లుంగి (Lungi) అనే వస్త్రము దక్షిణ భారతదేశంలో పుట్టినాగాని, ఇండొనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌, బ్రూనై, మలేషియా, సింగపూరు, ఆఫ్రికాలో కొన్ని ప్రదేశాలలో, అరేబియా ద్వీపకల్పాలలో కూడా ధరిస్తారు. మాములుగా ఈ వస్త్రము నూలుతో చేయబడుతుంది. దక్షిణ భారతదేశం సర్వత్రానే కాకుండా, బెంగాల్, సింధ్, ఒడిషా లలో కూడా దీనిని వాడతారు. ట్రౌజర్లు వేసుకోవటం అసౌకర్యాన్ని కలిగించే వేడి, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో లుంగీలకి ఆదరణ చాలా ఎక్కువ.

చొక్కా, ముండులని ధరించిన మలయాళీ పురుషుడు

తయారీ

మార్చు

ఒక లుంగీ 115 సెం.మీ ల వెడల్పు, 200 సెం.మీ ల పొడవు ఉంటుంది. దీనికి దాదాపు 2/3 పరిమాణములో లుంగీలు పిల్లలకు కూడా లభ్యం. శుభకార్యాలలో ధరించేందుకు పట్టుతో చేసిన లుంగీలు కూడా లభిస్తాయి.

వాడుక

మార్చు

స్థానిక సంప్రదాయాలని బట్టి స్త్రీపురుషులు లుంగీలు వాడతారు. లుంగీని చుట్టటం, కట్టటంలో వేర్వేరు రకాలునాయి. దైనందిన కార్యాలని చేసుకొనేందుకు వీలుగా ఉండేటట్ల నుండి భారీ వివాహ వేడుకలలో ధరించే వరకు విధవిధాలైన లుంగీలు వాడతారు. పొడవు తగ్గించేందుకు లుంగీని నడుము వద్ద లోపలికి మడిచి కూడా కట్టుకొనవచ్చును.

భారతదేశంలో లుంగీ

మార్చు

తెలుగు వారి సాంప్రదాయక వస్త్రధారణ పంచె ధరించే విధానంలో లుంగీ నుండి విభేదిస్తుంది. లుంగీలు పంచెకట్టు శైలిలో మాత్రమే కడతారు. ధోవతి కట్టు వాడరు. ఈ ప్రాంతంలో స్త్రీలు వీటిని ధరించరు.

ఇంట్లో ఉన్నప్పుడు/సాంప్రదాయికత అవసరం లేనప్పుడు పంచె స్థానంలో లుంగీ ల వాడకం ఎక్కువ. ఇవి రకరకాల రంగులలో గడుల డిజైనులలో లభిస్తాయి. నేసిన (గడుల) వే కాకుండా (ఇతర) ప్రింటు డిజైనులలో కూడా ఇవి లభ్యమౌతాయి. ఇరువైపుల ఉన్న వెడల్పులను కుట్టి వలయాకారంలో ఉన్న లుంగీలను బర్మీజ్ లుంగీ అంటారు. ఇలా కుట్టుకో (కపో) వటం వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ముస్లిం మతస్తులు కుర్తా లుంగీలను సాంప్రదాయికంగానే వాడతారు.

లుంగీలను కూడా అడ్డపంచెలుగా (మోకాళ్ళ వరకు, కొద్దిగా పైకి లేదా క్రిందకు ఎత్తి) కడతారు . (ఎత్తు/పల్లమైన ప్రదేశాలలో, మెట్లని ఎక్కేటప్పుడు/దిగేటప్పుడు) నడిచే సమయంలో కాళ్ళకి అడ్డం రాకుండా ఇలా కడతారు. లేక ఇరువైపుల ఉండే అంచులను రెండు చేతులతో పట్టుకొంటారు. బరువులు ఎత్తటం వంటి కష్టమైన పనులు చేసేందుకు వీలుగా, కయ్యానికి కాలు దువ్వే సమయాలలో (ఫుల్ స్లీవ్స్ చొక్కా చేతులు మడుచుకొన్నట్లు), మల మూత్ర విసర్జనా సమయాలలో ఇలా కడతారు.

కర్ణాటక లోని గ్రామ ప్రదేశాలవారు లుంగీని తరచుగా ధరిస్తారు. వివాహ వేడుకలలో వరుడు, వధూవరుల తండ్రులు పంచె ధరించటం తప్పనిసరి. సంపన్న వర్గాలు ఇటువంటి వేడుకలకు పట్టు పంచెలు కట్టటం ఆనవాయితీ.

తమిళనాడులో కూడా లుంగీల వాడకం ఆంధ్రప్రదేశ్ లో వలెనే ఉంటుంది. ఈ ప్రాంతంలో లుంగీలు వ్యతిరేక గడియార దిశలో కడతారు. దక్షిణ రాష్ట్రంలో దీనిని కైలి అని సారం/చారం అని అంటారు. సాంప్రదాయికంగా తమిళ ముస్లింలు తెలుపు రంగు లుంగీల వైపే మొగ్గు చూపుతారు.

కేరళ రాష్ట్రంలో సాధారణంగా రంగులతో వివిధ డిజైనులలో ఉండే లుంగీలను స్త్రీ పురుషులిరువురూ ధరిస్తారు. శ్రమజీవులు రోజువారీ దుస్తులుగా ధరిస్తారు. ముండు అనబడు కేరళ ధోవతి సాధారణంగా తెల్లగా ఉండి, కసవు అనే బంగారు రంగు అంచు కలిగి ఉంటుంది. హిందువులు గడియార దిశలో కడతారు. కాషాయ వర్ణ ముండు లను కావి ముండే అని అంటారు. క్రింద వరకు కాకుండా మోకాళ్ళ వరకే అడ్డపంచె వలె కడతారు. ముస్లింలు, క్రైస్తవులు వ్యతిరేక గడియార దిశలో కడతారు. ఆంధ్ర, తమిళ నాడు లలో వలె ఇలా కట్టడం ఇక్కడ ఏ మాత్రం అసాంప్రదాయికమో, అమర్యాదపూర్వకమో కాదు.

