వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 17

పాత చర్చ 16 | పాత చర్చ 17 | పాత చర్చ 18

alt text=2013 జనవరి 28 - 2013 జనవరి 30 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 జనవరి 28 - 2013 జనవరి 30

ఏకవాక్య వ్యాసాలు. మార్చు

నేను ప్రారంభించిన ఏకవాక్య వ్యాసముల రగడకు ప్రధాన కారణమయిన వ్యాసం (డయామీటర్)పై కొంత వివరణ:

నేను ఆంగ్లంలో ఉన్న కొన్ని వృక్షముల వ్యాసాలు తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు డయామీటర్ అనే పదం వచ్చింది. డయామీటర్ అనే ఇంగ్లీషు పదానికి తెలుగులో వ్యాసం అని అర్థం ఉన్నది. వ్యాసం అనే పదం మామూలుగా ప్రజల వాడుకలో లేదు, అందువలన సామాన్యుడిగా నాకు తెలియలేదు. అనువాద ప్రక్రియలో డయామీటర్ అనే ఆంగ్ల పదం వృత్తం లోపల అడ్డు కొలతలు అనే అర్థాల నిచ్చే డయా మరియు మెట్రాన్ అనే గ్రీకు భాష పదాల నుండి ఉద్భవించిందని అర్థమయింది. ఆధునిక వాడుకలో డయామీటర్ యొక్క పొడవును డయామీటర్ అనుట వలన నేను తెలుగు వారికి సులభంగా అర్థమయ్యేట్టూగా అడ్డుకొలత అనే పేరుతోనే వ్యాసం ప్రారంభించాను. అంతేకాక వ్యాసం అనే పేరుతో ఇతర వ్యాసం ఉండుట వలన వ్యాసం అయోమయనివృత్తి ఏర్పాటు చేశాను, అక్కడ నుంచి వ్యాసం (అడ్డుకొలత)కు దారిమార్పు ఇచ్చాను. నువ్వు ప్రారంభించిన వ్యాసం నువ్వే సరిచేయాలి అన్నట్లు ఇతరులు ఈ వ్యాసంపై విమర్శలు గుప్పిస్తే సరిచేయడానికి ప్రయత్నించాను. ఈ వ్యాసం పేరు మార్పుకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పుస్తకానుభవం లేనందువలనే ఈ సమస్య వచ్చినందువలన ఈ వ్యాసం గురించి పుస్తకాలలో వెతుకుతున్నాను, త్వరలో అత్యంత అందంగా ఈ వ్యాసాన్ని సరిదిద్దుతాను. మీ YVSREDDY (చర్చ) 23:50, 28 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ మధ్య కొందరు సభ్యులు పోటిపడి మరీ ఏకవాక్యయుతమైన కొత్తవ్యాసాలనుసృష్టిస్తున్నారు.అసలుకన్న కొసరుఎక్కువ అన్నచందాన వ్యాసాలచేర్పు జరిగిన,తెలుగు వికీపీడియా విలువలు దిగజారే ప్రమాదం పొంచివున్నది.ఏపాఠకుడైన ఏదైన సమాచారం కై ఒకపేజిని చూస్తే అందులో అంతో,ఇంతో సమాచారమున్న,రెండో పర్యాయము మళ్లి చూస్తాడు,అసలు మ్యాటరే లేని రెండు,మూడు ఇలాంటి వ్యాసాలను చూసి,ఆతరువాత టైం వేస్టంటూ అసలు తెవికీకే దూరమైయ్యే అవకాశమున్నది.ఈవిధంగా అసక్తిగల పాఠకులకు తెవికీ పట్ల చులకనభావం పేరుగుతుంది.ఎన్ని వ్యాసాలున్నాయన్నదికాక ఎంత సమాచార ము అందించగలమన్నదిముఖ్యము.అందుచే విజ్ఞజైన సభ్యులు వ్యాసరచన విషయంలో శ్రద్ధ పెట్టాలి.ఈలాంటి సభ్యులకు సీనియరు సభ్యులు,కార్యనిర్హకులు వెంటనే స్పందించి తగు సూచనలు లు,అవసరమైనచో హెచ్చరికలు ఇవ్వడం ఎంతో అవసరం.నేను ఇది ఏసభ్యుని పట్ల వ్యక్తిగత ద్వేషంతో వ్రాయడంలేదు.తెవికీ అభివృద్ధిని,పేరును దృష్టిలో పెట్టుకొని సూచిస్తున్నాను.తెవికీని విజ్ఞాన సర్వస్వముగానే వుంచుదాము.వుత్త స్వర్వసముగా కాదు.పాలగిరి (చర్చ) 03:36, 23 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అన్నివికీపీడియాలలో మొలక వ్యాసాలగురించి భిన్నాభిప్రాయాలు వుంటాయి. (గతంలో బాట్ ద్వారా గ్రామ వ్యాసాలు సృష్టంచడంజరిగింది.) దీనికి పరిష్కారం ఒక విషయంపై ఆసక్తి వున్న సభ్యులు కలిసికట్టుగా చర్చించి నిర్ణయంతీసుకొని ప్రాజెక్టు జట్టుగాపనిచేయడం. --అర్జున (చర్చ) 04:18, 23 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నేను ఏక వాక్య వ్యాసాలకు పూర్తికా వ్యతిరేకం. నేను ఒక మంచి ఆశయంతో తెవికి కి వచ్చాను. నా ఉద్దేశాన్ని కూడా నా వాడుకరి పేజిలొతెలియజేశాను. భౌతిక శాస్త్ర వ్యాసాలు ఎలా విస్త రిస్తున్నానో మీకు తెలుసు. భౌతిక శాస్త్ర వ్యాసాలు మరి కొందరు వ్రాస్తున్నారు. చాలా సంతోషం. అందులో కొన్ని సవరణలు చేస్తున్నాను. వ్యాసాలలొ కొన్ని అనవసర విషయాలు, బొమ్మలు ఉన్నపుడు నేను చర్చా పేజీలలొ వ్రాసినప్పటికీ సదరు సభ్యులు కాని.నిర్వాహకులు పట్టించుకోవటం లేదు. కొందరు విషయ ప్రాథాన్యత తగ్గించి కొత్త వ్యాసాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మీరు నూనెల వ్యాసాలు వ్యాసేటప్పుడు మేమెవరమూ అందులో తలదూర్చలేదు ఎందువలనంటే నాకు విషయం తెలియదు. పల్లెవాసుల జీవన విధానం వ్యాసం జొలికి పోను.ఎందువలనంటే నాకు విషయం తెలియదు. కాని నాకు తెలిసిన అంశాలలొ తప్పులుంటే నేను సహించలేను. నేను వ్యాసాలు రాస్తున్నాని నా కంటే ముందుగా కొందరు వ్యాసాలను ఏకవాక్యాలలొ మొదలుపెట్టడం అయినా వాటిని విస్తరించక పోవడం సంబందం లేని అంశాలు జొప్పించటం తప్పులు చెప్పినా పట్టించుకోకపోవటం సంబంధిత రంగంలో 18సం. అనుభవం గల నాకు బాథ కలిగింది. అందువలన భావోద్వేగంతో నేను మొదటిసారి ఒకేసారి అనేక ఏకవాక్య వ్యాసాలను వ్రాసినందుకు క్షంతవ్యుడను. నేను వ్రాసిన ఏకవాక్య వ్యాసాలను విస్తరించిన తదుపరి తెవికీ నుండి కొంతకాలం దూరంగా ఉంటాను( కె.వి.రమణ- చర్చ 05:17, 23 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]
రమణగారు,
నేను జనరల్ గా చెప్పినది మీరు వ్యక్తిగతంగా తీసికొని నొచ్చుకున్నట్లున్నారు.ప్రస్తుతం భౌతిక,రసాయనశాస్త్రాలలో అధ్యాపకుడిగా అనుభవమున్న మీనుండి ఇంకా పైశాస్త్రాలకు సంబంధించిన ఎన్నోవ్యాసాలు రావసివున్నది.ప్రస్తుతం పైరెండు శాస్త్రాలకు సంబంధించి ఎన్నోచక్కని వ్యాసాలు మీరు వ్రాసారు.మీలాంటివారు మాలాంటి వారిమాటలను సహృదయంతో స్వీకరించి మునుముందు కూడా రచనలు సాగించండి.నా వ్యాఖ్యలు మీకు బాధకల్గించినందుకు క్షమించండి.తేవికీ నాఒక్కడి స్వంత అస్తికాదు.నేనుకూడా ఒక సామాన్య సభ్యుడనే.ప్రత్యేకమైన హక్కులు,అధికారాలేమిలేవు.తెవికీ అందరిది.నేను పైనచేసిన వ్యాఖ్యలు మీఒక్కరి గురించికాకుండగా,ఇతరసభ్యులు సలహలిస్తున్నప్పటికి పటించుకోనివారిగురించి.ఇదేమి మనస్సులో పెట్టుకోకుండగా మీరచనలు సాగించండి.పాలగిరి (చర్చ) 05:55, 23 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున వాడుకరి పేజీలో Santu గారి సందేహం
1. ఈ మధ్య కొందరు సభ్యులు విపరీతంగా ఏకవాక్య వ్యాషాలు మొలకలుగా సృష్టిస్తున్నారు. దీనికి కారణం ఎక్కువ వ్యాసాల చరిత్రలలో తమ పేరు ముందుగా ఉంటుందని వారి అభిప్రాయమైనట్లు గా తోచుచున్నది. దీని కారణంగా ఎవరూ వ్యాస విస్తరణ చేయుట లేదు. కొందరు అజ్ఝాత వాడుకరులు కూడా మొలకలను విపరితంగా సృష్టిస్తున్నారు. తెవికీ లో ఎక్కువ వ్యాసాలు సృష్టించే వారికి ప్రాధాన్యత అధికంగా ఉంటుందా?
2. వ్యాషాల చరిత్ర ను సభ్యులు చేర్చేన విషయం పరిమాణం ఆధారంగా సార్ట్ చేస్తే సభ్యులలో కొందరు ఉత్సాహంగా హెచ్చు విషయం చేర్చటానికి ప్రయత్నించరా?
3. ఒక వాడుకరి ఏకవాక్య వ్యాసం తో 1 శాతం రాస్తే 99 శాతం తో పూర్తి వ్యాసం పూర్తిగా రాసేవారు వ్యాస విషయ కర్తగా ఉండాలని కోరుకోవటంలో తప్పేముంటుంది?

(Santu (చర్చ) 02:21, 25 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]

