వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1

ప్రాజెక్టు కాలపరిమితి

మార్చు

తెవికీ నాణ్యత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడగలదని ఆశిస్తున్నాను. కాకపోతే ఈ ప్రాజెక్టు కాల పరిమితి కనీసం ఒక 12 - 15 వారల వరకు ఉంచితే దీని ఫలితాలు విదిమౌతాయి. రెండు నెలలు చాలా తక్కువ కాల పరిమితనిపిస్తుంది. --విష్ణు (చర్చ)10:25, 8 జనవరి 2014 (UTC)Reply

విష్ణు గారి వ్యాఖ్యకు ధన్యవాదాలు. వికీలో ప్రాజెక్టులు విడతలలో చేయడం మంచిది. ఎందుకంటే తక్కువసమయానికి నిబద్దత చూపడానికి ఎక్కువ సభ్యులు తమ ఆసక్తి చూపే అవకాశం వుంది. ఒక విడత పనిజరిగినతరువాత లోటుపాట్లు విశ్లేషించి, ఆసక్తిని బట్టి కొంత విరామమిచ్చి మరల తరువాత విడత చేపడితే మరింత ఎక్కువమంది పాల్గొనటానికి అవకాశం వుంది. --అర్జున (చర్చ) 03:42, 9 జనవరి 2014 (UTC)Reply

సమన్వయకర్త ఎంపిక

మార్చు

ఇప్పటికే ఆసక్తి తెలిపిన సభ్యులందరికి (Rajasekhar1961 , రహ్మానుద్దీన్ ,విశ్వనాధ్,కె.వెంకటరమణ, Bhaskaranaidu , విష్ణు , రవిచంద్ర) ధన్యవాదాలు. ఈ రోజు ఆసక్తి తెలపటానికి చివరిరోజు కావున, ఈ రోజు ఆసక్తి తెలిపేవారితోపాటు, ఈ ప్రాజెక్టుకి సమన్వయకర్తగా వుండటానికి ప్రాజెక్టు సభ్యులెవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావలసినదిగా కోరుతున్నాను.సమన్వయకర్తకు కొంత నిర్వహణ బాధ్యతలు చేపట్టాలి (గణాంకాలు చేర్చడం, ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న పనులలో ఒకే రకంగా వున్న వాటికి మెరుగైన మూసలు, పద్ధతులేమైనా సభ్యుల సహకారంతో చేపట్టటం, మరియు ప్రాజెక్టు మొదటి విడత పూర్తయిన తరువాత ప్రాజెక్టు ఉపయోగాలని విశ్లేషించడం లాంటివి ). దీనికి కొంత ఎక్కువ సమయంకేటాయించవలసినాదీనిద్వారా నేర్చుకునే మెళకువలు వికీలో మరియు వికీ బయట ఉపయోగంగా వుంటాయి. ఈ ప్రాజెక్టు మొదటి విడతకు నా వీలైనంత సహాయం వుంటుందని, ప్రాజెక్టు నిర్వహణలో అనుభవం పొందడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి సభ్యులు రేపటిలోగా స్పందించి, 16 జనవరి 2014న అధికారికంగా ప్రారంభించటానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఒకరి కంటే ఎక్కువ మంది ముందుకు వస్తే మొదటి విడతకి మొదటగా స్పందించినవారిని సమన్వయకర్తగా నిర్ణయించుకోవచ్చు--అర్జున (చర్చ) 07:56, 14 జనవరి 2014 (UTC)Reply

సమన్వయకర్త ప్రతిపాదన

ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులపై పని చేస్తున్న నేను, ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరించి ప్రాజెక్టుల నిర్వహణలోని మెళకువలు తెలుసుకోదలచుకొన్నాను. - శశి (చర్చ) 09:35, 14 జనవరి 2014 (UTC)Reply

శశి గారి ప్రతిపాదనకు ధన్యవాదాలు. ఇక ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి అవసరమైన వన్నీ సమకూరినట్లే. ఇక సభ్యులు తమ కృషి మరియు సూచనలతో ప్రాజెక్టు నిర్వహణకు సహాయపడాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 01:54, 15 జనవరి 2014 (UTC)Reply

