స్వాగతం

మార్చు
Learndownload గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Learndownload గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     ప్రభాకర్ గౌడ్ నోముల 06:40, 4 జూలై 2020 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా ఎంత ప్రజాదరణ పొందింది?

ఆంగ్ల వికీ ప్రజాదరణ గురించి చెప్పనవసరమే లేదు. ప్రపంచంలో ప్రస్తుతము ఉన్న ఇంటర్నెట్ సైట్లలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన 9 వ సైటు వికీపీడియా. ఇక తెలుగు వికీపీడియా సంగతి చూస్తే ప్రస్తుతము ఉన్న అన్ని భారతీయ భాషా వికీలకంటే కొంత మంచి స్థానంలో ఉంది. కానీ, తెలుగు వికీపీడియాలో చాలా కొద్ది వ్యాసాలు విశేషవ్యాసాలుగా అభివృద్ది చెందాయి. ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము ఇంకా అభివృద్ది చెందాలంటే తెలుగు వికీపీడియాలో సభ్యులుగా చేరేవారి సంఖ్యను పెంచాలి. ఈ పని చేయగలిగిన వారు ప్రస్తుతము ఉన్న సభ్యులే! మరియు ఉన్న సభ్యులు మొహమాట పడకుండా, జంకకుండా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ది పరచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల ప్రభాకర్ గౌడ్ నోముల 06:40, 4 జూలై 2020 (UTC)Reply

స్వాగతం పేజీ చదవండి

మార్చు

Learndownload గారు,

మీరు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగానే విసర్గము అనే పేజీ సృష్టించారు. సంతోషం, అభినందనలు. ఆ వ్యాసానికి సంబంధించి కింది విషయాలను గమనించాలి. వికీపీడియాలో తప్పులు చేస్తే సరి రాసే వారికి సూచనలు ఇస్తారు, కూడా ఉంటారని తెలుసుకోండి. వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా గట్టిగా నోక్కినచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. నాలుగు లైన్లు వ్యాసం కాదండి, మీ ఊరు గురించి రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది చూడండి అది ఒక వ్యాసం, అందుచేత వివిధ కారణాల వల్ల ఈ పేజీలను తొలగించాలి. తక్షణమే తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. నిర్ద్వ్ంద్వంగా కాపీహక్కుల ఉల్లంఘన కావున విసర్గము కొత్త పేజీని అధికారులు తొలగిస్తారు, తెలుగులో వ్యాసాలు ఎలా ఉండాలో, ఒకసారి ఇది వరకే ఉన్న వ్యాసాలు చూడండి.వికీపీడియాలో మనం రాసినది నిజమో కాదో పాఠకులకు ఎలా తెలుస్తుంది? అలా తెలియాలంటే మనం రాసేదానికి ఆధారాలు చూపించాలి. మీరు రాసిన పేజీలో కూడా ఆధారాలు చూపించడం అవసరం.తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట). మీరు వికీలో రచనలు చేయాలనుకుంటున్నారు, కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి సూచనలు పాటించండి, స్వాగతం పేజీ కూడా చదవండి, తర్వాత రాయవచ్చు. ప్రభాకర్ గౌడ్ నోముల 07:00, 4 జూలై 2020 (UTC)Reply