తెవికీ అందరు కలిసికట్టుగా అభివృద్ధిచేయవలసినది. వ్యక్తులు వారి వారి అభీష్టాలమేరకు వారి ఆసక్తికి సంబంధించిన విషయాలపైన లేక వికీలో అచ్చుతప్పులు దిద్దడం, ఛాయాచిత్రాలు చేర్చడం లేక వ్యాసాల వర్గీకరణ, అంతర్వికీలింకులు, అనువాదాలు స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతుంది. ఈ మార్పులను ప్రధానంగా వ్యాస పేజీల మార్పులు వ్యాసేతర పేజీల మార్పులు గా చూడవచ్చు. ధనాపేక్షలేకుండా చేసేపనికి కనీసం సముదాయంలో గుర్తింపు కలిగిస్తే సభ్యులకు వుత్తేజం కలుగుతుందనుకుంటాను. తెవికీ పని గురించి రకరకాల పరామితులు అనగా మార్పుల సంఖ్య, లింకుల సంఖ్య,మార్పు పరిమాణం లాంటివి నెలవారీగా అందుబాటులో వున్నాయి. అందుకని 2010 లో వ్యాసాల మార్పులను లెక్కలోకి తీసుకొని మొదటి పదిస్థానాలలో వున్న సభ్యులను వారి చర్చాపేజీలలో వ్యాఖ్య ద్వారా గుర్తించడం జరిగింది. వ్యాస మార్పులుమాత్రమే కాకుండా వ్యాసేతర మార్పులు కూడా తెవికీ నాణ్యతకు ప్రధానం కాబట్టి 2011, 2012 లో రెండింటిలో ప్రధానంగా పనిచేసినవారిని గుర్తించడం, వ్యాఖ్య ద్వారా అభినందించడం జరిగింది. ఇవే కాకుండా తెవికీలో బాగా పనిచేస్తున్న వారికి సహసభ్యులు పతకాలతో సత్కరించడంకూడా జరుగుతున్నది. ఈ విధంగా చూస్తే తెలుగులో ఏ విధంగా పనిచేసిన గుర్తింపు కలిగించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ చర్చాపేజీలు చూసేవారికి మాత్రమే తెలుస్తాయి. ఛాయాచిత్రకర్తలకు ముఖపత్రపేజీలో గుర్తింపు ఇస్తున్నట్లు వ్యాసవిషయాలలో పనిచేసేవారికి ముఖపత్రపేజీలో గుర్తింపు ఇవ్వాలనుకొని, ప్రధానంగా కొత్త పేజీలకు సంబంధించిన మీకు తెలుసా శీర్షికలో వ్యాసాన్ని ప్రారంభించిన వారి పేరు చేర్చటం జరిగింది. అయితే మొలక వ్యాసాలలో ఆసక్తికరమైన విషయాలు పెద్దగా వుండవు కాబట్టి, ఈ శీర్షికను అన్ని వ్యాసాలకు అన్వయించి ఆసక్తికరమైన విషయం చేర్చిన వారి పేరు వ్యాసవిషయకర్త గా చేర్చటం జరిగింది. దీనిగురించి ఇటీవల ప్రారంభమైన చర్చలో కనీసం ఐదు మంది సభ్యులు కూడా పాల్గొనకపోవడంతో అసంపూర్తిగా మిగిలింది.
మొలక వ్యాసాలు ఎక్కువగా చేర్చటంవలన వికీఅభివృద్ధి వేగంగా జరుగుతుందా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. మళయాళం లాంటి వికీలో మొలకలను దాదాపు నిషేధించగా, తమిళ వికీలో ఒక మోస్తరు స్థాయిలో వాడుతున్నారు. దీనిపై నిర్ణయం లేక నిర్ణయంలో మార్పులు వికీసభ్యులు చర్చించి తీసుకోవలసివుంది. తెవికీ ప్రారంభించిన రోజుల్లో వుత్సాహవంతులైన సభ్యులు (నాకు తెలిసి దీనిగురించి చర్చజరపకుండానే) బాట్ సాయంతో ప్రతి గ్రామానికి మొలక వ్యాసాలు ప్రారంభించారు. తద్వారా తెవికీలో పనిచేసేవారిలో ఆసక్తి పెరిగి అవి పూర్తి వ్యాసాలుగా వృద్ధిచెందుతాయని భావించారు. అయితే చాలా కొద్ది గ్రామ వ్యాసాలు తప్ప మిగతావి మొలకలుగానే వున్నాయని నా అభిప్రాయం. తెవికీచదివేవారికి ఎక్కువ శాతం మొలకలుంటే ఆసక్తి తగ్గుతుందనుకునే వారిలో నేను ఒకడిని. మొలక వ్యాసాలలో వుండే విషయాలను మొదట జాబితాగా ఒక వ్యాసంలో రాస్తే దానిపై ఆసక్తిగలవారు దానిని ప్రత్యేక వ్యాసంగా తయారుచేయవచ్చు.
వ్యాస విషయ కర్త అనేదానిగురించి ఆ వ్యాసానికి సహకరించినవారందరు వ్యాసవిషయకర్తలే. దీనికి వ్యాస చరిత్ర పేజీ మరియు చర్చాపేజీలు చూడాలి. మీకు తెలుసా శీర్షికలో ప్రస్తావించిన విషయానికి మాత్రమే సంబంధిత సభ్యుని విషయకర్తని ముఖపత్రపేజీలో సూచించడం జరిగింది.
అందరూ అభిప్రాయాలు తెలియచేస్తే, ఓటింగు పద్ధతిద్వారా అత్యధిక సభ్యుల అభిప్రాయం ప్రకారం పని చేయవచ్చు. మీలాంటి వారు తెవికీ చర్చలలో ఎక్కువగా పాల్గొని తెవికీ అభివృద్ధికి కృషి చేయాలనుకోరుచున్నాను.--అర్జున (చర్చ) 03:30, 25 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఏకవాక్య వ్యాసాలగురించి,మరియు మొలకల గురించి చర్చ జరుగవలసిన అగత్యం ప్రస్తుతం ఎంతైనవుంది.ప్రస్తుతం చురుకుగా రచనలు,దిద్దుబాట్లు చేస్తున్న సభ్యుల సంఖ్య తక్కువగా వున్నందున కొత్తసభ్యులను ప్రోత్యహించచలసిన అవసరమున్నప్పటికి,వ్యాసంలో విషయమే లేకుండగా పుంఖానుపుంఖాలుగా సృష్టిస్తున్న సభ్యులగురించికూడా త్రీవ్రంగావెంటనే స్పందించవలసిన అవసరమున్నది.ఈ పద్ధతికి స్వస్తి చెప్పకపోయిన,ఆ సభ్యున్ని ఆదర్శంగా తీసుకొని కొత్తసభ్యులుకూడా ఏకవాక్య వ్యాసాలు రాస్తారు.మొదటి సభ్యుని నియంత్రించని వాళ్ళం,ఆతరువాత సభ్యులను ఎలా నియంత్రించగలము. మొక్కయైవ్రంగనిది మ్రానయైవంగుతుందా?.కలుపుమొక్కలా ఈ ఏకవాక్యవ్యాసాలు తెవికీ నీ ఆక్రమించి,అసలు,సిసలు వ్యాసాలు కనుమరుగవుతాయి.తెవికీ ఆర్.టి.సి.వారి ఎర్రబస్సుకాదు,రైల్వేవారి జనరల్ కంపార్టుమెంట్ కాదు,ఎవ్వరుముందు కర్చీఫ్ వేస్తే వాళ్ళస్వంతమవ్వటానికి.ఒకసభ్యుడు ఏదైన శాస్త్రానికి సంబంధించి మంచి వ్యాసాలు రాస్తుంటే,ఈ ఇంకొకవిషయామేలేని సభ్యుడు ,రెండో సభ్యుడు రాయబోయే శీర్షిక వ్యాసాని చవుహించి ఆ పేరుటొ ఆవిషయాన్ని, ఏకవాక్యంతో కొత్త పేజి సృష్టించి అతని ఉత్సహంమీద నీళ్లుచల్లి,ముందరకాళ్లకు బంధం వేస్తున్నాడు.ఒకవేళ వేరే శీర్షికతో పూర్తి విషయంతో వ్యాసం మొదలెట్టినచో,ఆవ్యాసాన్ని తాను ఏకవాక్యంతో ప్రారంభించిన దానిలో విలీనంచెయ్యాలని,నిర్హాకులకు సందేశాలు పెట్టి,నిజమైన స్పూర్తితో రచనలు చేసె వారికి ఇబ్బంది కలుగ చేస్తున్నారు.కొత్తగా రచనలు చేస్తున్నవారి రచన విధానంలో తప్పులున్న,సినియరు సభ్యులు,లేదా నిర్హకులు సూచనలిచ్చిన ,స్వీకరించి తమ తప్పును సరిదిద్దుకోవటం విజ్ఞతగల సభ్యుని కర్తవ్యం.నేను రచనలు మొదలుపెట్టినప్పుడు రాజశేఖరు గారు,వాటిని గమనించి,బాగుంటే బాగుందని,తేడా వుంటే ఎలాచెయ్యాలో చెప్పేవారు,ఒక్కోసారి పోనుచేసి మరి చెప్పెవారు.అలాగే అర్జుంగారు,మరియు చంద్రకాంతరావుగారు నాపొరబాట్లను దిద్దారు.సహాకారంతో ముందుకు సాగాలి.మరి ఎందరో సభ్యులు నీఏకవాక్య వ్యాసాల పద్దతిమానుకోమని సహృదయంతో పనికట్టుకొని తమ విలువైన సలహాలిస్తుంటే వారికి ప్రత్యుత్తరమివ్వడం సంగతి దేవుడెరుగు,తన పద్ధతిలో విసుమంత మార్పులేకుండ ఆదేపనిగా అర్థంపర్దము లేకుండ వ్యాసాలు,వర్గాలు,వర్గాలకు వర్గాలు,మూసలు,మూసలకుమూసలు,ఇలా కొనసాగుతునే వున్నది.పోని వర్గాలు,మూసలు సృష్టించవలసినంత మేటరెమైనవుందా?.క్రమశ్క్షణారాహిత్యం అంటువ్యాధిలాంటిది.అంటుకుంటె వదలదు.కలరాలా మొత్తము చుట్తుకుపోతుంది.తెవికీ లో ప్రస్తుతం 18 మంది నిర్హాకులు న్నారు, దయచేసి వీరందరు ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెళ్లడించాలి.అలాగే విషయంక్రొత్తగా చేర్చని మొలకలనుకూడా తొలగించాలి.మొలకలు ప్రారంభమైయ్యాకా మూడు సంవత్సరా లవరకు ఎటువంటి మార్పులేని వాటిని తొలగించాలి.ఏకవాక్య వ్యాసాలను నిరోధించాలి.ఒకే విషయంపై రెండువ్యాసాలున్నచో,ఎక్కువ విషయమున్నదానిలో రెండో వ్యాసము విలీనంచెయ్యాలి.విలీనంచెయ్యునప్పుడు, విలీనంచెయ్యువ్యాసంలోని వ్యాసకరలదిద్దుబాట్ల చరిత్రను కూడా తరలించాలి.వ్యాసంలో ఎలా తమపేరుండదు,కనీసంవ్యాసచరిత్రలో నన్న పేరుండలికదా. ఈ విషయమై మిగతా సభ్యులుకూడా స్పందిస్తారనే విశ్వాసంతోపాలగిరి (చర్చ) 05:11, 25 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]


ఏక వాక్య వ్యాసాలు అత్యధికంగా చోటు చేసుకోవడం వికీనాణ్యతను తగ్గింస్తున్నది వాస్తవం. రాశి కంటే వాసి ముఖ్యం. ఈ వ్యాసాలలో ఏదో ఉందని భావించి వాటిని చదవాలని అనికున్న వారికి అది తప్పక నిరాశను కలిగిస్తుంది. ఆంధ్ర ప్రదేశం లోని గ్రామాలను ప్రాజెక్ట్ కార్యక్రమంగా చేపట్తి వాటిని పూర్తి చేసారు. ఈ కృషిలో చదువరి గారూ, వైజా సత్య గారూ, కాసు బాబు గారూ విశేష కృషి చేసారు. వారి కృషి అభినందనీయం. చిరకాలం గుర్తించుకోవలసిన విషయం. ఇది మన గురించి మన గ్రామాల మనం తెలుసుకోవలసినది కనుక ఈ ప్రాజెక్ట్ తెవికీకి చాలా అవసరం. కానీ అన్ని గ్రామాల గురించి ఎవరూ వ్రాసి పూర్తి చేయలేరు కనుక అవి అసంపూర్తిగా మిగిలి పోయాయి. వాటిని పూర్తిగా వ్రాయలేక పోయినా వాటిని ఎప్పటికీ అలా ఉంచి వాటిని అభివృద్ధి చేయాలి. భవిష్యత్తులో ఐ పని జరగవచ్చు. అప్పుడు తెవికీ సభ్యుల సంఖ్య తక్కువ కనుక వాటిని అభివృద్ధి చేయడం వీలు పడలేదు కాని ఇప్పుడు సభ్యులకు తగిన ప్రోత్సాహం కలిగించి వాటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన మొలక లలో విషయం లేనప్పుడు వాటిని తొలగించ వచ్చు. ఒకప్పుడు వాటిని తొలగిస్తూ వచ్చారు ఇప్పుడు ఆ పని కొంత వెనుకబడింది. ఒకప్పుదు దీని గురించి కొంత చర్చ జరిగింది. సభ్యులలో అనేక మంది వాటిని తొలగించలన్న అభిప్రాయం కనబరచారు. కొంత పని కూడా జరిగింది. మొలకలను సృష్టించకుండా ఉండడం మంచిది. సభ్యులకు తెలియజేసినా

కొంత మంది వాట్ని లక్ష్యపెట్తడం లేదు.

