వికీపీడియా చర్చ:మొలకపేజీల నియంత్రణ విధానం

రచ్చబండలోని చర్చలో వ్యక్తమైన ప్రతిపాదనకు సవరణలు

మార్చు

విధానం అమలులో వాడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందలి ప్రతిపాదనకు( ఇటీవలి చర్చ )తద్వారా జరిగిన చర్చలను గమనించి సవరణలు చేయడమైనది. మూసలు వికీకోడ్లని ప్రత్యేకించి పేర్కొనుటలేదు. సాధారణంగా మూసపేరు మాత్రమే వ్యాస పరిమాణం లెక్కలోవస్తుంది. అది చాలావరకు చిన్నదిగా వుంటుంది. చిత్రంవున్నా పరిమితిలో మినహాయింపు ఇవ్వటం లేదు. ఇంకేదైనా మార్పులు అవసరమనుకుంటే కొత్త సూచనలు చేయండి.--అర్జున (చర్చ) 17:07, 27 ఫిబ్రవరి 2013 (UTC)Reply

  • ఈ ప్రతిపాదనకు నేను మద్దతు తెలుపుతున్నాను. ఓటింగ్ పద్దతి సభ్యులు సృష్టించిన పేజీలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణంగా ఏకవాక్య పేజీలు, అనవసర పేజీలు తొలగించడానికినికి ఓటింగ్ అవసరం లేదు. నేరుగా తొలగించ వచ్చు. ఎవరైనా సభ్యుడు అభ్యంతరం వెలిబుచ్చిన సమయంలో మాత్రమే ఓటింగ్ పద్ధతి అనుసరించ వచ్చు. అయినప్పటికీ " వ్యతిరేకించే వారు " మాత్రం ఉండకూడదన్నది నా అభిప్రాయం. ఇందువలన సభ్యులలో తీవ్రమైన వివాదాలు తలెత్తడానికి అవకాశం ఉంది.--t.sujatha (చర్చ) 04:02, 4 మార్చి 2013 (UTC)Reply
  • మీ స్పందన తర్వాత మరింత వివరం అవసరమనిపించింది. వోటింగ్ విధానంపై నిర్ణయానికి మాత్రమే. చర్చలో ఒకవేళ స్పందించేవారు తక్కువగా వున్నా వోటింగ్ అవకాశం ద్వారా వ్యతిరేకత అంచనా వేయటానికి అవకాశం కలుగుతుంది. ఈ విధానం స్వంత ఖాతాతో పనిచే సే సభ్యులందరికి ఇది వర్తిస్తుంది. పేరులేకుండాపనిచేసేవారికి, కొత్తగా 25మార్పులు లోపు వున్న ఖాతాగల సభ్యులకు సాధారణ నిర్వహణ ప్రకారం చర్యలు తీసుకొనబడతాయి.--అర్జున (చర్చ) 12:21, 5 మార్చి 2013 (UTC)Reply
ప్రతిపాదన బాగుంది. అలాగే చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 13:08, 6 మార్చి 2013 (UTC)Reply

ఓటుప్రక్రియ ప్రారంభం

మార్చు

{{సహాయం కావాలి}} ఓటు ప్రక్రియ ప్రతిపాదన పేజీలో ప్రారంభించపడింది. అర్హులైన సభ్యులు గడువులోగా ఓటు వేయవలసినది.--అర్జున (చర్చ) 04:18, 7 మార్చి 2013 (UTC)Reply

నా అభిప్రాయాలు

మార్చు

ఇదివరకు జరిగిన అనేక చర్చలవలె ఇది కూడా కేవలం చర్చించడం వరకేనని, ఎలాంటి చర్య ఉండదని, కాబట్టి వ్యాఖ్యానించడం వృధానేనని భావించి ఎలాంటి చర్చచేయలేను. వెంటనే ఓటింగుకు రావడంతో కనీసం ఇప్పుడైనా నా అభిప్రాయాలు చెప్పడం సమంజసమనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పినవి ఎలాగూ పట్టించుకోరని నాకు తెలిసినా కనీసం భవిషత్తులోనైనా ఈ విషయాలు సందర్భాన్ని బట్టి పనికివస్తాయనే ఆశయంతో నా అభిప్రాయాలు చెబుతున్నాను. ముందుగా చిన్న వ్యాసాలంటే ఏమిటి? 2000బైట్ల పరిమాణం దాటితేనే చినవ్యాసం నుంచి బయటపడినట్లేనా? మరి అంతకంటె చిన్న పరిమాణంలో ఉన్నవాటికి ఎలాంటి మినహాయింపులు లేవా? ఏ రకం వ్యాసాలైననూ ఖచ్చితంగా ఈ పరిమాణానికి లోబడి ఉండాల్సిందేనా? వెయ్యి, వెయ్యిన్నర బైట్ల పరిమాణంతో నాణ్యత గల వ్యాసం తెవికీలో ఉండరాదా? ఒక సభ్యుడు వ్యాసాల సంఖ్యను పెంచుకోవడం కోసమే అన్నీ చిన్నవ్యాసాలు సృష్టిస్తే ఈ విధానం సమంజసమైనదనుకోవచ్చు, కాని నాణ్యత కల వ్యాసాలు రచించే ఒక మంచి సభ్యుడు సదుద్దేశ్యంతో ఒక మంచి వ్యాసం సృష్టించాలని సమాచారం అందుబాటులో లేనప్పుడు అది 2కెబిలకు తక్కువ పరిమాణం ఉన్ననూ తొలిగింపునకు గురిచేయాలా? విజ్ఞానసర్వస్వంలో వ్యాసం ఉంచుటకు వాసిని కాకుండా రాశికే ప్రాధాన్యత ఇవ్వడం సమంజసమేనా? ఇలా పరిమాణంకే ప్రాధాన్యత ఇస్తే ఒకటి రెండు వాక్యాల వ్యాసానికి కూడా సాగదీసి అనవసర విషయాలుచేర్చి 2కెబిలకు చేర్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇలా చేస్తే పరిమాణం పెరుగుతుందేమో కాని నాణ్యత దిగజారుతుందని వేరే చెప్పనక్కరలేదు. ఒక్కొక్కసారి మనం ఎంతకష్టపడిననూ ఒక నాణ్యత కల విషయానికి సంబంధించి నాలుగైదు వాక్యాల సమాచారం కూడా లభ్యంకాదు. ఒక మంచి విషయానికి సంబంధించి కనీసం ఈ నాలుగైదు వాక్యాలైననూ పాఠకులకు అందుబాటులో ఉంచవలసిన అవసరం లేదా? కాబట్టి మొలక వ్యాసాలనేవి రకరకాలుగా ఉంటాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేము. సమాచారం లభ్యమౌతున్ననూ వ్యాసంలో చేర్చక మళ్ళీమళ్ళీ కొత్త కొత్త చిన్న వ్యాసాలను తమాషా కొరకు సృష్టించడం ఒక రకమైతే, ఎంతో పరిశోధించి నాలుగైదు వాక్యాల సమాచారం సంపాదించి చేర్చడం మరోరకం. ఈ రెంటినీ ఒకే రకంగా చూడరాదు. అలాగే విషయ పరిజ్ఞానం లేని వ్యాసాలను ఎంతవరకైనా సాగదీయవచ్చు కాబట్టి ఈ నియమాలు అలాంటి వాటికి ఏమీ చేయలేవు, అదే ఒక విషయ పరిజ్ఞానమున్న చిన్న వ్యాసానికై మాత్రం ఈ నియమాలు ప్రతిబంధకంగా మారుతాయి. అంటే ఈ నియమాలు ఎలాంటి వ్యాసాలు తొలిగించుటకు రూపొందించామో వాటిని కాకుండా చిన్నవైనా నాణ్యత కల వ్యాసాలు తయారుచేయుటకే ఇబ్బందిగా మారుతాయని మరీ వివరంగా చెప్పనవసరం లేదు. మనం ఒక ఉద్యానవనం లోకి వెళితే వృక్షాలే కాదు మొక్కలూ కనిపిస్తాయి. అసలు అందాన్నిచ్చేవి మొక్కలే, అయితే ఎలాంటి మొక్కలుండాలి అనే విషయంపై మాత్రం నిర్ణయం అవసరం. అసహ్యంగా కనిపించే, గడ్డిజాతికి చెందే, అడ్డుగా వచ్చే... ఇలాంటి పిచ్చి మొక్కలను తొలిగిస్తామంటే ఎవరికి అభ్యంతరముండదు కాని ఒక వరసన ఉంటూ చూడముచ్చటగా కనిపిస్తూ, సందర్శకులను (పాఠకులను) ఆకర్శిస్తూ, రంగురంగుల పువ్వులతో ఘుమఘుమలాడే మొక్కలనూ తొలిగించాలంటే ఆలోచించాల్సిందే (ఈ మొక్క మాటలు తెవికీ గురించే సుమా!, దారి తప్పలేను). నా వ్యక్తిగత అభిప్రాయానికి వస్తే నేనూ చిన్న వ్యాసాలకు వ్యతిరేకినే. అసలు ఈ 2కెబిల పరిమాణం గురించి నేను ఐదేళ్ళుగా చెబుతున్నాను. నేను వేల వ్యాసాలపై పనిచేసిననూ వందల కొత్త వ్యాసాలను సృష్టించిననూ చిన్న వ్యాసాలేవీ చేర్చలేను. కాని చిన్న వ్యాసాలపై నియమాలు రూపొందించేటప్పుడు మాత్రం ఒక వైపునుంచి కాకుండా ప్రతివైపు నుంచి రకరకాలుగా ఆలోచించి నియమాలు రూపొందించాల్సి ఉంటుంది. లేనిచో ఈ నియమాలపైనే రేపు వివాదాలు జరిగే అవకాశమూ ఉంటుంది. మరో విషయం ఈ 2కెబి పరిమాణం ఇకపై సృష్టించే కొత్త వ్యాసాలకేనా? ఇదివరకు ఉన్న చిన్నవ్యాసాలపై ఎలాంటి చర్య ఉండదా? ఇప్పుడున్న చిన్న వ్యాసాలను ఎవరు అభివృద్ధి పరుస్తారు/పర్చాలి? ఇలా అనేక రకాలుగా ఆలోచించి ఓటింగ్ మొదలుపెడితే బాగుండేది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:51, 7 మార్చి 2013 (UTC)Reply

చినచినవని చినబుచుకొన
వలదయ, పెదవయిన నేమిటి విషయలేమివి!
చినపెదవి కలిసి కలగా
పులగంగ, తెవికిని మెరుగుజేయి వికివరా!