సభ్య పేజీ మూస నిర్ణయం

మార్చు

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు సభ్యులకి వందనములు! చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ స్పందనలకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జర్గుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. - శశి (చర్చ) 11:25, 15 జనవరి 2014 (UTC)Reply

ప్రాజెక్టు మూసలు

మార్చు
సాధారణ స్పందనలు
  • సభ్యపేజీ మూసల ప్రాజెక్టు సభ్యపేజీమూసల మాదిరిగా మార్చాలి. క్రింద అడిగింది బొమ్మలపై స్పందన కాబట్టి, ఈ ప్రక్రియ కొనసాగించవచ్చు, కావలసిన మార్పులు తరువాత చేయవచ్చు.--అర్జున (చర్చ) 12:09, 15 జనవరి 2014 (UTC)Reply

మొదటి నమూనా

మార్చు
స్పందనలు

<మీ స్పందన పై వరుసలో రాసి సంతకం చేయండి>

రెండవ నమూనా

మార్చు
స్పందనలు

మూడవ నమూనా

మార్చు
స్పందనలు
  • పరిమాణం చిన్నదిగా వుండి చేసేపనిని కొంతవరకు సూచిస్తున్నది. అయితే దీనిలో W ని 'వి' గా మార్చితే బాగుంటుంది. అయితే ఈ బ్రాకెట్లు వికీకరణనే జ్ఞప్తికి తెస్తున్నాయి, విస్తరణ మరుగవుతుంది కాబట్టి నాణ్యతకు ఇతర చిహ్నలు (ప్రక్కన చూపినవి) లాంటివి పరిశీలించవచ్చు.--అర్జున (చర్చ) 03:51, 16 జనవరి 2014 (UTC)Reply
  • నేను ఒకటి ఇచ్చాను. అది కూడా పరిశీలించండి
     
    ఇది కూడా పరిశీలించండి
    ...విశ్వనాధ్ (చర్చ) 06:17, 16 జనవరి 2014 (UTC)Reply

<మీ స్పందన పై వరుసలో రాసి సంతకం చేయండి>

వ్యాస చర్చా పేజీ మూస

మార్చు

వ్యాస చర్చా పేజీలో ఉంచవలసిన మూసని అర్జున గారు అందించిన సహాయ సహకారాలతో {{వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్}} రూపొందించాను. దయచేసి మీ అభిప్ర్రాయాలని 26-జనవరి-2013, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం| 12:00 లోపు తెలియజేయగలరు - శశి (చర్చ) 06:41, 19 జనవరి 2014 (UTC)Reply

  • శశికి ధన్యవాదాలు. సభ్యులు వేరే బొమ్మపై ఆసక్తి చూపితే ఆ తరువాత మార్చవచ్చు కనుక దీనిని ప్రాజెక్టు వ్యాసాలకు జతచేర్చడం ప్రారంభిస్తున్నాను. --అర్జున (చర్చ) 06:09, 20 జనవరి 2014 (UTC)Reply

సూర్య పత్రిక జాలస్థలిలింకులు శాశ్వతం

మార్చు

సూర్య పత్రిక జాలస్థలి నిర్వాహకునితో సంప్రదించితే వారి జాలస్థలిలో లింకులన్నీ శాశ్వతంగా వుంటాయని స్పష్టంచేశారని తెలపడానికి సంతోషిస్తున్నాను. ఇది ఇతర తెలుగు పత్రికలకు కూడా స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాను. --అర్జున (చర్చ) 03:38, 23 జనవరి 2014 (UTC)Reply

wmflabs.org లో ఖాతా

మార్చు

ప్రాజెక్టు నిర్వహణ లో ఆసక్తి వున్న వారందరూ ముఖ్యంగా ప్రస్తుత సమన్వయకర్త వాడుకరి:Veera.sj http://wmflabs.org లో ఖాతా తెరవమని కోరుతున్నాను. ఆ తరువాత shell అనుమతికి అభ్యర్ధించండి. నా అభ్యర్ధన ఉదాహరణ గా చూడవచ్చు. ఈ అనుమతి వచ్చినతరువాత, ప్రాజెక్టు గణాంకాలు విశ్లేషించడం (ఉదాహరణ) మరి ఇతర డాటాబేస్ పనులు చేయడం వీలవుతుంది.--అర్జున (చర్చ) 04:03, 23 జనవరి 2014 (UTC)Reply

ఖాతా లేకుండా క్వేరీలు

http://quarry.wmflabs.org వాడండి.

