వాస్తు శాస్త్రం
వాస్తు శాస్త్రం : వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.
- భూమి వాస్తు.
- హర్మ్య వాస్తు
- శయనాసన వాస్తు.
- యాన వాస్తు.
వాస్తు శాస్త్ర పురాణంసవరించు
పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి 'ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు.
ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.
శిరస్సున - శిఖి(ఈశ)
దక్షిణ నేత్రమున - సర్జన్య
వామనేత్రమున - దితి
దక్షిణ శోత్రమున - జయంతి
వామ శోత్రమున - జయంతి
ఉరస్సున (వక్షమున) - ఇంద్ర, అపవత్స, అప, సర్ప
దక్షిణ స్తనమున - అర్యమా
వామ స్తనమున - పృధ్వీధర
దక్షిణ భుజమున - ఆదిత్య
వామ భుజమున - సోమ
దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా
వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట
దక్షిణ పార్శ్వమున - వితధి, గృహక్షత
వామ పార్శ్వకామున - అసుర, శేష
ఉదరమున - వినస్వాన్, మిత్ర
దక్షిణ ఊరువున - యమ
వామ ఊరువున - వరుణ
గుహ్యమున - ఇంద్ర జయ
దక్షిణ జంఘమున - గంధర్వ
వామ జంఘమున - పుష్పదంత
దక్షిణ జానువున - భృంగరాజ
వామ జానువున - సుగ్రీవ
దక్షిణ స్పిచి - మృగబు
వామ స్పిచి - దౌవారిక
పాదములయందు - పితృగణము
ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడు'గా సృష్టి గావించాడు.
వాస్తుశాస్త్ర సంబంధ గ్రంధాలుసవరించు
- మనసార శిల్ప శాస్త్రము (రచన : మనసారా),
- మాయామతం (రచన : మాయా),
- విశ్వకర్మ వాస్తుశాస్త్రము (రచన : విశ్వకర్మ),
- అర్ధ శాస్త్రం
- సమారంగణ సూత్రధార (రచన : రాజా భోజ),
- అపరాజిత పృచ్చ (విశ్వకర్మ అతని కుమారుడు అపరాజిత మధ్య సంవాదము, రచన భువనదేవాచార్య)
- మానుషాలయ చంద్రిక
- శిల్పరత్నం
- పురాణాలలో-మత్స్య, అగ్ని, విష్ణు ధర్మొత్తరం, భవిష్య పురాణాలలో వాస్తు ప్రకరణలు ఉన్నాయి.
- సంహితా గ్రంధాలు ;బృహత్సహిత,గార్గసంహత,కాశ్యప సంహిత
- ఆగమ గ్రంధాలు:శైవాగమాలు,వైష్ణవాగమాలు
ప్రధాన వస్తువులుసవరించు
వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన వస్తువులు పంచ భూతాలైన
- భూమి
- జలం
- అగ్ని
- వాయు
- ఆకాశం
వాస్తు పురుష మండలాలుసవరించు
ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:
చైనా వాస్తు శాస్త్రం - పెంగ్ షూయ్సవరించు
అభిప్రాయాలుసవరించు
ఎంత పకడ్బందీగా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్నా మనిషికి కేవలం సుఖాలే కాక కష్టాలు కూడా కలుగుతాయని, మనిషి నమ్మకానికే శక్తి ఉందని, మనిషికి కలిగిన ఓటమికి, అనారోగ్యాలకు, బాధలకు వాస్తుతో సంబంధం లేదని, మనిషిలో ఏవో తెలియని భయాలే వాస్తుని నమ్మేలా చేస్తాయని పలువురి లౌకిక వాదుల అభిప్రాయం. ఇటీవల టివి 9 చానెల్ వారు "వాస్తు నమ్మకం వెనుకబాటుతనం" అని డిస్ప్లే చేయడం జరుగుతున్నది
మూలాలుసవరించు
- D. N. Shukla, Vastu-Sastra: Hindu Science of Architecture, Munshiram Manoharial Publishers, 1993, ISBN 978-81-215-0611-3.
- B. B. Puri, Applied vastu shastra in modern architecture, Vastu Gyan Publication, 1997, ISBN 978-81-900614-1-4.
- Vibhuti Chakrabarti, Indian Architectural Theory: Contemporary Uses of Vastu Vidya Routledge, 1998, ISBN 978-0-7007-1113-0.
బయటి లింకులుసవరించు
- [https://dasamiastro.com/vastu-in-telugu/ The complete Gruha vastu guide and house plan
- Vastu Shastra, Non Commercial Vastu Website on web, More articles on vastu shastra with meaningful images, free e-books, and every thing is FREE.
- Vaastu Vedic Research Foundation, Chennai, Tamil Nadu, India
- Vaastusolutions.net Defines that even the Gods needs a Vaastu compliant place on Earth to live. http://www.vaastusolutions.net
- Parasara Vasthu Ganithamu [1] Java Application by D T S Reddy.
- https://en.wikipedia.org/wiki/Vastu_shastra
- https://web.archive.org/web/20131222074324/http://www.webzeest.com/article/2474/whether-the-science-of-vaastu-is-believable
- https://web.archive.org/web/20150304195127/http://www.vaastunaresh.com/vastu-myths.html
- https://en.wikipedia.org/wiki/Superstition_in_India
- http://www.rohitmishra.me/blog/2011/08/23/vaastu-is-not-science/
- https://web.archive.org/web/20140414143852/http://www.hindusvision.com/Vastushastra.html
- https://en.wikipedia.org/wiki/Feng_shui
- https://web.archive.org/web/20150209125539/http://www.nhsf.org.uk/2005/12/vaastu-shastra-fact-or-fiction/
- https://cs.wikipedia.org/wiki/V%C3%A1stu_%C5%A1%C3%A1str