—సి.చంద్ర కాంత రావు

సమాచారం దొరకనపుడు వ్యాసం ఎందుకు మొదలెట్టాలి ?, ఒకటి అయ్యాక మరొకటి మోదలు పెట్టవచ్చును, విషయ పరిజ్నానం లేని వ్యాసాలు ఎంతవరకైనా సాగదీస్తుంటే నిర్వహకులు, ఇతర సభ్యులూ పట్టించుకోరా?,ఇపుడు పీకేసేది కలుపు మొక్కలూ గడ్డిమొక్కలే కాని పనికొచ్చే మొక్కలు కాదు. కలుపు పీకుతున్నపుడు కొన్ని పనికొచ్చే చిన్న మొక్కలూ పోవచ్చు. అలా అని పీకకుండా ఒదిలేస్తే అసలు పంటనే లేదా తోటను మొత్తాన్ని పాడుచేస్తాయి. పోలయ్య (ఈ వ్యాఖ్య 117.204.47.117 ఐ అడ్రసుతో వ్రాయబడింది)
పోలయ్య గారూ, ఏకవాక్య వ్యాసాలపై రచ్చబండ లో చర్చ జరిగింది. పరిశీలించగలరు. అది నిర్వాహకులూ, సభ్యులూ పట్టించుకున్నారు కాబట్టే చర్చ జరిగింది. జరిగిపోయిన మొలక వ్యాసాల గూర్చి యిపుడు చర్చ అనవసరమని నా భావన. మొలకల అభివృద్ధికి మనం కృషి చేద్దామా! మీరు అనేక వ్యాసాలను అభివృద్ధి చేశారు. అది ఐ.పి నెంబరుతోనె. దయచేసి మీరు ఖాతా సృష్టిస్తే మాకు సంతోషదాయకం. మీవంటి వారి సహకారంతో మొలక వ్యాసాలు అభివృద్ధి చేయవచ్చు. కలుపుమొక్కలని అన్నింటిని ఒకేసారి తొలగించేటపుడు మంచి విషయమున్న వ్యాసాలు మరుగున పడతాయి. అందువలన గతం గతః. వీలైతె గతంలో గల వ్యాసాల అభివృద్ధికి మనం కృషిచేద్దామా! వ్యాసాలను కూల్చడం సులువైనది. అవి నిర్మాణం చేయటం కష్టం. వాటి నిర్మాణం కోసం కలసి శ్రమిద్దాం(  కె. వి. రమణ. చర్చ 14:11, 8 మార్చి 2013 (UTC))Reply
వికీపీడియా అనేది అందరికీ అందుబాటులో ఉన్న విజ్ఞానసర్వస్వం. ఎవరైనా తమకు నచ్చిన అంశాలపై (వికీ మూల నియమాలకు భంగం కలగకుండా) రచనలు చేసే హక్కు ఉంది. ఒక్క వాక్యం వ్యాసం అంటే తొలిగించవచ్చేమో కాని, 2కెబిలకు తక్కువ పరిమాణం ఉన్న వ్యాసాన్ని కూడా తొలిగించడం కఠిన నియమం కిందికే వస్తుంది. అభివృద్ధి చెందిన వికీలలో కూడా ఇలాంటి కఠిన నియమాలు ఉండకపోవచ్చు! ఇంకనూ అభివృద్ధి దశలోనే ఉన్న తెవికీలో ఇలాంటి నియమాలు చేర్చడం సమంజసం కాదని సాధారణ దృష్టితో ఆలోచిస్తే ఎవరికైనా బోధపడుతుంది. చాలా సభ్యులు ఒకవైపు నుంచే ఆలోచిస్తున్నారు కాని తెవికీ భవిషత్తు దృష్ట్యా ఈ నియమం మంచిది కాదని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. పీకేసేది కలుపు మొక్కలే అని కూడా అనలేము, ఎందుకంటే నియమం ప్రకారం (నెగ్గితేనే) 2కెబిలకు మించని అన్ని వ్యాసాలనూ తొలిగించాల్సి వస్తుంది. లేకుంటే మళ్ళీ వాదనలు షరా మామూలే. పంటను నాశనం చేసే కలుపు మొక్కలు తీసే ఈ యంత్రం (నియమం) పంటను కూడా తప్పకుండా తొలిగిస్తుంది. నియమం ప్రకారం తొలిగించాల్సి వస్తుంది కూడా, అందుకే నేను స్పష్టంగానే చెప్పాను కదా, ఈ నియమానికి మినహాయింపులు లేవా అని! రేపు కొత్తగా చేరే సభ్యుడు ఏదో కొంత సమాచారంతో వ్యాసం సృష్టిస్తాడనుకుందాం, చాలా మంది కొత్త సభ్యులు తరుచుగా దిద్దుబాట్లు చేయరు, ఆ వ్యాసం అలాగే ఉండి నెల రోజుల పిదప తొలిగింపునకు గురౌతుంది (ఈ నియమం నెగ్గితే) మళ్ళీ ఎప్పుడో ఆ సభ్యుడు తాను ఇదివరకు సృష్టించిన వ్యాసం కొరకు చూస్తే ఇక్కడ కనిపించదు. సదుద్దేశ్యంతో చేర్చిన ఒక మంచి వ్యాసం (చిన్నదైనా సరే) ఇలా తొలిగింపునకు గురైతే అతని దిద్దుబాటు హక్కులకు భంగం కలిగినట్లుగా ఎందుకు భావించరాదు. చిన్న వ్యాసాలను తొలిగించడానికి నేను వ్యతిరేకం చూపడం లేదు కాని నాణ్యత కల చిన్న వ్యాసాల తొలిగింపునకు మాత్రం కొన్ని మినహాయింపులు ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం. ఆలోచిస్తే దీనికీ సమాధానం దొరుకుతుంది. తెవికీలో 2కెబిల పరిమాణం దాటని వ్యాసాలు దాదాపు 80-90% ఉన్నాయి, మరి ఇవన్నీ తొలిగించాలా? ఇన్నేళ్ళ నుంచి వందల సభ్యుల మూలంగా అభివృద్ధి చెందిన తెవికీలో ఇన్ని వేల వ్యాసాలు ఇప్పుడు తొలిగించవలసిందేనా? అభివృద్ధి చెందిన ఆంగ్ల, స్పానిష్, జర్మన్, డచ్ లాంటి వికీలలో కూడా 2కెబిలకు మించిన వ్యాసాలు 50% దాటలేవు. ఒకేసభ్యుడు ఉద్దేశ్యపూర్వకంగా పదేపదే సృష్టిస్తున్న అతిచిన్న వ్యాసాలకూ, ఎన్నో పెద్ద వ్యాసాలను సృష్టించిన మరో సభ్యుడు సదుద్దేశ్యంతో తయారుచేసిన చిన్న వ్యాసానికి తేడా గురించే మనం ఆలోచించాలి. నా అభిప్రాయాలు స్పష్టంగానే చెబుతున్నాను. దీనికీ మరోరకంగా ఆలోచిస్తే నేనేమీ చేయలేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:04, 8 మార్చి 2013 (UTC)Reply
భలే! చాలామంచి చర్చ జరుగుతోంది ఇక్కడ. ఇది వికీ మొదలైనప్పటి నుండి ఎడతెగకుండా సాగుతున్నదే. నిజానికి వికీలో ఒక వ్యాసం చిన్నదని తొలగించాలంటే ఒకే ఒకటి నిరూపించాలి. అది ఆ వ్యాసానికి విస్తరింపబడే అవకాశం లేదని. విస్తరింపబడే అవకాశం ఉందా లేదా అనే నిర్ధారణ అప్పటి వికీ పరిస్థితి, స్థాయి, వికీలో అప్పటికే ఉన్న అంశాల నిడివి, ఆ వ్యాసంలోని అంశం యొక్క ప్రాముఖ్యత. ఆ విషయంపై లభ్యమౌతున్న వనరులపై ఆధారపడుతుంది. ఇలాంటి నిర్ధారణ చెయ్యటానికి సమయం లేనప్పుడు వాటిని ఉంచాలి, తుడిచెయ్యాలి అనే రెండు విధానాలను అవలంభించవచ్చు. ఉంచాలి అని ఆలోచించేవాళ్ళు, తుడిచెయ్యాలని ఆలోచించేవాళ్ళూ ఉంటారు. అది వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. అవతలి పక్షం వారు చెడ్డవారు కాదు, వాళ్ళది కాస్త భిన్నమైన తాత్విక ధోరణి మాత్రమే. వికీ రెండు పక్షాల పరస్పర సంఘర్షణతోనే అభివృద్ధి చెందుతుంది. ఇరు పక్షాలు అవసరమే. ఆ అవతలి పక్షమూ సదుద్దేశంతోనే వ్యవహరిస్తున్నారని గమనించాలి. --వైజాసత్య (చర్చ) 03:33, 9 మార్చి 2013 (UTC)Reply
ఈ ప్రతిపాదిత నియమాలకు సంబంధించి పైన వివరించినవి కాకుండా మరికొన్ని సందేహాలు వెలిబుచ్చుతున్నాను. ఇది ఎవరికీ విమర్శకాదని, భవిషత్తులోనైనా నియమాలు రూపొందించేటప్పుడు ఇలాంటివి పరిగణనలోకి తీసుకొనే అవకాశముంటుందనే ఉద్దేశ్యంతో తెలియజేస్తున్నాను.
1)"సాధారణంగా మూసపేరు మాత్రమే వ్యాస పరిమాణం లెక్కలోవస్తుంది. అది చాలావరకు చిన్నదిగా వుంటుంది" అనడం నిజమే కాని ఇన్ఫోబాక్స్ సంగతి పేర్కొనలేరు. సాధారణంగా infobox పరిమాణమే 500-2000 బైట్లు ఉంటుంది. అంటే కేవలం infobox ఉండి సమాచారం లేకున్నా 2కెబి వ్యాస పరిమాణం ఉంటే సరిపోతుందా? ప్రస్తుతం చాలా సినిమా పేజీ వ్యాసాలలో కేవలం infobox మాత్రమే ఉంది. వ్యాసంలో వాక్యాలు లేకున్ననూ ఇలా infobox మాత్రమే ఉండటం సమంజసమేనా?
2)గ్రామవ్యాసాలకు ప్రాధాన్యత అనే కారణంతో కాకుండా కేవలం బాటుద్వారా సృష్టించబడినని అనే కారణంతో మినహాయించబడినది. అంటే బాటుద్వారా సృష్టించే ఎలాంటి వ్యాసమైననూ పరిమాణానికి మినహాయింపు లభిస్తుందా? రేపు ఎవరో ఒక ఎల్లయ్య బాటు సభ్యత్వం తీసుకొని చిన్నచిన్న వ్యాసాలు సృష్టిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి?
3)బ్రిటానికా, ఎన్కార్టా లాంటి విజ్ఞానసర్వస్వాలు కూడా చిన్న వ్యాసాలకు (నాణ్యత ప్రకారం) గుర్తింపు ఇస్తున్నప్పుడు మనం ఇలాంటి నియమం చేయడం సమంజసమేనా?
4)సదుద్దేశ్యంతో చేర్చిన నాణ్యమైన చిన్న వ్యాసాలను తొలిగిస్తే కొందరి దిద్దుబాట్ల హక్కులకు భంగం కలిగినట్లు తద్వారా వికీ మూలనియమానికి ఈ నియమం ప్రతిబంధకంగా ఉన్నట్లుగా ఎందుకు భావించరాదు?
5)ఇప్పుడు 2కెబిలని అంటున్నాం, రెండేళ్ళ తర్వాత ఇది 4కెబిలంటారు (ఊహకు అనుకుందాం). 2-4 కెబిల వ్యాసాలు కూడా అప్పుడు తొలిగిస్తారనుకుందాం, ఇలా చేస్తుంటే సభ్యులకు దిద్దుబాట్లపై అభద్రతా భావం ఏర్పడుతుందని తప్పకుండా చెప్పవచ్చు. ఇప్పుడు చేసిన దిద్దుబాట్లు భవిషత్తులో ఉంచకపోవచ్చు అనే అభద్రతాభావం ఏర్పడితే ఇప్పుడు దిద్దుబాట్లు చేయడానికి ఎవరూ సాహసించక పోవచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.
6)దీన్ని మరోరకంగా ఆలోచిద్దాం, రెండేళ్ళ తర్వాత 2కెబిలను తగ్గించి అరకెబి చేశారనుకుందాం. అప్పటివరకు 0.5-2 కెబిల మధ్యన రచనలు చేసిన వారి దిద్దుబాట్లను (వారి హక్కులను) ఎలా భర్తీచేయాలి? కొత్తసభ్యులందరూ నియమాలు తెలుసుకొని రచనలు చేయరు కదా! (లేదా భవిషత్తులో పూర్తిగా నియమం (ఇప్పుడు ఏర్పడితే) తొలిస్తారనుకుంటే ఈ మధ్యలో తొలిగించిన వ్యాసపు దిద్దుబాట్లపై పనిచేసినవారి హక్కుల సంగతి?)
7)కొత్త సభ్యులు తెవికీలో చేరగానే పెద్దవ్యాసాలు రచించరు. సమయం దాటగానే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తొలిగిస్తూ పోతే కొత్త సభ్యులపై ఈ నియమం ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయం మనం ముందే ఆలోచించరాదా?
8)తెవికీ భవిష్యత్తును, పాఠకుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఇలాంటి కఠిన నియమాలు రూపొందించడం ఎంతవరకు సమంజసమనదే నా చివరి ప్రశ్న. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:41, 9 మార్చి 2013 (UTC)Reply

