వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/మీకు తెలుసా
క్రికెట్ 2023 ప్రాజెక్టు కింద సృష్టించిన/విస్తరించిన వ్యాసాల్లోంచి ఆసక్తికరమైన విశేషాలను ఇక్కడ చేరిస్తే, వాటిలో అనువైన వాటిని మొదటిపేజీలో ప్రదర్శించవచ్చు.
ఎలాంటివి రాయాలి/రాయకూడదు:
- మనం ఇక్కడ రాసే వాక్యాలనే వివరంగా చెప్పే వ్యాసాలు ఇక్కడ ఉండాలి. వాటికి లింకు ఇవ్వాలి. రాసే విషయం సరైనదైనప్పటికీ, సంబంధిత వ్యాసం ఇక్కడ లేకపోతే, ఆ వాక్యం రాయవద్దు. ఇది "మీకు తెలుసా" లో నియమం.
- మామూలు క్రికెట్ రికార్డులు కాకుండా, అరుదైన విశేషాలను మాత్రమే ఇక్కడ చేరుద్దాం.
- ఇక్కడ రాసే వ్యాసాల ఆకృతి సరిగ్గా మొదటి పేజీలో ఉన్న మీకు తెలుసా ఆకృతి లాగానే ఉండాలి.
మీకు తెలుసా జాబితా
మార్చు- ... ఒకప్పటి భారత క్రికెట్ ఆటగాడు జహంగీర్ ఖాన్, లార్డ్స్ మైదానంలో బౌలింగు చేసినపుడు ఆ బంతి గాల్లో ఒక పిచ్చుకకు తగిలి, అది చనిపోయిందనీ!
- ... ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, 1882లో క్రికెట్ సిరీస్‌ను ఓడిపోయినపుడు ది స్పోర్టింగ్ టైమ్స్ పత్రిక, ఇంగ్లీష్ క్రికెట్ మరణించిందనీ, శవాన్ని దహనం చేసి ఆ చితాభస్మాన్ని ఆస్ట్రేలియా తీసుకువెళ్తారనీ రాసినపుడు, యాషెస్ సీరీస్ పుట్టిందనీ!
- ... ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు జోష్ హాజెల్‌వుడ్ వన్‌డే క్రికెట్ మ్యాచ్‌లలో ఆడడం మొదలుపెట్టాక, వరుసగా తన 34 వ మ్యాచ్ దాకా అసలు ఔటే అవ్వలేదనీ!
- ...భారతదేశపు తొట్టతొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు అనీ, ఆమె సి.కె.నాయుడు కుమార్తె అనీ!
- ... ఆస్ట్రేలియా క్రికెటర్లు జోష్ హాజెల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్ లు, భాగస్వామ్యంలో 26 నిమిషాలలో 54 పరుగులు చేస్తే, అందులో జోష్ అసలు ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదనీ!
- ... క్రికెట్ ఆటను ఒలింపిక్ క్రీడల్లో ఒకే ఒక్కసారి 1900 లో ఆడారనీ, అప్పుడు ఫ్రాన్స్ రెండవ స్థానంలో నిలిచిందనీ!
- ... 1975 క్రికెట్ ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్‌తో ఆడుతూ సునీల్ గవాస్కర్, మొత్తం 60 ఓవర్లూ బ్యాటింగు చేసి, 174 బంతులు ఆడి, 36 పరుగులే చేసాడనీ!
- ... క్రికెట్‌లో ఒక రకమైన రనౌట్‌ను అనధికారికంగా మన్కడింగ్ అంటారనీ, అది ప్రఖ్యాత భారత క్రికెటరు వినూ మన్కడ్ నుండి వచ్చిందనీ!
- ... సి.కె.నాయుడు, తన 62 వ యేట భారతీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంటైన రంజీ ట్రోఫీలో ఆడి, ఆ మ్యాచ్‌లో 52 పరుగులు చేసాడనీ!
- ...భారత మహిళా క్రికెట్ జట్టులో ఆడే క్రీడాకారిణి శిఖా పాండే, భారత వైమానిక దళంలో పనిచేసిందనీ, ఆమెను శికీపీడియా అంటారనీ!
