లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం

లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా,భీంగల్ [1] మండలంలోని పురానిపేట్ గ్రామంలో నింబాచలం కొండ పై కొలువైన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి, నర నారాయణులు వారి స్వయంభూ విగ్రహ రూపంలో పూజింపబడు తున్నాడు[2].పవిత్రమైన నరసింహ క్షేత్రం దక్షిణ బద్రీనాథ్ గా ప్రసిద్ధి చెందింది[3][4][5].

లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం is located in Telangana
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :18°45′N 78°15′E / 18.75°N 78.25°E / 18.75; 78.25
పేరు
ఇతర పేర్లు:శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం
ప్రధాన పేరు :శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం పురానిపేట్ భీంగల్ నిజామాబాద్
దేవనాగరి :श्री लक्ष्मी नरसिंह स्वामी देवस्थान पुरानी पेंट भीमगल निजामाबाद।
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిజామాబాద్ జిల్లా
ప్రదేశం:భీంగల్, పురాని పేట్ లిబాంద్రి గుట్ట
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ నరసింహస్వామి
ప్రధాన దేవత:లక్ష్మి
ముఖ్య_ఉత్సవాలు:శ్రీరామనవమి,ఉగాది,దసరా
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షీణ భారత దేశ హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01

స్థల పురాణం

మార్చు

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చాలా పురాతన మైన హిందూ దేవాలయం.ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది[6].ఇచ్చట పార్వతి పరమేశ్వరుల కల్యాణానికి బ్రహ్మదేవుడు స్వయానా వచ్చాడని, శ్రీహరి వారి అనుగ్రహం కోసం తపస్సు చేశాడని, ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు కరుణించడంతో నరసింహ రూపంలో స్వామి ఈ ప్రాంతంలో కొలువు దీరమంటూ బ్రహ్మ దేవుడు స్వామిని వేడుకున్నాడని, అప్పుడు నరసింహుడు ఇచ్చట లక్ష్మి దేవి సమేతంగా స్వయంభువుగా వెలసినట్లు పురాణం ద్వారా తెలుస్తోంది.

ఉత్సవాలు

మార్చు

దక్షిణ బద్రీనాథ్ గా ప్రసిద్ధి చెందిన భీంగల్ లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో లింబాద్రి గుట్టను విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనబడేలా తీర్చి దిద్దుతారు.కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం పది రోజుల పాటు శ్రీ వారి రథోత్సవము నిర్వహిస్తారు. స్వామి వారిని భక్తులు గ్రామం నుంచి కొండపైకి తెచ్చి ఉద్వాసన బలి ప్రదానం,‌పుష్కరిణి పై డొల సేవ నిర్వహిస్తారు.ఆనంతరం స్వామి వారు తిరిగి గ్రామానికి చేరుకుంటారు[7].

విశేషం

మార్చు

ఈ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో రెండు బద్రీనాథ్ గా ప్రసిద్ధి.లింబాద్రి గుట్ట అనేది ఎత్తున శిఖరం తప్ప ప్రత్యేక ఆలయం అంటూ లేదు. ఈ ఆలయం ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా వేప చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ గుట్టకు లింబాచల్ కొండా గా పిలవడం విశేషం. సంతానం లేని దంపతులు సంతానం కల నెరవేరుతుండడం కూడా మరో విశేషం.

నిజామాబాద్ జిల్లా భీంగల్ లింబాద్రి గుట్ట జాతర నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా నంబి లింబాద్రి వ్యవస్థక ధర్మకర్తలు, ఆలయం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. శ్రీ వారి జాతర సందర్భంగా ఆలయంలో పది రోజుల పాటు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు నిజామాబాద్ జిల్లా ముఖ్య పట్టణాలు లైనా ఆర్మూర్, భీంగల్, బోధన్, జక్రాన్‌పల్లి ,నందిపేట్,తో పాటు ఆదిలాబాద్,నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట ఉమ్మడి వరంగల్ జిల్లాల మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు.

ఎలా చేరుకోవచ్చు

మార్చు

ఈ ఆలయాన్ని హైదరాబాద్ నుండి నేరుగా ఆర్మూర్, నిజామాబాద్ నుండి భీంగల్ వరకు బస్సులో రావాలి . భీంగల్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంటుంది. బస్సులో, ఆటోలో,ప్రైయివేయటు వాహనాల్లో కూడా చేరుకోవచ్చు. జాతర సమయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేవాలయం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తుంది.

మూలాలు

మార్చు
  1. Publications, Devullu com | Mohan. "Mohan Publications | Bhakti Books | Telugu Books | FREE pdfs | Devullu.com | Bhakti Pustakalu: దక్షిణాది బద్రి... లింబాద్రి-Lingrabragutta Temple, Kartik Purnima, లింబాద్రి గుట్ట దేవాలయం, కార్తీక పౌర్ణమి". Mohan Publications | Bhakti Books | Telugu Books | FREE pdfs | Devullu.com | Bhakti Pustakalu. Retrieved 2024-11-20.
  2. C, Girish. "శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -భీమగల్". www.manatemples.in (in ఇంగ్లీష్). Retrieved 2024-11-20.
  3. Tv, 9Staar (2018-12-08). "లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ..." 9StaarTV (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-11-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "దక్షిణ బద్రీనాథ్‌... లింబాద్రిగుట్ట". EENADU. Retrieved 2024-11-20.
  5. "దక్షిణాది బద్రి... లింబాద్రి | Lingrabri Gutta is a prominent temple in Telangana state | Sakshi". www.sakshi.com. Retrieved 2024-11-18.
  6. information, Temples in India (2021-11-12). "Limbadri Lakshmi Narasimha Temple Timings, History". Templesinindiainfo (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-11-20.
  7. Today, Telangana (2020-11-20). "Limbadrigutta brahmotsavams begin". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-11-20.