ఓటు ప్రక్రియ మరియుఫలితంపై అభ్యంతరాలు

మార్చు
  • ఇందుకే నేను ఓటింగు పద్ధతిని వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదన మీద చంద్రకాంతరావు గారు ఇన్ని ఆలోచించదగ్గ విషయాలను లేవనెత్తితే, ఏకాభిప్రాయ సాధన సరేసరి, లేవనెత్తిన విషయాలపై సరైన చర్చ జరగకుండానే ఈ ప్రతిపాదన అమలు లోకి వచ్చింది. ఆ తగిన ఓట్లు వచ్చాయి కదా ఇక ఏకాభిప్రాయమెందుకు అని చేతులు దులుపేసుకునేందు ఈ ఓటింగు పద్ధతి మంచి అవకాశానిస్తుంది. ముందు ముందు ఇది చాలా ప్రమాదకరమైన ధోరణికి దారితీస్తుంది. ఉదాహరణకి 10 మంది తెలుగు వికీని రోమన్ లిపిలో వ్రాయాలని ప్రతిపాదించారనుకోండి. అత్యధిక ఓట్లు ఉన్నాయని రోమన్ లిపి వ్రాస్తామా? అందుకే విధానాలను ఓటింగు పద్ధతి ద్యారా జారీ చేయకూడదు. నేనీ మొలకల నియంత్రణ ప్రతిపాదన వ్యతిరేకించడం లేదని గమనించగలరు --వైజాసత్య (చర్చ) 04:56, 24 మార్చి 2013 (UTC)Reply
  • వైజాసత్య గారు మీరు పొరపడుతున్నారు. ప్రతిపాదన పై రెండు ధపాలు (ఓటింగ్ విధానం తీరుతెన్నులుగురించిన చర్చ ప్రారంభానికి ముందు, తరువాత )చర్చ జరిగింది, దానికి స్పందనగా వచ్చిన చంద్రకాంతరావు గారు మరియు ఇతరుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని మార్పులు చేయడం జరిగింది. ఓటింగ్ ప్రారంభం జరిగినతరువాత మరిన్ని అభిప్రాయాలొస్తే అవి భవిష్యత్తులో పరిగణించవచ్చని ప్రక్రియ కొనసాగించడంజరిగింది. ఇంతకు ముందు అనుభవమున్న ఒకరో ఇద్దరోనిర్వాహకుడో అధికారో చెప్పినదానికి సర్దుకొనడం జరిగింది. తరువాత అలా వీలుపడలేదు. అభిప్రాయ అంచనాకొరకు వోటింగ్ జరిగితే ఎక్కువమంది పాల్గొంటే ఇంతకు ముందలి పద్ధతి కంటే ఇది మెరుగైనదని నేను భావిస్తున్నాను. అలాగే వికీలో దేనికి పరిపూర్ణత్వం, దోషం లేకపోవడం అంటూ వుండదని అందరికి తెలిసిన విషయమే. అలాగే విధానాలకు కూడా. విధానాలలో లోటుపాట్లుంటే తదుపరి సవరణల ద్వారా దాన్ని మెరుగుచేయవచ్చు. ప్రక్రియ పూర్తిగా గమనించినట్లయితే ఓటింగుకు ముందల చాలా పని వుంది. ప్రతిపాదన చేర్చి దానిపై కనీసం వారం పాటు చర్చజరగి మెరుగు పరచిన ప్రతిపాదనే ఓటింగ్ కి రావాలి. అంతే కాకుండా 80శాతం ఆధిక్యత కూడగట్టుకోవాలి. వికీలో మార్పులకు అంత ఆసక్తిగల వారుంటే, దానికి ప్రతిస్పందించేవారున్నంతకాలం, వికీ మూలస్థంభాలను వుల్లంఘించని అభివృద్ధికి తోడ్పడే మార్పులకే అమోదముద్ర పడతాయనుకుంటాను.--అర్జున (చర్చ) 03:27, 25 మార్చి 2013 (UTC)Reply
  • వైజాసత్య గారు చెప్పినట్లు ఓటింగ్ పద్దతి అనేది తెవికీకి ప్రస్తుత పరిస్థితులలో సరిపడదనుకుంటున్నాను. "ఎవరైన ఐదుగురు సభ్యులు కలిసి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఓటింగ్ చేసి నిర్ణయం తీసుకున్నప్పుడు అది ప్రజాస్వామ్య పద్దతికే అపహాస్యం చేసినట్లవుతుంద"ని నేను ఇదివరకే చెప్పాను. సభ్యుల సంఖ్య పెరిగి సభ్యులలో స్వయంనిర్ణయం మరియు చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఓటింగుకు సరైన ఫలితం ఉంటుంది. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ఒక దేశం బాగా అభివృద్ధి చెందుతుందనే రాజకీయ మేధావుల ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలి. స్నేహపూర్వక వాతావరణమే కాదు, స్నేహపూర్వక సంఘర్షణా ఒక సంస్థ అభివృద్ధికి చాలా ముఖ్యమనే సంగతిని కూడా మనం ఆలోచించాలి. లేనిచో కొందరి వల్ల అందరూ అపహాస్యం పాలయ్యే పరిస్థితి వస్తుందేమో! మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఓటింగ్ పద్దతి దేని ప్రకారం ప్రకారం ప్రారంభించబడిందో ఆ పద్దతి ప్రకారం కనీసం 80% మద్దతు దీనికి ఉండాల్సింది కాని ఇక్కడ 70% మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఇది ఎలా నెగ్గినట్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. (అసలు ఓటింగ్ పద్దతికే సభ్యుల మద్దతు లేదు కాబట్టి నిర్ణయం ఎలా తీసుకోవాలనేది మరో సమస్య!) సి. చంద్ర కాంత రావు- చర్చ 10:07, 24 మార్చి 2013 (UTC)Reply
  • వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి వివరించినట్లుగా తటస్థులను ఆధిక్యత నిర్ణయించడంలో పరిగణించరు. వోటింగ్ కు కావలసిన కనీస సభ్యులు పాల్గొన్నారా లేదా అంతవరకే పరిగణిస్తారు. కనుక ప్రతిపాదన కు మద్ధతుగా 7వ్యతిరేకంగా చెల్లిన వోట్లు లేకపోవడంతో అధిక్యత 100శాతంగా వుందని గమనించగలరు. ఇంకొకటి ఈ ప్రక్రియ ద్వారా 11మంది పాల్గొంటే (ఇంతకు మందు చర్చలలో ఐదుమంది కూడా ఎక్కువగా పాల్గొన్న పరిస్థితిపెద్దగాలేదు) వికీలో చైతన్యం పెరిగినట్టుగానే భావిస్తున్నాను.--అర్జున (చర్చ) 03:37, 25 మార్చి 2013 (UTC)Reply
  • 1)అర్జునరావు గారు, మీరు కేవలం మీ వ్యక్తిగత నిర్ణయాలే తెవికీపై రుద్దుతున్నారు. ముందు తటస్థులను మద్దతు కిందకు తీసుకోవాలన్న పిదప నేను వ్యతిరేకిస్తే దానికి కొద్దిగా మార్చి "తటస్థులను వోటింగ్ లో పాల్గొన్నవారిలెక్కవరకే తీసుకొని ఆధిక్యత నిర్ణయించడంలో వదలివేయటం నాకు సమ్మతమే" అని చెప్పారు. అంటే మీకు సమ్మతమైనవి మాత్రమే తెవికీ నియమమౌతుందంటారా? దీనిపై సభ్యుల అభిప్రాయం అవసరం లేదా? ఇక మీతో చర్చించడం వృధానని నేను వదిలిపెడితే స్పందనలు లేవని నియమం ఖరారు చేస్తారా? రేపు ఎవరో ఒక ఎల్లయ్య ఏదో విషయంపై ఒక చర్చ/ప్రతిపాదన తీస్తే ఎవరూ ప్రతిస్పందన ఇవ్వనప్పుడు ఎల్లయ్య చెప్పినదే వేదమౌతుందా? "తటస్థులను ఆధిక్యత నిర్ణయించడంలో పరిగణించరు" అనేది కూడా మీ వ్యక్తిగత అభిప్రాయమే, దాన్ని నేను ఒప్పుకోను.
    2)అదే చర్చాపేజీలో పైవిభాగంలో వైజాసత్య గారు అసలు ఓటింగే అవసరం లేదన్నారు. దానికీ ఎవరూ స్పందించలేదు. అలాంటప్పుడు మీ ప్రకారమైతే ఓటింగ్ అవసరం లేదన్నట్లుగానే భావించవలసి ఉంటుంది! కాని మీరు అలాంటి నిర్ణయం తీసుకోరు. (అసలు నిర్ణయం తీసుకొనే అధికారం ఏ ఒక్కరికో లేదు అది వేరే విషయం) ఒకే చర్చాపేజీలో ఒకేరకమైన పద్దతి/అభిప్రాయాలకు కూడా మీరు భిన్న రీతులో వ్యవహరిస్తున్నారు. మీకు అనుకూలమైన వాటినే తెవికీపై అంటగడుతున్నారని ఎందుకు భావించరాదు? (ఈ విషయం పైన స్పష్టంగానే కనిపిస్తున్నది) ఎలాంటి స్పందనలు లేవు కాబట్టి ఓటింగ్ అవసరం లేదన్నట్లుగా వైజాసత్యగారు ప్రకటిస్తే ఎలా ఉంటుంది? స్పందనలు లేవు కాబట్టి ఓటింగ్ అవసరం లేదన్నట్లుగా భావించి ఈ ఓటింగ్ చెల్లనేరదని నేను చెబితే మీరేమంటారు?
    3) ఒక ఓటింగులో 10మంది పాల్గొని కేవలం ఒక్కరే మద్దతు పలికి 9 మంది తటస్థులైతే దాన్నీ 1-0 మద్దతుతో 100% మెజారిటీతో ఆమోదించినట్లుగానే భావిస్తారా? పదమందిలో ఒక్కరు మాత్రమే మద్దతు ప్రకటిస్తే 100% మద్దతు అని ఎలా అనగలం?
    4)వికీ మూల నియమానికి వ్యతిరేకమైన పాలసీకి (సభ్యుల దిద్దుబాట్ల హక్కులకు ఈ పాలసి భంగకరం కాబట్టి) సభ్యులు మద్దతు పలికిననూ అది అమలులోకి రావడం సరైనదేనా? అసలు అలాంటి పాలసీలు రూపొందించడం ఎంతవరకు న్యాయమని ముందే ఆలోచించరాదా? ఈరోజు ఇలా చేశాం, రేపు తెవికీలో వ్యాపార ప్రకటనలు కూడా ఇచ్చుకొని డబ్బు సంపాదిద్దాం అనే పాలసీని ఆమోదిస్తే దాన్నీ వాడుకలోకి తీసుకువద్దామా?
