మంచు లక్ష్మి
సినీ నటి
(లక్ష్మి మంచు నుండి దారిమార్పు చెందింది)
మంచు లక్ష్మి భారతీయ నటి, నిర్మాత. ఈమె నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న .
మంచు లక్ష్మి | |
---|---|
![]() గుండెల్లో గోదారి చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో లక్ష్మి | |
జననం | మంచు లక్ష్మీప్రసన్న 1977 అక్టోబరు 8 |
ఎత్తు | 5"5 |
జీవిత భాగస్వామి | ఆండీ శ్రీనివాసన్ |
కుటుంబము మార్చు
ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్, మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే.
వివాహము మార్చు
ఈమె వివాహము ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ తో జరిగింది. ఈయన అమెరికా వాసి.
పురస్కారాలు మార్చు
- నంది పురస్కారం ఉత్తమ విలన్ గా అనగనగా ఓ ధీరుడు చిత్రానికి ఎన్నుకోబడింది.
- సైమా అవార్డులు (2011)లో సైమా ఉత్తమ ప్రతినాయకురాలు (అనగనగా ఓ ధీరుడు)
- దొంగాట సినిమా లో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు ని అందుకుంది.
- తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్: ఉత్తమ సహాయ నటి (చందమామ కథలు)
- స్పెషల్ జూరి అవార్డ్ దొంగాట
- గుండెల్లో గోదారి సినిమాకు ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు
నటించిన చిత్రాలు మార్చు
సంవత్సరం | చిత్రము | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2008 | ద ఒడే | నజ్మా | ఆంగ్లము | |
2009 | డెడ్ ఎయిర్ | గబ్బి | ఆంగ్లము | |
2011 | అనగనగా ఓ ధీరుడు | ఐరేంది | తెలుగు | 2012 నంది పురస్కారము: ఉత్తమ ప్రతినాయిక |
2011 | దొంగల ముఠా | శివ | తెలుగు | |
2012 | డిపార్ట్‍మెంట్ | సత్యా భోస్లే | హిందీ | |
2012 | ఊ..కొడతారా ఉలిక్కిపడతారా | అమృతవల్లి | తెలుగు | |
2013 | కడలి | సెలీనా | తెలుగు,తమిళం | |
2013 | గుండెల్లో గోదారి | చిత్ర | తెలుగు, తమిళం | |
2017 | లక్ష్మీ బాంబ్ | జడ్జి లక్ష్మి, ప్రియ | తెలుగు | |
2018 | W/O రామ్ | దీక్ష | తెలుగు | |
2020 | మా వింత గాధ వినుమా | తెలుగు |