 • వికీపీడియాలో అందరూ స్వచ్చం సేవకులే కాని ఎవరూ ఎవరిని నియంత్రించ లేరు. నిర్వహకత్వం, అధికారి కూడా భాద్యాతా యుతమైనదే కాని అధికారయుతమైనది కాదు. ఈ పదవులు తోటి సభ్యులకు సహకరించ తగినవే కాని నియంత్రించ తగినవి కాదు. అలా నియంత్రించడనికి ప్రయత్నించి ధిక్కారానికి గురి కావడం మాత్రమే జరుగుతూ ఉంది.
 • కనుక సభ్యులు ఎవరికి వారు మొలకలను సృష్టించడం తగ్గించండి. అతి పెద్ద వ్యాసాలను మాత్రమే వ్రాయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ వ్రాయతగిన విసహాయంతో వ్యాసాన్ని ప్రారంభించి కనీసం చిన్న వ్యాసంగానైనా వ్రాయడం మంచిది. తరువాత ఆసక్తి ఉన్న సభ్యులు వాటిని అభివృద్ధి చేస్తారు. ఇది చురుకైన సభ్యులు కనీస బాధ్యతగా స్వీకరిస్తాం.
 • ఎవరో అభివృద్ధి చేస్తారన్న దృష్టితో వ్యాసాలను సృష్టించడం తగ్గించి విష య ప్రాధాన్యం ఉన్న వ్యాసాలను వ్రాయడం ప్రారంభిస్తాం.
 • కొత్త సభ్యులు అవగాహనా లోపంతో వ్రాసిన ఏక వాక్య వ్యాసాలను తొలగించడం మీద దృష్టి సారిస్తాం.

--t.sujatha (చర్చ) 05:22, 25 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెవికీ అభివృద్ధికి అందరూ సోదర సభ్యులందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. సంతు గారు సందేహాలను అర్జున గారు నివృత్తి చేశారు. కాని ఏక వాక్య వ్యాసాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలి. నేను ఏకవాక్య వ్యాసాలకు వ్యతిరేకిని. గ్రామ వ్యాసాలలో విషయం తెలియక పోవచ్చు కనుక ఏకవాక్య వ్యాసాలు సృష్టించడంలో తప్పులేదని నా అభిప్రాయం. విషయ ప్రాధాన్యత గల వ్యాసాలకు అంతర్జాలంలో ఎన్నో రిఫరెన్సులు ఉన్నప్పుడు వాటికి ఏక వాక్య వ్యాసాలు అవసరం లేదని నా అభిప్రాయం. సోదర సభ్యులు అటువంటి వ్యాసాలు రాసే ఉద్దేశ్యం ఉన్నపుడు en.wikipedia లో గల వ్యాసాలను అనువాదం చేసుకోవచ్చు. కాని విషయ జ్ఞానం లేనపుడు ఆ వ్యాసాల జోలికి పోవడం మంచిది కాదు. సోదర సభ్యులు మొలకలను విపరీతంగా సృష్టిస్తున్నారు. కాని ఎన్ని రోజులైనా వాటిని విస్తరించడం పై ధృష్టి పెట్టడం లేదు. కొత్త వ్యాసాలపై దృష్టి పెట్టి ఎవరో పూర్తి చేస్తారులే అనే భావనతో ఉన్నారు. విస్తరించలవవి కానివాటికి ఫరవాలేదు. విస్తరించేందుకు వనరులున్నప్పటికీ విపరీతంగా మొలకలను పెంచుతున్నారు. దీనిని మనమందరం వ్యతిరేకించవలసి యున్నది. ఇది ఒక జాఢ్యంగా తయారై కొత్తగా వచ్చిన వారికి కూడా ఎలా వ్యాసం రాయాలో తెలియడం లేదు. నేను వ్యాసాలను ప్రారంభించే కొత్తలో రాజశేఖర్ గారు మంచి ప్రోత్సాహం యిచ్చారు. పాలగిరి వంటి వారు వ్యాస నాణ్యతకు అనేక సలహాలనిచ్చారు. సోదర సబ్యులు చర్చా పేజీలో లోపాలను రాసినప్పటికీ స్పందిచడంలేదు. అలానే నిర్వాహకులు కూడా ఏకవాక్య వ్యాసాల నిర్మూలనపై దృష్టి సారించాలి. కొత్త వ్యాసాలు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం తెవికీ ఉపయోగించే వారికి విషయం తెలియనప్పుడు. ఈ విషయంలో పాలగిరి వాదనతో ఏకీభవిస్తాను. మొలకలను నిరోధిద్దాం! తెవికీ అభివృద్ధికి పాటుపడుదాం!( కె.వి.రమణ- చర్చ 05:58, 25 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]
నియమాలలో ఏకరూపత లేకపోతే ఒకదానికి మినహాయింపు ఇచ్చినప్పుడు ఇంకొకదానికిఎందుకివ్వకూడదు అనే వాదన వస్తుంది. మొలకలని పరిశీలిస్తే గ్రామాలకే కాక, సినిమాలు, పుస్తకాలు, వ్యక్తులు లాంటి వాటికి కూడా చాలా మొలకలు కనబడతాయి. గ్రామాల మొలకలు బాట్ లో చేసినవి పదులవేలల్లో వుంటాయి కాబట్టి వాటిని సంస్కరించాలంటే మనకు మరల బాట్ కావాలి. సాంకేతిక సభ్యులు క్రియాశీలంగా లేనందున వాటిని సంస్కరించటం వెంటనే చేయలేకపోవచ్చు. అందుకని మొలక వ్యాసాలు చేర్చేవారు మొలక మూస చేర్చాలని , దానికి నెలరోజులలోగా(ఉదాహరణగా) విస్తరణ జరగకపోతే ఆ మొలక వ్యాసం తొలగించబడుతుందని, అలా తొలగించిన వ్యాసాలు మరల సృష్టించేటప్పుడు కనీస పరిమాణం వ్యాసంగా వుండాలని నియమం పెడితే ఎలావుంటుందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.--అర్జున (చర్చ) 07:10, 26 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఒకప్పుడు నేను చాలా ఏకవాక్య వ్యాసాలను వ్రాసినవాడిని; చాలా మంది సభ్యులు అభ్యంతరం చెప్పడం వలన వాటిని ఆపివేశాను. నేను తయారుచేసిన ఏకవాక్య వ్యాసాలు కొన్ని వేలల్లో ఉంటాయి. అవి మొలకలుగా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. వాడుకరులు ఇలాంటి వ్యాసాలు తయారుచేయడం ఆపాలని అనుకుంటే తప్ప వీటి నియంత్రణ కష్టం. కొన్నిటిని ఆయా శాఖల్లో నైపుణ్యం ఉన్నవారు అభివృద్ధి చేయవచ్చును. ప్రస్తుతం నేను ఏకవాక్య వ్యాసలను వ్యతిరేకిని. మంచి చర్చలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 08:14, 25 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇది ఇప్పటి సమస్య కాదు అని కొందరు చెప్పారు. వికీలో ప్రవేశించిన మొదట్లో చాలామంది సభ్యులు కేవలం ఎక్కువ చిన్న మార్పులు చేయడం ద్వారా, ఎక్కువ వ్యాసాలను ప్రారంభించడం ద్వారా, ఎక్కువ బొమ్మలు అప్లోడ్ చేయదం ద్వారా ఇలా పలురకాలుగా గుర్తింపు పొందాలనుకోవడం చూసాను. కొందరు ఒక వ్యాసాన్ని ప్రారంబిస్తే దానిని రెండు మూడు సార్లుగా పూర్తి చేసేసేవారు. వ్యాసం మొత్తం అలా పూర్తిచేసిన వారికంటే, చిన్నా చితకా మార్పులు చేసిన వారికి ఎక్కువ గుర్తింపు కలిగి వారికి అత్యధిక మార్పులు చేసిన వారిగా పతకాలు పెడుతుండేవారు. తద్వారా రాసి కంటే వాసి ముఖ్యం కాదూఅని, వ్యాసాల అభివృద్ది కంటే ఎక్కువ వ్యాసాల సృష్టి, మార్పుల ద్వారా గుర్తింపు కలుగుతుందని చాలామంది సభ్యులకు తెలిసేలా చేసినది మనమే (పాత సభ్యులు లేదా ఎక్కువగా క్రియాశీలకంగా ఉండే సభ్యులు లాంటివారు) ఇపుడు సమస్య తెలిసింది కనుక వాదనల జోలికెళ్ళకుండా, ఎవరు అభ్యంతర పెట్టినా ఆగకుండా మరీ ధారుణంగా ఉండే వ్యాసాలను తొలగించాలి. వాటిని నిజాయితీగా గుర్తించి తొలగించేవారు ఎవరు అనేది సభ్యులు నిర్ణయించుకొని వారికి ఆభాధ్యత అప్పగిస్తే కొంత స్పష్టత ఏర్పడుతుంది...విశ్వనాధ్ (చర్చ) 14:28, 25 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
విశ్వనాథ్ గారు చెప్పినట్లు అధిక మార్పులు చేసే వారికి ప్రాధాన్యత నిచ్చేకన్నా వ్యాసాల వృద్ధి పట్ల శ్రద్ధ కనబరిచే వారికి ప్రాధాన్యత నిస్తే మరికొంత మంది వ్యాస విస్తరణ పై దృష్టి పెడతారు. వ్యాసాల సంఖ్య మరియు అందులో చేర్చిన విషయం యొక్క బైట్లు యొక్క నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని ప్రోత్సాహకాలు అయిన పతకాలు ఇస్తె వ్యాస విస్తరణ పట్ల శ్రద్ద కలుగుతుందని నా అభిప్రాయం. ఒక సభ్యుడు 20 వ్యాసాలు లో 100 బైట్లు మాత్రమే చేరిస్తే అతని వ్యాస:విషయ నిష్పత్తి 1:5 అవుతుంది. వేరొక సభ్యుడు 2 వ్యాసాలలో 500 బైట్లు చేరిస్తే అతని వ్యాస,విషయ నిష్పత్తి 1:250 అవుతుంది. మొదటి సభ్యుని ఏవరేజ్ 5బైట్లు/వ్యాసం , రెండవ సభ్యుని ఏవరేస్ 250 బైట్లు/వ్యాసం అవుతుంది. ఈ విధంగా చేస్తే విషయాన్ని విస్తరించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.( కె.వి.రమణ- చర్చ 06:18, 26 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]
రకరకాల పరామితుల అధారంగా గుర్తింపు ఇవ్వవచ్చు. అయితే అవి నేరుగా నివేదికలలోవుండనివైతే వాటిని గుణించడానికి సమయం కావాలి. సాధారణంగా సభ్యులు వ్యాసాల నాణ్యతను పెంచే వుద్దేశ్యంతో పనిచేస్తున్నారు కాబట్టి సులభమైన పరామితులనే వాడుతున్నాము.--అర్జున (చర్చ) 03:44, 5 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నేను ప్రారంభించిన వ్యాసాల నాణ్యత పెంపుదల బాధ్యత నుండి తప్పుకోను, వాటి నాణ్యత పెంచుతాను. నేను ప్రారంభించిన వ్యాసాల నాణ్యత పెంచిన వారికి ధన్యవాదాలు. ఏ శాస్త్రాల మీద నాకు పుస్తక అనుభవం లేదు, అనుభవించినవి, నచ్చినవి అనుభవించి వ్యాసాలు వ్రాసున్నాను. ఇటీవల పుస్తక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వాటిలోని సమాచారాన్ని కూడా వ్రాస్తున్నాను. అవసరమయినవి, నేను విస్తరించగలిగినవే మాత్రమే వ్రాసాను, అందువలన నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని అవసరమమయిన మేరకు విస్తరించగలను. రాజశేఖర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో నక్షత్రవనం వ్యాసం అభివృద్ధి పరుస్తున్నాను. సుజాత గారు నాపై పెట్టిన బాధ్యత లాగా పనిచేస్తున్నాను. తెలుగు వికీపీడియాలో పతకాలు పొందిన ప్రతి ఒక్కరి మీద అభిమానం పెంచుకున్నాను. ప్రతి అభినందనను, విమర్శను నా వ్యాసాల నాణ్యత పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాను. సందర్భాన్ని బట్టి కొత్త వ్యాసాలు మొదలు పెట్టినను సోము గారు కోరినట్లుగా నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని మొలక స్థాయి నుండి మొక్క స్థాయికి విస్తరించగలను. మీ YVSREDDY (చర్చ) 05:45, 26 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రస్తుతం మీరు వ్రాసిన ఏకవాక్య వ్యాసాల నాణ్యత పెంచెటంతవరకైన క్రొత్తగా ఏకవాక్యవ్యాసాలను ప్రారంభించకండి.ముందు వాటిని మెరుగు పరచండి,ఆతరువాత కొత్తవ్యాసాలగురించి ఆలోచించండి.పాలగిరి (చర్చ) 07:02, 26 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
(తే.27.01.2013ది. ఉదయం పాలగిరి గారి వ్యాఖ్య(YVSREDDY చర్చా పేజీ నుండి-రెడ్డి గారి వ్యాసముల గురించి)
మీప్రవర్తన పై గాటుగా రచ్చబండలో జర్చజరిగి,ఏకవ్యాక్య వ్యాసాలను విరోధించాలని చర్చలో పాల్గొన్న అందరు అన్నప్పటికి మీ ప్రవర్తనలో మార్పు రాలేదు.నిన్న జర్నలిజం అంటూ వ్యాసం 4 వాక్యాలతో ప్రారంభించారు.దాన్ని పూర్తిచెయ్యకముందే జెండా అంటూ మరో 4వాక్యాలతో మరోవ్యాసం మొదలైనది.ముందు జర్నలిజం వ్యాసాన్ని ముగించండి,ఆతరువాత రెండోది మొదలెట్టండి.తెవికీ లో పలానా రోజు లోపుగా వ్యాసాలు చేర్చండి అంటూ నింబంధనేది లేదు.ఒకవ్యాసానికి సంబంధించి తగినంతసమాచారము సేకరించిన తరువాతనే వ్యాసం మొదలెట్టండి.విజ్ఞతతో ఆలోచించండి.నాకుతెలినంతవరకు మీరు అనుసరిస్తున్న విధానం సరియైనదికాది. ఏమిచేసిన చిరంజీవి (ఆంజనేయస్వామి)........ అనే నానుడిని సార్ధకం చెయ్యకండి. వికీ సభ్యులెవ్వరు మీశత్రువులుకాదు.ఒకరిమొఖాలొకరికి తెయయదు.ఇంతమంది సలహా లిస్స్తున్నారంటే మీ వ్యాసాలలో విషయంలేకపోవడమే.మీరు విషయాన్ని అనుభవిస్తూ వ్రాసున్నానని సమాధానమిచ్చారు.ముందు విషయాన్నిఅనుభవించండి,ఆకలింపుచేసుకోండి.అప్పుడు తగినంత సమాచారాన్ని సమీకరించుకొని వ్యాసంవ్రాయండి.దయచేసి ఎదుటివారుచెప్పిందినేనుఎందుకు వినాలనే ఆహంభావంతో తెవికీని చలకనచెయ్యకండి.మీరు స్వంతంగా ఒక బ్లాగు తయారుచేసుకొని అందులో మీమనస్సుకు నచ్చినట్లుగా వ్రాసుకోండి.ఎవ్వరికి అభ్యంతరం వుండదు.నచ్చినవాళ్ళుచదివితే చదువుతారు.లేదంటే లేదు.తెవికీని లక్షలాది తెలుగువారికి ఉపయోగపడాలనే సదుద్దేశ్యంలో పనిఛేస్తున్నది. మీఅర్థంపర్థంలేని చర్యలతో చులకనకాకండి.భాస్కరనాయుడుగారు,రమణగారు,శ్రీ సుజాతగారు,విశ్వనాథ్ లాంటివారు ఏలావ్యాసాలురాస్తున్నారో చూడండి.మీరు మళ్ళి ఆలోచించండి.వికీలో ఏకాకిగా మిగలకండి. అందరితో కలసి పనిచెయ్యండి.(పాలగిరి 01:26, 27 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]