- ... ఒకప్పుడు క్రికెట్లో అండర్‌ఆర్మ్ బౌలింగే సరైనదనీ, ప్రస్తుత బౌలింగు యాక్షను అప్పటి క్రికెట్ చట్టాల ప్రకారం చట్టవిరుద్ధమనీ!
- ... బాపూ నాదకర్ణి ఒక క్రికెట్ టెస్టు మ్యాచ్‌లో వరుసగా 21 ఓవర్లకు మించి (వరుసగా 131 బంతులు), మెయిడెన్ ఓవర్లు వేసాడనీ!
- ... అబ్బాస్ అలీ బేగ్‌ను ఒక క్రికెట్ టెస్టు మ్యాచ్ సందర్భంలో ఒక ప్రేక్షకురాలు ముద్దు పెట్టుకుందనీ!
- ...ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్, భారత్ రెండు దేశాలకూ క్రికెట్ టెస్టులు ఆడాడనీ!
- ...టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు తరఫున మొట్టమొదటి శతకం సాధించిన ఆటగాడు లాలా అమర్‌నాథ్ అనీ!
- ...అన్వర్ హుస్సేన్ అనే పాకిస్థానీ క్రికెటర్, 1947 డిసెంబరులో పాకిస్తాన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ మొదటి బంతిని ఆడాడనీ!
- ...మహ్మద్ జాహిద్ అనే పాకిస్థానీ క్రికెటర్, టెస్ట్ అరంగేట్రంలోనే 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి పాకిస్థానీ క్రికెటర్ అనీ!
- ...సలీమ్ మాలిక్ అనే పాకిస్థానీ క్రికెటర్, టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడనీ!
- ...సలీమ్ మాలిక్ అనే పాకిస్థానీ క్రికెటర్, 21వ శతాబ్దం ప్రారంభంలో మ్యాచ్ ఫిక్సింగ్‌లో నిషేధానికి గురైన మొదటి అంతర్జాతీయ క్రికెటర్ అనీ!
- ...సలీమ్ ఇలాహి అనే పాకిస్థానీ క్రికెటర్, వన్డే అరంగేట్రంలో శతకం సాధించిన మొదటి పాకిస్థాన్ క్రికెటర్ అనీ!
- ...ఇంతియాజ్ అహ్మద్ అనే పాకిస్థానీ క్రికెటర్, ఒక జట్టు ప్రారంభ మ్యాచ్ నుండి వరుసగా అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడనీ!
- ... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వారి ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్‌లో నియమితులైన మొదటి మహిళ గండికోట సర్వలక్ష్మి అనీ!
- ...టీ20లలో 100 వికెట్లు తీసిన పాకిస్తాన్ మొదటి క్రికెటర్ షాదాబ్ ఖాన్ అనీ!
- ...టెస్ట్, వన్డే అరంగేట్రం రెండింటిలోనూ సెంచరీ చేసిన మొదటి క్రికెటర్ అబిద్ అలీ అనీ!
- ...తన మొదటి రెండు టెస్టులలో ప్రతిదానిలో సెంచరీలు చేసిన పాకిస్తాన్ మొదటి బ్యాట్స్‌మెన్ అబిద్ అలీ అనీ!
- ... టెస్టు అరంగేట్రం తొలి సెషన్‌లో 5 వికెట్లు తీసిన తొలి పాకిస్థానీ బౌలర్ అబ్రార్ అహ్మద్ అనీ!
- ... అత్యంత సుదీర్ఘమైన క్రికెట్ టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మధ్య పన్నెండు రోజుల పాటు జరిగిందనీ!
- ...నాజర్ మొహమ్మద్ అనే పాకిస్థానీ క్రికెటర్, 1952-53లో ఢిల్లీలో టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ కోసం వేసిన మొదటి బంతిని ఆడాడనీ!
- ...నాజర్ మొహమ్మద్ అనే పాకిస్థానీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ కోసం మొదటి సెంచరీ చేశాడనీ!
- ... ఆస్ట్రేలియా మహిళా క్రికెటరు అలిస్సా హీలీని ఔట్ చేసేందుకు శిఖా పాండే వేసిన బంతిని బాల్ ఆఫ్ ది సెంచురీ అంటారనీ!
- ...నాజర్ మొహమ్మద్ అనే పాకిస్థానీ క్రికెటర్, ఒక టెస్ట్ మ్యాచ్ మొత్తం మైదానంలో ఉన్న మొదటి ఆటగాడనీ!