    5)నియమం నెగ్గినట్లే అనుకున్ననూ (ఒక్క క్షణానికి అలా అనుకుందాం), ఇప్పుడేమి చేయాలి? చిన్న వ్యాసాలన్నీ తొలిగిద్దామా? తొలిగించిననూ తెవికీకి ఏమైనా ప్రయోజనమా? మనం ఎవరి ప్రయోజనాలకైతే వ్యాసాలు రచిస్తున్నామో వారికి (పాఠకులకు) ఈ తొలిగింపుల వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ లేదని మనం గ్రహించుకోలేమా? తెవికీలో తోటి సభ్యుల కంటే పాఠకుల ప్రయోజనాలే పరమార్థమని అనుకోవడం తప్పా? వ్యాసాలను తొలిగించడం ప్రారంభిస్తే తేనెతుట్టెను కదిలించినట్లుగానే భావించవలసి ఉంటుంది. వందలు కాదు వేల వ్యాసాలు తొలిగింపునకు గురౌతాయి. అవీ సీనియర్ సభ్యులవే. మీరు కొన్ని వ్యాసాలు తొలిగించడం ప్రారంభించి చూడండి చివరకు పరిస్థితి ఎక్కడికి వెళుతుందో ఊహించడం కూడా సాధ్యం కాదు.
    6)అసలు ఓటింగ్ నియమానికి సభ్యుల మద్దతు ఉందా? దానికే సభ్యుల ఆమోదం లేనప్పుడు ఆ ఓటింగ్ నిర్ణయాన్ని(?) ఇతర నియమాలకై ఎలా వర్తింపజేయాలి?
    7)అసలు ఓటింగ్ కంటే చర్చనే ప్రధానం అని ఎందుకు అనుకోరాదు? ఓటింగ్ వల్ల కేవలం బలాబలాలు మాత్రమే తేలుతాయి కాని అభిప్రాయాలు బయటపడతాయా? ఒక పాలసీకై అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే చర్చలే ఏకైక మార్గం కాదా?
    8)నేను చెప్పిన "చైతన్యం"ను మీరు సరిగా అర్థం చేసుకోలేరు. ఓటింగ్ సంఖ్య పెరగడమే చైతన్యం అంటున్నారు కాని సభ్యులు చర్చాపేజీలను సమర్థవంతంగా ఉపయోగించుకొని, అభిప్రాయాలను నిష్పక్షపాతంగా తెలియజేసినప్పుడే చైతన్యం వచ్చినట్లుగా భావించవలసి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే- ఏదేని ప్రతిపాదన చేస్తే - "పై ప్రతిపాదన చాలా బాగుంది, నేను మద్దతు పలుకుతున్నాను" అనే వారే ఎక్కువ. అసలు ప్రతిపాదన ఏమిటి, అది తెవికీకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతుంది, దానివల్ల భవిష్యత్తు పరిణామాలేమిటి, ఇదివరకు జరిగిన లోటుపాట్లను అది భర్తీ చేయగలదా? ఇత్యాది ఆలోచనలు చేసి తమ అభిప్రాయాలు వెల్లడిస్తే గాని ఒక మంచి పాలసి రూపొందదు. ప్రతిపాదించేవారు మరియు సభ్యులు అలా భావించిన నాడే సరైన పాలసీలు రూపొందుతాయి. ఓటింగులో పదిమంది పాల్గొనడం గొప్ప కాదు, నిర్వాహక ఓటింగులలో కూడా పది మంది పాల్గొన్న సంఘటనలున్నాయి. అదే సంఖ్య చర్చా పేజీలలో ఎందుకు రావడం లేదో ఆలోచించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:26, 25 మార్చి 2013 (UTC)Reply
  • చర్చలో నాకేదో దురుద్దేశాలు అంటగట్టడం నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ వోటు ప్రక్రియ వికీ ప్రపంచానికి కొత్త కాదు. ఇంగ్లీషువికీలో అమలవుతున్నదాన్ని మనసభ్యుల అభిప్రాయాల ప్రకారం స్వల్పంగా మార్చి వాడే ప్రయత్నం. నేను ఈ మొలక నియంత్రణ విధానంపై వోటు చేయలేదని గమనించండి. వికీ నిర్ణయాలు మరింత మెరుగుచేయటానికి నా వంతు నేను తోడ్పడుతున్నాను. తటస్థులను ఇంకే విధంగా పరిగణించాలో మీరే తెలపండి. వోటు విధానంకు సవరణలు ప్రతిపాదించండి. ఓటువిధానం, ఏకాభిప్రాయ సాధనకు చర్చలను నిషేధించనప్పుడు, నిర్ణయాన్ని తీసుకోవడంలో సహాయపడేటప్పుడు దానిలో ఆసక్తి గల వారందరు పాల్గొన్నప్పుడు ఇప్పడు ఈ విధానం సరికాదు అనడంలో నా దృష్టిలో అర్థంలేదు. ఇదే లేకపోతే ఒక వ్యక్తి నిరంకుశంగా వికీలో ప్రతిపాదించిన ప్రతిమార్పుని ఆపగలడని మీకనిపించడంలేదా. మీ అనుభవంలోచూడలేదా. కొత్త మార్పుని ఆహ్వానించాలి. దానికి లోటుపాట్లు వుంటే కాలక్రమేణా అవి తొలగిపోతాయి. విధానానికి రకరకాల ప్రయోజనాలు వుంటాయి. కనీసం కొత్త వారిని అవి సరియైన మార్గంలో ప్రవేశపెట్టటానికి తోడ్పడవచ్చు. --అర్జున (చర్చ) 01:04, 26 మార్చి 2013 (UTC)Reply
"అర్జునరావు గారు, మీరు కేవలం మీ వ్యక్తిగత నిర్ణయాలే తెవికీపై రుద్దుతున్నారు." - ప్చ్..చర్చ సరైన దిశగా కానీ, సరైన ఉద్దేశ్యంతో కానీ జరగటం లేదు. ఈ వ్యాఖ్య ఇతరులు సదుద్దేశంతోనే వ్యవహరిస్తున్నారని భావించాలి అనే మార్గదర్శకాన్ని ఉల్లంఘిస్తుంది.
ఇక అసలు చర్చ విషయానికొస్తే..అర్జునరావు గారూ, సాక్షాత్తు జిమ్మీ వేల్సే నిరంకుశంగా ఏ నిర్ణయాలు చేయలేకపోయాడు. అలా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలకి పెద్ద ఎత్తున నిరసన ఎదురయ్యే సరికి తోకముడచక తప్పలేదు. కాబట్టి ఒక వ్యక్తి నిరంకుశంగా దేన్నీ వికీసమాజంలో ఆపలేడు. ఇక్కడ మొలకలను నియంత్రించటానికి సరైన మద్దుతు ఉన్నది. ఆ విషయం ఈ ఓటింగు అక్కరలేకుండానే రచ్చబండ చర్చలోనే అవగతమౌతున్నది. కాకపోతే చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఎలా నియంత్రించాలన్న విషయం మీదనే. మీరు ఎంత సదుద్దేశంతో వ్యవహరిస్తున్నారో, చంద్రకాంతరావు గారూ అంతే సదుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని భావిస్తున్నాను. ఆయనా మొలకలకు వ్యతిరేకే. కావలంటే ఇక్కడ చూడండి.
భేదాభిప్రాయాలు చర్చించి ఒక ప్రణాళిక చేసుకుంటే సరదాగా సాగిపోయేది. వికీ ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల డాష్ కాదు. కొన్ని దశాబ్దాలపాటు కొనసాగవలసిన కృషి. అందులో ఒక నెలా రెండు నెలలు, రెండేళ్లు పెద్ద విషయం కాదు. మొలకలనన్నింటినీ తుడిచెయ్యటానికి రెండు గంటలు కూడా పట్టదు. మీరెందుకు తొందరపడుతున్నారో అర్ధం కావటం లేదు.--వైజాసత్య (చర్చ) 04:45, 26 మార్చి 2013 (UTC)Reply
  • మీరు లింకు ఇచ్చినందులకు ధన్యవాదాలు. అయితే ఇంతకుముందు జరిగిన చర్చలలో ఏకాభిప్రాయం కుదిరిందని ఖరారు చేయలేము.ఎందుకంటే చర్చలలో విభేదాలు వ్యక్తమయ్యాయి. చర్చలలో ఎవరు విభేదించినా 100శాతం ఏకాభిప్రాయసాధన రాదు. దానివలన పాల్గొన్న వారికి ముఖ్యంగా మార్పునుకోరేవారికి అది సంతృప్తికరమైన ముగింపు కాదు. అలా ఎక్కువసార్లు జరిగితే మార్పుని కోరేవారిని నిరుత్సాహపరచినట్లే అవుతుంది. నిర్ణయాలకు మెరుగైన విధానాలు వాడితే ఫలితం వ్యక్తిగతంగా ఇష్టంలేకపోయిన ప్రక్రియపై సంతృప్తి ఎక్కువగా వుంటుందని నా అనుభవం. అందువలననే ఇటీవలి చర్చలలో ముఖ్యమైనదానికి ఒక సంతృప్తికరమైన ముగింపు ఇవ్వడానికి నేను ప్రయత్నించాను. ఇక దీనిలో నిర్వాహక పాత్ర పోషించినపుడు ప్రతిపాదనను మెరుగుపరచటంలో, అందరు చెప్పిన విషయాలను సూత్రీకరించటంలో నా ముద్ర వున్నా సాధ్యమైనంతవరకు వికీ ప్రయోజనాలను, ఒక స్వేచ్ఛా ప్రాపంచిక సముదాయం నిర్ణయంతీసుకునే పద్దతులను సమర్థవంతంగా నిర్వహించటం దృష్టిలో వుంచుకొని ప్రయత్నించినా నా అలోచన ప్రభావం కొంత వరకు వుండవచ్చు. చాలావరకు సభ్యుల స్పందనలద్వారా దానిని తగ్గించగలిగానని భావిస్తాను. దీనికి ముఖ్యంగా చంద్రకాంతరావుగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇది ఎవరు నిర్వహించినా జరిగేదే. ఇంకా చంద్రకాంత రావుగారుచెప్పినట్లు దీనిలో లొసుగులు వుంటే సవరణల ద్వారా మెరుగుచేయవచ్చు. అలాగే ఈ ‌విధానం అమలులోకి రాగానే వెంటనే మొలకలు విలీనం లేక తొలగించబడేటట్లుచేయటానికి నాకెలాంటి తొందరలేదు. సముదాయం అంగీకరించే రీతిలో ఈ విధానం అమలుచేసే ప్రక్రియకు, వేగానికి నేను అడ్డంకి కాను.--అర్జున (చర్చ) 08:35, 27 మార్చి 2013 (UTC)Reply