మార్పుల గణాంకాల వుదాహరణలు

మార్చు

పేజీ మార్పులు

మార్చు

; For more info https://wiki.toolserver.org/view/Database_access

login and connect to telugu wiki database, servername typically nightshade

$ssh <username>@<servername>.toolserver.org

WMFlabs లో tools వాడేవారికి (వేరేవిధం
ఎవరైనా http://quarry.wmflabs.org వాడి ఇలాంటి క్వేరీలు చేయవచ్చు)

$ssh <username>@tools-login.wmflabs.org

<type your passphrase to connect>

$ sql tewiki_p

mysql>

sample query for Top 25 pages with maximum edits ఫిభ్రవరి2014ఉదాహరణ
ఫలితాలకు ప్రాజెక్టు పేజీ చూడండి.
SELECT  page_title,
COUNT(*) As Edits
FROM page
LEFT JOIN revision
ON revision.rev_page = page.page_id 
WHERE rev_timestamp >= '20140201000000'
AND rev_timestamp <'20140301000000'
AND page_namespace = 0
AND page_title in (SELECT page_title 
        FROM page
        JOIN categorylinks ON categorylinks.cl_from = page.page_id
        WHERE page.page_namespace = 1 AND categorylinks.cl_to= 'వికీప్రాజెక్టు_నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్_పేజీలు') 
GROUP BY page_title
HAVING Edits > 0
ORDER BY Edits DESC LIMIT 25;

వాడుకరి మార్పులు

మార్చు
Sample query for Top 25 Users with maximum edits in Project
ఫలితాలకు ప్రాజెక్టు పేజీ చూడండి.
SELECT
  user_name,
  COUNT(*) As Edits
FROM user
LEFT JOIN revision
      ON rev_user = user_id
LEFT JOIN page
      ON page_id = rev_page 
WHERE rev_timestamp >= '20140201000000'
AND rev_timestamp <= '20140301000000'
AND page_namespace = 0
AND page_title IN (SELECT page_title 
        FROM page
        JOIN categorylinks ON categorylinks.cl_from = page.page_id
        WHERE page.page_namespace = 1 AND categorylinks.cl_to= 'వికీప్రాజెక్టు_నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్_పేజీలు')
GROUP BY user_name
HAVING COUNT(*) > 0
ORDER BY Edits DESC LIMIT 25;

SQL Query ని మెరుగుపరచవలసినవి

మార్చు

 Y సహాయం అందించబడింది

పై ఉదాహరణ Queryలలో వ్యాసం పేరు ప్రాజెక్టు వర్గం నుండి తీసుకొనేటట్లుగా డాటాబేస్ నిపుణులు మార్చితే ఫలితాలు పొందడం సులువవుతుంది. --అర్జున (చర్చ) 05:40, 24 జనవరి 2014 (UTC)Reply

తాజా క్వెరీలు చర్చాపేజీలో చేర్చాను. ఇక సులువుగా గణాంకాలు తాజాచేయవచ్చు. వ్యాసాల చర్చాపేజీలలో ప్రాజెక్టు మూస చేర్చితే సరి.--అర్జున (చర్చ) 11:33, 30 జనవరి 2014 (UTC)Reply

వెతుకులాట గణాంకాలు దొరుకుతాయా

మార్చు

కింది గణాంకాలు దొరుకుతాయా?