గోవాలో జాలరి పురుషులు కట్టే లుంగీ ముందు వైపు త్రికోణాక్రృతిలో ఉంటుంది.

(పాకిస్థాన్, భారతదేశపు) పంజాబ్ ప్రాంతాలలో లుంగీలను స్త్రీ పురుషులిరువురూ ధరిస్తారు. ప్రముఖ భాంగ్రా నృత్యాల సాంప్రదాయిక దుస్తులలో లుంగీ ఒక భాగము. గ్రామాలలో కూడా ఇవి బాగా జనాదరణ కలిగి ఉన్నాయి. ఇతర ప్రదేశాలలో రూపొందించే ప్రక్రియ, రంగులు, కట్టే విధానంలో ఇవి చాలా భిన్నంగా ఉంటాయి.

ఇతర రాష్ట్రాలు

మార్చు

బీహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ లోని అన్ని వర్గాల పురుషులు లుంగీని అసాంప్రదాయికంగా ఇంట్లో ధరిస్తారు. హిందూ పురుషులు సాధారణంగా ఇవి బయటకు వచ్చే సమయంలో ధరించరు.

ఒడిషాలో సంబల్ పూరి లుంగీలు మామూలు లుంగీల కంటే వ్యత్యాసంగా ఉంటాయి.

హర్యానాలో లుంగీలు రాత్రి దుస్తులుగా పరిగణింపబడతాయి.

ఇతర దేశాలలో లుంగీ

మార్చు

బంగ్లాదేశ్ పురుషులలో లుంగీ ఇంటా బయటా సమానంగా వాడటం సర్వసాధారణమైననూ మర్యాదపూర్వక సందర్భాలలో దీనిని వాడరు. వరునికి పెళ్ళికానుకగా లుంగీలు ఇవ్వటం ఇక్కడ ఆచారంగా ఉంది. పంచె వలె సమతలంగా ఉండకుండా రెండు వైపులా కుట్టి వెడల్పాటి గొట్టం (స్థూపాకారం) వలె ఉంటాయి. సాధారణంగా స్త్రీలు లుంగీలు ధరించకున్ననూ ఆగ్నేయ బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో ధరించటం ఉంది.

ఇండొనేషియాలో లుంగీ సారుంగ్ అని పిలువబడుతుంది. మతసంబంధిత ఘట్టాలకి సారుంగ్ ని సాంప్రదాయికంగా ధరిస్తారు. సుమత్రా, జావా, బాలిలలో దీని వినియోగం ఎక్కువ.

బర్మీజ్ లో లుంగీని లొంగ్యీ (longyi) గా సంబోధిస్తారు. పురుషుల లుంగీని పాసో (paso) గా, స్త్రీల లుంగీలను హ్తమెయిన్ (htamain) గా వ్యవహరిస్తారు.

సొమాలియాలో లుంగీని మకావిస్ (macawis) గా సంబోధిస్తారు. దీనిని పురుషులు అసాంప్రదాయికంగా ధరిస్తారు. ఎక్కువగా ఇక్కడి లుంగీలు తెలుపు రంగులో ఉన్ననూ, ఆగ్నేయ ఆసియా, భారత ఉపఖండంతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం ప్రభావం వలన ఈ ప్రదేశాలలో ధరించే శైలులలో ఉన్న రంగులని ఇక్కడ కూడా పరిచయం చేయబడ్డాయి.

ఫుతాహ్ (Futah) అని వ్యవహరింపబడే లుంగీలను యెమెన్లో అన్ని వయస్కుల పురుషులు ధరిస్తారు.

ఒమన్ లో లుంగీలను ఇజార్ (Izaar) అంటారు. పొడుగ్గా పాదాల వరకు ఉండే థోబ్ ( Thobe) అనే కుర్తా ల క్రింద తెల్లని ఇజార్ లని ధరిస్తారు. జాలర్లు తమ పనులు చేసుకోవటానికి వీలుగా థోబ్ లేకుండానే రంగులున్న ఇజార్ లు ధరిస్తారు. శాస్త్రీయ నృత్యం చేసేటప్పుడు మోకాళ్ళ వరకు ఉండే ఇంకో ఇజార్ ను కూడా ధరిస్తారు.

సౌదీలో కూడా లుంగీలను ఇజార్ అనే వ్యవహరిస్తారు. అసిర్ వంటి నైఋతి తెగలు ఉత్తర యెమెన్ లో ఉపయోగించే లుంగీల వంటివే ఉపయోగిస్తారు. సాధారణంగా కుట్టకుండా, నలుపు రంగులో ఇవి కుచ్చులు గలితి ఉంటాయి. ఇతర ప్రదేశాలలో బంగ్లాదేశ్, భారతదేశం లేదా ఇండొనేషియా నుండి దిగుమతి అయిన లుంగీలని నిద్రించే సమయంలో సౌకర్యం కోసం కట్టుకొంటారు. తీర ప్రాంతాలలో ఇది సాధారణం. జాలర్లు కూడా వీటిని కడతారు.

ఈ దేశాలలో లుంగీలను సరోంగ్ అనే వ్యవహరిస్తారు. లుంగీ అన్న పదం వాడరు.

చిత్ర మాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=లుంగీ&oldid=2988337" నుండి వెలికితీశారు