విధానం అమలుగురించి సూచనలు

మార్చు
  • మొలకల విషయంలో చంద్రకాంతరావుగారి వాఖ్యలలో కొన్ని నిజాలున్నా వాటి విషయ్ంలో అందరూ విసుగు చెందారనేది వాస్తవం. ఇక ఈ చర్చలో ఎక్కువ మంది సభ్యులు పాల్గొనక పోవడానికి, సలహాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడానికి కారణాలు అనేకం ఉన్నా అందులో ముఖ్యమైనది- కొందరి సభ్యులు చర్చలు,వాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవడం. దుందుడుకుగా వాఖ్యలు చేయడం వలన మిగతా సభ్యులు ignore చేయడం చేస్తున్నారు. ఇక మొలకలు ఎక్కువ సంఖ్యలో తొలగించాల్సిన్ ఆవసరం లేకుండా ఉండే విషయంలో నా అభిప్రాయాలు.
  • మొలకలు తొలగించడానికి కొంతకాలం ఆగి విలీనం చేయదగినవి చూసి చేసి వాటిని విస్తరించడం,
  • ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న సభ్యులంతా కొంతకాలం మిగతా రచనలు మానేసి కేవలం మొలకల విస్తరణకు పూనుకోవడం.
  • వికీపీడియా:మొలకల జాబితా తీసుకొని ప్రతి ఒక్కరు ఇప్పటి నుండి ఒక్కొక్కటిగా విస్తరిస్తూ పోవడం. తరువాత ఆ లిస్ట్ నుండి వాటిని తొగించడం (ఒక్కొక్కరు ఒక్కటి కాదు, తెలిసినది చేరుస్తూ ఒక్కోదాన్ని అందరూ విస్తరణ చేయాలని నా మనవి)
  • మొలక స్థితి దాటాక టాగ్ తీసేయడం. నిజానికి ఇప్పటికే చాలా వరకూ ఆ స్థితి దాటాయి, కాని మొలక టాగ్ తీయబడలేదు చాలా వాటికి.
  • సాధారణంగా ఎవరైనా కొత్త వ్యాసం మొదలెడితే దాంట్లో మిగతావాళ్ళు వేలు పెట్టరు, మొదలెట్టిన వారు విస్తరిస్తారనే భావంతో, అలాకాక కొన్ని రోజులు చూసి వెంటనే దాని విస్తరణకు అందరూ తెలిసిన సమాచారం చేరుస్తూ కృషిచేస్తే సరి.
  • ఇప్పటి ఉత్సవం ద్వారా కొత్త సభ్యుల రాక ఎక్కువగా ఉంటుంది కనుక మనం అంటే ప్రస్తుతం క్రియాశీలక సభ్యులం వాళ్ళ రచనలను గమనిస్తూ అనవసర మైన సమాచారం గురించి ముందుగానే హెచ్చరిస్తూ (కొద్దిగా సామాచారం ఉంటే తొలగించబ్డుతుంది అని) వాళ్ల వ్యాసాలను విస్తరించేలా చేయడం. వీటి వలన ప్రస్తుతం అనుకున్నట్టుగా వేల వ్యాసాలు కాక వందల సంఖ్యలోనే తొగించవచ్చు. వికీలో నాణ్యత పెరిగే అవకాశం కూడా ఉంటుంది.విశ్వనాధ్ (చర్చ) 09:03, 26 మార్చి 2013 (UTC)Reply
విశ్వనాధ్ గారూ చక్కని సూచనలు చేశారు. నేను ఆ మొలకల జాబితాను తాజకరిస్తాను. మొలక టాగ్ తీసెయ్యటం బాటు ద్వారా చేయవచ్చు --వైజాసత్య (చర్చ) 12:02, 30 మార్చి 2013 (UTC)Reply
జాబితాను తాజాకరించాను.   చేశాను --వైజాసత్య (చర్చ) 08:12, 3 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • (1)మొలకలు గురించి విస్తార చర్చలు అవసరము అసలు లేదు. (2) మొలక తరువాత అది ముందుకు మొలకెత్తుతుందా లేదా అని వ్యాసకర్తకు కావలసిన సలహాలు, సూచనలు ఆ మొలకలో సూచించడము. (3) మొలకని ఎవరయినా మొలకెత్తిస్తారా లేదా అని నిర్వాహకులు లేదా సభ్యులు తొలగింపునకు దానికి తగిన సమయము కేటాయించడము. (4) ఇంక ఎవరూ ఆ మొలక జోలికి వెళ్ళడము లేదని తెలిసినప్పుడు వెను వెంటనే తొలగించడము. (5) తొలగించిన మొలకలు తిరిగి ఎవరయినా మొలకెత్తిస్తామని ముందుకు వచ్చినా, వెంటనే ఆ మొలకలను పున: ప్రతిష్టించడము. (6) వ్యాస విత్తులు విత్తే ముందే ఆ వ్యాసకర్తకు తగు విధముగా సలహాలు, సూచనలు, సంప్రదింపులు జరపడము. (7) వ్యాసకర్తలు ఏదయినా వ్యాసమునకు విత్తులు వేయాలనుకున్నప్పుడు ముందుగానే వరిష్ట వికీ సభ్యుల మద్దతు కోరుకోవచ్చు, వారు వ్యాసకర్త వ్యాసము ముందుకు వెళ్ళుటకు అందుకు తప్పక సహకారము కూడా లభించవచ్చును. మరికొన్ని సభ్యులు కోరితే ప్రతిపాదించగలను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:24, 29 మార్చి 2013 (UTC)Reply

ప్రసాద్ గారూ, మీ వ్యాఖ్యలకు నా సమాధానాలు అంకెల వారీగా 1.మొదటి వ్యాఖ్యపై విభేదించక తప్పదు. ప్రతివ్యాసం మొలకగానే మొదలౌతుంది. కాబట్టి తొలగించాలంటేనే చర్చ జరగాలి. అవి అలా ఉంచడానికి చర్చనే అక్కరలేదు. (ఇది చాలా తాత్వికమైన పాయింటు. ప్రస్తుతానికి అక్కడితో వదిలేద్దాం) 2.చక్కని సలహా. మనం దీన్ని అమలుపరచాలి. 3.అమలులోకి వచ్చింది. 4.ఇంత స్థాయిలో నియంత్రణ ఆచరణయోగ్యం కాదేమో. 5. తొలగించిన వ్యాసాలలో ఏముండేదో కేవలం నిర్వాహకులకు మాత్రమే చూడగలరు. కాబట్టి నిజానికి విస్తరణ జరగలాంటే అవి అందరికీ కనిపిస్తేనే కదా ఏదైనా అవకాశముండేది. 6. సభ్యులు ఎప్పుడు కొత్త వ్యాసాలు సృష్టించాలనుకుంటానారో మనకు చెప్పి చెయ్యరు కదా. ఈ పాయింటు నాకు సరిగా అర్ధంకాలేదు. 7. చాలామంది కొత్త సభ్యులు అంతదాకా ఆలోచించరు. అలా సహాయం తీసుకోవాలని కూడా తెలియదు. వికీ ప్రపంచం ఒక పెద్ద అయోమయంగా తోస్తుంది మొదట్లో. మంచి సలహాను కానీ ఆచరణలో ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. --వైజాసత్య (చర్చ) 08:28, 3 ఏప్రిల్ 2013 (UTC)Reply

  • వైజాసత్య గారు, మీరు స్పందించినందులకు చాలా సంతోషము. తదుపరి మీ అభిప్రాయ జవాబులకు నా సమాధానములు గమనించగలరు.

1. నేను "విస్తారమ"యిన చర్చలు అనవసరము అని ప్రస్తావించాను. కాని చర్చలే అవసరము లేదని కాదు. చర్చలు జరగాలి కాని ఉచితానుచితాలు మరచి "సమయము" ఉన్నంతలో ఉచిత సేవలు చేసే వారి మనుష్యుల మనసులు విరిగి పోయేవరకు (విస్తారంగా) కేవలం (ఎందుకూ) పనికి రాని చిత్తుమొలకల గూర్చి చర్చలు అనవసరము అని నా అభిప్రాయము. నిర్ణయాలు కొంత కఠినముగా ఉన్న "కర్కశము" కాదని మొలక(ల) వ్యాసకర్త(లు) గ్రహించ గలగాలి. ఒకవేళ అదే వ్యాసకర్త తను తొలగించిన మొలకలను విస్తరించాలను కున్నప్పుడు, తన మొలకలు తొలగించిన వాటిని తిరిగి పున:ప్రతిష్టంచమని కోరుకోవచ్చు. అదేవిధముగా తొలగించిన వేటినయినా ఎవరయిననూ తొలగించిన మొలకలు విస్తరించ వచ్చును. అన్ని తొలగించిన మొలకలను ఒక వర్గంలో చేర్చవచ్చునేమో అని నా సూచన. కానీ వికీ సంస్థకు అనవసర చెత్త చెదారము "భారము" అవుతుందేమోనని నా శంక. ఈ పై సూచించిన విషయాలను కూడా "వికీలకు ఇచ్చే సూచనలు, సలహాలు" వాటిలో కూడా చేర్చవచ్చును. 2. మరియు 3.: సంతోషమే కదా ! అందరికి. 4. వరిష్ట సభ్యులు గమనించ గలరు. ఆ మాత్రము నిర్ణయాలు నిర్వాహకులు తీసుకోలేరంటారా ? తప్పకుండా చేయవచ్చును. వికీ అధికారము ఆ మాత్రము కూడా లేదనుకో కూడదు. 5. చర్చలు ఉంటాయి, అవి అందరికీ అందుబాటులొ ఉంటాయి కదా ! 6. మరియు 7.: రోజూ వచ్చే రోజు వారీ వికీ సభ్యులుంటారు. రోజూ కాకపోయినా వారానికి ఒకసారి వచ్చే వారైనా తేలికగా మొలకలను గమనించ గలరు. వ్యాసకర్తకు తగు సూచనలు చేయవచ్చును. అందుకు అనుగుణంగా కొత్తగా వ్యాసవిత్తులు విత్తే వారికి ఈ విషయములలో, "ఈ విషయాల్ని" వికీ సలహాలు, సూచనలలో పొందుపరచ వచ్చును. ఇవి ఒక దారికి వస్తే మరిన్ని కొత్త వికీ సలహాలు, సూచనలు చర్చలు చేద్దామంటాను. మీరు గమనించి గ్రహించగలరు అని అనుకుంటాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:29, 3 ఏప్రిల్ 2013 (UTC)Reply

అమలు పరచే విధానం

మార్చు

చంద్రకాంతరావు గారూ, మీరు మొలకలకు వ్యతిరేకని నాకు తెలుసు. ఈ విషయంపై నేను మీతో ఇదివరకు కూడా చర్చించాను. అయితే కేవలం దీన్ని ఎలా అమలుపరచాలన్న విషయంపై భేదాభిప్రాయాలున్నాయి. నేను మీ అభ్యంతరాలన్నీ చదివాను. వాటిని దృష్టిపెట్టుకొని ఒక మధ్యమార్గాన్ని వెతికే ప్రయత్నం ఇది. ప్రస్తుతానికి కేవలం మొలకల నియంత్రణ గురించే చర్చించుకుందాం. మిగిలిన విషయాలు తర్వాత.