(తే.27.01.2013ది. ఉదయం సోమేశ్ గారి వ్యాఖ్య(YVSREDDY చర్చా పేజీ నుండి-రెడ్డి గారి వ్యాసముల గురించి)
మీరు మీ వ్యాసాలను పేక ముక్కల భవంతిగా నా చర్చా పేజి లో పోల్చారు. వాటిని శాశ్వత గృహంగా చేస్తామనడం సంతోషించదగ్గ విషయం. మీరు విపరీతంగా తయారుచేసే మొలకలను మీరే మొక్కలయ్యే వరకైనా పెంచాలి. మీరు తయారుచేసిన మొలకలను ఎవరో విస్తరించాలని కోరుకుని మొలకల సంఖ్య పెంచడం మీ తప్పు. మీ వ్యాసాలు విస్తరించలేని గొప్ప వ్యాసాలు కాదు. మీ రోజుకు ఒక వ్యాసం వ్రాసినా అది పూర్తి చేయండి. అంతే గాని ఒక వాక్యం వ్రాసి మొలక మూసలు, విస్తరణ మూసలు, అనువాదం మూసలు, దారిమార్పులు, విలీనం మూసలు ఉంచడం సబబుగా లేదు. అనవసర వర్గాలు, పనికిరాని మూసలు చేస్తూ తెవికీ నాణ్యతా ప్రమాణాలు దిగజారుస్తున్నారు. ఒక వాక్యం కనిపిస్తే అందులో ప్రతి పదానికి విచక్షణాజ్ఞానం లేకుండా వ్యాసాలు మొదలు పెట్టడం భావ్యమా! (Somu.balla (చర్చ) 01:13, 27 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]

రెడ్డిగారూ,
మీకు అనుభవం లేని వ్యాసాల జోలికి పోయేకన్నా మీకు అనుభవం ఉన్న రంగంలో వ్యాసాలు మొదలుపెట్టి వాటిని విస్తరించవచ్చు కదా. ఎన్ని వ్యాసాలు మొదలు పెట్టామని కాదు. ఎన్ని పూర్తిచేశామన్నదే గొప్పతనం. ఈ విషయం మీరు గ్రహించాలి. ఒక కార్యక్రమం మొదలు పెట్టే వాని కన్నా దానిని నిర్విఘ్నంగా పూర్తి చేసే వాడే ఘనుడు. మీ వ్యాసాలను విస్తరించండి.( కె.వి.రమణ- చర్చ 07:16, 26 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]
'ఫలానా ఊరు ఫలానా జిల్లాలో ఉంద'ని రాస్తే చాలు... అది ఒక వ్యాసం....!
'ఫలానా కూర తినడానికి ఉపయోగిస్తార'ని రాస్తే చాలు... అది ఒక వ్యాసం....!
'ఫలానా చెట్టుకు ఫలానా పువ్వులు పూస్తా'యని రాస్తే చాలు... అది ఒక వ్యాసం...!
దీనికి తోడు 'ఆ మొక్క, ఆ చెట్టు, ఆ కొమ్మ, ఆ ఆకు, ఆ కాయ..... ' ఫోటోలుపెడుతూ, ఆ ఫోటోలలో వ్యాసకర్త కూడా చొరబడటం ఖచ్చితంగా ఇబ్బందే ...! తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ, తెలుగు సంప్రదాయానికీ, వ్యాసాలలోని విషయ సారాంశ ఖచ్చితత్వానికీ నిబద్ధతగా... కొలమానంగా... మేము (చాలా పత్రికలు) వార్తలు, వ్యాసాలూ రాసేటప్పుడు తెవికీలో వచ్చిన సారాంశాన్నే పరిగణన లోకి తీసుకుంటూ ఉంటాం...! తెవికీ అంటే మాకు అంత నమ్మకం...! (ఇంతకు ముందు తెవికీని అభివృద్ధి చేసినవారు అంత కృషి చేసారు. వారందరికీ కృతజ్ఞతలు. వారి కృషిని ఇప్పటికీ కొనసాగిస్తున్న నేటి తరం నిర్వాహకులకూ కృతజ్ఞతలు.) చాలా సార్లు వ్యాసాల వివరణ కోసం..., మరింత అదనపు సమాచారం కోసం... తెవికీలో పరిశీలిస్తే ఏకవాక్యంతో వ్యాసం ప్రత్యక్షమవుతుంది... ఇష్టంగా తింటున్న ఉప్మాలో కరగకుండా మిగిలిపోయిన ఉప్ప రాయిలా...! --- ఇందుకు పరిష్కారం ఏమిటంటే... ఏకవాక్య వ్యాసాలను తొలగించడం లేదా తక్షణమే అభివృద్ధి చెయ్యడం ! వ్యాసాలను అభివృద్ధి చేయగల సమాచారం వారివద్ద వుండి ఉన్నట్లయితే ఈపాటికే ఆ వ్యాసాలను అభివృద్ధి చేసి వుండేవారు. ఇంతవరకూ ఆ వ్యాసాల అభివృద్ధి జరగలేదు కాబట్టి, ఆ పూర్తి సమాచారం వారి వద్ద లేదని భావిస్తూ ఆ ఏకవాక్య వ్యాసాలను తొలగించడమే సమంజసం కాగలదు. ఇకపోతే వ్యాసాలతోబాటు చేర్చిన ఫోటోలలో వ్యాసరచయిత కూడా ఉన్నట్లయితే ఆ ఫోటోలను తొలగించడం మంచిదని నా సూచన. ఆపై విజ్ఞుల నిర్ణయం.....!........... Malladi kameswara rao (చర్చ) 07:32, 26 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అయ్యా, అటువంటి చిత్రాలు, లేదా వ్యాసాలు కనబడినప్పుడు వాటి చర్చాపేజీలో వ్యాఖ్యానించండి. నిర్వహాకులుల తగు సవరణలు చేస్తారు. — వీవెన్ (చర్చ) 17:52, 26 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కొత్తగా ఏకవాక్య వ్యాసాలను సృష్టించడం తగ్గించుకుందాం. మొలకలు ఒక విధంగా కొత్తవారికి వ్యాసాలను రాయమనే ఆహ్వానం కూడా. అయితే, ఇప్పటి వరకూ ఉన్న ఏకవాక్య వ్యాసాల విషయంలో (వాటిని గుత్తగా తొలగించడం కాకుండా) మనకు ఒక వ్యూహం అవసరం. విషయ ప్రాధాన్యత పరంగానో లేదా జనాలు ఎక్కువగా చూసే వ్యాసాలను గుర్తించి ముందుగా వాటిపై దృష్టి సారిస్తే మేలు. వివిధ వ్యాసాలకు ఉన్న రద్దీని తెలుసుకోడానికి ఈ జాల సేవను వాడుకోవచ్చు. జనాలు అంతగా చూడని వ్యాసాలు మొలకలుగా ఉన్నా ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేదు. ఆలా రంగాలకు సంబంధించిన వ్యక్తులు వీటి అభివృద్దికి వికీప్రాజెక్టులగా కృషి చేస్తే సరిపోతుంది. — వీవెన్ (చర్చ) 17:52, 26 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వెరీ గుడ్, బాగానే చర్చ సాగుతుందే!! ముందుగా ఏకవాక్య వ్యాసాలను వ్యతిరేకించే వాళ్లకి - నేనూ మీవైపే. కానీ అది "మన" స్వంత అభిప్రాయంగా గుర్తించక తప్పదు. ఒక వేళ మనం అలాంటి వ్యాసాల్ని తొలగిద్దామనుకొండి, ఎప్పుడు తొలగించాలి? సృష్టించిన వెంటనే తొలగించాలా? కొన్నాళ్లు ఆగి, విస్తరించకపోతే తొలగించాలా? దానికి వీటిపై మనం ఒక కన్నేసి ఉంచాలి నిర్ణీత వ్యవధి తర్వాత తొలగిస్తుండాలి. దీనికంటే ముఖ్యమైన విషయం అసలు అలాంటి నిషేధం ఎందుకు విధించాలి అని ఆలోచించాలి. ఇక్కడ చేరిన సభ్యులందరూ మొదట ఇలాంటి చిన్న వ్యాసాలు వ్రాసినవారే. ఏకవాక్య వ్యాసాల వళ్ళ పెద్ద ఉపయోగం ఉండదని కొత్త సభ్యులకు నచ్చజెప్పాలి. అంతేకాని మీరు ఇంత పెద్దది వ్రాయగలిగితే ఇక్కడ వ్యాసం ప్రారంభించండి అనటం వికీపీడియా స్పిరిట్ కే వ్యతిరేకమని నా అభిప్రాయం. కొన్ని మొలకలుంటే మిగిలిన వ్యాసాలకు వచ్చిన నష్టమేవీలేదు. కొన్నేళ్ళ క్రితం ఇదే విషయం చర్చకొచ్చినప్పుడు కాసుబాబు గారు "మొలకలు ఉండడం మరీ అంత అవాంఛనీయం కాదు. ప్రస్తుతం మొలకలు అత్యధిక శాతం కావడమే మన సమస్య" అన్నారు. పెద్దాయనతో నేను ఏకీభవిస్తున్నాను. సంతోషకరమైన విషయమేవిటంటే గత మూడేళ్ళలో తెవికీలో మొలకలశాతం ఒక ఇరవై శాతం దాకా తగ్గింది. ఇక ఏకవాక్య వ్యాసాలు సృష్టించే వారికి, ప్లీజ్.....ఉన్న వ్యాసాలను విస్తరించి నాణ్యత పెంచేందుకు కృషి చేద్దాం. --వైజాసత్య (చర్చ) 06:00, 31 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వెరీ గుడ్, బాగానే చర్చ సాగుతుందే!! ముందుగా బహువాక్య (అనేక వాక్యాలు) వ్యాసాలను వ్యతిరేకించే వాళ్లకి - నేనూ మీవైపే. కానీ అది "మన" స్వంత అభిప్రాయంగా గుర్తించక తప్పదు. ఒక వేళ మనం అలాంటి వ్యాసాల్ని విడగొడదామనుకోండి. ఎప్పుడు విడగొట్టాలి, పెద్ద వ్యాసాలు మరీ పెద్దవిగా అయినప్పుడా, విడి విడిగా రాయనప్పుడా, రాసే వారికి సూచన లిద్దాము, వాటిని విడి విడిగా రాయటం వలన కలిగే ప్రయోజనాలను అతనికి తెలియజేద్దాం, ఒక పెద్ద వ్యాసంలో అనేక విశేషాలను రాసి ఒకే చోట ఉంచడం కంటే వాటిని ఎవరు ఏ సమాచారం కోసం వెతుకుతున్నారో ఆ పేరుతో పేజీలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న సమాచారాన్ని తెలుసుకునేలా రాయమని సలహా ఇద్దాం, కలగూరగంపలో లాగా ఏ కాయ ఏ మూలలో ఉందో తెలియనట్లుగా ఏ కార్తెలో ఏ పంటలు వేయాలో తెలుసుకుందామని వచ్చిన అతనికి ఆ కార్తె వెతకడానికి పట్టే సమయాభావాన్ని అతని తెలియజేద్దాం, అప్పటికి వినకుండా తన పని తాను చేసుకుంటూ పోతే వికిపీడీయా విధి విధానాల ప్రకారం ఆ వ్యాసాన్ని చర్చించి విడగొట్టే పనిని మనమే తీసుకుందాం. సంతోషకరమైన విషయమేవిటంటే ఇటీవల కాలంలో చెట్టు వేరు వ్యాసంగా వాటి నుంచి లభించే నూనెలు వేరు వేరు వ్యాసాలుగా వస్తున్నాయి. ఇక బహువాక్య (అనేక వాక్యాలు) వ్యాసాలు సృష్టించే వారికి, ప్లీజ్.....వ్యాసాలను విడి విడిగా విడగొట్టి అవసరమయిన చిత్రాలను ఉంచి బ్రౌజర్ వేగం పెంచేందుకు కృషి చేద్దాం. వై.వి.యస్.రెడ్డి (చర్చ) 19:41, 31 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నమస్కారం రెడ్డిగారూ, ఒక కథకు, నాటకానికి, కరపత్రానికి, న్యూస్ ఐటంకి, మాగజిన్ ఆర్టికల్కి విభిన్న శైలులున్నట్టే వికీపీడియాలోని వ్యాసాలకు కూడా ఒక శైలి ఉంటుంది. వికీపీడియాలో ఎలాంటి సమాచారం ఉండాలి, ఎలాంటిది అనవసరం అన్న విషయాలపై కూలంకషమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కేవలం ఒక పదాన్ని ఒక వాక్యంలో నిర్వచించడానికైతే వికీపీడియా వ్యాసం అవసరం లేదు. అలాంటి వాటికోసమే విక్షనరీ ఉంది. WP:NOT అనే మార్గదర్శకపు పేజీని చదవగలరు. వికీపీడియాలో సమస్తమైన పంటలు, మొక్కలు, చెట్ల గురించి సమాచారమున్నా వ్యవసాయ మార్గదర్శిని కాదు. అలాగే అన్ని ప్రదేశాల గురించి సమాచారమున్నా టూరు గైడు కాదు, ట్రావెలాగూ అంతకన్నా కాదు. --వైజాసత్య (చర్చ) 03:26, 1 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో సమస్తమైన పంటలు, మొక్కలు, చెట్ల గురించి సమాచారముతో పాటు రైతులకు వ్యవసాయ మార్గదర్శినిగా కూడా ఉపయోగపడుతుందని YVSREDDY గారు తెలియజేయడంలో తప్పు ఏముంది. వై.వి.యస్.రెడ్డి (చర్చ) 23:41, 1 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మార్గదర్శకమ్ముగా ఉపయోగమ్ము పడుతుండవచ్చుగాని మార్గదర్శి కానేరదు ~ ~ ~ ~
మీరలా సూచించడంలో తప్పేమీ లేదు. ఏ ఒక్క వెబ్సైటు అందరికీ అన్నీ అవలేదు. వికీపీడియా దేన్నీ రెకమెండ్ చెయ్యలేదు. అందుకే అది వ్యవసాయ మార్గదర్శని, ట్రావెల్ గైడు, కెరీర్ కౌంసిలింగ్ వెబ్‍సైటు తదితర పాత్రలను పోషించలేదు. ఎందుకు రెకమెండ్ చెయ్యలేదు అని మీరు అడిగితే దానికి కొన్ని మంచి హేతువులున్నాయి. అందులో మొదటిది వికీపీడియా యొక్క తటస్థ ధృక్కోణానికి కట్టుబడి ఉండాలనే మూల నియమానికి ఉల్లంఘణ. ప్రతి సంస్థకు కొన్ని నిమయ నిబంధనలున్నట్టే అది వికీపీడియా నిర్ణయం. ఈ పైన వ్రాసిన అజ్ఞాత సభ్యుడు చెప్పినట్టు వికీపీడియా రైతులకు మార్గదర్శినిగా ఉపయోగపడితే సంతోషం. కానీ మార్గదర్శిని కావటం వికీపీడియా ఉద్దేశం కాదు. అందుకు అన్నదాత ఉంది కదండి. మీ వ్యక్తిగత లక్ష్యం రైతులకు మార్గదర్శనిగా ఉపయోగపడే వెబ్‍సైటు తయారుచెయ్యటమే అయితే మీరు వికీపీడియాలోని విషయాలన్నీ ఉపయోగించుకుని బేషుగ్గా ఒక మార్గదర్శిని వ్రాయవచ్చు. ఇందులోని కంటెంట్ వాడుకోవటానికి వికీపీడియాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. కేవలం విషయం వికీపీడియా నుంచి తీసుకున్నారని వ్రాస్తే చాలు. మాది రైతు కుటుంబం. నేను చదివిందీ వృక్షశాస్త్రమే. మీరలాంటి వెబ్‍సైటు తయారుచేస్తే నేను తప్పకుండా సంతోషిస్తాను --వైజాసత్య (చర్చ) 03:45, 3 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
12 మంది పైగా చర్చలో పాల్గొనితమ అభిప్రాయాలను తెలియచేసినందులకు అందరికి ధన్యవాదాలు. నాకు అనిపించిన సారాంశం ఏమిటంటే, తెవికీకి కొత్తగా చేరేవారు మొలక వ్యాసాలు రాయటం సర్వసాధారణం. తెవికీలో అనుభవం గడించినతరువాతకూడా మొలక వ్యాసాలు సృష్టించటం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని మొలక వ్యాసాలు రాయటం మంచిది కాదు. అందరి అభిప్రాయాలు తెలిపినతర్వాత ఏ ఒక్కరు కూడా అ వుద్దేశ్యంతో పనిచేయడంలేదని స్పష్టమవుతున్నది. అందువలన తదుపరి చర్యలు గురించి ఈ ప్రతిపాదన చేస్తున్నాను. దీనిలో మార్పుల కొరకు ఒక వారం వేచి వుండి ఆ తరువాత ఓటింగు జరుపుదాం.