- ... ఆడిన జట్ల సంఖ్యను బట్టి ఒక టోర్నమెంటు పేరు ప్రెసిడెన్సీ మ్యాచ్, ట్రయాంగులర్, క్వాడ్రాంగులర్, పెంటాంగులర్ అంటూ మారిందనీ!
- ... లిటిల్ మాస్టర్‌గా గౌరవించబడ్డ హనీఫ్ మొహమ్మద్ అనే పాకిస్థానీ క్రికెటర్, టెస్టు మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి పాకిస్థానీ ఆటగాడనీ!
- ...ఫజల్ మహమూద్ అనే పాకిస్థానీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్‌లో 100 వికెట్లు దాటిన తొలి పాకిస్థానీ ఆటగాడనీ!
- ...మొహమ్మద్ ఆసిఫ్ అనే పాకిస్థానీ క్రికెటర్, ట్వంటీ-20 క్రికెట్‌లో మెయిడిన్ ఓవర్ వేసిన తొలి బౌలర్ అనీ!
- ...వాలిస్ మాథియాస్ అనే పాకిస్థానీ క్రికెటర్, పాకిస్తాన్ తరపున ఆడిన మొదటి ముస్లిమేతర క్రికెటర్ అనీ!
- ...ఆకిబ్ జావేద్ అనే పాకిస్థానీ క్రికెటర్, 19 ఏళ్ళ 81 రోజుల వయస్సులో వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్న వయస్కుడనీ!
- ...అలీముద్దీన్ అనే పాకిస్థానీ క్రికెటర్, 12 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కనిపించిన అతి పిన్న వయస్కుడనీ!
- ... పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ కంటే 2 సంవత్సరాల ముందే మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మొదలైందనీ!
- ...ఫఖర్ జమాన్ అనే పాకిస్థానీ క్రికెటర్,పాకిస్తాన్ తరపున వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్ అనీ!
- ...ఫఖర్ జమాన్ అనే పాకిస్థానీ క్రికెటర్, వన్డేలో ఛేజింగ్‌లో 193 అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్ అనీ!
- ...బాబర్ ఆజం అనే పాకిస్థానీ క్రికెటర్, ఒకే దేశంలో (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వరుసగా 5 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ అనీ!
- ...బాబర్ ఆజం అనే పాకిస్థానీ క్రికెటర్, రెండుసార్లు వరుసగా 3 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ అనీ!
- ...బాబర్ ఆజం అనే పాకిస్థానీ క్రికెటర్, ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించిన తొలి పాక్ కెప్టెన్ అనీ!
- ...బాబర్ ఆజం అనే పాకిస్థానీ క్రికెటర్, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ను గెలుచుకున్న మొదటి పాకిస్థానీ (రెండుసార్లు ఈ ఘనత సాధించాడు) క్రికెటర్ అనీ!
- ...బాబర్ ఆజం అనే పాకిస్థానీ క్రికెటర్, అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీలు చేసిన పాకిస్తానీ కెప్టెన్ అనీ!
- ...మహమ్మద్ సిరాజ్ అనే భారత క్రికెటర్, ఒక ఓవర్‌లో 4 వికెట్లు తీసిన మొదటి భారతీయ క్రికెటర్ అనీ!
- ...కిర్స్టీ ఫ్లావెల్ అనే న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారిణి, మహిళల టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి మహిళ అనీ!
- ...గ్లెన్ టర్నర్ అనే న్యూజీలాండ్ క్రికెటర్, వన్డేలో 150కి పైగా స్కోర్ చేసిన మొదటి ఆటగాడు అనీ!
- ...గ్లెన్ టర్నర్ అనే న్యూజీలాండ్ క్రికెటర్, వన్డే చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 200కి పైగా బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మెన్ అనీ!
- ...బ్రూస్ టేలర్ అనే న్యూజీలాండ్ క్రికెటర్, టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రంలోనే సెంచరీ చేసి ఐదు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ అనీ!
- ...మార్టిన్ గప్టిల్ అనే న్యూజీలాండ్ క్రికెటర్, వన్డే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మొదటి న్యూజీలాండ్ క్రికెటర్ అనీ!