ఇక అమలు పరచే విధానం
  • నేను ఒక బాటు స్క్రిప్టు తయారుచేసి ప్రతినెలా కొత్తగా సృష్టించబడిన మొలకల జాబితాను తయారుచేస్తాను. ఆ బాటు స్క్రిప్టును అందరికీ అందుబాటులో ఉంచుతాను.
  • అలా బాటు జాబితాలో ఉన్న వాటిని సభ్యులు ఒక్కొక్కటే పరిశీలించి తొలగించాలో, ఉంచాలో నిర్ణయం తీసుకుంటారు.
  • తొలగింపు చిట్టచివరి నిర్ణయం మాత్రమే. ముందుగా అది ఎక్కడైనా విలీనం చేసే అవకాశముందా, విస్తరణ సాధ్యమౌతుందా, విషయప్రాముఖ్యత మొదలైన విషయాలు పరిశీలిస్తారు.
  • వ్యాసాలు మూకుమ్మడిగా తొలగించబడవు.
  • కొన్ని పరిస్థితులలో మూకుమ్మడిగా బాటు ద్వారా కొన్ని వ్యాస శృంఖలలు (సీరిస్) (ఒకే మూసలో సృష్టించబడే చిన్నవ్యాసాలు) తొలగించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, సముదాయం యొక్క అనుమతితోనే తొలగించగలరు.
  • వ్యాసాలు బాటు జాబితాలో చేరిన తర్వాత తొలగించడానికి మధ్య ఒక నెలరోజులు గడువుంటుంది. ఆ మధ్యకాలంలో మనం వాటిని విస్తరించి బాటు జాబితానుండి తొలగించవచ్చు.
  • క్రియాశీలక సభ్యులందరూ మొదట ఆ నెలలో సృష్టించబడిన మొలకలపై దృష్టిపెడితే బాగుంటుంది

--వైజాసత్య (చర్చ) 12:00, 30 మార్చి 2013 (UTC)Reply

చర్చలన్నీ ఓపికతో చదివి, వెలిబుచ్చిన భావాలను గ్రహించి, ఉద్దేశ్యాన్ని అర్థంచేసుకొని, అర్థాన్ని సమాలోచించి, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వైజాసత్య గారు చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి. ముఖ్యంగా మూడవ పాయింటు చాలా బాగుంది. మొదటి పాయింటు ప్రకారం మీరు చెప్పినట్లు ప్రతిమాసం చివరివారంలో జాబితా చేస్తే సరిపోతుంది. మిగితా పాయింట్లు కూడా బాగున్నాయి. ఒక్క రెండో పాయింటు విషయంలోనే పునరాలోచించ వలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే తొలిగించే విషయంలో పాలసీలకే చివరి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. లేనిచో సభ్యుల మధ్యన మళ్ళీ చర్చలు పెరగవచ్చు. గత 3-4మాసాల నుంచి మొలక నియంత్రణ చర్చలను చూస్తే, భవిష్యత్తులో కూడా వ్యాసాలను తొలిగించుటకు సృష్టించిన సభ్యులను దృష్టిలో ఉంచుకొని విచక్షణ చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలిగించే వ్యాసం సృష్టించిన సభ్యుడిని కాకుండా వ్యాస నాణ్యత ప్రకారం జరిగితేనే బాగుంటుంది. నేను మొలక వ్యాసాలకు వ్యతిరేకిని కానని మీకు బాగా తెలుసు, అసలు ఆ 2కెబిల ప్రతిపాదన దాదాపు ఐదేళ్ళ క్రితమే తెవికీ తెరపై మొదటగా తెచ్చినది కూడా నేనే నేమో! అలాగే కొత్తకొత్త నియమాలు చేయడానికి నేను వ్యతిరేకిని కాను, అభివృద్ది నిరోధకుడిని కాను. ఎటు తిరిగి తొలిగించే విషయంలో, పాలసీ విషయాలలో, ఓటింగ్ నియమాలలో మాత్రమే నా అభిప్రాయాలు (ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు కావు, గత చర్చలు, తెవికీ భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని చేసినవి) వేరుగా ఉన్నాయి. 2కెబిల పరిమాణానికి కూడా కొన్ని మినహాయింపులుంటే బాగుంటుంది. పాలసీలు రూపొందించేటప్పుడు వీటి గురించి ఆలోచిద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:37, 30 మార్చి 2013 (UTC)Reply
ఒకే రెండవ పాయింటు కొట్టివేశాను. కానీ మూడవ పాయింటును అమలుపరచడానికి రెండవ పాయింటు అవసరమౌతుందోమోనని అనుకున్నాను. రెండు కేబీల నియమానికి మినహాయింపులు ఉంటాయని నేను ఊహించగలను. విస్తరణలు, విలీనం మొదలైనవన్నీ జరిగిన తర్వాత కూడా మినహాయింపుగా మిగిలిపోయే వ్యాసాలు చాలా అరుదు. అవి తారసపడినప్పుడు పరిశీలించి చూద్దాం. అందుకని ముందే నియమానికి గండి కొట్టనవసరం లేదనుకుంటా. --వైజాసత్య (చర్చ) 05:10, 3 ఏప్రిల్ 2013 (UTC)Reply
మీరు ఊహించింది కూడా సరైనదే కాని తొలిగింపు అనేది పాలసీల ప్రకారమే జరిగితే బాగుంటుందనేది నా సూచన. లేనిచో కొందరు తొలిగించాలనీ, కొందరు వద్దని అంటూంటే సమస్య మళ్ళీ మొదటికే రావచ్చు. ముందుగా మొలకల నియంత్రణకై పటిష్టమైన పాలసీలు రూపొందించాలి. ఇదివరకు జరిగిన చర్చలు, అభిప్రాయాల ఆధారంగా మీరు ముసాయిదా పాలసీలు రూపొందించండి. దానిపై చర్చలు జరిపి అందరి అభిప్రాయాలకనుగుణంగా పాలసీలు రూపొందిద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:02, 3 ఏప్రిల్ 2013 (UTC)Reply
తొలివిడతగా ఇదిగో గత నెల రోజుల్లో కొత్తగా సృష్టించబడిన మొలకల జాబితా వికీపీడియా:మొలకల జాబితా/2013 ఏప్రిల్. --వైజాసత్య (చర్చ) 06:42, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply
కొత్తగా ఒక్క నెలలోనే ఇన్ని చిన్న వ్యాసాలు పుట్టుకొచ్చాయి. ఇలాగైతే మొలక వ్యాసాల నివారణ కష్టమే! ఇప్పటికే ఉన్న చిన్న వ్యాసాలను విస్తరించడం కంటే కొత్త చిన్న వ్యాసాల సృష్టిపై దృష్టిపెట్టడం బాగుండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:35, 3 మే 2013 (UTC)Reply
సాధారణంగా అయితే ఇన్ని మొలకల ఉండేవి కావు కానీ సుజాత గారు, వెంకటరమణ గారు కొత్తగా గ్రామాల వ్యాసాలను సృష్టిస్తున్నారు. ఎందుకు సృష్టిస్తున్నారో కనుక్కోవాలి --వైజాసత్య (చర్చ) 02:04, 4 మే 2013 (UTC)Reply
నేను పెద్ద సంఖ్యలో గల వర్గాలు లేని వ్యాసాలకు వర్గాలను ఉంచే ప్రయత్నం చేశను. పూర్తిచేశాను. ఆ కార్యక్రమంలో భాగంగా కొన్ని గ్రామ వ్యాసాలకు వర్గాలు,మూసలు లేకపోవుట గమనించితిని. ఆ వ్యాసాలలో మూసలను సరిదిద్ది ఆ గ్రామ వ్యాసాలలో చేర్చితిని. ఆ క్రమంలో మూసలలో ఉన్న ఎరుపు రంగులో గల గ్రామాలను గుర్తించి వాటికి కూడా మూసలు చేర్చితిని.అందువల్ల మొలక వ్యాసాల సంఖ్య పెరిగినది. యిదివరలో కూడా గ్రామ వ్యాసాలు మొలకలుగానే యున్నాయి.కనుక గ్రామ వ్యాసాలకు సడలింపు ఉన్నదని అనుకున్నాను. వాటిని విస్తరంచలేను. కాని గ్రామ వ్యాసాలు కానివాటిని మొలక స్థాయి దాటించగలను.--  కె.వెంకటరమణ చర్చ 02:42, 4 మే 2013 (UTC)Reply
అవును గ్రామాల వ్యాసాలు జాబితా నుండి తొలగిస్తాను. కొత్తగా గ్రామాలు ఎందుకుచేరుతున్నాయనే ఉత్సుకతతో అడిగిన ప్రశ్న మాత్రమే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టము లెండి :-) ఇప్పుడున్న గ్రామాల జాబితా నిజానికి సంపూర్ణమైనది కాదు. కేవలం పంచాయితీ గ్రామాలకే పేజీలున్నవి. కొందరు కొత్త సభ్యులు వాళ్ళ ఊరి పేరు కనిపించకపోయేసరికి పేరు వ్రాసి ఎర్రలింకు ఇస్తున్నారు. --వైజాసత్య (చర్చ) 03:29, 4 మే 2013 (UTC)Reply
  • వికీపీడియాలో 50 వ్యాసాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము. దాదాపు 70% మొలక స్థితిలో ఉన్నాయని అర్జునరావుగారు చెప్పారు. మొలకలను వృద్ధి చేయకుండాఆ 50 వేలకు అధికంగా వ్యాసాలున్నాయని చెప్పడం మనసాక్షికి కొంచం విరుద్ధమని అనిపించింది.
  • ఈ వ్యాసాలలో దాదాపు 26 వేల వ్యాసాలు గ్రామాలకు సంబంధించినవని చర్చల వలన తెలిసి వచ్చింది.
  • ఉగాది సమావేశాలలో ఈ వ్యాసాలను కనీసం మొలకస్థాయి దాటించాలని అనుకున్నాము. ఈ బాధ్యత తీసుకున్న సభ్యులలో నేను ఉన్నాను.
  • ఇందుకొరకు ముందస్తు సమావేశంలో రాజశేఖర్ గారూ నేనూ ఆలోచించి ఒక మూస చేసాము.
  • ఉగాది సమావేశాలలో విశ్వనాధ్ గారు సభ్యులు గ్రామాల వ్యాసాలకు దస్త్రాలు సేకరించిన వారు దస్త్రాలు మాత్రమే పెట్టినా చాలని చెప్పారు.
  • అవి అంబాటులో ఉండాలంటే ప్రత్యేక పేజీలో ఉంచాలని తరువాత గ్రామాల పేజీలోకి మార్చి వాటిని తొలగించాలని చర్చ జరిగింది.
  • గ్రామాల పేజీలో నేరుగా వేస్తే పని తక్కువ కనుక గ్రామాల పేజీలో చిత్రమాలిక ఉపపేజీ పెట్టాలనుకున్నాము.
  • గ్రామల పేజీలో ఏమి వ్రాయాలో తెలియక వ్రాయడం లేదని అనుకుని ఉపశీర్షికలు ఉంటే వాటిలో తగిన సమాచారం చేరుస్తారని అనుకుని మూస పద్దతిలో ఉపశీర్షికలు పెట్టాను.
  • చంద్రకాంత్ రావుగారు, ఇది బాటు ద్వారా చేయవచ్చని చెప్పారు కనుక అవి చేయడం మానుకున్నాను.
  • రహమానుద్దీన్ గారు గూగులు మ్యాప్ సాయంతో ఒక్కో గ్రామానికి దూరాలు వ్రాసామంటే కనీసం మూడు వాక్యాలు చేర్చవచ్చు అన్నారు.
  • అలా కూడా చేయవచ్చు అనుకుని చూస్తుంటే శోధనలో ఈ [1] లభించింది.
  • ఇది ఉపయోగించి ఆయాగ్రామాలకు సంబంధిన లింకును ఆయా గ్రామాలలో 6-8 మండలాలకు పెట్టాను.
  • ఇలా చేస్తే సభ్యులు సులువుగా చేయగలరని భావించాను.
  • ఈ పని చేస్తున్న తరుణంలో ఆంగ్లవీకీలో ఉన్న పేర్లు ఇక్కడ కొన్ని మండలాలో లేవని అవి సవరించే సమయంలో కొత్త పేజీల సృష్టి జరిగింది. మొలకలు గ్రామాల పేజీలకు మినహాయింపు కనుక ఇచి చేసాను. కానీ ఇప్పుడవి నిలిపి వేసాను. --t.sujatha (చర్చ) 04:43, 4 మే 2013 (UTC)Reply
ఐదారేళ్ళ క్రితం మండల వ్యాసాలలో మరియు మూసలలో గ్రామవ్యాసాలకు సంబంధించి అన్నీ నీలం రంగు లింకులే ఉండేవి. 2008లో ఆ తర్వాత కూడా చాలా సభ్యులు (సభ్యులు కాని వారు కూడా) ఇదివరకే ఉన్ననూ కొద్ది పేరుమార్పుతో మళ్ళీ గ్రామనామపు లింకులిచ్చారు. కొందరు గ్రామనామం తప్పుగా ఉందని సవరించడంతో నీలం లింకు కాస్త ఎర్రలింకులుగా మారాయి. మరికొందరు గ్రామాల పేర్లలొ అనుబంధ గ్రామాల పేర్లు కూడా చేర్చడంతో ఎర్రలింకులు అధికమయ్యాయి. రెవెన్యూ గ్రామం అయితే ఫర్వాలేదుకాని అనుబంధ గ్రామానికి కూడా సరిపడా సమాచారం లభించడం చాలా కష్టం. ఇలాంటి అనుబంధ గ్రామాలకై ప్రత్యేక పేజీలు అవసరం లేదనుకుంటాను. అలాగే సుజాత గారు చేర్చినట్లు ఖాళీ విభాగాలు అవసరం లేదు. సమాచారం లభించినప్పుడే విభాగాలు సృష్టించడం మేలు. రహమనుద్దీన్ గారన్నట్లు గూగుల్ మ్యాప్ సహాయంతో దూరం వ్రాయడం సరైన ఫలితాలివ్వదు. నేను ఇదే విషయంపై మహబూబ్‌నగర్ జిల్లా గ్రామ వ్యాసాలకై పరిశోధించాను. సమీప గ్రామం కూడా సరైన రోడ్డు లేకుంటే చాలా దూరం నుంచి చూపెట్టడంతో తప్పు ఫలితమిస్తోంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:43, 4 మే 2013 (UTC)Reply