ప్రతిపాదన మార్చు

"తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలను, ప్రారంభించిన నెలరోజులలోగా అవి కనీస స్థాయికి (మూసలు వికీ కోడ్లు లాంటివి లెక్కపెట్టకుండా 200బైట్ల పరిమాణం మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని తొలగించవలెను."--అర్జున (చర్చ) 09:23, 7 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జునరావుగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇది సభ్యులందరికీ ఆమోదయోగ్యమొనదీ ఆచరణయోగ్యమైనది. మొలకలను తగ్గించడానికి ఉపకరించే ఐ ప్రతిపాదనకు నేను ఆమోదం తెలియజేస్తున్నాను.--t.sujatha (చర్చ) 03:47, 8 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నిజంగా చాలా మంచి ప్రతిపాదన. అలాగే- ఇప్పటి వరకూ ప్రారంభించి, ఏక.. అర.. పావు.. వాక్యాలతో అసంపూర్తిగా వదిలేసిన వ్యాసాలను కనీస స్థాయికి (అర్జునరావు గారు ప్రతిపాదించినట్లుగా - మూసలు వికీ కోడ్లు లాంటివి లెక్కపెట్టకుండా 200బైట్ల పరిమాణం మరియు కనీసం ఒక అంతర్గత లింకు) పెంచకుండా కొత్తవ్యాసాల సృష్టి తగదని స్పష్టం చేస్తూ, అందుకోసం ఖచ్చితమైన నిబంధన ఏర్పాటు చేస్తే బావుంటుందేమో.... పరిశీలించగలరు. ....Malladi kameswara rao (చర్చ)

తొలగింపు నిర్వాహక బాధ్యతలు చురుకుగా జరిగితే విస్తరించబడని మొలక వ్యాసాలు కాలపరిమితి దాటగానే తొలగించబడతాయి కాబట్టి నిబంధనలు మరింత జఠిలం చేయడం అంతమంచిదికాదనకుంటాను. పరిమాణం పరిశీలించితే తెలుగులో ప్రతిఅక్షరానికి మూడుబైట్లు కావాలి. అందువలన 200బైట్లు ఒక చిన్న వాక్యంతోనే సరిపోతాయి. అందుకని సాధారణంగా వ్యాసానికి మూడు పేరాలు మరియు పేరాకు మూడు వాక్యాలు చొప్పున మొత్తం 9 వాక్యాలకి 1800బైట్లు కావాలి. దగ్గరి సంఖ్యగా పరిమితి 2000 బైట్లుగా నిర్ణయించితే మెరుగు. --అర్జున (చర్చ) 11:47, 9 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జునరావుగారూ ! పరిమితి ఎంత అన్నది మీరు నిర్ణయించండి. --t.sujatha (చర్చ) 14:33, 9 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
కొందరు వ్యాస విషయం లేకుండా చిత్రాలతోనే వ్యాసం వ్రాస్తున్నారు. కనుక 2000 బైట్లలో చిత్రాలు,మూసలు,వికీకోడ్లు మినహాయిస్తే బాగుంటుంది.( కె.వి.రమణ- చర్చ 14:57, 9 ఫిబ్రవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]
కోడ్లు మినహాయింపు ప్రతిపాదనలో వుంది. ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానమన్న సూత్రమందరికి ఆమోదయోగ్యంకాబట్టి కాబట్టి చిత్రం వుంటే పరిమాణం లో ఒక వెయ్యి బైట్లు మినహాయింపు ఇవ్వవచ్చు అని నా ఆలోచన. --అర్జున (చర్చ) 01:29, 12 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
2000 బైట్లలో చిత్రానికి 1000 బైట్లు పోతే మిగిలిన 1000 బైట్లకు 5 లేక 6 వాక్యాలు మాత్రమే వస్తాయి. అందువల్ల పరిమితి పెంచండి.223.177.58.78 03:10, 12 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
2కెబిలకు (గ్రామ వ్యాసాలకు మాత్రం మినహాయింపు ఇస్తూ) మించిన సమాచారంతో వ్యాసాలు సృష్టించాలనే చర్చ ఎప్పుడో జరిగింది. 106.66.55.100 12:03, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దయచేసి మీలాంటి అనుభవజ్ఞులు వాటి లింకులు తెలిపితే వుపయోగంగా వుంటుంది. --అర్జున (చర్చ) 01:27, 14 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చిన్న పేజీల తొలగింపు పై యిదివరలో ఒక చర్చ జరిగింది. అందులో కాసుబాబు గారు కొన్ని ప్రతిపాదనలు చేశారు.వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత ప్రతిపాదనలు 4.అందులో "మూడు లైనులు, మూడు నెలలు" అనే ప్రతిపాదన చేశారు. దానిప్రకారం ఏక వాక్యవ్యాసాలు వృద్ధి చేయుటకు మూడునెలల పరిమితి ఇవ్వడం జరిగింది. దానిని ప్రస్తుతం ఒక నెలకు కుదించటం మంచిది. ఒక నెలలో విస్తరణ జరగనిచో ఆ వ్యాసపు పేజీలో తొలగింపు మూస ఉంచి వారంలోపులోగా తొలగించాలని సూచించడం జరిగినది.ప్రస్తుతం వ్యాస పరిమాణాన్ని పెంచటం మంచిది. వ్యాసంలో చిత్రమునకు 1000 బైట్లు పోతే మిగిలిన 1000 బైట్లతో కూడా అతి చిన్న వ్యాసమే అవుతుంది.( కె.వి.రమణ- చర్చ 04:01, 14 ఫిబ్రవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]
వాటికోసం వేదికేటంత సమయం నాకిప్పుడు లేదు కాని పైన రమణగారు సూచించిన లింకులో కూడా అలాంటి చర్చే జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా గ్రామవ్యాసాలు చిన్నగా ఉన్ననూ వాటికి వ్యతిరేకంగా మాట్లాడింది ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే. గ్రామవ్యాసాలను మొలక స్థాయి నుంచి దాటించడం చాలా సులభం కూడా. 106.66.47.57 16:58, 14 ఫిబ్రవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రతిపాదనపై చర్చలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు. నేను ఇంగ్లీషు వికీపీడియా విధానాలను, తెలుగులో ఇప్పటికి జరిగిన చర్చలను (చాలావరకు పూర్తి సమ్మతిగలవే లేక భిన్నాభిప్రాయాలున్నా వోటింగు జరపనివి) పరిశీలించాను అన్నింటికి ముఖ్యంగా ఏకాభిప్రాయం ప్రాతిపదిక ముఖ్యమని గమనించాను. వికీపీడియాలో ఏకాభిప్రాయం అంటే పూర్తి సమ్మతి కాదని గమనించండి. తెవికీ పురోగతికి విధానాల నిర్ణయంలో ఏకాభిప్రాయానికి ప్రయత్నించటం, భిన్నాభిప్రాయాలు వున్నప్పుడు వోటు ప్రక్రియద్వారా వ్యతిరేఖత ను అంచనావేసి అది తక్కువగావున్నప్పుడు ఏకాభిప్రాయం సాధించినట్లుగా అనుకొని ముందుకు పోవాలి. ఓటింగు ప్రక్రియకు మార్గదర్శకాలను మొదటి నిర్ణయించితే ఆ తరువాత ప్రతిపాదనపై ఓటింగు జరపవచ్చు. అందుకని వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి చూసి దాని చర్చాపేజీలో మీ అభిప్రాయాలు తెలపండి.