  1. తెవికీలోకి వచ్చేసాక, సందర్శకులు (తెవికీ వెతుకులాటలో) దేని కోసం వెతికారు?
    1. రోజువారీగా, ఏయే పదాల కోసం వెతికారు?
    2. వెతుకులాటలో నేరుగా పేజీ ఎన్నిటికి దొరికింది?
    3. అస్సలు ఒక్క ఫలితం కూడా దొరకని వెతుకులాటలు ఏమిటి?
    4. దొరకనివి ఏమిటి? (అంటే మనం ఈ వ్యాసాలు రాయాలన్నమాట!)
    5. చదువరులు ఏ పేజీల నుండి ఏయే పేజీలకు వెళ్ళారు?
    6. పేజీలోని లింకులను, మార్గదర్శకంలోని లింకులను ఎన్నేసి సార్లు నొక్కుతున్నారు?
    7. వెతుకులాట పదాలను రాయడంలో దొర్లుతున్న తప్పులు ఏమిటి?
    8. ఇంగ్లీషులో వెతుకుతున్నారా?
  2. తెవికీలోకి ప్రవేశిస్తున్న సందర్శకులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు?
  3. సెర్చింజన్ల వెతుకులాట ద్వారా వస్తున్నదెంతమంది?
  4. ఏయే పదాల కోసం వెతికి ఇక్కడికొచ్చారు? (దీన్ని తెలుసుకునే సౌకర్యాన్ని గూగులు క్రమేణా తీసేస్తోంది.)
ఓ పేజీలో ప్రతిరోజూ పై గణాంకాలను చూపించగలమా?

పై ప్రశ్నల ద్వారా నేను తెలుసుకోదలచినది ఏంటంటే..

  1. మనం ఏయే వ్యాసాలు రాయాలి,
  2. ఏయే వ్యాసాలపై దృష్టి పెట్టాలి,
  3. సాధారణంగా ఏయే భాషాదోషాలు జరుగుతున్నాయి..

-మొదలైనవి. తెవికీలో ఏయే పేజీకి ఎన్నేసి వీక్షణలున్నాయో,ఎంత ప్రాచుర్యం వచ్చిందో తెలుసుకోడానికి కాదు. -- చదువరి (చర్చరచనలు) 15:56, 6 మార్చి 2014 (UTC)Reply

పదాలు రాయడంలో తప్పుల గురించి ఒక విశేషం- ”స్వాతంత్రం” అనే తప్పు మాట కోసం వెతికితే తెవికీలో 1192 ఫలితాలొచ్చాయి. "స్వాతంత్ర్యం" అనే సరైన మాట కోసం వెతికితే 994 ఫలితాలు మాత్రమే వచ్చాయి. తప్పు మాటను రెండొందల సార్లు ఎక్కువగా రాసాం. --చదువరి (చర్చరచనలు) 16:07, 6 మార్చి 2014 (UTC)Reply
  • చదువరి గారికి, మీ సందేహం ఈ రోజే చూడడం జరిగింది. ఎకో వ్యవస్థ ద్వారా నా పేరుకి లింకు ఇచ్చినట్లయితే లేక {{సహాయం కావాలి}} చేర్చినట్లైతే త్వరలో స్పందించడానికి వీలుండేది. ఇక మీ సందేహానికొస్తే వికీపీడియా లో వెతుకుట గణాంకాలు WMF గోప్యత దృష్ట్యా బహిర్గతం చేయటం లేదు. ఇంతకుముందు రచ్చబండలో రవిచంద్ర సందేహానికి ఇదే సమాధానం లింకుతో సహా ఇచ్చాను. గూగుల్ వారి పాత గణాంకాల ప్రకారం 46శాతం వికీపీడియా వీక్షకులు గూగుల్ ద్వారా వస్తున్నారు. ప్రస్తుతానికి వికీ ట్రెండ్స్ వాడి కొత్త వ్యాసాలకన్నా వున్న వ్యాసాలను అభివృద్ధి చేయడమే నా దృష్టిలో వీలంత మెరుగైన పద్ధతి.--అర్జున (చర్చ) 12:02, 11 మార్చి 2014 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1".