చంద్రకాంత్ రావుగారూ ![ http://www.onefivenine.com/india/villag/state/Andhra-Pradesh] ఈ లింకు గమనించండి ఇలాంటి లింకుల ఆధారంతో సభ్యులు గణాంకాలు చేర్చవచ్చు. ఈ లింకులో ఉన్న గ్రామాలు కొన్ని మండలాల పేజీలలో లేవు కనుక ఆపేజీలను సృష్టించి గణాంకాలు చేర్చాలన్న విషయం గమనించండి. --t.sujatha (చర్చ) 04:25, 5 మే 2013 (UTC)Reply

ఈ మార్గదర్శకం మరింత స్పష్టంగా ఉంటే బాగుండేది

మార్చు

ఈ మార్గదర్శకం ప్రతిపాదన ఇలా చెబుతోంది:

తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం 2000బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను.

ఈ ప్రతిపాదన మరింత స్పష్టంగా ఉంటే బాగుండేది. స్పష్టత అవసరమైనవి:

  1. అనుభవంలేని వారు రాసే మొలకల సంగతేంటి?
  2. ఇతర వ్యాసాల్లో విలీనం చేసే వీలు లేకపోతే ఏం చెయ్యాలి.. తొలగించవచ్చా లేక తొలగించకుండా అలాగే ఉంచెయ్యాలా?

అర్జున గారూ, ఈ ప్రతిపాదన ఆమోదం పొందాక, ఈసరికే ఉన్న వికీపీడియా:మొలక అనే మార్గదర్శకానికి సవరణలు చేర్చాలి లేదా ఒక కొత్త మార్గదర్శకం పేజీ రూపొందాలి. సవరణ అనేది జరగలేదు. కొత్తగా వేరే పేజీ ఏదైనా సృష్టించారా? ఆరేడేళ్ళకిందటి సంగతి.. గుర్తుండే అవకాశం తక్కువ. కానీ కాస్త దృష్టి పెడితే గుర్తుకొస్తుందేమో పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 00:57, 30 డిసెంబరు 2019 (UTC)Reply

  • చదువరి గారికి, విధానం అనుభవంలేని వారు రాసే మొలకలని ఏవిధమైన చర్చలు లేకుండా తొలగించాలని సూచిస్తుంది. మరింత స్పష్టతకొరకు ఆ వాక్యం చేర్చవచ్చు. వీలైతే విలీనం చెయ్యాలి అంటే వీలులేకపోతే తొలగించటమే అన్న అర్ధం స్ఫురిస్తుంది.--అర్జున (చర్చ) 04:06, 30 డిసెంబరు 2019 (UTC)Reply
  • అవును. మొలక వ్యాసంలో సవరణలు లేక "ఇవీచూడండి" లో చేర్చాల్సింది. విధానానికి మార్గదర్శకాలు చేయడం, విధాన నిర్ణయం చేయడం, అమలు చేయడంలో జరిగిన చర్చలు ప్రోత్సాహకంగా లేకపోవడంతో అవి చేయలేకపోయాను. ఇప్పుడు లింకు చేరుస్తాను. మీ స్పందనకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:06, 30 డిసెంబరు 2019 (UTC)Reply

అర్జున గారూ, చదువరి గారూ ఇవి పరిశీలించండి.

1.వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం పేజీలో ఇలా ఉందని పైన అర్జున గారు వివరించారు.

•“తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం (2000 బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను.”

2.కానీ వికీపీడియా:మొలక అనే మార్గదర్శకాలులో ఇలా ఉంది.

  1. "మొలక అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం కనీసం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే సుమారు 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు’’
  2. నమోదైన వాడుకరి ఎవరైనా మొలక వ్యాసాన్ని సృష్టించవచ్చు.
ఈ రెండిటి వ్యత్యాసాన్ని సవరించాలి.--యర్రా రామారావు (చర్చ) 07:48, 30 డిసెంబరు 2019 (UTC)Reply
యర్రా రామారావు గారూ, వికీపీడియా:మొలక పేజీనుండి మీరు ఉదహరించిన రెండింటిని బట్టి నాకు అర్థమైంది ఇది:
  1. మొలక అంటే పనికిరానిది కాదు, కానీ కనీసం వ్యాస విషయాన్ని సరిపడినంతగా వివరించేలా, 3 నుండి 10 వాక్యాలు, ఉండాలి.
  2. మొలకను పరిమణాన్ని బట్టి కాకుండా, వ్యాస విషయాన్ని బట్టి నిర్ణయించాలి.
    1. విస్తారమైన వ్యాసం కాగల విషయాలకు (ఉదాహరణకు భారతదేశం అనుకుందాం) 10 వాక్యాలే కాదు, పాతిక వాక్యాలు ఉన్నా అది మొలకే అవుతుంది.
    2. విషయం మరీ చిన్నదైతే, అంతకంటే పెద్ద వ్యాసం రాయలేనంత చిన్నదైతే, దాన్ని మొలకగా పరిగణించకూడదు (ఈ రెండింటిని బట్టి నాకు అర్థమైనదేంటంటే.., మొలకగా నిర్ణయించడం పట్ల మన విచక్షణను వాడాలి అని).
  3. మొలకలను నమోదైన వాడుకరు లెవరైనా సృష్టించవచ్చు ("నమోదైన వాడుకరులు మాత్రమే" అని అనలేదు. ఐపీ అడ్రసులు సృష్టించే మొలకల పట్ల కఠినంగా ఉండాలి అని దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను).
దీనితో పోలిస్తే, నియంత్రణ విధానం పేజీలో కొంత భిన్న వైఖరి ఉందికదా అని మీ ఉద్దేశమై ఉండవచ్చు. ఆ తేడాల పట్ల నా అభిప్రాయం:
  1. "తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు" - "నమోదైన వాడుకరి ఎవరైనా మొలక వ్యాసాన్ని సృష్టించవచ్చు": ఈ రెండింటి లోను, "తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు)" అనే దాన్ని మనం స్థిరపరచుకోవచ్చు అని నా ఉద్దేశం.
  2. "కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం (2000 బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే" - దీనికి విరుద్ధంగా "వికీపీడియా:మొలక" లో వొచక్షణ వాడమని చెబుతోంది. విచక్షణ వాడే విషయంలో వివిధ వాడుకరుల మధ్య భిన్నాభిప్రాయం ఏర్పడి, వివాదంగా మారే అవకాశం ఉంది. ఈ తగువులు పడే బదులు, 2000 బైట్లు, ఒక లింకు అనే లెక్క ఒకటి ఉంటే నిర్ణయం తేలిక అవుతుందని నా ఉద్దేశం.
మీరు, అర్జున గారు, ఇతర వాడుకరులూ ఏమంటారో చూడాలి. అయా అభిప్రాయాలను బట్టి ఏ పేజీని సవరించుకోవాలో నిర్ణయించుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 08:21, 30 డిసెంబరు 2019 (UTC)Reply
చదువరి, యర్రా రామారావు గార్లకు, వికీపీడియా:మొలక వ్యాసం తొలిగా ఆంగ్ల వికీవ్యాసం నుండి అనువదించగా వచ్చినది. మొలక నియంత్రణ విధానంలో తెవికీలో చర్చల ఫలితంగా తర్వాత ఏర్పడ్డది కావున రెండవదానినే పరిగణించి దానికనుగుణంగా మొదటి దానిని అవసరమైన చోట సరిదిద్దాలి. --అర్జున (చర్చ) 09:25, 30 డిసెంబరు 2019 (UTC)Reply
అర్జున గారూ, మీతో ఏకీభవిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 09:27, 30 డిసెంబరు 2019 (UTC)Reply
అర్జున గారూ, దీనిపై వివరణ ఇచ్చినందుకు ధన్యావాదాలు.--యర్రా రామారావు (చర్చ) 11:47, 30 డిసెంబరు 2019 (UTC)Reply