వికీమానియా 2013 మార్చు

2013 సంవత్సరం హాంగ్ కాంగ్ లో వికీమానియా సమావేశం కోసం అప్లికేషన్లు కోరబడుతున్నాయి. కుతూహలం ఉన్న వికీపీడియా సభ్యులు నమోదు చేసుకొనవచ్చును. వివరాలు క్రింద తెలియజేశాను.Rajasekhar1961 (చర్చ) 10:56, 23 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Scholarship applications for Wikimania 2013 in Hong Kong are being accept. The application window is one month (through 22 February).

Wikimania 2013 scholarship is an award given to an individual to enable them to attend Wikimania in Hong Kong from 7-11 August, 2013.

Two type of scholarships will be available this year. Partial scholarships will cover travel expenses to Wikimania, capped at 50% of the estimated air fare from your nearest international airport according to wm2013:Getting to Hong Kong. Full scholarships will cover round-trip travel, dorms accommodations as arranged by the Wikimania Team, and registration for Wikimania 2013.

Applicants will be rated on the following four dimensions:

 • 1. Activity within Wikimedia (on-wiki and off-wiki) - 50%
 • 2. Activity outside of Wikimedia and other free knowledge/software projects - 15%
 • 3. Interest in Wikimania and the Wikimedia movement - 25%
 • 4. Fluency of English language - 10%

To learn more about Wikimania 2013 scholarships, please visit https://wikimania2013.wikimedia.org/wiki/Scholarships To apply for a scholarship, you can fill out the application form here: https://scholarship.wikimedia.hk

If you have any question, email us at wikimania-shcolarship@wikimedia.org.

Good luck!

Simon Shek Community coordinator - Wikimania 2013 / Wikimedia Hong Kong wikimedia.hk

ధన్యవాదాలు రాజశేఖర్. 2010లో నేను ,2012లో రాజశేఖర్ వికీమేనియా మేధాఉపకారవేతనము పొంది సమావేశానికి హాజరవటం జరిగింది. ఈ సంవత్సరము కూడా తెలుగు వికీలలో పనిచేసేవారు తప్పక వికీమేనియాలో పాల్గొని తద్వారా వికీప్రపంచంలో జరుగుతున్న మార్పులను తెలుసుకొని తెవికీ అభివృద్ధికి తోడ్పడాలనికోరుతున్నాను. సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 03:00, 24 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రెడ్డి గారికి వినతి మార్చు

పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టెనేని బిగియపట్టవలయు
పట్టువిడుట కన్న పరగచచ్చుట మేలు
విశ్వదాభిరామ!వినురవేమ!

మీరు మీ చర్చా పేజీ లొ సభ్యుల సలహాలను నిషేధించారు. కనుక రచ్చబండ లోవ్రాయవలసి వస్తున్నందుకు చింతిస్తున్నాను.

పై పద్యంలో పట్టుపట్టరాదు(నాలా విషయం లేనపుడు వ్యాసం వ్యాయకండి) , పట్టివిడువరాదు(భాస్కరనాయుడు-పల్లెవాసుల జీవన విధానం లాగ) , పట్టెనేని బిగియపట్టవలయు(పాలగిరి గారి నూనెల వ్యాసాల లా) , పట్టువిడుట కన్న(మీ లాంటి వారి అసంపూర్తి ఏకవాక్య వ్యాసాలు వలె) .ఇలాంటి వ్యాసాలు రాసేకన్నా "పరగచచ్చుట మేలు"(రాయకుండా వుండటమే మంచిది.ఏదో పాటలో వలే "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా" ఎవరో విస్తరిస్తారని మొదలుపేట్ట రాదు.Somu.balla (చర్చ) 04:18, 29 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఒక దేవాలయం నిర్మించాలంటే(వ్యాసం రాయాలనుకుంటే) స్వంత ధనమైనా లేదా చందాలతొ పొందిన ధనమైనా (స్వంత జ్ఞానం కాని,సేకరించిన విషయం గాని) ఉపయోగించి ప్రారంభించి పూర్తి చేయాలి. కాని ఏదీ లేకుండా పునాదులు తీసి (ఏక వాక్య వ్యాసాలు వ్రాసి) వదిలేస్తే అందరూ అందులో పడిపోతారు(చదివే వారు నష్టపోతారు). ఎలాగో దేవాలయం పూర్తి చేస్తే(వ్యాసం పూర్తి చేస్తే) ఇతర వనరులు(వ్యాసానికి తుది మెరుగులు)ఎవరైనా ఎవరైనా సమకూరుస్తారుఃSomu.balla (చర్చ) 05:08, 29 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అడ్డుకొలత వ్యాసంపై సలహా కొరకు మార్చు

చంద్రకాంతరావు గారికి,

డయామీటర్ అనే ఆంగ్ల వ్యాసానికి తెలుగులో అనేక పేర్లు కలవు. ఉదాహరణకు కొన్ని అడ్డుకొలత, వ్యాసరేఖ, వృత్తము మధ్య రేఖ, వ్యాసం, వృత్త వ్యాసం. అయితే డయామీటర్‍కు మూల అర్థం అడ్డుకొలత, అదే పేరు మీద నేను వ్యాసాన్ని ప్రారంభించి వ్యాసం (అడ్డుకొలత) నుంచి దారి మార్పు ఇచ్చి వ్యాసం అయోమయ నివృత్తి కూడా ఏర్పాటు చేసాను. అయితే కె.వి.రమణ గారు అడ్డుకొలత అనే పేరు సరియైనది కాదని వ్యాసము(diameter) అనే కొత్త వ్యాసాన్ని ప్రారంభించారు, దానిలో నేను వ్రాసిన విధంగానే వ్రాసి మరికొంత సమాచారాన్ని జోడించారు. అడ్డుకొలత అనే పేరు సరియైనది కాదు అని అనిపిస్తే సరియైన పేరుకు తరలించి వ్యాసము(diameter)ను విలీనం చేయవలెనని మనవి.YVSREDDY (చర్చ) 05:25, 23 డిసెంబర్ 2012 (UTC)

నేను రోడ్డు నియమాలు వ్యాసాన్ని ప్రారంభించినప్పుడు రాజశేఖర్ గారు దానిని పేజీ చరితం చెడిపోకుండా రహదారి నియమాలుకు తరలించారు. పేజీ చరితం చెడిపోకుండా పేరు మార్పు చేయగలిగినప్పుడు సరియైన పేరును సూచించి పేరు మార్చమని విన్నవించుకోవాలి గాని ఆ పేరు తప్పుగా ఉంది అని మరొక పేరుతో వ్యాసం సృష్టించడం ఏమిటి, అడ్డుకొలత పేరు సరియైనదిగా లేదని వ్యాసము(diameter) పేరుతో కె.వి.రమణ గారు కొత్తగా వ్యాసం ప్రారంభించారు, ఈ పేరు బాగా లేదని మరొకరు వ్యాస రేఖ అని ప్రారంభిస్తారు, ఈ పేరు కూడా బాగాలేదని మరొకరు మరొక వ్యాసం ప్రారంభిస్తారు, అలా ప్రారంభించవచ్చా సరైన సలహా ఇవ్వండి. మీ YVSREDDY (చర్చ) 14:06, 23 డిసెంబర్ 2012 (UTC)


అడ్డుకొలత వ్యాసానికి కె.వి.రమణ గారు సూచించిన సరియైన పేరు మార్పుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. మీ YVSREDDY (చర్చ) 15:44, 23 డిసెంబర్ 2012 (UTC)

