిలో ఆమె అద్భుతమైన పాత్ర పోషించింది. మరికొన్ని యావరేజ్ సినిమాల తర్వాత ఆమె 2005లో పరిణీతలో నటించింది, ఇందులో ఆమె విద్యాబాలన్ తో కలిసి నటించింది. అప్పటి నుండి ఆమెకు యాక్షన్ థ్రిల్లర్ దస్, బెంగాలీ చిత్రం అంతర్ మహల్ తో సహా మరో రెండు విజయాలు సాధించింది. 2006లో, ఆమె షాయన్ మున్షీతో కలిసి ది బాంగ్ కనెక్షన్ చిత్రంలో నటించింది. 2007లో, ఆమె అభయ్ డియోల్‌తో కలిసి మనోరమ సిక్స్ ఫీట్ అండర్ అనే థ్రిల్లర్‌లో చేసింది. 2011లో, ఆమె విజయవంతమైన బెంగాలీ చిత్రం బైషే స్రాబోన్‌లో పరంబ్రత ఛటర్జీ సరసన నటించింది.

2014లో విలియం షేక్స్పియర్ రచనల ఆధారంగా రూపొందించబడిన మొదటి బెంగాలీ చలనచిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన హృద్ మఝరేలో సేన్ ప్రధాన పాత్రలో నటించింది.[13][14] ఇది బార్డ్ పుట్టిన 450వ సంవత్సరానికి నివాళిగా అందించబడింది. తొలి చిత్ర నిర్మాత రంజన్ ఘోష్ రూపొందించిన ఈ చీకటి ప్రేమకథలో ఆమె అబిర్ ఛటర్జీ, ఇంద్రాశిష్ రాయ్‌లతో కలిసి నటించింది.[15] షేక్స్పియర్ నాటకాల ఆధారంగా ప్రపంచ సినిమాల జాబితాలో ఫిల్మ్ లండన్ నుండి ఈ చిత్రం అరుదైన సిఫార్సును పొందింది.[16] ఈ చిత్రం, దాని స్క్రీన్ ప్లే కూడా యుజిసి లిటరేచర్ ఆర్కైవ్‌లో చేర్చబడ్డాయి.[17] సబుజ్ ద్వీపర్ రాజా (1979) తర్వాత అండమాన్ నికోబార్ దీవులలో చిత్రీకరించబడిన ఏకైక బెంగాలీ చిత్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది.[18][19][20]

2016లో, ఆమె కె.డి రచించి దర్శకత్వం వహించిన బాలీవుడ్ డైరీస్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, సలీం దివాన్ కూడా నటించారు.[21] అమిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో రైమా సేన్, సంజయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ది లాస్ట్ అవర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది.[22]

మూలాలు

మార్చు
  1. "Raima Sen". The Times of India. Retrieved 31 January 2018.
  2. "69th & 70th Annual Hero Honda BFJA Awards 2007". bfjaawards.com. Archived from the original on 8 January 2010. Retrieved 24 October 2008.
  3. "Nishijapon (2005) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2022-01-07. Retrieved 2022-01-06.
  4. Jha, Subhash K. (2020-11-19). ""They Greats Are All Gone," Sandip Ray On Soumitra Chatterjee". BollySpice.com - The latest movies, interviews in Bollywood (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-06.
  5. "ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!". Sakshi. 2023-07-27. Retrieved 2024-02-20.
  6. G. V, Ramana (12 February 2005). "Dhairyam - Telugu cinema review". idlebrain. Retrieved 26 April 2018.
  7. Bollywood's royal connection, The Times of India.
  8. "Raima and Riya Sen - Bollywood's royal connection". The Times of India. Retrieved 7 November 2020.
  9. COOCH BEHAR (Princely State), University of Queensland. Retrieved 18 April 2008.
  10. Geraldine Forbes et al., The new Cambridge history of India[permanent dead link], p. 135, Cambridge University Press, 2003, ISBN 0-521-26727-7.
  11. Chatterji, Shoma A. (2002). Suchitra Sen: A Legend in Her Lifetime . Rupa & Co. ISBN 81-7167-998-6.
  12. Mukherjee, Amrita (24 January 2004). "Will you change your surname after marriage?". The Times of India. Retrieved 31 May 2008.
  13. "Love, and jealousy, 450 years after the Bard – The Times of India". The Times of India. 4 August 2014.
  14. "Hrid Majharey (Bengali) / Dark but honest". 24 July 2014.
  15. "Abir-Raima jodi-The pair comes together in Ranjan Ghosh's first film". Archived from the original on 17 October 2014. Retrieved 19 December 2014.
  16. "Film London launches Shakespeare India".
  17. "Hrid Majharey part of JU project".[dead link]
  18. "Andaman album Hrid Majharey maker Ranjan Ghosh shares his andaman album with t2". Archived from the original on 5 February 2021.
  19. "Actress Raima Sen in city :::: Shooting of Bengali Film 'Hrid Majharay' in AFC". 28 February 2013.
  20. "I was awe-struck on visiting Cellular Jail: Abir".
  21. "Raima Sen to play a Sonagachi sex worker in KD Satyam's Bollywood Diaries". India.com. 2 November 2014. Retrieved 6 December 2015.
  22. "The Last Hour". webseriesreviews.com. 25 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=రైమా_సేన్&oldid=4338840" నుండి వెలికితీశారు