యర్రా రామారావు చేసిన సూచనలు,ప్రతిపాదనలు

మార్చు

చదువరి గారూ పైన మీరు వివరించిన అభిప్రాయాలుపై, ఇంకా మరికొన్నిటిపై నేను నాసూచనలు, ప్రతిపాదనలు వివరిస్తున్నాను.

మొలక వ్యాసం అంటే ఏమిటి అనే దానికి సరియైన నిర్వచనం ఉండాలి.

మార్చు

•నిర్వచనం మాదిరి ప్రతిపాదన:“తెవికీలో నమోదుకాబడి, 25 మార్పులుకు తక్కువ కాకుండా ఎడిట్లు లేదా మార్పులు చేసిన వికీపీడియన్లు సృష్టించిన వ్యాసాలు 30 రోజుల తరువాత ఆ వ్యాసానికి ఎటువంటి మూలాల లంకె,ఒక అంతర్గత లింకు లేకుండా, 2000/2500 బైట్లకు తక్కువగా ఉన్న వ్యాసాలు మొలక వ్యాసాలుగా పరిగణింపబడతాయి”

సూచన: ముప్పది రొజులలోపు అటువంటి వ్యాసాలును పర్వేక్షణకోసం వర్గం: కొత్తగా సృష్టించిన వ్యాసాలు అనే వర్గంలోకి చేర్చాలి.అలా చేరినప్పుడు నిర్వాహకులు పరిశీలించి,తొలగించవలసిన వ్యాసాలు తొలగించటానికి తేలికగా ఉంటుందని నా అభిప్రాయం.మొన్న తెవికీ జన్మదిన వార్షికోత్సవం సమావేశం రోజు ఈ ప్రతిపాదన విషయమై మీతో అన్నాను.

ఇంకొకటి. లోగడ ఉన్న ఈ క్లాజు “వ్యాసం ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను.” అనే దానిపై

మార్చు
  • నా అభిప్రాయం:అసలు ఈ వాక్యం కొంత గంధరగోళానికి తావు ఇస్తుంది.మనం కొద్ది పేరు మార్పుతో రెండు వ్యాసాలు ఉంటే విలీనం మూస ఎక్కిస్తున్నాం.ఒకే విషయాన్ని తెలిపే వ్యాసాలైతేనేగదా విలీనం చేయాలని మూసలు పెడుతుంది. అలా విలీనం అనే అభిప్రాయానికి ఇక్కడ తావు ఇవ్వటం అవసరంలేదనుకుంటాను. దాని వలన మనకెందుకులే అనుకుంటారు. అంత శ్రమ తీసుకొని విలీనం ఎవరు చేయరు.దాని వలన శ్రద్ద కొరవుతుందనుకుంటాను.ఇప్పటికే విలీనం చేయవలసిన వ్యాసాలు పరిస్థితి ఎలా ఉందో మనందరకు తెలుసు.ఇక తొలగించే వ్యాసాలు ఏమి ఉండవు.అన్నీ ఉండేవే.

మరొక ప్రతిపాదన వ్యాస పరిమాణంపై

మార్చు

2000 బైట్లకు బదులు కనీసం 2500 బైట్లుకు తగ్గకుండా ఉండాలని ప్రతిపాదిస్తున్నాను.

ప్రతిపాదించిన మరి కొన్ని నియామాలు

మార్చు
  1. ఎటువంటి నోటీసు లేకుండా తొలగించవచ్చును.
  2. ఇప్పటివరకు వికీపీడియాలో ఉన్న అన్నివ్యాసాలకు ఈ నియమాలు వర్తిస్తాయి.

గమనిక:ఏమైనా కొన్ని ఇతర రకాల వ్యాసాలకు మినహాయింపు ఉంటే వాటిని చర్చించి సరిగా నిర్వచించాలి.

చదువరి గారిని, అర్జున గారిని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:55, 30 డిసెంబరు 2019 (UTC)Reply

  • యర్రా రామారావు గారికి, తెవికీలో ఇప్పటికే అంగీకరించిన విధానాన్ని సమర్ధవంతంగా ఇంతవరకు అమలు చేయలేదని నా అభిప్రాయం. కనుక కొంతకాలం అమలుకు ప్రయత్నించిన తరువాత సవరణలు ప్రతిపాదించితే మంచిదనుకుంటాను. --అర్జున (చర్చ) 09:30, 30 డిసెంబరు 2019 (UTC)Reply

మొలకల నియంత్రణపై అర్జున అనుభవాలు

మార్చు

వాడుకరి:Arjunaraoc/మొలకలు-202001 లో వివరించినట్టు, నేను సృష్టించిన మొలకల నియంత్రించే ప్రక్రియ చేపట్టాను. 42 వ్యాసాలలో 5 వ్యాసాలు విలీనం చేసి తొలగించగా, 1 వ్యాసం (ఉనికిలో లేని గ్రామం) నేరుగా తొలగించాను. 3 వ్యాసాలు అయోమయనివృత్తి వ్యాసాలు. వ్యాస పరిమాణం 2000 చేరటానికి పెద్దకష్టపడవలసిన అవసరంలేదు. దీనికొరకు శోధన యంత్రాలలో ఫలితాలకోసం వెతకటం, లేక దగ్గర గల పాత పత్రికలు కొంత పరిశీలించడం తప్పనిసరి. గ్రామాలైతే, గ్రామాలకు దగ్గరలోని రహదారులు, పట్టణాల నుండి దూరాల వివరాలు, సంస్థలు అయితే వాటి స్థాపన ఉద్దేశ్యం, లక్ష్యాలు లాంటివి చేర్చాను. పత్రికలకు వాటిలోని వివిధ భాగాల గురించి చేర్చాను. ముఖ్యంగా అన్నిటికి మూలాలను తనిఖీ చేసి {{cite web}} వాడి చేర్చాను. ఇలా చేసిన తరువాత వ్యాసం చిన్నదైనా మెరుగుగా వున్నట్లనిపించింది. కొన్ని వ్యాసాలకు అనువాదాలతో తిరగ రాశాను. ఇకపై నేను వ్యాసం మొదలెడితే కనీసం 2000బైట్ల పరిమాణంతో ఒక అంతర్గత లింకు, వేరే వ్యాసం నుండి ఈ వ్యాసానికి లింకు, ఒక మూలపు లింకు ఉండేటట్లుగా చేస్తాను. నెల రోజులు గడచిన అలా చేయకపోతే నిరభ్యంతరంగా అటువంటి వాటిని తొలగించవచ్చు. ప్రస్తుత నియమానికి అదనంగా వేరొక వ్యాసం నుండి ఈ వ్యాసానికి లింకు(సాధారణంగా చేర్చుతాము), ఈ వ్యాసంలో కనీసం ఒక మూలపు లింకు వుండేటట్లుగా సవరించితే సరిపోతుంది.--అర్జున (చర్చ) 09:25, 19 జనవరి 2020 (UTC)Reply

మొలక వ్యాసాల నియంత్రణపై యర్రా రామారావు అనుభవాలు,సూచనలు

మార్చు

నా మొలకల జాబితాలో వివరించినట్టు, నేను సృష్టించిన మొలకల నియంత్రించే ప్రక్రియ చేపట్టి పూర్తిచేసాను. వికీపీడియా:క్రియాశీల వాడుకరులు సృష్టించిన మొలక వ్యాసాల గణాంకాలు ప్రకారం 2048 బైట్స్ లోపు నాకు 45 వ్యాసాలు ఉన్నవి.కానీ నేను 2500 కెబి పరిమాణంలోపు గల వ్యాసాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నందున అదనంగా 34 వ్యాసాలతో కలిపి 79 వ్యాసాలు జాబితాలో కనపడుతున్నవి. 79 వ్యాసాలలో ఒకటి అయోమయ నివృత్తి పేజీ కాగా, రెండు గ్రామాలుకు చెందిన వ్యాసాలు. అవి రెవెన్యూ గ్రామాలు కానందున, ఎటువంటి డేటా అందుబాటులో లేనందున తొలగించాను. మిగిలిన 76 వ్యాసాలు 2500 బైట్సుకు మించి వ్యాస విస్తరణ చేసి,మూలాల లంకె కూర్పు చేసాను.ఇవి అన్నీ తెలంగాణలో జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త, ఇతర జిల్లాలకు మారిన మండలాలు.తగిన అవగాహన ఉన్నందున వీటికి పెద్దగా కష్టపడవలసిన అవసరం కలుగలేదు.ఇకపై నేను వ్యాసం మొదలెడితే కనీసం 2500బైట్ల పరిమాణంతో ఒక అంతర్గత లింకు, వేరే వ్యాసం నుండి ఈ వ్యాసానికి లింకు, ఒక మూలపు లింకు ఉండేటట్లుగా పాటించగలవాడను.అందరూ ఇదే పద్దతి పాటిస్తే మొలక వ్యాసాల సమస్య ఉండదని భావిస్తున్నాను.వీటి నియంత్రణా విధానంపై, పైన గౌరవ వికీపీడియన్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు,సూచనలు ఒకసారి తిరిగి రచ్చబండలో చర్చించి మరింత సవివరంగా ఉండేలాగున నిర్ణయం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.మరొక విషయం వికీపీడియా:మొలక, వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు, వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం ఇలా ఇన్ని రకాల వ్యాసాల పరిశీలించాలంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది.ఒక్కోసారి ఏ పొరపాటువల్లైనాగాని ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండి సందిగ్ద పరిస్థితులు ఏర్పడే అవాకాశం ఉన్నందున దీనిపై పరిశీలించవలసిందిగా నేను సూచిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:52, 28 జనవరి 2020 (UTC)Reply

Return to the project page "మొలకపేజీల నియంత్రణ విధానం".