చంద్రకాంతరావు గారికి నమస్కారములు, కొన్ని ఆంగ్ల పదములకు వేర్వేరు అర్థాలు ఉండవచ్చు. ఒక పదానికి సమానార్థం యిచ్చే పదం ఉండదు. కాని యించుమించు సమానార్థం యిచ్చె పదాలు లభిస్తాయి. ఉదాహరణకు 'bat' అనె పదమునకు రెండు అర్థాలుంటాయి. అవి 'బ్యాటు ' మరియు "గబ్బిలం" రెండు అర్థాలున్నాయని "గబ్బిలం" వ్యాసం వ్రాసేటప్పుడు మనకి నమానర్థం యిచ్చే పదాన్ని విస్తరించాలి కాని క్రికెట్ లో బ్యాట్ ను విస్తరించరాదు. అదే విధంగా cricket అనే పదమునకు "క్రికెట్"మరియు "మిడుత" అనే రెండు అర్థాలుంటాయి. మనవ్యాసమునకు సంబంధం ఉన్న అంశాన్ని తీసుకోవాలి. ప్రస్తుత విషయానికొస్తే "అడ్డు కొలత " అనే వ్యాసాన్ని రెడ్డి గారు ప్రారంభించారు. దాని సరియైన ఆంగ్ల పదం diameter అవ్వచ్చు లేదా measure of the cross section కావచ్చు. diameter అను పదమునకు రెండు అర్థాలుండవచ్చు. కాని జన సామాన్యంలో ఏ పదం ఎక్కువ వినియోగమే ఆ పేరుతో వ్యాసం వ్రాస్తే బాగుంటుంది. అందువలన వ్యాసము(diameter) పేరుతో వ్యాసం విస్తరించాను. ఇంకా విస్తరిస్తాను. తెవికీ లో వ్యాసములు తయారుచేయటం మన కొరకు కాదని రెడ్డి గారు గుర్తించాలి. సమాజం లో విధ్యార్థుల అవసరానికని గుర్తించాలి. ఎవరైనా విషయాన్ని విస్తరిస్తే ప్రోత్సహించాలి. గాని వివిధ రకాల పేర్లు పెట్టి దారి మార్పులు చేస్తూ వాడుకరులను అయోమయం లోకి నెట్టివేస్తున్నారు. అయినా తెవికీ వ్యాసాలలో మన పేరు ఉంటుందా! సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని వ్యాసాలు చేయాలి. ఆయన చేసిన వ్యాసాలు అడ్డుకొలత, వ్యాసం (అడ్డుకొలత),వ్యాసము(డయామీటరు),వ్యాసరేఖ వంటివి అనేకం ఉంచి అయోమయంలోని నెట్టివేస్తున్నారు.నేను యింకను ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేయదలచితిని. అందువలన దీనిని విలీనం చేయవద్దు. ఎవరైనా విశేషంగా వ్రాసినట్లయితే అందులో విలీనం చేయండి లేదా తొలగించండి.( కె.వి.రమణ- చర్చ 10:04, 23 డిసెంబర్ 2012 (UTC))
మీరిద్దరు పైన ఇచ్చిన విషయాలను మాత్రమే కాకుండా నేనూ రోజూ అందరి రచనలను పరిశీలనలో భాగంగా గమనించబడిన విషయాల ఆధారంగా నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే తెవికీ సంప్రదాయం ప్రకారం ఏదేని వ్యాసం మొదట ప్రారంభించినదే ఉంచి తర్వాత చేర్చిన వ్యాసాలను తొలిగించడం కాని దారిమార్పులు చేర్చడం కాని చేయడం జరుగుతుంది. చాలా వ్యాసాలు తెవికీలో ఇదివరకే ఉన్ననూ కొందరు ఆ విషయం గ్రహించక మళీ కొద్దిపేరుమార్పుతో ఇదివరకే ఉన్న వ్యాసం కన్నా పెద్దగా, నాణ్యతతో రచించిననూ తర్వాత చేర్చబడిన వ్యాస సమాచారాన్ని మొదటగా సృష్టించిన వ్యాసంలోకి విలీనం చేయడం జరుగుతుంది. 5 రోజుల క్రితం Sampathg185 అనే సభ్యుడు ఇదివరకే ఉన్న సినిమా వ్యాసాలను చివరన ...(సినిమా) పేరుతో కొత్తగా సృష్టించినాడు. పాత వ్యాసాలలోని సమాచారమే అందులో చేరి పాత వ్యాసాన్ని అతను సృష్టించిన వ్యాసానికి దారిమార్పు ఇచ్చాడు. (పాత వ్యాసానికి తరలింపు ద్వారా కొత్తపేరు ఇస్తే చరితం కూడా కొత్తవ్యాసానికి బదిలీ అవుతుంది కాని ఇలా చేయలేడు). అలా చేయడం వల్ల వ్యాసం అతనే సృష్టించినట్లు అవుతుంది. పాత వ్యాసం అభివృద్ధికి కృషిచేసినవారి పేరు కొత్తవ్యాసం చరితంలో కనిపించదు. కాబట్టి ఆ విషయం ఆ సభ్యునికి తెలియజేసి నేను అతను సృష్టించిన వ్యాసాలను తొలిగించి ఆ తర్వాత నేను కొత్తపేరుకు తరలించాను, ఇదీ పద్దతి. ఇదంతా చెప్పేది ఎందుకంటే ఎవరైననూ ఇప్పటికే ఉన్న వ్యాస సమాచారానికి పోలిన కొత్త వ్యాసం సృష్టించిననూ మొదటగా సృష్టించిన వ్యాసం మాత్రమే ఉంచబడుతుందని, అయితే వ్యాసం పేరు మాత్రం ఏదైనా ఉంచవచ్చు. ఇక మీ విషయానికి వస్తే మొదటగా YVSREDDY గారు అడ్డుకొలత పేరుతో ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పేరు నచ్చకనో మరే కారణమో కాని కె.వి.రమణ గారు వ్యాసము(diameter) పేరుతో మరో వ్యాసం ప్రారంభించారు. రమణగారు రెడ్డి గారు ప్రారంభించిన వ్యాసానికి కొత్తపేరుకు తరలింపునకు చర్చ ప్రారంభిస్తే బాగుండేది. ఏకంగా మరో వ్యాసం ప్రారంభించడం దానికీ, దీనికి కొన్ని దారిమార్పులు ఇవ్వడం కొంత అయోమయానికి దారితీసింది. చివరగా నేను చేప్పేది- రెడ్డి గారు ప్రారంభించిన వ్యాసమే ఉంచి, పేరు మాత్రం రమణ గారిది ఉంచితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీరిద్దరికీ అంగీకారమేననుకుంటాను. ఎందుకంటే వ్యాసం చరితం ప్రకారం రెడ్డి గారు సృష్టించినట్లు, వ్యాసం పేరు రమణగారు సూచించినట్లు ఉంటుంది. ఇది ఇద్దరికీ అంగీకరమైతే నేను వెంటనే ఆ పనిచేస్తాను. లేకుంటే మాత్రం తెవికీ నియమాలు, సంప్రదాయం ప్రకారం, ఇతర సభ్యుల మెజారిటీ నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకోబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:06, 23 డిసెంబర్ 2012 (UTC)

పై సారాంశం చదివితే రమణగారు ప్రారంభించిన వ్యాసం YVSREDDY గారు ప్రారంభించిన వ్యాసంలో విలీనం అవుతుందని భావించి ఉంటారు కదూ, తప్పులో కాలేశారు.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే వికీపీడియాలో మీరొక్క కొత్త వ్యాసానికి ప్రారంభకులుగా ఉండాలనిపిస్తే అది ఏ వ్యాసమైనా, అది ఎవరు, ఎప్పుడు ప్రారంభించినా అది మీ ప్రారంభ వ్యాసంగా చేసుకోవచ్చు. ఎలా అంటారా సింపుల్ ఇదివరకే ప్రారంభించిన వ్యాసాన్ని తీసుకొని అందులోని సమాచారానికి కొద్దిగా మెరుగులు దిద్ది, కొద్దిగా పేరు మార్పుతో ఉదాహరణకు వ్యాసం(డయామీటరు) పేరుతో వ్యాసం ఉందనుకోండి, వ్యాసము(diameter) పేరుతో వ్యాసాన్ని ప్రారంభించి మెరుగులు దిద్దిన సమాచారాన్ని ఇందులో భద్రపరచండి. విలీనం ప్రతిపాదనలు వస్తే తొలగించండి. ఇక ఆ వ్యాసం మీ సొంతం. గమనిక: ఈ వ్యాసం మీ పేరుతో కొంతకాలం వరకే ఉంటుంది. ఎందుకంటే కలకాలం నిర్వాహకులు మనవారే ఉండరు కదూ....

రెడ్డిగారి వ్యాఖ్యకు సమాధానములు మార్చు

YVSRగారు,

మీరు పైనచేసిన నిర్వహకులగురించి చేసిన వాఖ్య చాలా అనుచితమైనది.నిజానిజాలు తెలుసుకోకుండగా ఏకపక్షముగా,వారికి పక్షపాతదోరణిని అంటగట్టి వ్యాఖ్యానించడం సరికాదు.సభ్యులుకాని, నిర్వహకు కలుకాని ఇప్పటివరకు ఎలాంటి రాగద్వేషాలతో పనిచేస్తున్నట్లు కన్పించడంలేదు.ఇప్పుడు మీరు క్రొత్తగా నిర్వహాకులు ఎవ్వరినో వ్యక్తిగతంగా ప్రోత్యాయిస్తున్నట్లు,కొందరి పట్ల అనుచితవైఖరిగా వున్నట్లు వ్రాయడం,సరికాదు.మీరు ప్రస్తుతం మీరచనలలో జరుగుతున్న తొలగింపులను,విలీనాలను దృష్టిలో పెట్టుకొని తొందరపాటుతో భావోద్యోగాలను లోనయై ఈ వాఖ్యచేసినట్లు కన్పిస్తున్నది.వారు వ్యాసాలను మెరుగుపరచిస్థాయిపెంఛుటకు చేస్తున్న కృషిని మీరు అభినందించవలసినదిపోయి,ఇలాఅనుచితవాఖ్యలు చేసి మీపట్ల ఇతరులకువున్న గౌరవము పోగొట్టుకొనేట్టుచేసుకుంటూన్నారు.అస్తమానం ఆ అడ్దుకొలత వ్యాసాన్ని పట్టుకు వ్రేలాడే బదులు,వందల సంఖ్యలో అసంపూర్ణంగా వున్న మీప్రస్తుత వ్యాసాలను విస్తరించే పనిమొదలెట్టండి.మీరుఎంతకూ ఆపనిచెయ్యకపోబట్టేకదా ఇతరులు ఆపనిచేస్తున్నారు.మేరే మీ వ్యాసాలను సమీక్షించుకొని అనవసరమైనవి తొలగించుకుంటూ,అవసరమైన చోట విలీనాలు విస్తరణలు చేయ్యండి. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారనే నమ్మకంతోపాలగిరి (చర్చ) 10:43, 29 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]


చంద్రకాంతరావు గారి వివరణ చదివినమీదట నాకొచ్చిన చిన్న ధర్మ సందేహం ఇది - అన్యదా భావించ వద్దని ముందుగా మనవి చేసుకుంటున్నాను. ఇక సందేహం ఏమిటంటే - ఎవరైనా ఏదయినా వ్యాసానికి ప్రారంభకులుగా వుండాలంటే 'ఒక హెడ్డింగు పెట్టి, ఒకటి లేదా రెండు మూడు లైన్లతో వ్యాసం రాస్తే సరిపోతుందా? వ్యాసాన్ని క్లుప్తంగా ఇచ్చినప్పటికీ, దానిలో కనీస సమాచారం కూడా లేకపోతే దానిని వ్యాసంగా పరిగణించ వచ్చా? వ్యాస ప్రారంభకులుగా వుండాలన్న ఆపేక్షతో "1వ వ్యాసం - అది శీర్షికతో అక్కడున్నదానిని 'అది' అంటారు. 2వ వ్యాసం - ఇది శీర్షికతో ఇక్కడున్నదానిని 'ఇది' అంటారు." .... అంటూ లైన్లు పేర్చుకుంటూ ఉంటే - వాటిని వ్యాసాలుగానూ, వారిని వ్యాస రచయితలుగానూ పరిగణించాల్సిం దేనా? అప్పుడు అందరూ లైన్ల పేర్పు పైనే శ్రద్ధ పెడతారు గానీ, వ్యాస విస్తరణపై ఎందుకు శ్రద్ధ చూపుతారు? ఒకరిద్దరు శ్రద్ధ చూపినా, ఆ వ్యాసం మరొకరి పేరుగా వుంటుందని తెలిసినప్పుడు 'కనీస సంతృప్తి' కూడా పొందలేకపోయామని బాధపడరా? అసలు ఏకవాక్య వ్యాసాల రచనలు నిర్దిష్ట కాలపరిమితి లోగా (అంటే- కేవలం 30 రోజుల సమయం మాత్రమే. నిజం చెప్పాలంటే సమగ్ర సమాచారం తెలిసినవారికి ఇది చాలా ఎక్కువ సమయం అనుకుంటాను.) సమగ్ర వ్యాసంగా అభివృద్ధి చెయ్యకపోతే అవి తొలగించబడుతుందని హెచ్చరించడం... ఆ హెచ్చరికను ఖచ్చితంగా అమలు చేసే ఖచ్చితమైన నిబంధన ఉంటే తప్ప అసమగ్ర వ్యాసాల బెడద తప్పదేమో...! ఇది కేవలం నా సూచన మాత్రమే...! పరిశీలించగలరు. ....Malladi kameswara rao (చర్చ) 10:38, 29 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
తెవికీ లో వ్యాస నాణ్యత పెంచుటకు కృషి చేస్తున్న రాజశేఖర్ గారికి ధన్యవాదములు. రెడ్డి గారు రాజశేఖర్ పై అనవసమైన ఆరోపణలు చేస్తున్నట్లు తోస్తున్నది. రెడ్డి గారు మొదట అడ్డుకొలత వ్యాసం రాసారు. అందులో గణిత శాస్త్ర పమైన విషయాలు ఉన్నవి కనుక అందులో అనుభవమున్న నేను తగిన సలహాను ఇచ్చి సరిచేయమన్నాలు. దానికి రెడ్డి గారి నుండి స్పందనలేదు."వ్యాసం" అనే వ్యాసం గణిత శాస్త్రానికి సంబంధించినది మరియు essay అయినందున తెవికీ లో "వ్యాసము" అనే వ్యాసం ఉన్నందున నేను వ్యాసము (diameter) అనే వ్యాసం శాస్త్రప్రమాణాలతో విస్తరించాను. రెడ్డిగారు మరల వ్యాసం(డయామీటరు) అనే పేరుతో ఒకవ్యాసం రాసి దానిని అడ్డుకొలత కు దారిమార్పు చేశారు. మరల వ్యాసం(అడ్డుకొలత), వ్యాసరేఖ, ఛాతీ ఎత్తువద్ద, ఛాతీ ఎత్తు వద్ద అడ్డుకొలత అనే నాలుగు పేర్లతో వ్యాసాలను సృష్టించి వాటిని అడ్డుకొలత కు దారి మార్పు చేశారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. నేను ఆపై ఆ వ్యాసం గూర్చి వదిలి ఇతర భౌతిక శాస్త్ర అంశాలపై దృష్టి పెట్టాను. సోమేశ్ గారు తెవికీ ప్రక్షాలన చర్యలలో భాగంగా విలీన ప్రతిపాదనలు పెడితే వాటిపై చర్చించవలసినది పోయి వాటిని తొలగిస్తున్నారు. సోము గారు ఈ విషయాన్ని రాజశేఖర్ గారికి కూడా తెలియజేశారు. ఏకవాక్య వ్యాసాలను తొలగింపు, మరియు తెవికీ నాణ్యతను పెంచే చర్యలలో భాగంగా రాజశేఖర్ గారికి సోము గారు తెలియ జేసిన అభ్యర్థనను పరిగణనలో కి తీసుకుని వ్యాసం అనే దానికి ఇన్ని దారిమార్పులను తగ్గించడానికి వ్యాసం(గణితం) అనే వ్యాసంలో వీటన్నింటినీ విలీనం చేశారు. ఇది స్వాగతించాల్సినది పోయి నిర్వాహకులను నిందించడం రెడ్డి గారికి తగదు. తెవికీ లో ఏ ఒక్కరూ వ్యాసవిషకర్త కారు. ఒక వ్యాసం సమిష్టి కృషి అని గ్రహించాలి. రాజశేఖర్ వంటి వారు వ్యాస ప్రారంభకులు కావటానికి ఇలా చేశారనడం మంచి పద్ధతి కాదు. ఎవ్వరైనా తెవికీ అభివృద్ధికి, నాణ్యతను పెంచటానికి కృషి చేస్తే వారిని స్వాగతించాలి. రెడ్డిగారూ! మీ వ్యాసముల లో అధికంగా ఏక వాక్య వ్యాసాలే. వాటిని విస్తరించవచ్చుగదా. వ్యాసవిషయ కర్త కావాలని మీకు అనుభవం లేని వ్యాసాలను ఏక వాక్యాలుగా చేర్చి తెవికీ ప్రమాణాలను దిగజార్చడం మీకు తగదు. ఏక వాక్యాలపై ఇంత చర్చ జరిగినా మీ వ్యాస విస్తరణకు కృషి చేయకపోగా జర్నలిజం, జెండా వంటి ఏక వాక్య వ్యాసాలను మరలా చేర్చుతున్నారు. మీరు చేయని పనిని ఇతర సభ్యులు చేస్తుంటే వారిని కృషిని గుర్తించకపోగా వారిని లేనిపోని నిందలు వేయటం తగదు. మీరు అనేక వ్యాసాలలో మీ చిత్రాలనుంచారు. ఇది తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదా? మరికొన్ని వ్యాసాలు చిత్రాలతోనే ఉన్నాయి. వాటిలో అంశం లేదు. వృక్ష శాస్త్ర వ్యాసాలను కూడా ఏక వాక్యాలుగా చేరుస్తున్నారు. మీకు తెలియని అంశాల జోలికి పోకండి. తెవికీ ని పరిరక్షించే చర్యలను స్వాగతించండి. తెవికీ లక్షలాది మంది విద్యార్థులు ప్రమాణంగా ఉపయోగపడుతుంది. అందులో నాణ్యత లేకపోతే ఎట్లా. అలాగైతే నేను సృష్టించిన వ్యాసం కూడా వ్యాసం(గణితం) లో విలీనం చేసారు కదా! వ్యక్తిగత ప్రతిష్టలకు పోకండి. మన వ్యాసాలు ఇతరులకు ఉపయోగపడేటట్లు ఉండాలని ఆశించండి. నాకు విషయం తెలీక తెవికీ లో ఇంత శ్రద్ధతో వ్యాసాలను అభివృద్ధి చేయటం లేదు. నేను చేసిన వ్యాసం చాలా మందికి ఉపయోగపడాలని. ఇదే ఆశయంతో తెవికీ లో అనేకమంది స్వచ్చంద సభ్యులు నిరంతరంగా కృషి చేస్తునారు. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని. మీ వ్యాసాలను మంచి ప్రమాణాలతో విస్తరించండి. సహ సభ్యులు సహకారం అందిస్తారు. వ్యాస ప్రారంభకులుగా పోటీ పడకండి. వ్యాసం విస్తరణలో పోటీ పడండి.( కె.వి.రమణ- చర్చ 13:23, 29 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]
 • వికీపీడీయాలో ఎవరూ వ్యాసాలకు కర్తకారు అన్ని వ్యాసాలు సమిష్టి కృషిలో భాగమే అయినప్పటికీ ప్రారంభించిన వ్యాసాన్ని మొలకస్తాయి దాటించవలసిన బాధ్యతా మాత్రం సభ్యులందరికీ ఉంది. రమణ వంటి విద్యావేత్త విద్యార్ధులకు ఉపకరించే నాణ్యమైన వ్యాసాలను అందించి తెవికీ నాణ్యతను పెంచగలరు. వారికి సభ్యులు సహకరించవలసిన అవసరం ఉంది. ఈ చర్చలకు ఇక ముగింపు పలికి మనపనిలో మనం కొనసాగుతాం. --t.sujatha (చర్చ) 17:17, 29 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రెడ్డిగార్కి, మీరెవరో నాకు తెలియదు. కొన్ని చిత్రాలలో చూడటం తప్ప. మీ వివరాలు తెలియదు.నన్ను అమావాస్య చండ్రుడులా కళా విహీనమవుతారని సెలవిచ్చారు. మీరు అమావాస్య చంద్రుడు గా ఉన్నారు. మీరు మీ కళలను క్రమంగా పెంచుకుంటూ పొర్ణమి చంద్రుడులా మారాలని మా సహసభ్యుల కోరిక. నేనెవరో నా స్థాయి యేమిటో మీకు తెలియదు. తెలియవలసిన అవసరం కూడా లేదు. నేను సమాజంలో గొప్ప అధికారినైనా తెవికీ లో ఒక వ్యాసకర్తను కాదు, కవిని కాదు, రచయితను కాదు. కాని ఒక పనివాడిని. ఎందుకంటే తెవికీ మహా క్షేత్రంలో కలుపుమొక్కలైన నాణ్యత లేని వ్యాసాలను చూసి కలత చెంది తెవికీ క్షేత్రంలో అటువంటి వ్యాసాలు తగ్గించి ఎందరో పాఠకులకు మేలు చేయాలని ప్రవేశించాను. కాని నాకు ఎవ్వరి పైన ద్వేషాలు లేవు. మీరు ఎవరో తెలియనప్పుడు మీ మీద నాలు పక్షపాత ధోరణి ఎందుకు. మీరు మీ థోరణి మార్చుకోండి. మీ మైండ్ సెట్ మారాలి. అనవసర వ్యాఖ్యలు మానుకోండి. తెవికీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ తెవికీ శుద్ధి చేయుటకు తన పాత్రను నిర్వాహకుడిగా సమర్థవంతం గా నిర్వహింస్తున్న రాజశేఖర్ గారినే విమర్శిస్తున్నావంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి. మీరు ఎవరి మాట వినరు.మీరు ఉన్నతంగా ఎదగాలని ఎందరో సలహాలిస్తుంటే వారినే విమర్శిస్తారా. మీరు మీ వాడుకరి పేజీలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. సంతోషం.అందరికీ పొగడ్తలు అవసరంలేదు. మీరు నాణ్యమైన వ్యాసాలు తయారు చేసే వ్యాసకర్తగా మారితే అదే అందరికీ గౌరవించినట్లు. సుజాతగారు అధిక వ్యాసాలు తయారు చేయమని చెప్పారన్నారు. నా ఉద్దేశ్యంలో ఉన్నత ఆశాయాలు గల సుజాత గారు అటువంటి సలహాలివ్వరు. నాణ్యమైన వ్యాసాలు తయారు చేయమనే సలహాలిస్తారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు. మీ ఉద్దేశ్యంలో వ్యాసం అనగా ఏమో తెలియనట్లుంది. ఒక వ్యాసం ఒక పాఠకుడు చదివితే అందులో అతనికి అన్ని విషయాలు అర్థమయ్యేటట్లు ఉండాలి. కాని అసంపూర్తిగా ఉండి "ఎందుకండీ తెవికీ లో ప్రవేశించాను" అనే ఏహ్య భావం కలుగరాదు. ప్రమాణాలు పెంచటానికి మీరు కృషి చేయాలి. మీ ఉద్దేశ్యంలో ప్రతి వ్యాసం ప్రక్క మీ పేరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఉదాహరణకు గాంధీ వ్యాసానికి, "గాంధీ(YVSREDDY) " అని వ్యసనములు అనే వ్యాసానికి "వ్యసనములు(YVSREDDY) అని మొండితనం అనే వ్యాసానికి "మొండితనం(YVSREDDY) అని పేర్లు మీకు అవకాశం ఇస్తే పెడతారు. మీకు విమర్శించాలని కాదు. కొన్ని చిత్రాలకు వాటి పేర్లలో YVSREDDY అని తగిలించారు. చంద్రకాంతరావుగారు మీ చర్చా పేజీలో సూచనలు యిచ్చినప్పటికి మీ ధోరణి మారక పోవడం విచారకరం. వ్యాసాలలో వ్యాస విషయ కర్త చిత్రాలను చేర్చడం తెవికీ సాంప్రదాయానికి వ్యతిరేకం అయినా మీరు అనేక వ్యాసాలలో మీ చిత్రాన్ని ఉంచుతారు. ఎందుకండీ ఈ అనవసర విషయాలు. ఎందుకండీ మీ అనవసరమైన విమర్శలు. మిమ్మల్ని మీ వ్యాసాలను బట్రాజులా పొగిడే వారు మీకు యిష్టం. కాని మంచి సలహాలను స్వీకరించరు. మీరే కాదు ఎవరు అనవసర వ్యాసాలు వ్రాసినా తెలియ జేస్తాను. మీ వ్యాసాలలో తొలగింపు,విలీనం,దారిమార్పు మూసలు ఉంచితే మీరు చిత్తశుద్ధితొ ఉంటే చర్చించండి. నిర్వాహకులు చర్యలు తీసుకుంటారు. కాని వాటిని ఎలా మీరు తొలగిస్తారు. తెవికీ మీ స్వంత బ్లాగు కాదని మీరు గమనించాలి. తెవికీ ఒక సమిష్టి కృషి మీ స్వంతం కాదని గమనించండి. మీస్వంత బ్లాగులాగ "నా చర్చా పేజీలోకి రాకండి" "నా చర్చా పేజీని తోలగించండి" అనే వ్యాఖ్యలు మీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనాలు. పాలగిరి వంటి వారే నిర్వాహకుల సలహాలను స్వీకరిస్తారని గమనించాలి. అనవసర వ్యాఖ్యలు మానుకొని తెవికీ అభివృద్ధికి కృషి చేయండి.(Somu.balla (చర్చ) 02:17, 30 జనవరి 2013 (UTC))Reply[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ SIG సమావేశం మార్చు

2013 సంవత్సరంలో మొట్టమొదటి హైదరాబాద్ SIG సమావేశం ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లో జరుగబోతుంది. కుతూహలం ఉన్న సభ్యులు సమావేశానికి హాజరుకావలసిందిగా కోరుతున్నారు. ఈ గ్రూపులో చేరండి. https://lists.wikimedia.org/mailman/listinfo/wikimedia-in-hyd Rajasekhar1961 (చర్చ) 07:58, 24 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Help turn ideas into grants in the new IdeaLab మార్చు

 

I apologize if this message is not in your language. Please help translate it.

 • Do you have an idea for a project to improve this community or website?
 • Do you think you could complete your idea if only you had some funding?
 • Do you want to help other people turn their ideas into project plans or grant proposals?

Please join us in the IdeaLab, an incubator for project ideas and Individual Engagement Grant proposals.

The Wikimedia Foundation is seeking new ideas and proposals for Individual Engagement Grants. These grants fund individuals or small groups to complete projects that help improve this community. If interested, please submit a completed proposal by February 15, 2013. Please visit https://meta.wikimedia.org/wiki/Grants:IEG for more information.

Thanks! --Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation 20:54, 30 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Correct it here.)